Jump to section

పదమూడవ పాఠముయేసు పాపుల స్నేహితుడు

మత్త. 11:19—మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పు పొందుననెను

సువార్తలలో ప్రభువైన యేసు పాపుల స్నేహితుడిగా చూపించబడెను, వారి రక్షకుడు అవ్వకమునుపు చారిత్రాత్మకంగా, ఆయన మొట్టమొదటిగా మనుషుల మధ్య వారి స్నేహితునిగా చలించినవానిగా అగుపడెను. కానీ ఆయన మన రక్షకునిగా అగు నిమిత్తము నేడు కూడా ఆయన మొదటిగామన స్నేహితుడనే స్థానములోనే ఉన్నాడని నీవు గ్రహించావా? మనము సిద్ధముగా ఉన్న ఒక స్థితికి చేరకమునుపే లేదా ఇంకా చెప్పాలంటే, ఆయనను రక్షకునిగా పొందుకొనకమునుపే, ఆయన మన యొద్దకు స్నేహితుడుగా వచ్చును, తద్వారా వ్యక్తిగతముగా కలుసుకొనుట అనునది ఆటంకపరచబడకుండా ఉండును మరియు ఆయనను రక్షకునిగా స్వీకరించుటకు అవసరమైన ద్వారము మనకు ఇక తెరువబడియుండును. ఇది ఒక ప్రశస్తమైన ఆవిష్కరణైయున్నది.

నేను రక్షకుడిని పాపుల స్నేహితునిగా చూశాను కాబట్టి అనేకమైన అసాధారణ మరియు కష్టతరమైన ప్రజలు ప్రభువు నొద్దకు తేబడుటను నేను చూచితిని. ఒకానొక ప్రదేశములో తాను రక్షింపబడదలచుట లేదు అని చెప్పుచు ఒక యవ్వనస్థురాలు నా యొద్దకు వచ్చి నాపై ఎలా దాడి చేసెనో నాకు జ్ఞాపకమున్నది. తాను యవ్వనములో ఉన్నానని మరియు మంచి సమయమును కలిగియుండుటకు ఇష్టపడుతుందని, మరియు తన మార్గములను విడిచి పెట్టుటకు ఈ సాధువుల నెమ్మది మార్గమును ఎన్నుకునుటకు, తద్వారా జీవితములో ఎటువంటి సంతోషములేని విధముగా ఉండదలచుకోవుట లేదని నాతో చెప్పెను. తన పాపములను మరచిపోవాలనే ఎటువంటి ఉద్దేశము ఆమెకు లేదని మరియు రక్షింపబడవలెనన్న కోరిక ఏ మాత్రము తనకు లేదని ఆమె నాతో చెప్పెను. ఆమెకు సువార్త గూర్చి చాలా తెలుసునని, ఆమె ఒక మిషన్ పాఠశాలలో పెంచబడెనని, మరియు సువార్తపట్ల ఇది ఆమె యొక్క ప్రతిస్పందన అని అర్థమాయెను. ఆమె నాతో కొంత సమయము వాదులాడిన తరువాత, ‘‘మనము ప్రార్థిద్దామా?’’ అని నేను అడిగితిని, ఆమె తిరస్కారముగా నేను ఏమని ప్రార్థించాలి అని అడిగెను ‘‘నేను నీ ప్రార్థనకు బాధ్యత వహించను గానీ, నేను మొదటిగా ప్రార్థించెదను, మరియు దాని తరువాత నీవు నాతో ఏదైతే చెప్పావో దానినంతటిని ప్రభువుకు చెప్పవచ్చును’’ అని అంటిని. ‘‘ఓహ్, నేను దానిని చేయలేను!’’ అని ఆమె చెప్పెను, తన మాటను వెనుకకు తీసుకొనెను. ‘‘అవును, నీవు చేయవచ్చు’’ అని నేను చెప్పితిని. ‘‘ఆయన పాపుల స్నేహితుడని నీకు తెలియదా?’’ ఇది ఆమెను తాకెను. ఆమె ప్రార్థన-ఒక సాంప్రదాయ విరుద్దమైన ప్రార్థన చేసెను కానీ ఆ సమయము నుండి ప్రభువు ఆమె హృదయములో పనిచేయుట ప్రారంభించెను, కొద్ది రోజులకే ఆమె రక్షింపబడెను.

