Jump to section

రెండవ పాఠముక్రీస్తే మానవ జీవితము యొక్క అర్థము

కొలొ. 3:4—మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

యోహా. 5:24—నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పు లోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మనకు దేవుని అవసరత మరియు క్రీస్తుకు మన అవసరత

దేవునికి మానవుడు అవసరము, మరియు మానవునికి క్రీస్తు అవసరము. మానవుడు లేకుండా, దేవుడు తన ఉద్దేశమును నెరవేర్చుకొనజాలడు. మానవుడు లేకుండా, దేవుడు ఏమియు చేయలేడు.  మరొకవైపునేమో, మనము కూడా ఇలా చెప్పాలి, ‘‘క్రీస్తు లేకుండా, నేను ఏమియు చేయలేను.’’ మనము లేకుండా, దేవుడు ఏమియు చేయలేడు, మరియు క్రీస్తు లేకుండా మనము ఏమి చేయలేము. దేవునికి మనము కావాలి, మరియు మనకు క్రీస్తు కావాలి. మనము దేవుని కొరకు ఉన్నాము, మరియు క్రీస్తు మన కొరకు ఉన్నాడు.

మనము దేవుని కొరకు లేనిచో మరియు మన కొరకు క్రీస్తును మనము కల్గియుండకపోతే, మనము దిక్కుమాలిన వారము మరియు దయనీయమైనవారము అవుదుము. దురదృష్టవశాత్తు, ఇదే నేటి ప్రపంచం యొక్క నిజమైన పరిస్థితి. లోకము లోని ప్రజలు దేవుని కొరకు కాదు మరియు వారికి క్రీస్తు లేడు. వారంతట వారు నడచుదురు మరియు వారియందే వారు నమ్మిక యుంచుదురు. అయితే క్రైస్తవులమైన మనము భిన్నముగా ఉంటాము, ఎందుకనగా మనకు క్రీస్తు ఉన్నాడు.

క్రీస్తును మన జీవముగా తీసుకొనుట

మానవరీతిగా మాట్లాడితే, అనేకమైనవి చేయుటకు మనము అసమర్దులము అయ్యుండవచ్చును, కాని మనమందరము శ్వాసించగలము, త్రాగగలము, మరియు తినగలము. ఇవి ఎలా చేయాలో చిన్నపిల్లలకు కూడా తెలియును. వారికి ఎవరును బోధించనక్కరలేదు. అదేవిధంగా ఆత్మీయ మండలములో మనము ఏమియు చేయలేని వారము, అయితే మనము క్రీస్తును శ్వాసించగలము (యోహాను 20:22), క్రీస్తును త్రాగగలము (4:14; 7:37), క్రీస్తును మన ఆహారముగా తీసుకోగలము (6:35, 51, 57).  క్రీస్తే గాలి, అనగా శ్వాస; క్రీస్తే నీరు, అనగా పానీయం; మరియు క్రీస్తే రొట్టె, అనగాఆహారము. కాబట్టి, మనమందరము క్రీస్తును మనలోపలికి తీసుకోగలము. మనంతట మనము ఆయనను వ్యక్తపరచవలెనని లేక మనంతట మనము ఆయన కొరకు ఎదోచేయాలనే ఉదేశము దేవునికి లేదు. దేవుని ఉద్ధేశము ఏమనగా, క్రీస్తును మన జీవముగా తీసుకొనుట ద్వారా మనము ఆయనను వ్యక్తపరుస్తాము మరియు ఆయన కొరకు పనులు చేస్తాము (కొలొ. 3:4; యోహాను 6:57; 14:19).

రెండు పెద్ద తప్పులు, ఒకటి లోకానుసారమైన ప్రజలు చేసేది మరియు ఇంకొకటి క్రైస్తవులు చేసేది. లోకానుసారమైన ప్రజల పెద్ద తప్పు ఏమనగా, వారు దేవుని కొరకు ఏమియు చేయకపోవుట. మరోకవైపునేమో, క్రైస్తవులు, వారంతట వారు దేవుని కొరకు ఏదో చేయుటకు ప్రయత్నించుట.  ఇది కూడా పెద్ద తప్పు.  మనంతట మనము కాక క్రీస్తును మన జీవముగా తీసుకొనుట వలననే దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయుటకు మనకున్న సరియైన మార్గము. ప్రభువైన యేసు ఇలా చెప్పెను, ‘‘నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు’’ (యోహాను 15:5b). ఇంకా అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, ‘‘నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగల్గుచున్నాను’’ (ఫిలి. 4:13). క్రీస్తు లేకుండా, మనమేమియు చేయలేము. అయితే క్రీస్తుతో మరియు క్రీస్తులో, మనము సమస్తమును చేయగలము. యోహాను 14:20 లో శిష్యులకు ప్రభువు చెప్పారు, ‘‘నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.’’ అందువలన, మనము క్రీస్తు లేనివారము కాదు. మనకు క్రీస్తు ఉన్నాడు మరియు మనము క్రీస్తులో ఉన్నాము.

