Jump to section

పదవ పాఠముక్రీస్తు రక్షణ

యోహాను 3:16—దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

రోమా. 5:10—ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడినవారమై, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక వారు నిత్యజీవము పొందునట్లు ఆయన అద్వితీయ కుమారుని వారికి అనుగ్రహించెను అని [యోహాను 3:16] చెప్పుచున్నది…. మానవుణ్ణి తనతో ఏకము చేసుకొనవలెనని, ఇంకా మానవుణ్ణి తన వలె తన జాతిగా చేసుకొనవలెనని, నిత్యత్వమందు దేవుడు తన హృదయవాంఛగా ఒక మంచి దయాభీష్టమును కలిగియుండెను. కనుక, మానవుని యొక్క సృష్టిలో మానవుడు ఆయనను కలిగియుండు పాత్రగా అగునట్లు ఆయన మానవుని తన స్వరూపమందు మరియు తన పోలిక చొప్పున సృజించెను… సృష్టించబడిన ఆదాము…దేవుని స్వరూపమును మరియు దేవుని పోలికను కలిగియుండెను. కాబట్టి, సృష్టించబడిన సమయమందే, దైవ మానవుని గూర్చిన ఆలోచన అప్పటికే ఉండెను.

క్రొత్త నిబంధనలో జీవముగా తనతో మానవుని పునర్జన్మింపచేయుటకు దేవుడు వచ్చెను. యోహాను 1:12, “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాస- ముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” అని చెప్పుచున్నది. మనము దేవుని పిల్లలమైనప్పుడు, మనము దేవుని జీవమును మరియు స్వభావమును కలిగి ఉందుము…కనబడినది (జన్మించబడినది) కన్నవారి వలె (జన్మనిచ్చువారివలె) ఉండవలెను. ఆవు గాడిదకు జన్మనిచ్చుట లేక మేక కుక్కకు జన్మనిచ్చుట అనునది లేదు. మనలను ఆంతర్య స్వరూపములో మరియు బాహ్య పోలికలో మాత్రమే కాక ఆయన జీవము మరియు స్వభావములో కూడా ఆయన వలె చేయుట దేవుని హృదయ వాంఛయైయున్నది.

దేవుడు లోకం లోని ప్రజలను ఎంతగా ప్రేమించెనంటే ఆయన మానవుణ్ణి తన జీవము చేత తన వలె చేసుకొనవలెనని కోరెను. అయినను మానవుడు సాతాను చేత మోసపరచబడెను మరియు పాపము చేయుట చేత పడిపోయెను; ఈలాగున మానవుడు దేవుని యొక్క నీతిని ఉల్లంఘించెను… కనుక, ఇక్కడ మనము రెండు విషయములను చూచెదము: దేవుని ప్రేమ మరియు దేవుని నీతి. దేవుని ప్రేమ ప్రకారముగా, దేవుడు మానవుని తన వలె చేసుకొనగోరెను. అయినప్పటికీ, మానవుడు పాపము చేసెను మరియు దేవుని నీతిని ఉల్లంఘించెను.

కనుక,…ఆయన జీవము ప్రకారముగా, మానవునికి  దేవుడు జీవపరముగా చేయగోరిన దానంతటిని చేయుటకుగాను, ఆయన చట్టపరమైన అవసరత ప్రకారముగా పడిపోయిన పాపులను న్యాయపూరితముగా దేవుడు విమోచింపవలెను. దేవుని నీతి, దేవుడు పాపిని విమోచింపవలెనని కోరును. ఇది, “ఓ దేవా, నీవు వారిని ప్రేమించుట మంచిదే మరియు వారిలో జీవపరముగా ఎన్నో విషయములను చేయుట కూడా మంచిదే. కానీ నీ నీతి యొక్క అవసరతలు నెరవేరుటకుగాను నీవు మొదట వారిని విమోచింపవలెను” అని దేవుని నీతి దేవునితో చెప్పునట్లుగా ఉన్నది. ఇదే విమోచన. నీతిపరంగా పాపులను విమోచించుట చేత, ఆయన హృదయ వాంఛ ప్రకారముగా ఆయన జీవము చేత జీవపరముగా ఆయన కోరుకొనినది దేవుడు స్వేచ్ఛగా చేయవచ్చును…ఇట్లు దేవుని సంపూర్ణ రక్షణ, ఇది న్యాయపూరితమైన విమోచనను మరియు దేవుని జీవము చేత జీవపరముగా నెరవేర్చబడు రక్షణను, రెండిటిని కలిగియున్నది.

