Jump to section

పన్నెండవ పాఠముప్రేమించు తండ్రి

లూకా 15: 20-24—వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానినిచూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.  అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తవస్త్రము త్వరగాతెచ్చి వీనికి కట్టి, వీనిచేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;  క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి. 

మానవుడు దేవుని విడిచి దూరముగా వెళ్ళుట

[లూకా సువార్త 15:11-24లో చెప్పబడిన ఉపమానము] మానవునికి మరియు దేవునికి గల సంబంధము ఒక కుమారునికి అతని తండ్రికి మధ్య గల సంబంధముగా ఉన్నది. కుమారుడు తన తండ్రి నుండి కలిగినట్లుగానే, మానవుడు కూడా దేవుని నుండి కలిగినాడని ఇది సూచిస్తున్నది. మానవుడు దేవునిచే చేయబడెను. మానవుడు దేవుని జీవమును పొందుకోక పోయినప్పటికి, మానవుని జీవము దేవుని నుండే వచ్చినది. కావున, సృష్టి దృష్ట్యా, మానవుడు దేవుని కుమారుడు.

ఒక దినమున ఇద్దరు కుమారులలో చిన్నవాడు తన తండ్రి సంపదలోని తన భాగమును తీసుకొని, తన తండ్రిని విడిచి, దూరదేశమునకు వెళ్ళెను. ఈ దృశ్యము మానవుడు దేవుని యొద్ద నుండి తన సామర్థ్యములన్నిటినీ పొందుకున్నప్పటికి, దేవుని నుండి దూరముగా వెళ్ళుటను చూపుచున్నది.

తన తండ్రికి దూరముగానున్న దేశములో, ఈ చిన్నవాడు అపవిత్రమైన జీవనమును జీవిస్తూ, తన సంపాదనంతా దుర్వినియోగము చేసెను. దానిఫలితముగా, అతడు బీదవాడాయెను మరియు పందులను మేపుట ద్వారా తన జీవనమును కొనసాగించెను. ఇది మానవుడు దేవుని విడచిన తరువాత, అతడు పాపపు జీవనమును జీవించుటను చూపుచున్నది. తనకున్నదంతా దుర్వినియోగముచేసి, అతడు పాపములో పడిపోయెను. పందులు అపవిత్రమైనవి గనుక, పందులను పెంచుట అనునది పాపపు జీవనమును సాదృశ్యపరచుచున్నది. నీవు సినిమాహాళ్ళకు వెళ్లినప్పుడు లేదా నీవు నృత్యశాలకు వెళ్లినప్పుడు, నీవు పందుల దొడ్డిలోనికి వెళ్ళుచున్నావు.

మానవుడు దేవుని వైపు తిరుగుట మరియు దేవుని కొరకు పనిచేయాలని అనుకొనుట

అతడు పేదరికములో ఉండగా, కుమారుడు మేల్కొనెను. అతడు స్వీయగ్రహింపునకొచ్చెను మరియు తన తండ్రి గృహము యొక్క మంచి స్వాస్థ్యమును గూర్చి జ్ఞాపకము చేసుకొనెను. ఇది పాపములో ఉన్న ఒక మనిషి, అనగా పాపములలో జీవించువాడు, తాను ఒక ముగింపునకు వచ్చినప్పుడు దేవుని మరియు ఆయన ఆశీర్వాదములను జ్ఞాపకము చేసుకొనును అనుదానిని చూపు చున్నది. బీదరికము అనునది మానవుడు మేల్కొనునట్లు చేయును. కొంతమందికి వారు బహు అధికముగా పాపము చేసేవరకు మేల్కొనుట కష్టము. వారు నృత్యమాడుట లేదా జూదమాడుట యొక్క ముగింపునకు వచ్చినప్పుడు, వారు మేల్కొందురు.

చిన్న కుమారుడు స్వీయాగ్రహింపుకు వచ్చి, తన తండ్రిని జ్ఞాపకము చేసుకునప్పుడు, అతడు ఆయన యొద్దకు తిరిగి రావాలని నిర్ణయించుకొనెను. ఇది  మానవుడు పాపము నుండి మేల్కొనినప్పుడు, అతడు దేవుని జ్ఞాపకము చేసుకొనుట మరియు ఆయనవైపు తిరుగుట సహజమైనది అనే దానిని చూపుచున్నది.

