ఒకటవ పాఠము – మానవ జీవితము యొక్క మర్మము
రోమా. 9:23—మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల, తన మహిమైశ్వర్యము కనపరచవలెనని
10:9—అదేమనగా, యేసుప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు.
దేవుని ప్రణాళిక
దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళిక అంతయూ మానవునికి సంబంధించినది (ఎఫె. 1:5). బైబిల్ లో, ఈ ప్రణాళికను దేవుని ఏర్పాటు అంటారు (ఎఫె. 3:9-11).
మానవుని కొరకైన దేవుని ప్రణాళిక అంతయూ దేవుని ఏర్పాటు అయ్యున్నది. అది మానవుని ఉనికికి ఉన్న అర్ధముతో పాటు మానవుని యొక్క పుట్టుకను మరియు గమ్యమును వివరిస్తుంది.
ఒక పాత్రగా మానవుడు సృష్టించబడ్డాడు
నీవు కేవలము నీ కడుపులో ఆహారమును నింపుకొనుటకో లేక నీ మనస్సులో జ్ఞానమును కల్గియుండుటకో కాక నీ ఆత్మలో దేవుణ్ణి కల్గియుండుటకు సృష్టించబడ్డావు (రోమా. 9:23-24, ఎఫె. 5:18).
పాపము మానవునిలోనికి ప్రవేశించెను మరియు అతని పతనమునకు కారణమయ్యెను
పాపము, మానవుని ఆత్మ మృతమైనదగుటకు (ఎఫె. 2:1), మానవుని మనస్సు తిరుగుబాటు చేయుటకు (కొలొ. 1:21), మరియు మానవుని శరీరము పాపము చేయుటకు (రోమా. 6:12) కారణమయ్యెను. చరిత్ర అంతటిలోను, పాపము నుండి పారిపోవుటకు సాధ్యమైనన్ని మార్గములను మానవుడు ప్రయత్నించెను, కాని మానవుడు తననుతాను రక్షించుకోలేకపోయాడు.
విమోచన కార్యమును నెరవేర్చుటకు క్రీస్తు సిలువకు కొట్టబడెను
మానవుని పాపమును తీసివేయుటకు దేవుని గొర్రెపిల్లగాను…(యోహా. 1:29), ఆదిమ సర్పమైన సాతానును చితక ద్రొక్కుటకు ఇత్తడి సర్పముగాను…(యోహా. 3:14), మరియు దైవిక జీవమును విడుదల చేయుటకు గోధుమ గింజగాను…(యోహాను 12:24) ఆయన మరణించెను.
మానవుని పునర్జన్మించుట కొరకు దేవుని వితరణ
దేవుడు శరీరము అయ్యెను, యేసు అను మానవునిగా పుట్టెను. ‘‘వాక్యము శరీరధారియై మనమధ్య గుడారుడయ్యెను’’ (యోహా. 1:14) మరణము నుండి ఆయన పునరుత్థానమగుట వలన ఆయన జీవమిచ్చు ఆత్మ అయ్యెను. ‘‘కడపటి ఆదాము జీవమిచ్చు ఆత్మ అయ్యెను’’ (1 కొరి. 15:45). ఈ ఆత్మ జీవమిచ్చు ఆత్మ గనుక, విశ్వాసుల లోనికి దేవుణ్ణి ఆయన జీవముతోపాటు వితరణ చేయును.
నీవు ఇప్పుడు ఏమి చేయాలి?
1. నీ హృదయమును దేవుని వైపు త్రిప్పుము–మారుమనస్సు పొందుము
‘‘మారుమనస్సు అనగా మనస్సులో మార్పు వచ్చుట పరలోకరాజ్యము సమీపించి యున్నది గనుక మారుమనస్సు పొందుము’’ (మత్తయి 4:17).
2. నమ్ము–స్వీకరించు
‘‘నమ్ముట అనగా స్వీకరించుట.
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను’’ (యోహాను 1:12).
3. ఒప్పుకొనుట–పిలుచుట
‘‘…అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు’’ (రోమా. 10:9)
4. బాప్తిస్మము పొందుట–సాక్ష్యమిచ్చుట
బాప్తిస్మము మనుష్యుల ఎదుట ఒక సాక్ష్యము. విశ్వాసులు అందరు రక్షించబడుటకుగాను దేవుని ఎదుట మాత్రమే కాక మనుష్యుల ఎదుటను బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము ద్వారా, దేవుడు మనలను సాతాను రాజ్యములోనుండి దేవుని రాజ్యములోకి బదిలీ చేసెను.
యేసు ఇలా చెప్పెను, ‘‘ఒకడు నీటిమూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’ (యోహాను 3:5).
దయచేసి ఇప్పుడు ప్రార్థించుము:
‘‘ప్రభువైన యేసూ, నేను పాపిని. నీవు నాకు కావాలి. నా ఆత్మలోనికి రమ్ము. నా పాపమును తీసివేయుము. నేను దేవుని జీవమును కల్గియుండునట్లు నన్ను నింపుము. నా రక్షకునిగా మరియు జీవముగా ఇప్పుడే నిన్ను స్వీకరించుచున్నాను. నన్ను నేను నీకు ఇచ్చుకొనుచున్నాను. నీ నామములోనే దీనిని అడుగుచున్నాను. ఆమేన్!’’
Reference: The Mystery of Human Life
GOD MADE MAN A VESSEL
Gospel—The Meaning of Human Life – 1404
1 God made man a vessel he
With a spirit, soul, body.
God to man his content be
That through man His glory see.
2 Man does have God’s image true,
Noble in his status, too.
But God’s life man also needs
Divine nature to receive.
3 Christ in death as God expressed
Man redeemed, His blood was shedd’st.
In His resurrection He
Enters us our life to be.
4 Man without Christ will perceive
That all things are vanity.
Human life is meaningless
Without hope or purpose.
5 But when man takes Christ as life,
He’s in spirit born anew.
When he daily lives by Christ,
Vanity is turned to song.
6 Therefore, man can God express
That the whole world he would bless.
Living water flowing out
People’s thirst to satisfy.
7 When in glory Christ returns
Glorified our body be
To His glorious body conformed
With Him for eternity.