Jump to section

ఎనిమిదవ పాఠముక్రీస్తే జీవము

కొలొ. 3:4—మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు

వాయుకృతుడైన క్రీస్తు మనకు ఇచ్చిన జీవము

“ఆత్మయే జీవింపచేయునది” అని [బైబిలు చెప్పుచున్నది] (యోహాను 6: 63). కానీ ఆత్మ ఇచ్చు ఈ జీవము ఏమిటి? ఎన్నో రకములైన జీవములు ఉన్నవని మనకు తెలియును. ఈ లోకములో వృక్ష జీవము మరియు జంతు జీవము ఉన్నవి. వృక్ష జీవము తక్కువైనది మరియు జంతు జీవము ఎక్కువైనది. ఈ  రెండు రకములైన జీవముల కన్నా ఉన్నతమైనది మానవ జీవము. ఈ జీవములన్నియు అద్భుతమైనవి కానీ నాలుగవ రకమైన జీవము ఉన్నది-అది దైవిక జీవము, దేవునిలోనున్న సృష్టింపబడని జీవము.

అత్యున్నతమైన జీవము

ఈ అత్యున్నతమైన జీవము యొక్క లక్షణములు ఏమిటి? మొదటిగా, దేవుని యొక్క ఈ జీవము దైవికమైనది. దైవికము అనగా దేవుడుగా ఉండుట, దేవుని స్వభావమును కలిగి ఉండుట మరియు ఇతరుల నుండి విశిష్టముగా మరియు మహనీయముగా ఉండుట. దేవుడు మాత్రమే దైవికమైన వాడు, కనుక ఆయన జీవము దైవికమైనది. ఇంకా, దేవుని జీవము నిత్యమైనది…దేవుని జీవము సృష్టించబడనిది, దానికి ఆరంభము లేదు మరియు ముగింపు లేదు. మనమందరము ఒక సమయంలో మరియు ఒక దినమున జన్మించితిని మరియు మన మానవ జీవము మరణముతో ముగియునను  గ్రహింపు మనందరికీ ఉన్నది. కానీ దేవుని జీవమునకు ఎటువంటి ఆరంభము లేదు మరియు అది నిరంతరము కొనసాగును. ఎన్నో యుగములనుండి మానవులు వారి జీవమును పొడిగించుటకు ఎన్నో యంత్రములను నిర్మించిరి, కానీ ఏవీ కూడా ఫలించలేదు. అయినప్పటికినీ, దేవుడు స్వయంభవుడు మరియు నిత్య ఉనికిని కలిగియున్నవాడు. ఆయన జీవము నిజమైనది మరియు మార్పు లేనిది…దేవుని నిత్యజీవము నిరంతరముండుట మాత్రమే కాదు కానీ, నాణ్యతలో కూడా అది ఎటువంటి లోపము లేక కొరత లేకుండా, పూర్తిగా సంపూర్ణమైనది మరియు పరిపూర్ణమైనది. (Christ Is Spirit and Life, pp. 9-11)

దేవుని నిత్యజీవము ఆయన కుమారునిలో ఉండుట

మొదటి యోహాను 5: 10-11, “ఈ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని కలిగి- యున్నవాడు జీవము గలవాడు; దేవుని కుమారుని కలిగిలేనివాడు జీవములేనివాడు” అని చెప్పుచున్నది. ఈ నిత్య జీవము కుమారునిలో ఉన్నదని మనకు ఇక్కడ చెప్పబడినది. ఇంకెక్కడ ఇది లేదు.

దేవుని కుమారుడు మరణము మరియు పునరుత్థానము గుండా వెళ్లి పరిశుద్ధాత్మగా అయిన తర్వాత ఆయన సమయము చేతకాని, స్థలము చేతకాని ఇక ఎంత మాత్రము పరిమితి చేయబడినవానిగా లేడు. ఇప్పటినుండి, దేవుని కుమారుని స్వీకరించినవాడు దేవుని స్వీకరించును. అటువలె పరిశుద్ధాత్మను స్వీకరించువాడు కుమారుని స్వీకరించును‌. మొదటి కొరింథీయులు 15:45, “కడపటి ఆదాము జీవమిచ్చు ఆత్మ ఆయెను” అని చెప్పుచున్నది. క్రీస్తుని స్వీకరించిన వారందరూ నూతన జీవమును పొందునట్లుగా ఇది చేయును. వారి పాపములు  క్షమించబడుట మాత్రమే కాదు కానీ, వారు దేవుని నుండి నిత్యజీవమును కూడా స్వాస్థ్యముగా పొందుతారు.

