మూడవ పాఠము – సంఘజీవనము అనేది నిజమైన సామూహిక జీవనమై వున్నది
యెహాను 13:34-35—మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకొందురనెను.
సామూహిక జీవనాన్ని కలిగివుండాలని దేవుడు సృష్టించిన కోరిక
మానవులు ఒకరకమైన సామూహిక జీవనాన్ని కలిగివుండాలనే కోరికను కలిగివుంటారు. ఈ కోరిక సహజ స్వభావమునుండి బయటకువస్తుంది. ఒక సమాజాన్ని కలిగి వుండాలని, అనగా మనమందరం కలిసి జీవించాలనే కోరికను మన సహజ స్వభావములో, అనగా స్వాభావిక జీవములో ఉంటుంది.
ఆదికాండము 1:26లో దేవుడు మొదటిగా ఇలా చెప్పెను, “దేవుడు…నరుని చేయుదము.’’ దేవుడు ఒక్క మానవున్ని సృష్టించాడా లేక అనేక మానవులను సృష్టించాడా? దేవుడు “మానవుడు’’ అని ఎందుకు ఏక నామవాచకము ఉపయోగించాడు మరియు తరువాత “వారు’’ అనే బహు వాచకమును ఉపయోగించాడు. దేవుడు ఒక్క మానవున్ని సృష్టించాడా లేక అనేక మానవులను సృష్టించాడా? జవాబేమిటంటే: దేవుడు అనేక మానవులను ఒక మానవునిలో సృష్టించెను, లేదా దేవుడు ఒక్క మానవునితో పాటుగా అనేక మానవులను చేసాడు. దీని అర్ధమేమనగా, దేవుని అభీష్టములో మానవుడు సమిష్టి మానవుడు. దేవుడు ముందుగా ఆదామును సృష్టించి, తరువాత అబ్రాహామును, ఆ తరువాత దావీదు మున్నగువారిని సృష్టించలేదు. దేవుడు ఒక సమిష్టి మానవుని సృష్టించాడు. ఒక మానవునిలో అనేక మానవులున్నారు. దేవుని అభీష్టములో ఆయన చేసినది ఒక సమిష్టి పని. మానవ స్వభావములో సామూహిక జీవనాన్ని జీవించాలనే ఈ కోరిక దేవుని చేత పెట్టబడినదని మనమందరము గమనించాలి.
సంఘ జీవనము నిజమైన సామూహిక జీవనము
క్రీస్తులో మనమందరం ఒకే జీవాన్ని కలిగియున్నాము, మరియు ఈ ఒక్క జీవముతో, ఒకే స్వభావాన్ని మరియు ఒకే కోరికను కలిగియున్నాము. మనము రక్షించబడిన తరువాత, వెనువెంటనే సరియైన క్రైస్తవులతో సహవాసము కొరకు సంప్రదించాలనే ఒక కోరిక మనలో ఉంటుంది. ఇది ఒక సమాజము కొరకైన, అనగా సామూహిక జీవనము కొరకైన కోరిక. సంఘ జీవనము అనేది నిజమైన సామూహిక జీవనమై ఉన్నది.
ఒకరినొకరము ప్రేమించుకొనుటకు క్రీస్తే మన జీవముగా మరియు మూలకముగా ఉన్నాడు.
మనము తెలుసుకోవలసినది, ఏమిటంటే మనము ఒకరకమైన జీవనాన్ని కలిగి ఉండాలంటే, ఒక రకమైన జీవము మనకు అవసరం. దేవుడు ఒక జీవముతో సృష్టించిన మానవుడు సమాజములో ఉండాలనే కోరికను కలిగివున్నాడు, కానీ ఆ జీవము పాడైపోయి విషపూరితమైనది. ఒక వైపున, దేవుడు సృజించిన స్వభావముంది గనుక మనము ఇంకొకరితో జీవించాలనే కోరిక ఉంది; ఇంకొక ప్రక్క, మన మానవ జీవము పాడైపోయి, సైతాను చేత చెడిపోయెను గనుక మన పడిపోయిన స్వభావములో సామూహిక జీవనము కొరకు మనలో సరియైన జీవము లేదు.
కాని ఇప్పుడు మనకు క్రీస్తు వున్నాడు, క్రీస్తు అద్భుతమైనవాడు. మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమతోకూడిన సామూహిక జీవనంలో ఒక్కటైయుండుట కొరకు ఆయన సామాన్యమైన కారకము, సామాన్యమైన మూలకమై ఉన్నాడు (రోమా 12:10). నాకు అందరి సహోదరుల పేర్లు తెలియదు, ఎందుకనగా వారు ప్రభువులో సహోదరులు కాబట్టి, నేను ఎంతో సహజముగానే వారిని ప్రేమిస్తాను. అందరి సహోదరులలో ఒక సామాన్య మూలకము ఉన్నది, ఆ మూలకం క్రీస్తే. క్రీస్తే మూలకముగా ఒకరినొకరు ప్రేమించుటకు కారకమై వున్నాడు. అలాగే ఒకరినొకరు ప్రేమించుటకు సామర్థ్యము గల జీవముగా క్రీస్తు మనలో ఉన్నాడు. (CWWL, 1971, vol. 1, “The Life for the Preach ing of the High Gos pel,” pp. 447-449)
Reference: CWWL, 1971, vol. 1, “The Life for the Preaching of the High Gospel,” ch. 6
క్రీస్తుని మహిమగల సంఘములో
సంఘము — క్రీస్తు దేహము – 1226
1 క్రీస్తుని మహిమగల సంఘములో మనము అవయవమూలమై యున్నాముగా
విశ్వమందున్నట్టి ఏకదేహములో మనలన్
హల్లెలూయా, ప్రభు చేర్చియున్నాడు.
హల్లెలూయా, దేహముకై!
మనవయవములం !
అర్పించుకొందము సర్వం!
హల్లెలూయా, మనమేకమైతిమి!
2 ఒంటి క్రెస్తవుల౦ కాక, సమిష్టి సత్త్వమైన
దేవుని సంపూర్ణమైన వ్యక్తతై;
ఒంటి సంఘములు కాక, సమిష్టిగా దేహమై
హల్లెలూయాదేహములోనుంటిమి
హల్లెలూయా, దేహముకై!
సాతానుడు వణకును!
దేహములోనే జయము!
హల్లెలూయా, దేహములోనుంటిమి
3 సువర్ణమయమైనట్టి ఏడు దీపస్తంభముల్
దైవస్వభావం గల సంఘములే
దైవస్వభావముపొంది, మనమేకమైనచో
హల్లెలూయా, ప్రజ్వరిల్లుచుందుము
హల్లెలూయా, దేహముకై!
దీపస్తంభముల్ దేహమే!
స్వర్ణమయమై దేహము!
హల్లెలూయా, ప్రకాశించుచున్నది!