Jump to section

నాల్గవ పాఠముబైబిల్

2 తిమోతి 3:16—ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది  మరియు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.

బైబిల్ ప్రపంచములోని ఇతర అన్ని గ్రంథములకు పైగా నిలచునది. ఇది అద్వితీయమైన గ్రంథము. అమెరికా సంయుక్త రాష్ట్రముల యొక్క పదహారవ ప్రెసిడెంట్ అబ్రహాము లింకన్ ఇలా చెప్పెను “బైబిల్ దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప వరము. లోక రక్షకుని నుండి వచ్చే మంచి అంతయూ ఈ గ్రంథము ద్వారా మనకు తెలియపరచబడినది.” ఇది ప్రపంచములో ఎక్కువగా చదువుతున్న గ్రంథము మరియు ప్రపంచములో మరే గ్రంథమునకులేని విధముగా ఇది వెయ్యికి పైగా బాషలలోనికి తర్జుమా చేయబడినది. ఆదరణ, నిరీక్షణ మరియు ఇబ్బందిలో మరియు అనిశ్చతలో మార్గనిర్దేశము కొరకు అసంఖ్యాకులు బైబిల్ వైపునకు తిరిగిరి. బైబిల్ అను పదము “గ్రంథము” అని అర్ధమిచ్చు బిబ్లోస్ అను గ్రీకు పదము నుండి వచ్చెను. దీనర్థము ప్రపంచములోని ఇతర గ్రంథముల నడుమ ఇది అద్వితీయ-మైనదిగా నిలచుచున్నది.

ఉత్తమ శ్రేణికి చెందిన రచనలలో బైబిల్ అత్యున్నతమైనదిగా ఉండుట

బైబిల్ దాని యొక్క గ్రంథస్థములో అత్యున్నతమైనదిగా ఉండుట

మొదటి వాస్తవమేమిటనగా, గ్రంథములన్నిటిలో దాని యొక్క గ్రంథ ప్రామాణికతలో బైబిల్ ఒక్కటే నిలచును. ఇతర మతముల యొక్క శాస్త్రములు, కల్పిత కథలతోను మరియు పురాణ గాథలతోను నిండియుంటాయి. అయితే బైబిల్ లోపల నిజ సంఘటనలు, ప్రజలు మరియు ప్రదేశములు చెప్పబడిన అసంఖ్యాకమైన వాక్యాలను మనము కనుగొంటాము. లౌకికమైన చారిత్రక రికార్డుతో పాటు పురాతత్వశాస్త్రము, బైబిల్లోని పుస్తకముల లోని వాక్యముల యొక్క ఖచ్చితత్వమును ధ్రువీకరిస్తున్నది.

శూన్యము నుండి ఆకాశములను, భూమిని, సృష్టించబడిన సమస్తమును కలుపుకొనియున్న విశ్వమును సృష్టించిన సర్వశక్తిమంతుడు, నిత్యుడైన సృష్టికర్తను గూర్చి బైబిల్ మనకు చెప్పును. ఆదికాండము సృష్టిని గురించినది, ఇది విజ్ఞాన శాస్త్రము యొక్క వృత్తాంతము కాదుగాని, వైజ్ఞానిక ఆధారాలతో పూర్తిగా సామరస్యత కలిగియున్నది.

బైబిల్ దానిలో ఉన్న జ్ఞానములోను మరియు గొప్పతనములోను అత్యున్నతమైనదిగా యుండుట

రెండవదిగా, దేవునితో మానవుని యొక్క సంబంధము మరియు అతని సహా మానవులతో ఉన్న సంబంధము, అతని ఆలోచనలు, అతని ప్రవర్తన, అతని అనుదిన జీవనము గురించి బైబిల్ శ్రేష్టమైన జ్ఞానమును ఇచ్చునది. పాత నిబంధన కాలములో, భూమి మీద బహు దేవతా వాదము, అనగా ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళను నమ్మే సంస్కృతి ఉండేది. దేవుళ్ళని చెప్పబడేవి అధికముగా కౄరమైనవి, భయానకమైనవి, లేక కొన్నిసార్లు చెడునడత గలవారు. అయితే మానవుల కొరకు తండ్రిగా మరియు భర్తగా శ్రద్ధ వహించువాడును, ప్రేమ,  గౌరవము, న్యాయము, మరియు కరుణ అనువాటికి ప్రతిరూపమునైయున్నాడు, అపరిమితుడైన మరియు సన్నిహితుడైన అద్వితీయ దేవుణ్ణి బైబిల్ బయల్పరచును.