నేటి మానవ సమాజములో, వ్యర్ధత మరియు దౌర్భాగ్యము తప్ప ఏమియు లేదు, ఎందుకనగా ప్రజలు తప్పుడు మార్గములో ఉన్నారు. వారికి దేవునికి సంబంధము లేదు. అయినప్పటికీ, క్రైస్తవులు, వారంతట వారే దేవుని కొరకు ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు, ఈ యుగపు అంతములో, ప్రధానముగా యౌవ్వనతరము ద్వారా ప్రభువు కొంత పునరుద్ధరించబోవుచున్నాడు. కాబట్టి, యౌవ్వనస్థులైన మీరు క్రీస్తును జీవముగా తీసుకొనుట వలన దేవుని కొరకు ఉండుట ఎలా అనునది నేర్చుకోవాలి. మీరు ఇక్కడ ఏమి చేయుచున్నారని నన్ను అడిగినట్లయితే, మీరు చదువుకొనుచున్నారని లేక పనిచేయుచున్నారని చెప్పకూడదు. దానికి బదులు, నీవు ఇలా చెప్పాలి, ‘‘నేను ఈ దక్షిణ కాలిఫోర్నియాలో దేవుని కొరకు ఉన్నాను!’’ యౌవ్వనస్థులు ఇక్కడ ఏమి చేయుచున్నారు? వారిక్కడ దేవుని కొరకు ఉన్నారు! ఏ విధానములో? వారి జీవముగా క్రీస్తును తీసుకొనుట వలననే! దీనర్థము, వారు క్రీస్తును శ్వాసిస్తున్నారు, క్రీస్తును త్రాగుతున్నారు, మరియు క్రీస్తును తినుచున్నారు.

మనము లేకుండా, దేవుడు ఏమియు చేయలేడు, మరియు క్రీస్తు లేకుండా మనము ఏమి చేయలేము. మన జీవముగా క్రీస్తును తీసుకొనేమనము దేవుని కొరకున్న పాత్రలము. మన జీవముగా క్రీస్తును తీసుకొనుటకు సరిపడినవారముగా మనము ఉండుట ఎంత అద్భుతము! జంతువులు క్రీస్తును జీవముగా తీసుకొనుటకు సృష్టించబడలేదు కాని మనము సృష్టించబడ్డాము. క్రీస్తును తీసుకొనుటకు మనందరమూ అర్హులము.

జీవముగానున్న క్రీస్తే మనకున్న అవసరత

ఏదైనా చేయుటకుగాను, మనకు సరియైన జీవము అవసరము. ఒక కుక్క మొరుగుతుంది; ఎందుకనగా, దానికి కుక్క జీవము ఉన్నది, అది మొరుగునట్టి జీవము. పిల్లి జీవములో ఉన్న సామర్ధ్యము వలన పిల్లి ఎలుకను పట్టుకొనగలదు, అయితే మనకు ఈ సామర్ధ్యము లేదు.  అదేవిధముగా, మనము దేవుని వ్యక్తపరచి, దేవుని అధికారమును సాధకము చేయాలని కోరినచో, అది చేయగల్గిన జీవము మనకు అవసరము. దేవుని వ్యక్తపరచుటగాని, దేవుని అధికారమును సాధకము చేయుటగాని మానవ జీవము చేయలేదు. కాని దేవుని వ్యక్తపరచుటకును, దేవునికి ప్రాతినిథ్యము వహించుటకును సామర్థ్యము గల మరొక జీవమును స్వీకరించుటకు మానవ జీవము సరిపడినది. కుక్క జీవము, పిల్లి జీవము, లేక పక్షి జీవము వంటి జంతు జీవములు, వేరొక జీవమును స్వీకరించుటకు సరిపోవు. దేవుడు వాటిని ఈ రీతిగా సృష్టించలేదు. అయితే మనము వేరొక జీవమును స్వీకరించు రీతిగా దేవుడు మనలను సృష్టించెను. ఈ జీవము స్వయాన దేవుని యొక్క నిత్య జీవము అయ్యున్నది, అది క్రీస్తే.

మన జీవముగా మనలోనికి స్వయాన దేవుణ్ణే స్వీకరించుటకు ఒక అవయవముగా ఉన్న మానవ ఆత్మతో దేవుడు మనలను సృష్టించాడు. మానవ జీవము దేవుని వ్యక్తపరచు సామర్ధ్యము గలది కాదు మరియు దేవుని అధికారమును కూడ సాధకము చేయలేదు.  అయితే మానవ జీవము ఒక దానిని, అనగా ఈ సామర్థ్యముగల దానిని నిత్యజీవమును స్వీకరించుటకు మంచిది ‘‘దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను’’  (5:12).