కుమారుడు తిరిగివచ్చుటకు మునుపు, అతడు తన పాపములను జ్ఞాపకము చేసుకొనెను మరియు అతడు తండ్రికి కుమారునిగా ఉండుటకు ఎంతమాత్రము తగినవాడు కాదని అనుకొనెను. దానికిబదులుగా అతడు దాసునిగా ఉండుటకు ఇష్టపడెను మరియు తనను పనికి పెట్టుకోమని తన తండ్రిని  అడుగుటకు బయలుదేరెను. కాబట్టి తన తండ్రిని కలుసుకొనుటకు అతడు నాలుగు వాక్యాలను సిద్ధపరచుకొనెను: మొదటిది, ‘‘నేను పరలోకమునకు విరోధము గాను పాపము చేసితిని;’’ రెండవది, ‘‘నేను నీకు విరోధముగా… పాపము చేసితిని;’’ మూడవది, ‘‘ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను;’’ మరియు  నాల్గవది, ‘‘నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము’’ (18-19వ).

పాపి మేల్కొని దేవునివైపు తిరిగినప్పుడు, అతడు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసెనని మరియు దేవుని ఆశీర్వాదములు పొందుకొనుటకు అర్హుడు కాదని భావించుట సహజమేనని ఇది చూపుచున్నది. వేరు మాటలలో చెప్పాలంటే, అతడు దేవుని యొద్దనుండి వచ్చు ఏదైనను ఉచితముగా పొందుకొనుటకు అనర్హుడని అనుకొనును. దీనికారణముగా, దేవుని మంచితనముకు ప్రతిగా అతడు తన పనిని మరియు తన మంచి ప్రవర్తనను వ్యాపారముగా చేయుటపైనే ఆధారపడును. కావున అతడు దేవుని ఎదుట మెరుగుపరచుకొనుటకు ప్రయత్నించును. తాను కుమారునిగా ఉండుటకు బదులు దాసుడుగా ఉండాలని ఆలోచించుట పశ్చాత్తాపము నొందు ప్రతి పాపి యొక్క తప్పుడు భావనైయున్నది. ఈ భావన మూలముగా, దేవుని మంచితనముకు ప్రతిగా, మానవుడు తన సొంత గొప్పతనమును ఏర్పాటు చేయుటకు ఎల్లప్పుడు ప్రయత్నించును.

మానవుడు దేవుని హృదయమును గ్రహించకుండుట

చిన్న కుమారుడు తాను కుమారునిగా ఉండుటకు అర్హుడను కాడని మరియు దాసుడుగా ఉండాలనే దీనమైన మనోభావనను తన హృదయములో కలిగియున్నప్పటికీ, అతడు తన తండ్రి హృదయమును ఎరుగలేదు. తన తండ్రి హృదయములో తన కుమారుని గూర్చిన వాంఛ కలదు. అనేకమంది పాపులు అటువంటి దీనమైన హృదయమును కలిగియుండవచ్చు, కానీ వారు దేవుని హృదయమును ఎరుగలేదు. దేవుని హృదయము పశ్చాత్తాపపడిన పాపులు ఆయన కొరకు పనిచేయుట మీద కాదుగాని వారు తన కుమారులు అగుట మీదనే ఉన్నది. కూలివాడు తనకు వచ్చేదానిని తప్పక సంపాదించుకోవాలి మరియు అతడు పొందుకొనేదానికి తప్పక పని చేయాల్సియున్నప్పటికీ, కుమారుడు సమస్తమును తన తండ్రినుండి ఉచితముగా పొందుకొనును.

దేవుడు మానవుని స్వీకరించుట

చిన్నకుమారుడు తన తండ్రి యొద్దకు తిరిగివస్తునప్పటికీ, తనతండ్రి తనను స్వీకరించుటకు ఎదురు చూచుచున్నాడు అను విషయము తన గ్రహింపుకు ఎంతో దూరముగా నున్నది. తాను అనేకసార్లు తలుపును తట్టాలని మరియు చివరకు తన తండ్రి తలుపును తెరచుటకు ఎవరో ఒక దాసుడను పంపునని కుమారుడు తలంచెనేమో. అయినప్పటికీ కుమారుడు వస్తూ ఉన్నప్పుడు మరియు అతడు ఇంకనూ చాలా దూరములో ఉన్నప్పుడే, తన తండ్రి అతడు తిరిగివచ్చుట చూచెను మరియు అతడిని కలుసుకొనుటకు పరిగెత్తెను. తాను తన తండ్రి యొద్దకు తిరిగివచ్చుటే విషయమని కుమారుడు భావించగా, తన తండ్రి తనను స్వీకరించుటకు  వేచియుండుట అనునది అతడికి బహు విశేషముగా ఉండెను.