వేదాంతశాస్త్రం, మానవ విజ్ఞాన శాస్త్రాలు, ఖగోళశాస్త్రము, భౌగోళిక శాస్త్రము, తత్త్వ శాస్త్రము, సాంఘికశాస్త్రము, వైజ్ఞానిక శాస్త్రము, ప్రభుత్వము, విద్య, సంస్కృతి, మరణానంతర జీవచరిత్ర వంటి అన్ని విధములైన పరిజ్ఞానమును కూడా బైబిల్ తెలియజేయును.

నీతిశాస్త్రం మరియు నీతిబద్ధతలో బైబిల్ అత్యున్నతమైనదిగా ఉండుట

నీతిశాస్త్రము మరియు నీతిబద్దత విషయములో బైబిల్ కల్గియున్న ఉన్నతమైన ప్రమాణము మరే ఇతర గ్రంథములో లేదు. అది సరియైన ప్రేమను ఒక మాన సుగుణముగా వివరించును, ఈ సుగుణము దీర్ఘశాంతము గలది, దయగలది, అసూయ లేనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది (1 కొరి. 13:4). అది ప్రేమను ఒకని శత్రువును కూడా క్షమించునంతటిగా నిర్వచించును (మత్త. 5:44). అది ప్రేమను మానవుని కొరకు తన అద్వితీయకుమారుని ఇచ్చివేయునట్టి మాదిరికమైనదిగా వివరించును (యోహాను 3:16). క్రైస్తవులు ప్రేమయందు నడచుకొనువారు (ఎఫెసి. 5:2), మరియు సంఘము అనునది ప్రేమయందు నిర్మించబడిన సమాజము (ఎఫెసి. 4:16) అని బైబిల్ వివరించును.

ప్రభావము చూపుటలో బైబిల్ అత్యున్నతమైనదిగా ఉండుట

చరిత్ర అంతటిలో, అనేకమంది పేరుపొందిన ప్రజలు బైబిల్ చదువుట ద్వారా క్రీస్తు నందు విశ్వాసముంచునట్లు ప్రేరేపించబడిరి. ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ ఓడిపోయి, సెంట్ హెలెనా ద్వీపమునకు ప్రవాసితునిగా వెళ్ళినప్పుడు, ఇతర చక్రవర్తులు వారి సామ్రాజ్యములను బలాత్కారముతో ఏర్పాటు చేసుకొనగా, యేసుక్రీస్తు తన రాజ్యమును ప్రేమతో నిర్మించెను అని అతడు ఒప్పుకొనెను. తన కొరకు అనేకులు చనిపోవునట్లు చేయాలంటే, అతడు వారితో ముఖాముఖిగా మాట్లాడవలసి యుంటుంది, అయితే పద్దెనిమిది శతాబ్దములుగా అసంఖ్యాకులైన స్త్రీ పురుషులు యేసుక్రీస్తును ఒక్కసారి కూడా చూడకుండానే సంతోషముతో ఆయన కొరకు వారి జీవితములను త్యాగము చేయుటకు ఇష్టపడుచున్నారు. అనేకులు సమస్తమును విడిచి క్రీస్తును వెంబడించుటకు మరియు ఆయన కొరకు హతసాక్షులు అవుటకు గల కారణము, వారు బైబిల్ యందు బయల్పరచబడిన క్రీస్తును చూశారు.

బైబిల్ దేవుని పరిశుద్ధమైన వాక్యము

బైబిల్ ఇతర గ్రంథములకు భిన్నమైనదిగా ఉండుటకు గల కారణము దాని స్వభావము దైవికమైనది. లేఖనము దేవుని ఊపిరి (2 తిమో. 3:16). ఇది మనకు చెప్పుచున్నదేమనగా, లేఖనము మనుష్యుని ఆలోచనలో నుండి వచ్చినది కాదు, అయితే దానికిబదులు, గ్రంథకర్తల లోనికి మరియు వారిలో నుండి బయటకు తన ఆత్మ ద్వారా ఆయన ఆలోచనను మరియు ఆయన మాటను దేవుడు ఊదుట అయ్యున్నది. అందువలన, బైబిల్ దేవుని మూలకములను కలిగి యున్నది మరియు ఆయన యొక్క వాసనను కలిగియున్నది. ఒక క్రైస్తవుని యొక్క గొప్ప ఆనందము ఏమనగా, దేవుని ఊపిరి యొక్క మాట ద్వారా అనుదినము దేవుని తాకగల్గుట మరియు ఆయనను రుచిచూచుట అయ్యున్నది.