మనల్ని మనము క్రీస్తుకు తెరచుకొనుట మరియు ఆయనను జీవముగా స్వీకరించుట

క్రీస్తు లేకుండా సమస్తము వ్యర్థము. మానవుడే విశ్వము యొక్క అర్థము, మరియు క్రీస్తే మానవ జీవితము యొక్క అర్థము. మానవుడు విశ్వము యొక్క అర్థము అయినప్పటికీ, క్రీస్తు లేకుండా మానవునికి అంతరాంశము లేక వాస్తవికత ఉండదు. క్రీస్తు లేకుండా, మానవుడు కేవలము ఖాళీ పాత్ర అయ్యున్నాడు. ఖాళీ పాత్రగా ఉన్న మానవునికి అంతరాంశముగా ఉన్న క్రీస్తు అవసరము.  అందుకే మనము క్రీస్తుకు తెరవబడి మన జీవముగా ఆయనను స్వీకరించాలి.

నీవు ఎల్లప్పుడూ తెరవబడి ఆయన నామమును పిలవాలి. మతపరమైనది లేక ఆత్మీయమైనది ఏదియు నీ మనస్సులో ఉంచుకోవద్దు. అప్పుడు ఆయన తక్షణమైన, ప్రస్తుతపు, అధునాతమైన, క్షణక్షణము ఉండు క్రీస్తుగా ఉన్నాడని నీవు చూస్తావు. ఈ క్షణములో ఆయన క్రీస్తు అయ్యున్నాడు. ప్రజలు నిన్ను తిరస్కరించి హింసించు సమయములో, ఆయన క్రీస్తు అయ్యున్నాడు. నీ మనస్సులో అనేక సిద్ధాంతములను ఉంచుకోవద్దు. సిద్ధాంతములు పనికి రావు. క్రీస్తు మాత్రమే పనిచేయును. ఈ క్రీస్తు సజీవుడైన క్రీస్తు. ఆయన సిద్ధాంతములలోను బోధలలోను ఉన్న క్రీస్తు కాదు, అయితే జీవము-ఇచ్చు ఆత్మగా, ఇప్పుడు మనతోనే ఉన్న, వాస్తవికమైన, మరియు ఆచరణీయమైన క్రీస్తు అయ్యున్నాడు (1 కొరి. 15:45). కేవలము ఆయనను పిలువుము.

ఆయన మనతో సదాకాలము ఉండే జీవము-ఇచ్చు ఆత్మ అయ్యున్నాడు. ఆయన ప్రస్తుతమైనవాడు, ఆధిపత్యముగలవాడు, లభ్యుడు, మరియు తక్షణమైనవాడు. నీవు ఎక్కడ ఉన్నా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు ఒకరితో వ్యవహరించుచున్నను లేక ఒకరు నిన్ను వ్యవహరించుచున్నను, నీ గురించి నీ కారణముల గురించి నీవు మర్చిపో; కేవలము ఆయనకు తెరవబడి ‘‘ఓ ప్రభువైన యేసు’’ అని పిలువుము.  ఆయనను ఆస్వాదించుము. ఆయన నీ జీవము మరియు నీ అంతరాంశము. ఆయనే నీ మానవ జీవితము యొక్క అర్థము. (CWWL, 1971, vol. 1, “The Life for the Preaching of the High Gospel,” pp 433-436)

Reference: CWWL, 1971, vol. 1, “The Life for the Preaching of the High Gospel,” chs. 3, 4

నాదు జీవం నీవే  

సంఘముఆమె నిర్మాణము

841

1  నాదు జీవం నీవే

నాలో ఉన్నావు

దైవ సంపూర్ణతన్

నింపుచున్నావు

నీదు పరిశుద్ధ

స్వభావముతో

శుద్ధినొందుచును

జయమొందుదున్

 

2  ప్రవహించునట్టి

నీదు జీవము

నన్ను వెలిగించి

ఆత్మలో నీదు

సహవాసమిచ్చి

అక్కరలన్నీ

తీర్చివేసినన్ను

నిల్వబెట్టెను

 

3  అభిషేకమిచ్చు

నీదు ఆత్మయే

నాదు ఆత్మ ప్రాణ

ములను కూడ

ఆవరించి, నింపి

రూపాంతరించున్

నీతో సమరూప

మొందువరకు

 

4  సమృద్దివంతమై

నీదు జీవము

నాలో ప్రవహించి

బలమిచ్చును

జీవం మృత్యువును

మ్రింగివేసెను

బంధకములన్నీ

విడిపోయెను

 

5  అంకితము నీకే

నాదు సర్వము

నీ హృదయవాంఛ

నెరవేరను

స్వీయకృషినంత

మానివేతును

నిన్నే నాలో క్రియ

చేయనిత్తును

 

6  వ్యర్ధమైన నాదు

ప్రయాసమును

పూర్తిగా నిలిపి

వేతును ప్రభూ

రూపాంతరించుము

నీ జీవముతో

ఇతరులతో నన్ను

నిర్మించుము

Jump to section