Jump to section

పదిహేనవ పాఠముబాప్తిస్మము

మత్త. 28:19—కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు

బాప్తిస్మముకు గల అర్థం

నమ్ముట అంటే పాపముల క్షమాపణ కొరకు (అపొ. 10:43) మాత్రమే కాక పునర్జన్మింపబడుటకు (1పేతు. 1:21, 23) కూడ దాసుడైన-రక్షకుని (యోహా. 1:12) స్వీకరించుటయే. కావున నమ్మువారు త్రియేక దేవునితో జీవపరమైన ఐక్యత యందు (మత్త. 28:19) దేవుని పిల్లలుగా అగుదురు (యోహా. 1:12-13) మరియు క్రీస్తు అవయవములుగా అగుదురు (ఎఫె. 5:30). బాప్తిస్మమునొందుట అంటే దాస-రక్షకుని మరణము ద్వారా పాత సృష్టిని అంతమొందించుటకు పాతిపెట్టబడుటచే మరియు దాస-రక్షకుని పునరుత్థానము ద్వారా దేవుని క్రొత్త సృష్టిగా అగుటకు లేపబడుట చేత దీనిని దృఢపరచడం అయ్యుంది. నమ్మి బాప్తిస్మమునొందుట అన్నవి దేవుని సంపూర్ణ రక్షణను పొందుకొనుటకు ఒక సంపూర్ణమైన మెట్టుకు చెందిన రెండు భాగములై ఉన్నాయి. నమ్మకుండా బాప్తిస్మము తీసుకొనుట అన్నది వట్టి ఆచారసంబంధమైనది; బాప్తిస్మమునొందకుండా నమ్ముట అంటే, ఆంతరిక రక్షణకు బాహ్యమైన ధ్రువీకరణ లేకుండా ఆంతరికంగా మాత్రమే రక్షింప -బడుట అయ్యుంది. ఈ రెండు కలిసి వెళ్ళాలి. అంతే కాకుండా, ఇశ్రాయేలీయులు సముద్రములో (నీటిలో) మరియు మేఘములో (ఆత్మలో) బాప్తిస్మమునొందినట్టుగానే, నీటి బాప్తిస్మమన్నది ఆత్మ బాప్తిస్మమునకు జతచేయబడాలి-1 కొరి. 10:2;12:13. (మార్కు 16:16, ఫుట్‌నోట్ 1, రికవరీ వెర్షన్)

బాప్తిస్మమన్నది ఒక పద్ధతి లేదా ఆచారము కాదు; అది క్రీస్తుతో మన ఐక్యతను సూచించును. ఆయన మరణ పునరుత్థా-నమందు ఆయనతో ఒక్కటిగా మనము జతచేయబడునట్లు, మన మండలముగా ఆయనను తీసుకుంటూ, బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తులోనికి ముంచబడ్డాము. (రోమా. 6:3, ఫుట్‌నోట్ 1, రికవరీ వెర్షన్)

మనము మొదటి మానవుడైన ఆదాము అనే మండలములో జన్మించి ఉంటిమి (1 కొరి. 15:45, 47), కాని బాప్తిస్మము ద్వారా మనము రెండవ మానవుడైన (1 కొరి. 15:47) క్రీస్తు అనే మండలములోనికి బదిలీ చేయబడ్డాము (1:30; గత. 3:27). (రోమా. 6:3, ఫుట్‌నోట్ 2, రికవరీ వెర్షన్)

మనము క్రీస్తులోనికి బాప్తిస్మమునొందినప్పుడు, మనము ఆయన మరణములోనికి బాప్తిస్మమునొందితిమి. ఆయన మరణము మనల్ని లోకము మరియు అంధకార సంబంధమైన సాతానుని శక్తి నుండి వేరుచేసెను మరియు మన స్వాభావిక జీవమును, మన ప్రాచీన స్వభావమును, మన స్వయమును, మన శరీరమును మరియు మన చరిత్ర అంతటినీ కూడ అంతమొందించెను. (రోమా. 6:3, ఫుట్‌నోట్ 3, రికవరీ వెర్షన్)

బాప్తిస్మముకున్న ప్రాముఖ్యత

విశ్వసించుట అంటే క్రీస్తులోనికి విశ్వసించుటయే (యోహా. 3:16) మరియు బాప్తిస్మము నొందుట అంటే క్రీస్తులోనికి బాప్తిస్మమునొందుటయే. విశ్వాసము మరియు బాప్తిస్మము చేత క్రీస్తును ధరించుకొని మరియు క్రీస్తుతో ఐక్యపరచబడిన వారముగా, మనము క్రీస్తులోనికి ప్రవేశించాము. సరైన, యథార్థమైన మరియు సజీవమైన రీతిలో ఆచరించబడిన బాప్తిస్మము అన్నది విశ్వాసులు క్రీస్తుతో మాత్రమే కాక ఆయన దేహముతో కూడ జీవపరమైన ఐక్యతలోనికి ప్రవేశించునట్లు, విశ్వాసులను దైవిక నామము అయిన త్రియేక దేవుని నామము లోనికి (మత్త. 28:19), సజీవమైన వ్యక్తియగు క్రీస్తులోనికి (గల. 3:27), ప్రభావ వంతమైన మరణము లోనికి, అనగా క్రీస్తు మరణములోనికి (రోమా. 6:3), మరియు సజీవమైన జీవి అయిన క్రీస్తు దేహములోనికి (1 కొరి. 12:13) పెట్టును. అంతేకాకుండా, త్రియేక దేవుని మూలకముల చేత విశ్వాసులు ఒక జీవిగానున్న క్రీస్తు దేహములో జీవించునట్లు, వారి పాత జీవితమును అంతమొందిస్తూ మరియు క్రీస్తు అనే క్రొత్త జీవముతో వారిని అంకురిస్తూ, బాప్తిస్మము విశ్వాసులను వారి పాత స్థితి నుండి క్రొత్త స్థితిలోనికి తెచ్చును. (గల. 3:27, ఫుట్‌నోట్1, రికవరీ వెర్షన్)