ప్రక్రియగా దేవుని చట్టపరమైన అవసరత యొక్క సంపూర్తి, ఉద్దేశముగా దేవుడు జీవపరముగా చేయగోరు దాని యొక్క నెరవేర్పు

దేవుని యొక్క సంపూర్ణ రక్షణలో, చట్టపరముగా ఆయన ఏదైతే చేయునో అది ప్రక్రియగా ఉన్నది మరియు జీవపరముగా ఆయన ఏదైతే చేయునో అది ఉద్దేశముగా ఉన్నది.

దేవుని చట్టపరమైన అవసరత

ప్రక్రియ కోణంలో, ఆయన చట్టపరమైన అవసరత ప్రకారముగా దేవుడు సంపూర్తి చేసినది విమోచన, ఇది పాపములను క్షమించుట, పాపములను కడిగివేయుట, నీతిమంతులుగా తీర్చుట, దేవునితో సమాధానపరచబడుట మరియు స్థానపరముగా పరిశుద్ధపరచబడుటను కలిగి యున్నది… అయినప్పటికీ, దేవుని యొక్క సంపూర్ణ- రక్షణ ఇది మాత్రమే కాదు… దేవుని యొక్క సంపూర్ణ రక్షణ యొక్క మొదటి అంశము చట్టపరమైనది…ఈ విషయములన్నియు ప్రక్రియ, యోగ్యత మరియు స్థానమునకు సంబంధించినవి. ఉద్దేశపు కోణంలో ఆయన జీవము ప్రకారముగా జీవపరముగా దేవుడు మన కొరకు నెరవేర్చిన రక్షణను మనము ఆనందించునట్లుగా చట్టపరమైన అంశము మనలను దేవుని కృపలోనికి వెళ్ళునట్లుగా పాపులమైన మనలను యోగ్యులనుగా నిలువబెట్టును (రోమా 5:10).

దేవుని జీవపరమైన రక్షణ

దేవుని యొక్క సంపూర్ణ రక్షణలోని రెండవ అంశము ఉద్దేశము. ఉద్దేశమనే అంశములో, ఆయన జీవము ద్వారా  జీవపరముగా దేవుడు జరిగించే రక్షణ, ఇది (1) పునర్జన్మింపబడుట…., (2) కాపరత్వము చేయుట…. (3) స్వాభావిక తత్వము పరిశుద్ధపరచబడుట(4) మన మనస్సులో నూతన పరచబడుట (5) మన స్వరూపములో రూపాంతరించ- బడుట, తద్వారా (6) దేవుని నిర్మాణము జరుగుట (7) దేవుని జ్యేష్ఠకుమారుని స్వరూపములోనికి సమరూపమొందుట…. మరియు (8) మహిమపరచబడుటను కలిగి ఉన్నది (8:30). చట్టపరముగా నెరవేర్చబడినది ఐదు విషయములతోనున్న మొదటి మెట్టైన విమోచన, జీవ పరముగా నెరవేర్చబడినది తరువాత మెట్టైన రక్షణ, ఇది విమోచనకు వేరైనది మరియు ఎనిమిది విషయములను కలిగియున్నది. విమోచన చట్టపరముగా నెరవేర్చబడినది, అయితే రక్షణ జీవపరముగా నెరవేర్చబడినది. జీవపరమైన అంశములో ఎనిమిది విషయముల యొక్క ఫలితము, దేవుని నిత్య ప్రణాళిక యొక్క అంతిమ గురియైన నూతన యెరూషలేముగా పరిణతియగు క్రీస్తు దేహముగా సంఘటితపరచబడు దేవుని సంఘము, ఇది నిత్యత్వములో దేవుని వృత్తిగా మరియు వ్యక్తిగా ఉండునట్లు ప్రక్రియలు   చెందిన త్రియేక దేవుడు మరియు పునర్జన్మింపబడిన, పరిశుద్ధ పరచబడిన, రూపాంతరమొందిన మరియు మహిమపరచ బడిన ఆయన ప్రజలతో ఒక్కటిగా కలుపబడి మరియు మిళనము చెందుట చేత సంఘటిత పరచబడిన జీవియైయున్నది.