ఆయనను కలుసుకొనునట్లు ప్రజలను నడిపించుట

చాలాసార్లు ఎవరైతే కేవలము జ్ఞానము ద్వారా రక్షించబడ్డారో, వారు పెద్ద తలకాయలను వృద్ధిచేసుకొందురు. దేవుని అవసరత ఎక్కువుగా ఉన్నది అనేదానిని స్పృశించకుండానే వారు వృద్ధి చెందెదరు. వారికి సమస్తమును తెలుసు మరియు ఇంకా చెప్పాలంటే, వారు బోధకులను, వాస్తవాలను, బోధనలను విమర్శించుటకు తాము అర్హులమని భావించెదరు. కానీ వారు తమకు తెలిసిన ఆధారాలను కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మరియు దేవుణ్ణి ఒకానొక విషయములో నమ్మవలసి వచ్చినప్పుడు, వారు అలా చేయలేరు. వారు ఆయనతో జీవపరమైన స్పృహను కలిగిలేరు. అయినప్పటికీ, కేవలము కొద్దిగా మాత్రమే తెలిసిన కానీ తమలో నుండి బయటకు వచ్చి, మరియు సజీవుడైన దేవుడిని తాకి, భయంకరమైన శ్రమలు ఉన్నప్పటికి తమ విశ్వాసమును అభివృద్ధి పరచుకొనిన మరియు ఎదిగిన కొంతమంది కలరు. అందువలననే మన మొదటి విషయము ప్రజలు ఆయనను కలుసుకొనునట్లు నడుపవలెను.

సజీవుడైన ప్రభువే మన రక్షకునిగా అగును. యేసు ఇక ఏమాత్రము సిలువవేయబడిన వాడు కాదుగానీ, యేలుబడి చేయువానిగా ఉన్నాడు, మరియు నేడు మనము రక్షణ కొరకు సిలువ యొక్క పాదము నొద్దకు వెళ్లము గాని సింహాసనము నొద్దకు, అనగా ఆయనను ప్రభువుగా నమ్ముటకు వెళ్ళెదము. బహుశా విమోచనకు మరియు రక్షణకు గల వ్యత్యాసమును మనము మరి స్పష్టంగా చూడవలెను. విమోచన అనునది  రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుచే సిలువపై నెరవేర్చబడెను. నేడు మన రక్షణ అనునది కాలంలో ఒక్కసారే నెరవేర్చబడిన విమోచనపైనే ఆనుకొనియున్నది.

రక్షణ వ్యక్తిగతమైన మరియు అంతర్గతమైన అనుభవముగా ఉండుట

వ్యక్తిగతమైన మరియు అంతర్గతమైన అనుభవముగానున్న ఆ రక్షణ, ఆయన మరణము మీద కంటే ప్రభువు పునరుత్థానము మీదనే ఆధారపడునని చెప్పబడగలదు. క్రీస్తు మరణమన్నది దేవుని యెదుట బాహ్యంగా ప్రాయశ్చిత్తార్థమైన అవసరమై ఉండెను. కాని రక్షణకు క్రొత్త నిబంధన ఆయన పునరుత్థానమందున్న మన విశ్వాసము మీదనే నొక్కి ఒక్కానించును, ఎందుకంటే ఆయన మరణము అంగీకరించబడినదనుటకు పునరుత్థానమే రుజువు అయ్యుంది. వ్యక్తిగతంగా లేపబడి మరియు మహిమకు ఆరోహణమైన, ప్రభువైన యేసు క్రీస్తునందు మనము విశ్వసించితిమి మరియు పాపులను ఇప్పుడు ఆయనతో సంబంధము కలిగి ఉండుటనే అనుభవము లోనికి వెనువెంటనే తేవాలనే దానిని మనము వెదకుదము.