తాను కుమారుని చూచినప్పుడు, తండ్రి కనికరపడెను. తన హృదయము కదలెను గనుక,  అది అతడు పరుగెత్తుకెళ్ళి తన కుమారుని మెడపై పడునట్లు, మరియు అతడిని ప్రేమతో ముద్దాడునట్లు చేసెను. ఈ పరుగు వారి మధ్యనున్న సమయమును మరియు దూరమును తక్కువచేసెను. పరిగెత్తుట పాదములతో ముడిపడియున్నది; కుమారుని మెడపై పడుట చేతులతో ముడిపడి యున్నది; ముద్దాడుట అనునది భావోద్రేకములను వ్యక్తపరచు నోటిని కలుపుకొనియున్నది. కాబట్టి కుమారుని కొరకు తండ్రి వ్యక్తిత్వమంతా కదులుట మనము చూచెదము. పరలోకములో నున్న దేవుడు ఒక పాపి పశ్చాత్తాపమునొందుట చూచినప్పుడు, ఆయన కనికరపడును మరియు అతడిని కలుసుకొనుటకు పరిగెత్తును అని ఇది సాదృశ్యపరచుచున్నది. ఆయన హృదయమంతటితో పశ్చాత్తాపపడు పాపిని ఆయన హత్తుకొనును. పశ్చాత్తాపము నొందకమునుపు, అనేకమంది దేవుడు భయంకరమైన మరియు భయపడదగిన వానిగా తలంచెదరు, కానీ పశ్చాత్తాపము నొందిన తరువాత, దేవుడు ఎంతో ప్రశస్తమైనవాడు మరియు ఎంతో దగ్గరగా ఉన్నాడు అని కనుగొనుదురు.

దేవుడు మానవుని నీతిమంతునిగా తీర్చుట

తండ్రి అతడిని ముద్దాడిన తరువాత, కుమారుడు వెంటనే తాను సిద్ధపడిన ప్రసంగమును ప్రారంభించెను. కానీ అతడు తన మొదటి మూడు మాటలను ముగించగానే, తండ్రి అతడికి అంతరాయం కలిగించెను. కుమారుడు కేవలము, ‘‘నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు’’ అనెను, కానీ తండ్రి దాసులతో, ‘‘ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టుడి’’ అనెను (వవ. 21-22). తండ్రి హృదయము తాను తన కుమారునిగా ఉండుటకు అర్హుడను కాదు అని కుమారుడు చెప్పేదానిని వినేదిగా లేదు. కాబట్టి అతడు తన దాసులకు ప్రశస్త వస్త్రమును తెమ్మని ఆజ్ఞాపించెను. ప్రశస్త వస్త్రము అనునది చాలాకాలము క్రిందటే సిద్ధపరచబడిన వస్త్రమును తెలియజేయుచున్నది. తండ్రి చెప్పినప్పుడు, అది ఏమిటో దాసులు ఎరిగియుండిరి. తండ్రి కేవలము ‘‘ప్రశస్త వస్త్రము’’ అని చెబితే చాలు, దాసులు దానిని వెనువెంటనే అర్థము చేసుకొనిరి. తండ్రి ఇంకనూ కుమారుని చేతికి ఉంగరమును మరియు కాళ్ళకు చెప్పులను తొడిగెను మరియు క్రొవ్విన దూడను వధించెను.

