Jump to section

ఐదవ పాఠముదేవుడు ఉన్నాడు

ఆది. 1:1—ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

రోమా. 1:20—ఆయన అదృశ్య (దైవిక) లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

లోకములో బైబిల్ విశిష్టమైన పుస్తకము. బైబిల్‌లో ప్రస్తావించ-బడిన మొదటి అంశము దేవుడే. బైబిల్ యొక్క ప్రధానమైన విషయము దేవుడే. బైబిల్‌లోని మొదటి వచనము ఈలాగు చెప్పును, ‘‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.’’ శాస్త్రవేత్తలు మన భౌతిక విశ్వమును దీర్ఘకాలము పరిశోధించిరి. వారి అధ్యయనముల ద్వారా వారు కనుగొన్నదేమిటంటే మన విశ్వము చక్కని రూపకల్పనతో నిండిన ఒక క్రమమైన వ్యవస్థ అయ్యుంది. దేవుని గూర్చి బైబిల్ చెప్పేదానిని పరిగణించుటకు ముందు, దేవుని గూర్చి విశ్వము చెప్పేదానిని గూర్చి మొదట మనము పరిగణిద్దాము.

విశ్వము ద్వారా దేవుడు ప్రకటింపబడుట

రాత్రివేళ మీకు పైగానున్న ఆకాశమును చూడండి. మన నక్షత్ర మండలములో (గేలెక్సీలో) వంద కోట్ల కంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయనియు మరియు విశ్వములో వందకోట్ల నక్షత్ర మండలములు ఉండవచ్చని ఖగోళవేత్తలు అంచనావేసెను. మనము చూసే ప్రతి నక్షత్రము విశ్వములో ఒక సౌర వ్యవస్థను సూచించును. మన సొంత సౌర వ్యవస్థ సూర్యుని కేంద్రముగా కలిగియుంది, మరియు గడియారం వలె ఖచ్చితంగా దాని చుట్టు తిరుగు తొమ్మిది గ్రహాలను అది కలిగియుంది. గ్రహాలలో ఒకటైన భూమి, అంతరిక్షములో గంటకు 67,000 మైళ్లు ప్రయాణించును మరియు సూర్యుని చుట్టు ఒకసారి తిరగడానికి 365 రోజులను తీసుకొనును. ఈ వేగంలో వెయ్యో వంతు వేగముతో గనుక ఒక రైలు ప్రయాణిస్తే, అది అనేకసార్లు దాని గమనమును తప్పునని ఒకడు పరిగణించునప్పుడు ఈ వాస్తవము దిగ్భ్రమపరచును. చరిత్రంతటా కొందరు ప్రజలు ఆయా సమయాల్లో దేవుని గూర్చిన తలంపును వ్యతిరేకించిరి. దానిని వారు వ్యతిరేకించారన్న వాస్తవము దేవుడు ఉన్నాడనే అర్థమిచ్చుచున్నది. కొందరు తిరుగుబాటుచేయు కుమారులు తమ తండ్రి నుండి సంబంధమును తెంచుకున్నారన్న వాస్తవము వారికి తండ్రి ఉన్నాడనే అర్థమిచ్చును. కొందరు కుటుంబమును కూల్చుటకు ప్రయత్నించుట అన్న వాస్తవము కుటుంబము వాస్తవికతయైనదని అర్థమిచ్చును. ముందుగానే ఊహించి దేనినైనా వ్యతిరేకిస్తే అది ఉనికిలో ఉండునని నిశ్చిత సిద్ధాంతము (The law of inference) మనకు చెప్పును. దేవుని గూర్చిన తలంపును వ్యతిరేకించుట నిరర్థకమైనదని చరిత్రలో నిరూపించబడినది, ఎందుకంటే సంస్కృతులు మరియు మానవ ప్రభుత్వములు ఎంతగా మారిననూ, అంతములో దేవుని యందున్న నమ్మకమన్నది ఎల్లప్పుడు ప్రబలును.

విశ్వము దేవుని గూర్చి మనకు ఏమి చెప్పునో మనము పరిగణిద్దాము. దేవుని ‘‘దైవిక లక్షణములు మరియు నిత్యశక్తియు’’ సృష్టి ద్వారా చూడబడునని బైబిల్ మనకు చెప్పును (రోమా. 1:20). చిత్రలేఖనము చిత్రకారుని లక్షణములను చూపినట్టుగా, సృష్టికర్త యొక్క లక్షణములు ఆయన సృష్టించిన విశ్వము ద్వారా ప్రత్యక్షపరచబడును.