ఊపిరి తీసుకొనునంత సులువుగా క్రీస్తును జీవముగా స్వీకరించుట

ప్రభువు చేత బహుగా [వాడబడిన వ్యక్తి] మిస్టర్ ఎఫ్. బి. మేయర్. ఒక సమయమందు, పరిశుద్ధాత్మలో క్రీస్తు మనకు ఎలాగు జీవముగా కాగలడో అతడు గ్రహించలేదు మరియు ఈ జీవమును ఎలాగు స్వీకరించవలెనో కూడా అతను చూడలేదు. ఒక దినమున అతను దేవుని కుమారుడిని తన జీవముగా పొందగోరి కొండపై ప్రార్థించుచుండెను. తాను చేయవలసిన- దల్లా కేవలము విశ్వసించుట మాత్రమే అని ఒక్కసారిగా అతను గ్రహించెను. అతను శ్వాసను తీసుకొని “ప్రభువా, నేను        ఈ గాలిని శ్వాసించుచున్న రీతిగానే, నిన్ను నాలోనికి తీసుకొనుటకు నా విశ్వాసమును సాధకము చేయుచున్నాను” అని ప్రార్థించెను…అతడు కొండ దిగి వచ్చిన తర్వాత, అతను “దేవుని కుమారుడిని నేను శ్వాసించిన దినము నుండి, నా జీవితము పూర్తిగా మారిపోయెను” అని ఇతరులకు సాక్ష్యమిచ్చెను. దేవుని కుమారుడిని జీవముగా స్వీకరించుట చాలా సులువైన విషయము. అది మనలోనికి ఊపిరిని శ్వాసించుటంత సులువైనది. (CWWN, vol. 27, “The Normal Christian Faith,” pp. 143-144)

తినుట మరియు త్రాగుట ద్వారా ఎదుగుట

దైవిక జీవము మనలోనికి వచ్చినప్పుడు, మనము పునర్జన్మింప బడుదుము; మనము దేవుని జీవమును కలిగి- యుందుము మరియు మనము దేవుని కుమారులుగా అగుదుము… మన మానవ జీవనములో మనము జన్మించిన తరువాత, తినుట మరియు త్రాగుట ద్వారా మనము నిత్యము ఎదుగుదుము. అటువలె, క్రీస్తును ఆత్మీయ ఆహారముగా తినుట ద్వారా మరియు ఆత్మను జీవజలముగా త్రాగుట ద్వారాను, మన ఆత్మీయ జీవము ఎదుగును. దినదినము మనము క్రీస్తును తిని మరియు త్రాగినప్పుడు, మనము దైవిక జీవములో ఎదుగుదుము. ఈ విధముగా మనము దేవునితో నింపబడిన ప్రజలుగా అగుదుము మరియు తుదకు మన జీవనములో  దేవునిని వ్యక్తపరచుదుము. ఇదే క్రైస్తవ జీవితము యొక్క అర్థము.(Christ Is Spirit and Life, p. 17)

 

References: Christ Is Spirit and Life; CWWN, vol. 27, “The Normal Christian Faith,” ch. 12; CWWL, 1983, vol. 1, “The Five Great Mysteries in the Bible,” ch. 3

LIFE OF GLORY—OH, WHAT GLORY!

Experience of Christ—As Life

8380

1    Life of glory-oh, what glory!

Christ is glorious life to me;

Perfect, righteous, pure, and holy,

Life and light so rich is He!

All the glory of God’s nature

Dwells within Him hiddenly,

But as life is He imparted,

Me supplying inwardly.

 

2    Life divine-oh, joy to know it!

Christ is life divine to me;

He’s the consummated Spirit

Who has come to dwell in me.

Touching, moving, shining, teaching,

He’s th’ anointing soothing me,

Filling, drenching, and refreshing,

Me supplying inwardly.

 

3    Life of power-oh, what power!

Christ’s the life of pow’r in me;

Crucified with Christ the Savior,

No more slave of sin I’ll be.

With Him I’ve been resurrected,

I in Him and He in me;

Resurrection pow’r I’ve tasted,

Me supplying inwardly.

 

4    Life of vict’ry-oh, what vict’ry!

Christ’s victorious life to me;

On the cross He won the vict’ry;

I’ll no more a captive be.

Satan, demons, world, and passions-

He has conquered all for me;

Now His life of victory is

Me supplying inwardly.

 

5    Life of glory-power, vict’ry!

Life divine is Christ to me!

He gives vict’ry, power; gives me

Growth unto maturity;

To His image He transforms me,

Makes me all transcendent, free;

Till I’m raptured, glorified, He’s

Me supplying inwardly.

Jump to section