లేఖనము అనునది దేవుడు ఆయన మాటను తన ఆత్మ చేత మనుష్యుల ద్వారా ఊదుట, గనుక లేఖనము యొక్క ఏ మాటయూ మానవ చిత్తము నుండి వచ్చినది కాజాలదు; దానికి బదులు, ఆత్మ వలన ప్రేరేపింపబడిన మనుష్యులు దేవుని నుండి మాట్లాడిరి. “మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిన” (2 పేతు. 1:21) దేవుని మాట రెండింతల అర్థము గలది: మొదటిగా, మనుష్యులు ఆత్మ మూలముగా ప్రేరేపింపబడిన వారు; రెండవది, మనుష్యులు దేవుని నుండి మాట్లాడిరి. ఆదిమ గ్రీకులో, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుట అనునది గాలిచేత ఓడ కొనిపోబడుట అనే అర్థమును తెలుపుచున్నది. బైబిల్ గ్రంథకర్తలు దేవుని ప్రేరేపణను పొందిరి, మరియు వారు పరిశుద్ధాత్మ యొక్క శక్తి క్రింద ఉండిరి, అనగా దేవుని మాటను బయటికి మాట్లాడుటకు ఆయన చేత ప్రేరేపించబడిరి మరియు కొనిపోబడిరి. ఇంకనూ, వారు మాట్లాడినప్పుడు, వారు దేవుని లోపల నుండి మాట్లాడిరి. దేవుని ఆత్మయే మాట్లాడుటకు వారిని కొనిపోయెను, మరియు మనుష్యులు దేవుని లోపల నుండి మాట్లాడుట అయ్యున్నది. వేరేమాటల్లో చెప్పాలంటే, తన స్వంత మాటను మనుష్యుల లోపల నుండి, వారి నోటి ద్వారా దేవుడు మాట్లాడుట అయ్యున్నది.

బైబిల్ యొక్క ప్రధాన అంశములు

1. బైబిల్ తన ప్రణాళికతోనున్న దేవుడై యున్నది

బైబిల్లో బయల్పరచబడిన దేవుడు జ్ఞానము మరియు ఉద్దేశము గల దేవుడు. తెలివైన మరియు ఉద్దేశ్యపూర్వకమైన ఏ వ్యక్తియైననూ ఎల్లప్పుడూ ప్రణాళికలతో నిండియుండినట్లే, చాలా తెలివైనవాడైన మన దేవుడు, ఒక నిత్య ప్రణాళికను కల్గియున్నాడు, అది ఎక్కువగా మానవునితోను మరియు లోకముతోను ముడిపడియున్నది.

2. మానవుడు మరియు అతని గమ్యము

మానవుడు ఎక్కడ నుండి వచ్చినది, అతడు ఎలా చేయబడినది, మరియు అతడు ఎక్కడికి వెళ్ళుచున్నది బైబిల్ మనకు చెప్పును. అది మానవుని కొరకున్న దేవుని ప్రణాళికను మనకు చెప్పును.

3. క్రీస్తు

క్రీస్తు బైబిల్‌కు కేంద్రీయమైన వ్యక్తి. పాత నిబంధన ఆయన గురించిన ప్రవచనము, క్రొత్త నిబంధన ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు. మానవాళి కొరకు విమోచనమును మరియు రక్షణను క్రీస్తు ఎలా నేరవేర్చెనో ఇది మనకు చెప్పును.

4. పరిశుద్ధాత్ముడు

[పరిశుద్ధాత్మ] దేవునిలోని మూడవ వ్యక్తి. ఆయన మానవుడు దేవుణ్ణి అనుభవించుట అను సంబంధములో ఎక్కువగా ప్రస్తావించబడెను.