దేవుడు మానవుని ద్వారా వ్యక్తపరచబడుట

మానవజాతి యొక్క ఉనికి దేవుని ఉనికిని గూర్చి మాట్లాడును. మానవ శరీరము నిజమైన అద్భుతము. మానవుని అవయవములను మరియు శరీర భాగములను పోలినట్టు మరియు భర్తీ చేయుటకు ఆధునిక వైద్యము అనేక పరికరాలను కనిపెట్టినప్పటికీ, ఏ పరికరము మానవ అవయవముల యొక్క సామర్థ్యమును మరియు ప్రభావమును సమీపించలేదు. ఒకడు మేలుకొనియున్నా లేదా నిద్రపోతున్నా మానవ గుండె నిమిషానికి 72 సార్లు, లేదా సంవత్సరానికి 40 మిలియన్ల సార్లు కొట్టుకొనును. ప్రతి దినము ఒక వయోజనుడి గుండె, ప్రపంచము చుట్టు నాలుగు సార్లు ప్రయాణించుటకు సరిపడు 100, 000 మైళ్ళ రక్త నాళాలకు రక్తమును ప్రసరణ చేయును. ప్రతిదినము 2,000 గ్యాలన్ల కారు ట్యాంకును నింపుటకు అది తగినంత రక్తమును ప్రసరణ చేయును. మానవునిలోపల అట్టి అద్భుతమైన అవయవమును ఎవరు రూపొందించి ఉండగలరు? ఒకడు తన శరీరములోనున్న ఎర్ర రక్త కణాలను పోగు చేస్తే, దాని ఎత్తు ఎవరెస్ట్ శిఖరము కంటే ఐదు వందల సార్లు మించును. ముక్కు నిమిషానికి పదిహేడు సార్లు గాలిని పీల్చుకొనును. ప్రతినము అది 14, 000 లీటర్ల గాలిని ప్రోసెస్ చేయాలి. గాలి యొక్క ఉష్ణమును అమర్చుటకు అదనంగా, అది దాని తేమను సరిచేయాలి మరియు దాని దుమ్మును తీసివేయాలి కూడా. ఈ మూడు విధులను చేయగల మానవునిచేత-తయారు చేయబడిన పరికరము వంద పౌండ్ల బరువు ఉండాలి. ‘‘మానవునిచేత-తయరు చేయబడ్డ అట్టి ముక్కు’’ మన ముఖముపై నెలకొల్పితే ఏమగునో? ఇవి మానవ శరీరమును గూర్చిన అద్భుతములకు సంబంధించి కొన్ని ఉదాహరణలే. మనము అద్దము యెదుట నిలబడితే, ‘‘నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టు-చున్నవి, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది’’ అని బైబిల్‌లో కీర్తనాకారుడు చెప్పిన దానిని అంగీకరించకుండా ఉండలేము (కీర్త. 139:14).

దేవుడు లేఖనములలో బయలుపరచబడుట

బైబిల్ మనకు దేవుని పేర్లను బయలుపరచును. పాత నిబంధనలో దేవునికి ఉన్న అనేక పేర్లల్లో, ప్రధానముగా మూడు మాత్రమే ఉపయోగించబడును-ఎలోహిమ్, యోహోవా, మరియు అదోనాయ్. ఎలోహిమ్ అన్నది హెబ్రీభాషలో బహువచనము  లోనున్న నామవాచకము. అది ‘‘నమ్మకమైన బలవంతుడు’’ అనే భావమును సూచించును. దేవుడు బలవంతుడు మరియు నమ్మకస్థుడు. ఆయన శక్తిలో బలవంతుడు మరియు మాటలో నమకస్థుడు. యోహోవా అనగా దేవుడు స్వయంభవుడు మరియు ఎల్లప్పుడు – ఉండువాడని బయలుపరుస్తూ, ‘‘నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను’’ అని అర్థం. ఆయన గతములో ఉండిన, ప్రస్తుతమందు ఉన్న, మరియు భవిష్యత్తులో ఉండబోవువాడై ఉన్నాడు. అదోనాయ్ అంటే ‘‘యజమాని’’ మరియు ‘‘భర్త.’’ ఒక వైపున, దేవుడు మానవుని యజమాని; మరో వైపు, ఆయనే మానవుని భర్త. క్రొత్త నిబంధనలో తండ్రి, ప్రభువు, యేసు క్రీస్తు, మరియు పరిశుద్ధాత్మ అనబడే అనేక పేర్లు ఉన్నాయి. ఇవ్వన్నియు దేవుడు ఏమైయున్నాడో మరియు దేవుడు ఎవరో మనకు బయలుపరచును.

