తొమ్మిదవ పాఠము – క్రీస్తు తిరిగివచ్చుట
మత్త. 24:21—లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.
డెబ్బై వారాలు దేవునిచే కేటాయించబడుట
నేడు మనము ఉన్న యుగము కృపాయుగమై ఉన్నది….ఈ యుగము క్రీస్తు యొక్క మొదటి రాకడతో ప్రారంభమాయెను, మరియు ఇది క్రీస్తు రెండవ రాకడతో ముగింపబడును. క్రీస్తు తిరిగివచ్చినప్పుడు, ఆయన ఈ యుగమును ముగించును మరియు రాజ్యపుయుగమును తెచ్చును. ఈ యుగము యొక్క ముగింపు, పరిణతి అనునది కనీసము ఏడు సంవత్సరాలు ఉండును. కావున, మనము క్రీస్తు తిరిగి వచ్చుటను అర్థము చేసుకోవాలంటే, ఈ ప్రస్తుత యుగమును గూర్చిన చివరి ఏడు సంవత్సరాలను గూర్చి మనకు తప్పక సంపూర్ణమైన అవగాహన ఉండవలెను. ఈ ఏడు సంవత్సరాలు… దానియేలు గ్రంథము 9: 24-27లో నమోదు చేయబడెను. [ఈ వచనములలో, ప్రతివారము ఏడు సంవత్సరాలను సూచిస్తున్నది.]
చివరి వారపు ఆరంభములో, ఏడు సంవత్సరాలు క్రీస్తువిరోధి ఇశ్రాయేలీయులతో ఒక గట్టి నిబంధనను చేయునని బైబిలు స్పష్టంగా చూపుచున్నది; ఏడు సంవత్సరముల మధ్యలో అతడు నిబంధనను ఉల్లంఘించును, దేవునికి ఇశ్రాయేలీయులు అర్పించు బలులను మరియు నైవేద్యములను నిర్మూలించును (దాని. 9:27; ప్రక. 12:13-17). అతడు దేవుని స్థానమును పెట్టును, మరియు క్రీస్తు భూమి మీదకు వచ్చునంత వరకు నాశనమును కలుగజేయుటకు అతడు గొప్ప విధ్వంసమును కలుగజేయును (మత్త. 24:15). క్రీస్తు తన నోటి శ్వాసతో క్రీస్తు విరోధిని హతము చేయును మరియు తన రాకడను ప్రత్యక్షపరచుట ద్వారా క్రీస్తువిరోధిని ఏమియు లేనివానిగా చేయును (2 థెస్స. 2:8; ప్రక. 19:19-20).
క్రీస్తు రెండవ రాకడ గూర్చిన సంకేతములు
క్రీస్తు విరోధి అగుపడుట
‘‘కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక’’ అని మత్తయి 24:15లో ప్రభువు చెప్పెను. ఇది ప్రస్తుత యుగములోని చివరి మూడున్నర సంవత్సరాలలో, మహా శ్రమల కాలములో, అనగా చివరి వారపు మధ్యలో ఖచ్చితముగా నెరవేర్చబడును. ఆ సమయములో క్రీస్తువిరోధి యొక్క ప్రతిమ దేవుని దేవాలయములో ఒక విగ్రహముగా పెట్టబడును.
క్రీస్తువిరోధిని సూచిస్తున్న ఒక క్రూరమృగము మధ్యధరా సముద్రములో నుండి బయటకు వచ్చునని ప్రకటన గ్రంథము 13:1 చూపుచున్నది. ఈ క్రూరమృగము ఏడు తలలను మరియు పది కొమ్ములను కలిగియుండెను. ప్రకటన గ్రంథము 17:8-11 ఏ క్రూరమృగము యొక్క మూలమును తెలుపుచున్నది? క్రూరమృగము యొక్క ఏడు తలలు రోమా సామ్రాజ్యపు ఏడుగురు చక్రవర్తులను సూచిస్తున్నది. చారిత్రక నివేదికల ప్రకారం, రోమా సామ్రాజ్యం మొత్తము పన్నెండుమంది కైసరులను కలిగి యుండెను, కానీ ప్రకటన గ్రంథములో కేవలము ఆరుగురిని గూర్చి మాత్రమే ప్రస్తావించెను, ఎందువలననగా ఈ ఆరుగురు ‘‘పతనమైపోయిరి’’ కాబట్టి [వ. 10]; అనగా, వారందరును అకారణముగా మరణించిరి వారు ఆత్మ హత్యనైనా చేసుకొనిరి లేదా వారు చంపబడిరి, వారి సింహాసనము స్వాధీనపరచుకొనబడెను. క్రీస్తువిరోధి, అనగా ఏడవ కైసరుగా ప్రకటన గ్రంథములో పేర్కొనబడినవాడు, మధ్యధరా సముద్రము చుట్టునున్న ఒకానొక అన్య దేశము నుండి వచ్చును. అతనికి పదిమంది రాజుల మద్దతు ఉండును, మరియు వారు రోమా సామ్రాజ్యమును పునరుద్ధరించే ఒక గొప్ప రాజ్యముగా ఏర్పడుటకు ఒక్కటిగా కూడివచ్చెదరు.