రక్షణ అన్నది అవగాహనకు లేదా చిత్తమునకు సంబంధించిన ప్రశ్న కూడ కాదు. మనము చూసినట్టుగా, అది దేవుని కలుసు-కొనుటకు సంబంధించిన ప్రశ్న అయ్యుంది తాజాగా మనుష్యులు రక్షకుడైన క్రీస్తుతో సంబంధములోనికి వచ్చుట. ఆ సంబంధము సాధ్యమయ్యేటట్టు మానవునిలో ఉండాల్సిన కనీస అవసరత ఏమైయుంది? అని మీరు నన్ను అడుగుతారు.

నా సమాధానముగా నేను మిమల్ని విత్తువాని ఉపమానముకు మళ్లించుదును. దేవుడు డిమాండు చేయునన్న ఒక్క విషయము మనము ఇక్కడ సరళముగా చెప్పబడినట్టు నాకు అనిపించును. ‘‘మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా నిజాయితీగల (యోగ్యమైన) మంచి మనస్సుతో వాక్యము విని, దానిని అవలంబించి,  ఓపికతో ఫలించువారు’’ (లూకా 8:15). దేవుడు మానవుని నుండి డిమాండు చేయునది ఏమనగా ‘‘నిజాయితీగల మంచి మనస్సే’’ నిజాయితీ గలది గనుకే మంచిది. ఒకడు రక్షింపబడగోరునో లేదా రక్షింపబడగోరడో అన్నది విషయము కాదు, అతడికి అర్థమైనదా లేక అర్థం కాలేదా అన్నది విషయము కాదు; దానిని గూర్చి దేవునితో యోగ్యముగా ఉండుటకు అతడు సిద్ధపరచబడి- నట్లయితే, అతడిని కలుసుకొనుటకు దేవుడు సిద్ధపరచబడతాడు.

పాపుల రక్షణకు మౌలిక షరతు నమ్మకము లేదా పశ్చాత్తాపము కాదు కాని, దేవుని వైపుగానున్న నిజాయితీ గల హృదయమే. అతడికి సంబంధించినది ఏదియు దేవునికి అవసరము లేదు కాని, ఆ వైఖరితో అతడు రావడమే అవసరము. అధికమైన వంచన మధ్యలో తిన్నని నడవడి గల చోటులో, మంచి విత్తనములు పడి ఫలమును ఫలించును. ప్రభువుతో సిలువ వేయబడిన పూర్తిగా మోసపూరితమైన దొంగలైన ఇద్దరిలో, నిజాయితీగా ఉండాలనే కోరిక కొంతమట్టుకు ఒకనిలో ఉండెను. మందిరమునొద్ద ప్రార్థించిన సుంకరి మోసగాడే, కాని తన పాపపూరితత్వమును ఒప్పుకొనుటకు మరియు కనికరము కొరకు దేవుని యెదుట ఏడ్చుటకు అతడిలో కూడ నిజాయితీ ఉండెను.

పూర్వము వివరించబడిన వివిధ సంఘటనలు తెలియజేయునదేమనగా, అతడు నిలబడే స్థానమును ప్రభువుతో నిర్మొహమాటముగా చెప్పుచూ, నిజాయితీ గల హృదయముతో మోకాళ్లూని ప్రార్థించమని ప్రతి పాపిని మనము ప్రోత్సహించాలి. ప్రభువు నామమందు మనము ప్రార్థించాలని క్రైస్తవులమైన మనము చెప్పబడితిమి (యోహా. 14:14; 15:16; 16:23, 24). అవును, ఈ మాటలుకేవలం అక్షరంగా ఉపయోగించక, దీనర్థం ఆయనయందు ఉండాల్సిన విశ్వాసపు క్రియయేనని దీనిచేతమనకు తెలుసు. కాని పాపులకు సంబంధించి అది భిన్నమైనది, ఎందుకంటే యేసు నామమందు ఉచ్చరించబడని, దేవుడు వినగల ప్రార్థనలు ఉన్నాయి. అపొస్తలుల కార్యములు 10:4లో దూత కొర్నేలీతో ఈలాగు చెప్పును: ‘‘నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.’’ హృదయము నుండి నిజంగా ఏడిస్తే, దేవుడు వినును. ఒక పాపి హృదయమును దేవుడు తాకగలడు.