పాత నిబంధనలోనున్న పవక్తలందరు దేవుని ప్రేరణ ద్వారా మాట్లాడెను (1 పేతురు. 1:10-11; 2 పేతురు. 1:21). వారి నోటిలోనికి ప్రవచనా మాటలను పెట్టినది దేవుడే. ప్రభువు సెలవిచ్చినదేమనగా అను పదబంధం పాత నిబంధనలో తరచుగా మళ్ళీమళ్ళీ చెప్పబడెను. ప్రవక్తల మాటల యొక్క జ్ఞానము మరియు వారి ప్రవచనముల నెరవేర్పు అన్నవి వారి మాటలు వాస్తవానికి దైవికంగా ప్రేరేపించబడెనని నిరూపించెను. అతిగొప్ప ప్రవచనములలో ఒకటి ఇశ్రాయేలు దేశము యొక్క గమ్యమును గూర్చినది. యూదులు ప్రపంచమంతటా చెదరిపోదురు గాని నియమిత కాలములో ఇశ్రాయేలు దేశము పునఃస్థాపించబడునని మరియు యెరూషలేము పట్టణము యూదులకు తిరిగి వచ్చునని బైబిల్ ప్రవచించెను. 1948 లో ఇశ్రాయేలు దేశము పునఃస్థాపించబడుట మరియు 1967 లో యూదులకు యెరూషలేము తిరిగి ఇవ్వబడుటతో దీనిని మనము ఉన్న కాలములోనే చూడగలము. మధ్య ప్రాచ్యంలో ఆ చిన్న దేశము స్థాపించబడుట అన్నది చరిత్రలో దేవుని పనికి ఉన్న సజీవమైన రుజువు అయ్యుంది.

మానవుని కొరకైన దేవుని పథకము

[దేవుని] ఉద్దేశము మనము ఆయనను ఎరుగుటయే. దేవునికి తన్నుతాను మరుగు చేసుకోవాలన్న ఉద్దేశము ఏమియు లేదు. మానవుడు ఆయనను మొదటిగా సృష్టికర్తగాను, ఆ తరువాత తన దేవునిగాను మరియు తన తండ్రిగాను ఎరగాలని ఆయన ఉద్దేశించును.

మానవుడు తనను ఆరాధించాలని దేవుడు ఉద్దేశించును. ఆయనను ఆత్మలోను సత్యములోను ఆరాధించువారైన, నిజమైన ఆరాధికులను దేవుడు అన్వేషించునని యోహాను 4:23 మనకు చెప్పును. మానవుడు ఆయన సృష్టించిన వాటిని ఆరాధించాలన్న ఉద్దేశము ఆయనకు ఏమాత్రము లేదు. దేవుని నిజముగా ఆరాధించుట అంటే మన ఆత్మతో ఆరాధించుటయే. గతంలో, మానవుడు అనేక విగ్రహాలను నెలకొల్పెను మరియు దేవునికి బదులు వీటిని ఆరాధించెను. అయితే పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలలో, అన్ని రూపాలలో ఉన్న విగ్రహారాధనను దేవుడు ఉపేక్షించును (నిర్గ. 20:4-5; 1 కొరి. 10:14; 1 థెస్స. 1:9). ఆయనే అద్వితీయ దేవుడు. ఏ ఇతర వస్తువుకు మన ఆరాధనను డిమాండ్ చేసే అర్హత లేదు.