ఎర్ర సముద్రమును దాటుట బాప్తిస్మమును సూచించుట

ఆయన ఎన్నిక ప్రజల కొరకైన దేవుని సంపూర్ణ రక్షణ అనేది పస్కాను, ఐగుప్తు నుండైన నిర్గమమును మరియు ఎర్ర సముద్రమును దాటుటను ఇముడ్చుకొనియుండును. పస్కా విమోచనను సూచించును; నిర్గమము అన్నది లోకము నుండి బయటకు వచ్చుటను సూచించును; మరియు ఎర్ర సముద్రమును దాటుట బాప్తిస్మమును సూచించును.

ఎర్ర సముద్రమును దాటుట చేత, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి రక్షింపబడిరి మరియు స్వేచ్ఛ అనే మండలములోనికి తీసుకురాబడిరి కూడా. ఇది ఏమి రక్షణయో! నియమానుసారంగా, నేడు మనకుబాప్తిస్మము అన్నది అలాంటిదే. అది మనల్ని బంధకము నుండి రక్షించును మరియు క్రీస్తులో సంపూర్ణ స్వేచ్ఛలోనికి తీసుకువచ్చును. (Life-study of Exodus, pp. 319, 338)

నమ్ముట మరియు బాప్తిస్మమునొందుట అన్నవి ఒక సంపూర్ణ అడుగును వేయుట

ప్రభువునందు మనము విశ్వాసముంచకమునుపు మరియు బాప్తిస్మమునొందక మునుపు, మనము పాపులమై ఉంటిమి. కాని మనము సువార్త ప్రకటన ద్వారా వెలిగింపబడినప్పుడు, మనము చాల పాపపూరితమైనవారమన్న గ్రహింపునకు వచ్చితిమి. దేవుని యెదుట మరియు మానవుని వైపుగా మనము అనేక అపరాధములను, అతిక్రమములను మరియు తప్పిదములను కలిగియున్నాము మరియు మనము అధిక దోషారోపణ గలిగిన వారమైతిమి. తరువాత మనము పశ్చాత్తాపపడి, ప్రభువునందు విశ్వసించియుంటిమి, ఆయన క్షమాపణను పొందుకొంటిమి మరియు రక్షింపబడితిమి. కాని మన పశ్చాత్తాపమునకు మరియు విశ్వసించుటకు బాహ్యమైన వ్యక్తత అవసరము. ఈ వ్యక్తతయే బాప్తిస్మము. కావున, బాప్తిస్మము మరియు మనము నమ్ముట, మన విశ్వాసము అన్నవి ఒక విషయముకు చెందిన రెండు పార్శ్వములై ఉన్నాయి. ఈ కారణంగానే క్రొత్త నిబంధన నమ్ముటను మరియు బాప్తిస్మమును పొందుటను గూర్చి మాట్లాడును (మార్కు 16:16). నమ్ముట మరియు బాప్తిస్మము నొందుట అన్నవి ఒక అగుడును వేయుటకు మన రెండు పాదాలను ఉపయోగించుటతో పోల్చదగును. మొదటిగా మనము నమ్ముతాము మరియు మన నమ్మకము ఒక పాదము ముందుకు వేయుటతో సగము అడుగు అయ్యుంది. మన బాప్తిస్మము మరో పాదము ముందుకు వేయడంతో అడుగు పూర్తవ్వడంతో పోల్చబడగలదు. నమ్ముట మరియు బాప్తిస్మము-నొందుట అన్నవికలిపి ఒక సంపూర్ణమైన అడుగుగా చేయును. (Life-study of 1 Peter, p. 224)

References: CWWN, vol. 48, “Messages for Building Up New Believers,” ch. 1; Life study of Exodus, msgs. 28, 29; Life-study of 1 Peter, msg. 25

   

LORD, WHEN BY BAPTISM WE CONFESS

Baptism—Buried and Risen

937

1   Lord, when by baptism we confess

Our oneness in Thy death,

Oh, by Thy mercy and Thy grace,

May Thou reveal its worth.

 

2   By baptism in Thy death we’re one

And buried too with Thee;

Thus we’re forever dead to sin

And from its bondage free.

 

3   By baptism in Thy death we’re one

And buried too with Thee;

Thus to the world we bid farewell,

From Satan’s slav’ry free.

 

4   We’re resurrected with Thee too,

From death’s great pow’r set free;

Now fruit of holiness we bear

In our new life with Thee.

 

5   We’re baptized unto Thy dear name,

No more our own are we;

Thy steps we’d follow, for Thee live,

And e’er be one with Thee.

 

Jump to section