Jump to section

పద్నాల్గవ పాఠముపశ్చాత్తాపము మరియు ఒప్పుకోలు

మత్త. 3:2—పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి.

1 యోహాను1:9—మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.

మానవుని పశ్చాత్తాపము

మానవుని పశ్చాత్తాపము అనునది ఆత్మ యొక్క పరిశుద్ధపరచు పని యొక్క ఫలితమైయున్నది. ఆత్మ మానవుడిని వెలిగించుటకు, మానవుడిని వెతుకుటకు, మరియు  పాపమును గూర్చి, నీతిని గూర్చి, మరియు తీర్పును గూర్చి ఒప్పింపచేయుటకు వచ్చినప్పుడు, ఆయన మానవుడు పశ్చాత్తాపపడునట్లు మరియు దేవుని వైపు తిరుగునట్లు చేయును.

పశ్చాత్తాపము యొక్క అర్థము

పశ్చాత్తాపము అను పదముకు గల గ్రీకు అర్థము ‘‘దుఃఖపడుటనే ఫలితమునిచ్చేలా మనస్సును మార్చుకొనుట, ఉద్దేశ్యములో మార్పును కలిగియుండుట.’’ కావున, పశ్చాత్తాపపడుట, బైబిలు లోని ఉద్దేశ్యము ప్రకారము, మనస్సులో మార్పును కలిగియుండుటై- యున్నది. ఇది సాధారణముగా ప్రజలు అనుకొనునట్లు ఒకడు తనను తాను మెరుగుపరచుకొనుటో లేదా సంస్కరించుకొనుటో లేదా చెడుతనమును మరిచి మంచివైపు తిరుగుటో కాదు. మానవుని పతనము నుండి, మానవుని మనస్సు దేవునికి వ్యతిరేకముగా తిరిగెను మరియు దేవుడు కాక అనేక వ్యక్తులు, వస్తువులు, మరియు విషయముల వైపు తిరిగెను. ఇంకనూ, మానవుడు తన మనస్సు ద్వారా నియంత్రించబడుచుండెను, ఆలోచనల ప్రకారము తన కోరికలను నెరవేర్చుచుండెను (ఎఫె. 2:3). మానవుని ఆలోచనల యొక్క కోరికలు, అవి మంచివి ఐనప్పటికీ లేదా చెడ్డవైనప్పటికీ, అవి ఎప్పుడూ దేవునికి విరుద్ధముగా ఉండును మరియు దేవుడు కాకుండా ఉండు వ్యక్తులవైపు, వస్తువులవైపు, మరియు విషయములవైపు ఉండును. దీని కారణముగా, మానవుడు దేవునికి విరుద్ధముగా పనిచేయును మరియు దేవుడు కాకుండా ఉన్న వ్యక్తులవైపు, విషయములవైపు మరియు వస్తువులవైపు తిరుగును. కావున, మానవుడు పశ్చాత్తాపము నొందవలెను తద్వారా అతని నడవడిక మరియు ప్రవర్తన మారునట్లు తన మనస్సునందు మార్పును కలిగియుండవలెను. (Truth Lessons–Level One, vol. 3, lsn. 29)

పశ్చాత్తాపమునకు దేవుని వెలుగు అవసరమగుట

మీలోని ప్రతిఒక్కరు దేవునిచే సంపూర్ణముగా వెలిగించబడాలని నేను కోరుకొనుచున్నాను….మీరు ఆయన యొద్దకు పదే పదే వెళ్ళినట్లయితే, ఆయన మీ మీద ప్రకాశించును. ఆయన మిమ్ములను వెలిగించును. ఆయన మిమ్ములను వెలుగులోనికి తెచ్చును. ఆయన మిమ్ములను మిక్కిలిగా బహిర్గతము చేయును. అప్పుడు నీవు మిక్కిలి పశ్చాత్తాపము నొందెదవు, ఇంకనూ ప్రభువు ఎదుట ఏడ్చెదవు. నీవు ప్రభువుతో, ‘‘ప్రభువా నేను అపవిత్రుడను మరియు పాపిని. నేను చెడిపోయినవాడిని మరియు పాడైనవాడిని’’ అని చెప్పెదవు. అప్రయత్నముగానే, నీవు ప్రభువునకు ఒక సంపూర్ణమైన ఒప్పుకోలు చేసుకొందువు. నీవు ఎంతగా ఒప్పుకొందువంటే, నీవు తినుటను కూడా మర్చిపోయెదవు. నీవు నీ ఆఫీసుకు వెళ్లుచున్నప్పటికి, నీవు ఇంకనూ కన్నీటితో ప్రభువు యెదుట పశ్చాత్తాపమునొందెదవు. మీలో ఎంతమంది ఈ దశ గుండా పయనించారని నేను ఆశ్చర్యపడుచున్నాను. (CWWL, 1993, vol. 2, “The Training and the Practice of the Vital Groups,” pp. 325-326)