దేవుడు ఆత్మ, మరియు ఆయనను ఆరాధించువారు ఆత్మలో ఆరాధించాలి (యోహాను 4 :24). ఒకడు రేడియో తరంగాలను గ్రహించగోరితే, అతడు తప్పక రేడియో గ్రాహకమును ఉపయోగించాలి. ఒకడు టెలిఫోన్ కాల్‌ను స్వీకరించగోరితే, అతడు టెలిఫోన్ గ్రాహకమును ఎత్తాలి. అదే విధంగా, ఒకడు దేవుని ఆరాధించి మరియు ఆయనను సంప్రదించగోరితే, అతడు తప్పక తన ఆత్మను ఉపయోగించాలి. ఒకడు రంగును తన చెవులతో వినలేడు, ఒకడు సంగీతమును తన కళ్ళతో చూడలేడు. సరైన పదార్థముకు సరైన అవయవము అవసరము. దేవుడు ఆత్మ మరియు వస్తుపరమైన దేదియు కాడు. ఇందు చేతనే మనము ఆయనను వస్తుపరమైన దేనితోను ఆరాధించకూడదు కాని ఆయనను మన ఆత్మతో ఆరాధించాలి.

మన ఆత్మను ఉపయోగించుటకు గల మార్గము ప్రభువైన యేసు నామమును పిలవడం చేత ప్రార్థించుటయే (రోమా. 10:12-13). మన నోటిని మరియు హృదయమును మనము తెరచి, దేవునికి ప్రార్థిస్తే, మన ఆత్మ ఆయనను తాకును, మరియు దేవుడు మనకు వాస్తవముగా ఉండును.

మానవుని కొరకైన దేవుని అంతిమ పథకము మానవుడు దేవుని వ్యక్తపరచుటయే. దేవుని వ్యక్తపరచుటకున్న మార్గము దేవునితో నింపబడుటయే. మనము ఆయనకు ప్రార్థించి మరియు ఆయనను స్వీకరిస్తే, దేవుడు మనలోనికి వచ్చును మరియు మనల్ని నింపును. ఆయన ఇంకేమాత్రము మనకు బయట ఉండు బాహ్యమైన దేవునిగా ఉండడు, కాని మనలోపల ఉన్న అనుభవేద్యమైన దేవునిగా ఉండును. ఆయన మనల్ని ఆయనతోనే నింపును మరియు మన పూర్తి వ్యక్తిత్వమును మార్చును. క్రైస్తవునిగా ఉండుట అంటే వట్టి కొన్ని మత బోధలయందు విశ్వసించుట లేదా కొన్ని బోధలను నేర్చుకొనుట కాదు. అది దేవుని ఎరుగుట, ఆయనను ఆరాధించుట మరియు ఆయనతో నింపబడుట చేత ఆయనను వ్యక్తపరచుట అయ్యుంది. (There Is God, pp. 1-2, 4-7, 10-12, 15-17)

 

References: There Is God; CWWN, vol. 27, “The Normal Christian Faith,” ch. 2; CWWL, 1983, vol. 1, “The Five Great Mysteries in the Bible,” ch. 1

దేవా తండ్రీ, నీవు చేసిన సృష్టి

తండ్రిని ఆరాధించుటఆయన మహాత్మ్యము17

                                                                       

1    దేవా తండ్రీ, నీవు చేసిన సృష్టిన్,

భూమ్యాకాశముల వింతల్ గాంచెన్

వాటిలోని సమస్తమును నీదు

శక్తిన్ పలు రీతుల వర్ణింపన్;

 

నా సర్వమున్ నీకే స్తుతిపాడున్

ఏమాద్భుతం నీ ఘనత!

ఈ గానమున్

నిత్యంబాలాపింతున్

ఏమాద్భుతం నీ ఘనత!

 

2    నీ రక్షణ కృపన్ నేనాస్వాదించి

నీదు వరసుతునే ధ్యానింతున్

క్రొత్త సృష్టిన్ జేయన్ నాకై మృతుడై

మెండైన నీ జీవమున్ జూపించెన్.

 

3     సంఘమందు పాలొందిజూచితిని

అసంఖ్యాకుల్ నీ జీవమున్ కల్గి

నీ పూర్ణతన్ వ్యక్తపర్చుటకైన

నీ ఆవాసంబై కట్టబడుటన్

 

4    నీరీక్షింతున్ రాబోవు యుగమును

పూర్ణమైన క్రొత్త యెరూషలేమ్

నీ మహిమన్ చాటు క్రొత్త భూమియు

క్రొత్త ఆకాశములందుండును.

Jump to section