దగ్గరగానున్న సహాయకుడు

పేతురు చేత ఉల్లేఖించబడిన యోవేలు మాటలలో, ‘‘ప్రభువు నామమును పిలుచువాడెవడైననూ రక్షింపబడును.’’ ఇది ఏలాగు సాధ్యము? దేవుడు మరో వాగ్దానమును (అదే ప్రవచనము నుండి పేతురు చేత ఉల్లేఖించబడినదే) నెరవేర్చబడి నందునే, అదేమనగా: ‘‘మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను’’ (అపొ. 2:17, 21). పరిశుద్ధాత్మ మనుష్యు- లందరి మీద కుమ్మరింపబడినందున, ఒక కేక సరిపోవును.

నేను ఒకనికి సువార్తను ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్ముడు అతడిపై ఉన్నాడని నేను ఎల్లప్పుడు విశ్వసిస్తాను. అవిశ్వాసుల హృదయము లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నా భావం కాదు, కాని ఆయన బయట ఉన్నాడు. ఆయన ఏమి చేయుచున్నాడు? ఆయన వేచియున్నాడు, వారి హృదయముల లోనికి క్రీస్తును తీసుకురాడానికి ఆయన వేచిచూస్తున్నాడు. సువార్తను వినువారి హృదయములోకి ప్రవేశించుటకు పరిశుద్ధాత్ముడు వేచియున్నాడు. ఆయన వెలుగు వలె ఉన్నాడు. కిటికీ-తలుపులను కొద్దిగా తెరచినప్పటికీ వెలుతురు లోనికి వచ్చును మరియు లోపల ప్రకాశింపజేయును. హృదయము నుండి దేవునికి చేసే మొర ఉన్నప్పుడు, ఆ క్షణమునే ఆత్మ ప్రవేశించును మరియు ఒప్పింప-జేయుట మరియు పశ్చాత్తాపపడేటట్లు మరియు విశ్వసించేటట్లు చేయుట అనే ఆయన రూపాంతరీకరణ పనిని నూతన జన్మ అనే ఆశ్చర్యకార్యము నిమిత్తమై ప్రారంభించును.

ఓ, ఇది మన దేవుడు చేయగలిగిన అద్భుతమైనది! ఆయన జీవము గల దేవుడు, కనికరముతో వ్యవహరించుటకు సిద్ధంగా ఉన్నాడు. మనుష్యులు వారు ఏమై ఉన్నారో దాని కంటే కొంత మెరుగుగానే ఉండగలిగినప్పటికీ, లేదా వారు ఇంకాస్త అద్వానముగా ఉన్నప్పటికీ అది అడ్డంకే కాదు. ఆయన ఎదురు చూసేదంతయు ‘‘నిజాయితీ గల మంచి హృదయమునే.’’ మనుష్యుల హృదయమును కదల్చుటకు పరిశుద్ధాత్ముడు శక్తితో ఉన్నాడని ఎన్నడు మరచిపోకండి. (CWWN, vol. 40, “What Shall This Man Do?” pp. 30, 36-41, 45)

Reference: CWWN, vol. 40, “What Shall This Man Do?” ch. 3; CWWL, 1994-1997, vol. 5, “A Word of Love to the Co-workers, Elders, Lovers, and Seekers of the Lord,” ch. 2

 

IF YOU ARE TIRED OF THE LOAD OF YOUR SIN

Gospel—Persuasion

1038

1    If you are tired of the load of your sin,

Let Jesus come into your heart;

If you desire a new life to begin,

Let Jesus come into your heart.

 

Just now, your doublings give o’er;

Just now, reject Him no more;

Just now, throw open the door;

Let Jesus come into your heart.

 

2    If ’tis for purity now that you sigh,

Let Jesus come into your heart;

Fountains for cleansing are f lowing nearby,

Let Jesus come into your heart.

 

3   If there’s a tempest your voice cannot still,

Let Jesus come into your heart;

If there’s a void this world never can fill,

Let Jesus come into your heart

Jump to section