చట్టపరమైన అంశముగానున్న విమోచన దేవుని రక్షణ యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చలేదు, ఎందుకనగా అది కేవలము ప్రక్రియ మాత్రమే కానీ ఉద్దేశ్యము కాదు. ఉదాహరణకు, ఒక వంటవాడు విందు కొరకు వంటగదిలో ఎంతో సమయమును గడుపును. అయినప్పటికీ, భోజనమును తయారుచేయుట మాత్రమే అతని ఉద్దేశ్యము కాదు, అది కేవలము అతని ప్రక్రియ మాత్రమే. తరువాత విందును ఆస్వాదించుటకు అతిథులు ఆహ్వానించబడినప్పుడు, అది భోజనము తయారుచేయుట యొక్క ఉద్దేశ్యముగా ఉండును. అటువలె, దేవుని రక్షణలో మనము చట్టపరమైన అంశమైన, ప్రక్రియల అంశములోనే ఉండిపోకూడదు; ఇంకా, జీవపరమైన అంశమైన, ఉద్దేశ్యపు అంశము లోనికి మనము వెళ్ళవలెను.

లూకా 15 లోని వస్త్రము మరియు దూడ దేవుని చట్టపరమైన అవసరతను మరియు దేవుని జీవపరమైన రక్షణను  చిత్రీకరించుట

ఇంటిని విడిచి వేరే దేశములో సంచరించి, తప్పిపోయిన కుమారుడుగా అయిన ఒక కుమారుని గూర్చి లూకా 15 మాట్లాడుచున్నది. ఒక దినమున చినిగిన బట్టలతో తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చెను. అతడు తన తండ్రికి కుమారుడు అయినప్పటికిని, బాహ్యముగా అతడు తప్పిపోయిన కుమారుని వలె అగుపడెను. అతడు ఇంక దూరముగా ఉండగనే, అతని తండ్రి అతని చూచెను మరియు అతని హత్తుకొనుటకు పరిగెత్తెను మరియు అతని ముద్దు పెట్టుకొనెను. తరువాత, అతని తండ్రి వెంటనే దాసులకు, “ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టుడి” (22 వ) అని చెప్పెను…. దూరదేశములో సంచరించుటకు కుమారుడు ఇంటిని విడిచిపెట్టినప్పుడు, కుమారుడిగా తన స్థానమును అతడు కోల్పోయెను మరియు తప్పిపోయిన కుమారుడు అయ్యెను. తండ్రి అతనిపై ఆ వస్త్రము వేసినప్పుడు, అతను వెంటనే మరలా కుమారుడయెను. ఇది దేవుని రక్షణ యొక్క చట్టపరమైన అంశమునకు సంబంధించినది.

అయినప్పటికి, కేవలము వస్త్రము ధరించుట మరియు కుమారుడిగా అగుట మాత్రమే సరిపోదు. ఈ సమయమందు, ఒక వైపు, కుమారుడు సంతోషముగా ఉన్నాడు కానీ ఇంకొకవైపు, అతను తన హృదయములో, “తండ్రి, నాకు ఇప్పుడు కావలసినది బాహ్యముగా వస్త్రాలతో అలంకరించబడుట కాదు. నేను ఆంతర్యముగా ఆకలితో ఉన్నాను. ఎన్నో సంవత్సరములుగా నేను పంది పొట్టు తినుచుంటిని. నేడు నేను ఖాళీ కడుపుతో వచ్చితిని. త్వరగా నాకు ఆహారము పెట్టుము” అని అనుకొని యుండవచ్చును. కుమారుడు అలా చెప్పుటకు సిగ్గుపడి ఉండవచ్చును, కానీ తండ్రి, “క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము”(23 వ) అని చెప్పెను. ఆ సమయమందు కుమారుడు ఆనందముతో నాట్యము చేసి ఉండవచ్చును. క్రొవ్విన దూడను తినిన తరువాత, కుమారుడు తృప్తి పొందెను మరియు ఇంక ఎంత మాత్రము ఆకలితో లేడు. కనుక, వస్త్రము దేవుని రక్షణ యొక్క చట్టపరమైన అంశమును సూచించును మరియు దూడ దేవుని రక్షణ యొక్క జీవపరమైన అంశమును సూచించును.