ఒప్పుకోలు యొక్క రెండు పార్శ్వములు

దేవుని యొద్ద పాపమును ఒప్పుకొనుట

పాపముతో వ్యవహరించుట అనునది రెండు దశలను కలిగి యున్నది. మొదటిది, మనము మన పాపములను దేవునియొద్ద మరియు మనిషియొద్ద ఒప్పుకొనవలెను. మన పాపములను దేవునియొద్ద ఒప్పుకొనుట అనగా ఆయన ఎదుటకు వచ్చి  మనము ఆయనను బాధపరచిన సమస్తమును ఒప్పుకొనుటైయున్నది. మనము చేయు ప్రతి పాపము, ఆ పాపము దేవునికి వ్యతిరేకముగా ఉన్నదైనా లేదా మనిషికి వ్యతిరేకమైనా అది దేవుని నొప్పించేదిగా ఉన్నది…. మనము మన పాపములను దేవునియొద్ద ఈ విధముగా ఒప్పుకున్నట్లయితే, మనము సామాన్యముగా ఉండము; మనము అధికముగా పాపము చేసామని కేవలము నియమముగానే ఒప్పుకొనము. మనము నిర్దిష్టముగా ఉండాలి మరియు మన పాపములను ఒక్కొక్కటిగా ఒప్పుకోవాలి. మనము ఒక సంచి పాపములను దేవుని యొద్దకు తెచ్చి, దానిని ఆయన ఎదుట పడవేసి, దానిని గూర్చి మర్చిపోవుట చేయకూడదు. మనము పాపముల సంచిని దేవుని ఎదుట తెరువవలెను మరియు ప్రతి పాపమును చెప్పవలెను; మనము సంచిని ఖచ్చితముగా తెరువవలెను మరియు ఒక్కొక్క పాపమును క్షుణ్ణముగా ఒప్పుకొనవలెను.

మనుష్యునియొద్ద పాపమును ఒప్పుకొనుట

మన పాపములలో అధికశాతము ఇతరులను గాయపరచేవిగా ఉండును, కాబట్టి మనము మన పాపములను దేవునియొద్ద మాత్రము గాక మనుషులయొద్ద కూడా ఒప్పుకొనవలెను. మనము చేయు ప్రతి పాపము ఆయనను గాయపరచును గనుక మనము మన పాపములను దేవునియొద్ద ఒప్పుకొందుము. ఏదేమైనప్పటికి, మనము చేయు పాపములు దేవుని మాత్రమే గాక మనుష్యులను కూడా గాయపరచేవిగా ఉండును. మనము దేవుని గాయపరచినట్లయితే, మనము మన పాపములను ఒప్పుకొనిన వెంటనే ఆయన వాటిని క్షమించును. కానీ దేవుని క్షమాపణ అనునది మనము గాయపరచిన మనుష్యుల విషయమై శ్రద్ధ వహించదు. (CWWL, 1932-1949, vol. 3, “Crucial Truths in the Holy Scriptures,” vol. 2, pp. 415-416)

పశ్చాత్తాపము యొక్క ఫలితము

పాపములకు క్షమాపణ పొందుట

ప్రభువు సువార్త అనునది మనుష్యులు పశ్చాత్తాపము పడునట్లు మరియు పాపములకు క్షమాపణ పొందునట్లు చేయును (లూకా 24:47; 3:3; అపో. 2:38). మానవునికి క్షమాపణ కృపను ఇచ్చుటకుగాను, దేవుడు మొదటిగా అతనికి పశ్చాత్తాప హృదయమును ఇవ్వవలెను (5:31). ఒక మనిషి  దేవునికి వ్యతిరేకముగా తన పాపమునకు పశ్చాత్తాపము నొంది మరియు దేవుని వైపునకు తన హృదయములో తిరుగునంత వరకు, అతడు ప్రభువైన యేసునందు విశ్వాసముంచడు లేదా దేవుని క్షమించు కృపను పొందుకొనలేడు. ఒకవేళ మానవుడు క్షమించబడాలంటే, అతడు తప్పక పశ్చాత్తాపము నొందాలి. అతడు తన మృతమైన పనుల పట్ల పశ్చాత్తాపము నొంది (హెబ్రి. 6:1) దేవుని వైపు తిరుగవలెను.