ఇశ్రాయేలీయులు పునఃస్థాపించబడుట
మత్తయి 21:19లో, ప్రభువైన యేసు యెరూషలేముకు చేసిన తన చివరి ప్రయాణములో, దానిలో ఏ పండును కనుగొననందున అంజూరపు చెట్టును శపించెను. అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయులకు ఒక గుర్తుగా ఉన్నది (యిర్మి. 24:2, 5, 8). ఇశ్రాయేలీయులు మొండితనము మరియు తిరుగుబాటును కలిగియున్నందున మరియు దేవుణ్ణి సంతృప్తిపరచనందున, ఆమె దేవునిచే తిరస్కరించబడెను. ‘‘రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’ (మత్త. 24:2) అని ప్రభువు చెప్పినది నెరవేర్చబడునట్లుగా క్రీ. శ. 70లో రోమా చక్రవర్తిగా ఉన్న తీతు (టైటస్) యెరూషలేమును మరియు మందిరమును నాశనము చేయుటకు గొప్ప సైన్యమును తెచ్చెను. ఆ సమయము నుండి ఇశ్రాయేలీయులు అనేక దేశములకు చెదరిపోయిరి. వారి దేశము పడిపోవుట మాత్రమే కాదుగానీ, వారి భూభాగము కూడా కోల్పోబడెను. మానవరీత్యా మాట్లాడినట్లయితే, ఇశ్రాయేలీయులు మరలా తిరిగి ఏర్పడుటకు ఎటువంటి ఆశయు లేదు. ఏదేమైనప్పటికీ, ఒక దినమున శపించబడిన మరియు ఎండిపోయిన అంజూరపు చెట్టు చిగురించి ఆకులు వేయును అను ప్రవచనము బైబిలులో కలదు. [ఇది ఇంకనూ నెరవేర్చబడాలి.].
మందిరము తిరిగి నిర్మించబడుట
మందిరము తిరిగి నిర్మించబడుటను గూర్చి, మొదటిగా మనము చివరి వారపు రెండు అర్ద భాగములను చూడవలెను. మొదటి మూడున్నర సంవత్సరాలు, వారు దేవుణ్ణి స్వేచ్చగా ఆరాధించునట్లు అనుమతిస్తూ క్రీస్తు విరోధి ఇశ్రాయేలీయులకు మద్దతు నిచ్చును; తరువాతి మూడున్నర సంవత్సరాలు, క్రీస్తు విరోధి బలులు మరియు నైవేద్యమును ఆపివేస్తూ (దాని. 12:7; 9:27) వాటిని తన విగ్రహముతోనే స్థానభర్తీ చేయును. మత్తయి 24:15లో క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ ఉంచే ప్రదేశము మందిరములోని పరిశుద్ధ ఆవరణమును తెలియజేయుచున్నది (కీర్త. 68:35; యెజ్కె. 7:24; 21:2), మరియు అసహ్యమైనది విగ్రహముగా ఉన్న క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను చూపుచున్నది. వేరుమాటలో చెప్పాలంటే, తన రాకడ యొక్క ప్రత్యక్షతను కనపరచి క్రీస్తు విరోధిని క్రీస్తు నాశనము చేయు వరకు మూడున్నర సంవత్సరాలు ప్రతిమ మందిరములోనే ఉండును. కావున, మొదటిగా మందిరము తిరిగి నిర్మించబడాలి; అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించగలరు మరియు బలులను అర్పించగలరు, మరియు క్రీస్తు విరోధి తన ప్రతిమను ఉంచగలడు.
క్రీ. శ. 70లో తీతు (టైటస్) మందిరమును నాశనము చేసిన దగ్గరనుండి, మందిరము ఇంతవరకు నిర్మించబడలేదు. ఇశ్రాయేలీయులు యెరూషలేమును తిరిగి సంపాదించుకొనిరి మరియు మందిరమును తిరిగి నిర్మించుటకు చర్యలను వేగవంతముగా చేయుచున్నారు. మందిరమును తిరిగి నిర్మించుటకు అవసరమైన సామాగ్రి అంతా మరియు బలులు అర్పించుటకు అవసరమైన పాత్రలన్నియు కూడా బైబిలులో నమోదు చేసిన దాని ప్రకారమే సిద్దపరచబడతాయి. వారు ఇప్పుడు సరైన సమయము కొరకు వేచియున్నారు, మందిరము తిరిగి నిర్మించబడుట అనునది పూర్తగును.