ఇవన్నియు కూడా కుమారుని ఊహకు అతీతమైనవి. కుమారుడు చేసినట్లుగానే, మనము ఒక సందేశమును సిద్ధపరచుదుము, కానీ దేవుడు ప్రశస్త వస్త్రమును తెచ్చును.. ‘‘కానీ’’ అను పదము నొక్కిచెప్పవలెను. ఇది నూతన నిబంధనలో పెద్ద పదమై యున్నది.కానీ అనునది మనలను రక్షించును….మనము శిక్షించబడవలెను కానీ దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చెను; మనము నరకమునకు వెళ్లవలెను, కానీ దానికి బదులుగా మనము పరలోకమునకు వెళ్ళెదము.  వస్త్రము కప్పుట అనునది క్రీస్తే మన నీతి అగుటను సూచించుచున్నది. ఎప్పుడైతే పాపి క్రీస్తును కప్పుకొనునో, అతడు దేవునికి సరిపోవును మరియు అతడు నీతిమంతునిగా తీర్చబడును.

తండ్రి కుమారునికి చెప్పులు కూడ తొడిగెను. చెప్పులు మానవుని నేల నుండి వేరుపరచును. మానవుడు దేవుని యొద్దకు తిరిగివచ్చి మరియు నీతిమంతునిగా తీర్చబడి మరియు పరిశుద్ధాత్మచే ముద్రించబడినప్పుడు, అతడు భూసంబంధమైన వాటి నుండి వేరుపర్చబడును. తన పాదములకు చెప్పులు తొడిగిన తరువాత, తండ్రి క్రొవ్విన దూడను వధించెను. క్రొవ్విన దూడను వధించుట అనునది క్రీస్తు మనకొరకు జీవముగా మరియు ఆస్వాదనగా సిద్ధపరచబడుటను సూచిస్తున్నది. కేవలము క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడే, మనము నింపబడుదుము మరియు సంతోషముగా ఉండెదము.

దేవుడు మరియు మానవుడు కలిసి సంతోషించుట

ఈ సమయములోనే తండ్రి మరియు కుమారుడు తిని, త్రాగి మరియు కలిసి సంతోషించును. కుమారుడు తిరిగిరాక మునుపు, తండ్రికి ఎట్టి సంతోషము లేదు. కుమారుడు ఇంటికి దూరముగా ఉండి, తిరుగులాడుతూ మరియు బాధపడుచునప్పుడు, తండ్రి కూడా ఇంటినొద్ద బాధపడుచుండెను. …పాపులు దేవునికి దూరముగా ఉన్నప్పుడు, తిరుగులాడుచు మరియు బాధపడుచునప్పుడు, దేవుడు అసంతోషముగా ఉండును. కేవలము ఎప్పుడైతే పాపులు దేవునితో ఇంటినొద్ద ఉందురో, తినుచూ మరియు సంతోషముగా ఉందురో, అప్పుడే దేవుడు సంతోషముగా ఉండును.

ఎప్పుడైతే [పాపి] దేవుని యొద్దకు తిరిగివచ్చునో, అతడు ఆయనచే స్వీకరించబడును మరియు నీతిమంతునిగా తీర్చబడును. వేరుమాటలలో చెప్పాలంటే, అతడు కనుగొన- బడును మరియు అతడు బ్రతుకును.  (CWWL, 1954, vol. 3, “Gospel Outlines,” pp. 191-195)

 

References: CWWL, 1954, vol.3, “Gospel Outlines,” Subject 91; Life-study of Luke, msg. 34

 

I’VE WANDERED FAR AWAY FROM GOD

Gospel—Coming to the Lord

1052

1   I’ve wandered far away from God;

Now I’m coming home;

The paths of sin too long I’ve trod;

Lord, I’m coming home.

 

Coming home, coming home,

Nevermore to roam;

Open wide Thine arms of love;

Lord, I’m coming home.

 

2   I’ve wasted many precious years;

Now I’m coming home;

I now repent with bitter tears;

Lord, I’m coming home.

 

3   I’m tired of sin and straying, Lord;

Now I’m coming home;

I’ll trust Thy love, believe Thy word;

Lord, I’m coming home.

 

4   My soul is sick; my heart is sore;

Now I’m coming home;

My strength renew, my hope restore;

Lord, I’m coming home.

 

5    My only hope, my only plea-

Now I’m coming home-

That Jesus died, and died for me;

Lord, I’m coming home.

 

6    I need His cleansing blood, I know;

Now I’m coming home;

Oh, wash me whiter than the snow;

Lord, I’m coming home.

 

Jump to section