జీవమును పొందుకొనుట

దేవుని సువార్తలో మానవుని పాపములు క్షమించబడుటకు గల కారణము, మానవుడు ఆయన జీవమును పొందుకొనుట కొరకై ఉన్నది (కొలొ. 2:13). కావున, మానవుడు ప్రభువుయొక్క జీవమును పొందుకోవాలనుకున్నట్లయితే, అతడు తప్పక పశ్చాత్తాపము నొందవలెను (అపొ. 11:18). తన జీవము చెడిపోయినదని మరియు దేవునికి బాహ్యముగానున్న తన జీవనము, దుష్టమైనదని మానవుడు తప్పక చూడవలెను. ఇది చూచుట ద్వారా, అతడు ఒప్పించబడును మరియు తనను తాను అసహ్యించుకొనునట్లు చేయును. అతడు పశ్చాత్తాపము నొందుతూ మరియు దేవుని వైపు తిరుగుతుండగా, అతడు తన పాపములకు క్షమాపణ పొందుకొనును మరియు దేవుని జీవమును పొందుకొనును.

పరిశుద్ధాత్మ వరమును మరియు దైవిక స్వాస్థ్యమును పొందుకొనుట

ప్రభువు యొక్క సువార్తలో మానవుడు తన పాపములకు క్షమాపణ పొందుకొనుటలో గల ఉద్దేశ్యము, వారు పరిశుద్ధాత్మ వరమును పొందుకొనుట (2:38) మరియు దైవిక స్వాస్థ్యమును పొందుకొనుట (26:18) కొరకు కూడా ఉన్నది. వారి పాపములు క్షమించబడునట్లు ఎప్పుడైతే మానవులు పశ్చాత్తాపము నొంది దేవుని వైపు తిరుగుదురో, వారు పరిశుద్ధాత్మ వరమును మరియు దైవిక స్వాస్థ్యమును కూడా పొందుకొనుదురు. వారు త్రియేక దేవుని ఐశ్వర్యములన్నీ ఆస్వాదించులాగున      వారు పశ్చాత్తాపము నొందునప్పుడు సర్వము-ఇమిడియున్న ఆశీర్వాదముగా పరిశుద్ధాత్ముడు, అనగా సర్వము-ఇమిడియున్న ఆత్మగానున్న ప్రక్రియలు చెందిన త్రియేక దేవుడే (గల. 3:14) మనుష్యులకు దేవుని సంపూర్ణ సువార్తగా ఇవ్వబడెను.  ఆయన  విమోచించిన ప్రజలకు స్వయానా త్రియేక  దేవుడు ఆయన కలిగియున్న సమస్తము, ఆయన చేసిన సమస్తము, మరియు ఆయన చేయు సమస్తమే దైవిక స్వాస్థ్యమైయున్నది. ఈ త్రియేక దేవుడు పరిశుద్ధుల భాగముగా ఉండుటకు సర్వము-ఇమిడియున్న క్రీస్తులో మూర్తిమంతమాయెను(1:12). పరిశుద్ధులకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మయే ఈ దైవిక స్వాస్థమునకు మునృచియు, సంచకరువును, గ్యారంటీగాను ఉన్నాడు (ఎఫె. 1:14), ఈ స్వాస్థమును దేవుని క్రొత్త నిబంధనలో నేడు మునృచిగా మనము పంచుకొనుచున్నాము మరియు ఆస్వాదించు చున్నాము; మరియు రాబోయే యుగములోను, నిత్యత్వము- లోను దీనిలో తుదమట్టుకు పాలుపొందెదము మరియు ఆస్వాదించెదము (1 పేతు. 1:4) (Truth Lessons-Level One, vol. 3, pp. 47-48)

References: Truth Lessons-Level One, vol. 3, lsn. 29; CWWL, 1932-1949, vol. 3, “Crucial Truths in the Holy Scriptures,” vol. 2, ch. 24; CWWL, 1993, vol. 2, “The Training and the Practice of the Vital Groups,” msg. 8

 

నీ స్వరం వింటిని

సువార్తప్రభువు నొద్దకు వచ్చుట

1051

1    నీ స్వరం వింటిని

నీ చెంత చేరితిన్‌

కల్వరి ప్రశస్త రక్తం

లో శుద్ధు నౌటకు

 

చేరెదన్‌ ప్రభూ

నీదు చెంతకు

కడిగి, శుద్ధున్‌ చేయి

కల్వరి రక్తంలో

 

2     బలహీనతల్లో

నీవే నా బలము

నా హీనతను కడిగి

స్వచ్ఛత నిత్తువు

 

3     నాలోని కార్యమున్‌

యేసే స్థిరపర్చున్‌

పాప శక్తిపై యేసు

కృప నిచ్చుచుండున్‌

 

4     తానే సాక్ష్యమిచ్చున్‌

సద్భక్తులకును

ప్రతీ వాగ్ధానం తీర్చున్‌

విశ్వాసముంచగన్‌

 

5     విమోచించే రక్తం

జీవమిచ్చే కృప

మన బలం, నీతియును

ప్రభున్‌ వరమేగా

Jump to section