మహా శ్రమ
చివరి వారము యొక్క రెండవ భాగములో, అనగా ఈ యుగము యొక్క చివరి మూడున్నర సంవత్సరాలు, మహా శ్రమల కాలమైయున్నది, అటువంటిది ఈ లోకము ఆరంభమైనప్పటి నుండి రాలేదు, ఇక ఎప్పటికీ రాబోదు (మత్త. 24:21). ఈ సమయము ప్రకృతికతీతమైన వైపరీత్యాలతో ఏడు ముద్రలలోని ఆరవ ముద్ర సమయమున ఆరంభమగును (ప్రక. 6: 12-17) మరియు ఏడు పాత్రలలోని ఏడవ పాత్ర యొద్ద ముగియును (16:1-21). అది ‘‘భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలము’’ గా ఉండును (3:10). ఈ మహాశ్రమ ఈ భూమిపై నివసించే అందరిపైన (లూకా 21:35) మూడువైపుల నుండి వచ్చును దేవుని నుండి, క్రీస్తు విరోధి నుండి, మరియు సాతానునుండి నుండి వచ్చును.
పరిశుద్ధుల ఉత్థానము
మహా శ్రమలకు ముందు జయించువారు ఉత్థానము చేయబడతారు; ఎక్కువమంది విశ్వాసులు, అనగా ఇంకనూ ఎవరైతే జీవములో ఎదగలేదో వారు ఈ భూమి మీద మహా శ్రమలు అనుభవించుటకు విడువబడతారు. ‘‘ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును’’ అని మత్తయి 24: 40-41 చెబుచున్నది.
ఇది రాబోవు తీర్పును గూర్చి ఎటువంటి స్పృహ లేకుండా లోక ప్రజలు వస్తుపరమైన విషయములతో మత్తులైయుండగా, కొంతమంది వివేకమైన మరియు మెలుకువ గల విశ్వాసులు కొనిపోబడతారు అనే విషయమును తెలియజేయుచున్నది. మత్తులైయున్న మరియు స్పృహ కోల్పోయినట్టి ప్రజలకు, ఇది క్రీస్తు రాకడ యొక్క గుర్తైయున్నది. కావున, కొన్నిసార్లు మన హృదయము జారత్వము, త్రాగుబోతుతనము, మరియు ఈ జీవనానికి చెందిన ఆందోళనలతో క్రిందకు పడిపోయి (లూకా 21:34) మరియు మనము ఉత్థానమును కోల్పోయి లోతు భార్యవలె అగుదుమేమో అని మనలను మనము సరిచూసుకొనవలెను. (CWWL, 1990, vol. 3, “The Up-to- date Presentation of the God-ordained Way and the Signs concerning the Coming of Christ,” pp. 572, 574-578)
References: CWWL, 1990, vol. 3, “The Up-to-date Presentation of the God-ordained Way and the Signs concerning the Coming of Christ,” ch. 6; Life Lessons, vol. 3, lsns. 35, 36; Life-study of Revelation, msgs. 29, 30
MY KING WILL SOON COME BACK AGAIN
Hope of Glory—Longing and Praying
960
1 My King will soon come back again,
The sky be filled with Him;
The universe to be redeemed
Will see His light therein.
The Lord will soon fulfill His plan.
His footsteps now I hear;
His glorious frame I faintly see
Beginning to appear.
2 I’m longing for His presence blest
And dare not slothful be
While waiting for my Lord’s return,
His own dear self to see.
My only hope—that He may come
And change my faith to sight;
There is no other joy on earth
Which gives my heart delight.
3 My heart is always with Himself.
My eyes are heavenward.
My lips would utter nothing else
Than meeting with my Lord.
The coming of the Lord draws nigh;
His coming is for me.
His promise ever standeth firm
And soon fulfilled I’ll see.
4 My Savior, all Thy holy words
Can never doubted be;
With them encouraged day by day,
I’m faithful unto Thee.
Oh, may Thy glory soon appear,
The foe be overthrown,
Thy promises be realized,
And we brought to Thy throne.
5 Thy saving arm a refuge is,
My Savior God, to me;
Thou as the Father keepeth them
Who put their trust in Thee.
The sheep and Shepherd are of one,
The Head and Body same;
None e’er can pluck from out Thy hand
The child who trusts Thy name.
6 A thousand hands won’t hinder me,
Nor will ten thousand eyes;
The thorns upon the road but help
Me onward to the prize.
Arise, my spirit and my heart,
And let the world go by;
The Lord of life will take me soon
To be with Him on high.
7 Thou healing sun! Thou hope of man!
I really love Thy ray.
O righteous Lord! O glorious King!
I bow to Thee and pray:
Oh, may Thou soon ascend Thy throne
And quickly show Thy face;
Thy heav’nly kingdom may Thou found
And grant all men Thy grace.
8 The truth should triumph and be king,
And freedom should be queen,
But falsehood, which has rampant run,
Head of the world is seen.
We ask Thee, Truth, to quickly come
And bring Thy light from heav’n;
The foe be crushed and all Thy sons
Into Thy bosom giv’n.