5. దైవిక జీవము

[దైవిక జీవము అనగా] దేవుని జీవము, క్రీస్తు నందు విశ్వాసము ఉంచినప్పుడు ఒక వ్యక్తి దీన్ని పొందుకొనును. ఈ  దైవిక జీవము క్రీస్తునందు విశ్వాసముంచువారిలో జీవించును  మరియు దిశా నిర్దేశము చేయును మరియు వారి జీవనమును రూపాంతరించును.

6. క్రీస్తునందున్న విశ్వాసులు

క్రీస్తునందు ఒక విశ్వాసిగా ఉండుట యొక్క అర్థమును మరియు సరియైన క్రైస్తవ జీవితము జీవించుటకు గల మార్గమును క్రొత్త నిబంధన మనకు చెప్పును.

7. సంఘము

[సంఘమంటే] నేడు భూమి మీద విశ్వాసులనే దేవుని సమాజము. సంఘమనగా ఏమిటి మరియు విశ్వాసులు ఎలా సంఘముగా కూడుకోవాలి అనువాటిని బైబిల్ వివరించును.

8. దేవుని రాజ్యము

[దేవుని రాజ్యము] అనగా ఈ యుగములోను మరియు రాబోవు యుగములోను దేవుడు తన పరిపాలనను మరియు అధికారమును అభ్యాసము చేయు మండలము.

9. క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి

[క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి] భవిష్యత్తులో నిత్యత్వములో జరగబోయే విషయములను గురించి మాట్లాడును.

బైబిల్ చదువుట చేత యేసుక్రీస్తును కలుసుకొనుట

నీవు సత్యమును అన్వేషించువాడవై, నీ జీవితము యొక్క అర్థమును తెలుసుకొనగోరితే, నీవు బైబిల్ చదవాలి, మరియు బైబిల్లో నీకు తెలిపిన క్రీస్తును పిలవాలి. దేవుడు ప్రతీ వ్యక్తికి ఆత్మను ఇచ్చెను (యోబు 32:8) తద్వారా, అతడు దేవుని విషయములను అర్థము చేసుకొనగలడు మరియు స్వీకరించగలడు. నీవు క్రొత్త నిబంధన చదువుట ద్వారా ఈ అద్భుతమైన గ్రంథమైన బైబిల్‌ను చదువుటకు ఆరంభిస్తావని మేము ఆశిస్తున్నాము, మరియు ఈ గ్రంథములోని యేసుక్రీస్తును కలుసుకొనుట ద్వారా, నేడు ఒక ఫలవంతమైన మరియు సమృద్ధివంతమైన జీవితమును ఆరంభిస్తావని మేము ఆశిస్తున్నాము. (The Bible, pp. 1-2, 6-8, 11-18)

References: The Bible; On Knowing the Bible; CWWL, 1985, vol. 4, “The Full Knowledge of the Word of God”

 

లేఖనమంత దైవశ్వాసయే వాక్యాధ్యయనమువాక్యపు విధి నిర్వహణ

799

1   లేఖనమంత దైవశ్వాసయే

తన ఆత్మచే వాక్యములుగా

దైవజనులచే వ్రాయబడి

నరులకు వాగ్ధానములాయెన్

 

2   దైవశ్వాసయై వెలుగిచ్చును

దివ్యపుంజములై ప్రకాశించున్

చీకటిలో ప్రత్యక్షతనిచ్చి

నరుని అక్కరను తెల్పును

 

3   దైవశ్వాసయై జీవమిచ్చును

దైవస్వభావమును మనకు

ప్రసరింపజేయుచునుండియు

ప్రాణమును రూపాంతరించును

 

4   దైవశ్వాసయై జ్ఞానమిచ్చును

దైవజ్ఞానమును బోధించును

దేవుని నిత్య సంకల్పమును

తెల్పుచు గురియొద్దకు నడ్పున్

 

5    దైవశ్వాసయై బలమిచ్చును

దైవిక శక్తిని కలిగించున్

దైవసంకల్పం నెరవేరను

దుర్భలులకు శక్తినిచ్చును

 

6    దైవశ్వాసయై శ్వాసించుటచే

దేవునిచే పాలిభాగముగా

ఆత్మను సాధకము చేయుచు

ఆయన నాస్వాదింపవలెను

Jump to section