క్రీస్తు రక్షణ యొక్క అవసరత

చట్టపరమైన అంశము యొక్క ఐదు విషయములను గూర్చి మనము ఎంతో జ్ఞానమును కలిగి యున్నాము. మనము పాపులమై యున్నామని మరియు మనము పశ్చాత్తాపముతో, దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని, ప్రభువును విశ్వసించిన యెడల, మనము పాప క్షమాపణను పొందుకొనెదము మరియు మన పాపములన్నియు కడిగి వేయబడునని, మనము దేవునితో సమాధానపరచబడునట్లు ఆయనచేత నీతిమంతులుగా తీర్చబడుదుమని మరియు స్థాన పరముగా పరిశుద్ధపరచ బడుదుమని మనము ఎరుగుదుము. ఈ విషయములన్నియు మనకు తెలియును. కనుక కొంత మంది, “పరలోకమునకు వెళ్ళుటకు మనకు ఈ ఐదు విషయములు చాలు. దేవుడు మనలను ఇక ఎన్నడు ఖండించడు. ఆయన మనలను శాశ్వతంగా క్షమించాడు, కనుక మనము సమాధానముతో జీవించ వచ్చును” అని చెప్పుదురు. కనుక, వారు ఇతరులకు సువార్తను ప్రకటించినప్పుడు, “యేసులో విశ్వాసముంచి సమాధానముతో ఉండండి. మంచి వ్యక్తిగా ఉండుటకు ప్రయత్నించండి మరియు ఇతరులకు సహాయము చేయండి; అప్పుడు ఒక దినమున మీరు పరలోకమునకు వెళ్ళుదురు” అని చెప్పెదరు… కానీ ఇది మాత్రమే సరిపోదని బైబిలు చెప్పుచున్నది.  ఐదు విషయములతో పాటు, బైబిలు ఇంకా ఎనిమిది విషయములను చూపుచున్నది: పునర్జన్మింపబడుట, కాపరత్వము చేయుట, జన్మస్వభావము పరిశుద్ధపరచబడుట, నూతనపరచబడుట, రూపాంతరించబడుట, నిర్మించ- బడుట, సమరూపమొందుట మరియు మహిమపరచబడుట.

చట్టపరమైన దాని యొక్క ఐదు విషయములను మనము నిర్లక్ష్యము చేయకూడదు మరియు జీవపరమైన దాని యొక్క ఎనిమిది విషయములను అసలే నిర్లక్ష్యము చేయకూడదు. ముందున్న ఐదు విషయములు ఇంటి యొక్క పునాది వలె ఆధారములుగా ఉన్నవి. ఎనిమిది జీవపరమైన విషయములను గూర్చిన సంపూర్ణ జ్ఞానమును [మరియు అధిక అనుభవమును] మనము కలిగియుండునట్లుగా… ఈ  ఎనిమిది విషయములకు పునాది వలెనున్న ఐదు విషయముల పైన మనము నిర్మించవలెను.  (CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” pp. 387-391)

 

Reference: CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” chs. 1, 2

 

“ABBA, FATHER,” WE APPROACH THEE

Worship of the Father—His Redemption

43

1  “Abba, Father,” we approach Thee

In our Savior’s precious name.

We, Thy children, here assembling,

Now the promised blessing claim.

From our guilt His blood has washed us,

’Tis through Him our souls draw nigh,

And Thy Spirit too has taught us

“Abba, Father,” thus to cry.

 

2   Once as prodigals we wandered,

In our folly, far from Thee;

But Thy grace, o’er sin abounding,

Rescued us from misery.

Clothed in garments of salvation

At Thy table is our place;

We rejoice, and Thou rejoicest,

In the riches of Thy grace.

 

3    Thou the prodigal hast pardoned,

“Kissed us” with a Father’s love,

“Killed the fatted calf,” and made us

Fit Thy purpose to approve.

“It is meet,” we hear Thee saying,

“We should merry be and glad;

I have found My once-lost children,

Now they live who once were dead.”

 

4   “Abba, Father,” we adore Thee,

While the hosts in heaven above

E’en in us now learn the wonders

Of Thy wisdom, grace, and love.

Soon before Thy throne assembled,

All Thy children shall proclaim

Abba’s love shown in redemption,

And how full is Abba’s name!

 

Jump to section