Jump to section

ఒకటవ పాఠము – ప్రక్రియలు చెందిన త్రియేక దేవుడు

1 కొరి. 15:45—కడపటి ఆదాము జీవము-నిచ్చు ఆత్మ ఆయెను.

మత్తయి 28:19—కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్తిస్మమియుడి.

దేవుడు కేవలము ఒక్కడిగా ఉండుట

దేవుడు అద్వితీయముగా ఒక్కడైయున్నాడని అనేక సందర్భాల్లో మరియు అనేక విధాలుగా లేఖనములు మనకు చెప్పుచున్నవి. దేవుడు కేవలము ఒక్కడైయున్నాడని పాత నిబంధనలో మరియు నూతన నిబంధనలో, స్పష్టంగా మరియు ఖచ్చితంగా చెప్పే అనేక వాక్యభాగములు కలవు. ‘‘ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు’’ అని మొదటి కొరింథీయులు 8:4 చెబుచున్నది, ‘‘నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు’’ అని యెషయా 45:5 చెబుచున్నది. అటువంటి మాటలే యెషయా 45:6, 21-22; 46:9; మరియు 44:6, 8 లో కనుగొనవచ్చును.

దేవుడు ముగ్గురి పార్శ్వమును కలిగియుండుట–తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ

‘‘తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు  నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు’’ అని ప్రభువు మత్తయి 28:19లో చెప్పెను. ప్రభువు ముగ్గురిని-తండ్రి, కుమారుడు, మరియు ఆత్మను గూర్చి చాలా స్పష్టంగా మాట్లాడెను. కానీ ఆయన ఇక్కడ తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ అను నామమును గూర్చి మాట్లాడినప్పుడు, ఆయన ఉపయోగించిన నామము ఆదిమ భాషలో ఏకవచనముగా ఉండెను. తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ ముగ్గురిగా ఉన్నప్పటికీ, ఒక్కటే నామము అని దీనర్థము.

నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ ఏకకాలంలో సహాస్థిత్వము కలిగియుండుట

తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ అందరూ నిత్యులై ఉండుట

[యెషయా 9:6; హెబ్రీయులు 1:12; మరియు 9:14 లో] ముగ్గురు కూడా-తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ-నిత్యులని మనము చూడగలము.

తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ ఏకకాలములో సహాస్థిత్వమును కలిగియుండుట

‘‘నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును’’ అని యోహాను 14:16-17 లో ప్రభువు చెప్పుచుండెను. ఈ రెండు వచనములలో తండ్రి ఆత్మను పంపులాగున కుమారుడు తండ్రికి ప్రార్థించునని చెప్పెను. కావున, తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ ఒకే సమయములో ఉనికిలో ఉండగలరు.

తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ సహాంతర్గతులై వేరుచేయబడకుండా ఉండుట

‘‘తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నాము,’’ అని యోహాను 14:10 చెప్పుచుండెను. తండ్రి కుమారునికి వెలుపల తానొక్కడే రాడని ఇది సూచించుచున్నది; దానికి బదులుగా, ఆయన కుమారునిలో వచ్చును… ఇంకనూ ‘‘నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు’’ అని యోహాను 8:29 చెబుచున్నది. ‘‘యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై’’ అని లూకా 4:1 కూడా చెబుచున్నది. కుమారుడు ఈ భూమి మీద జీవించినప్పుడు, తండ్రి మరియు ఆత్మ ఇద్దరును ఆయనతో ఉన్నారని ఈ వచనములు తెలియజేయుచున్నాయి; ఈ ముగ్గురును విడదీయరాని వారుగా ఉన్నారు.

ముగ్గురు-తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ ఒక్కటిగా ఉండుట

కుమారుడు తండ్రిగా ఉండుట

‘‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును’’ అని యెషయా 9:6 చెబుచున్నది.

కుమారుడు (కడపటి ఆదాము) జీవము-నిచ్చు ఆత్మగా మారుట

‘‘కడపటి ఆదాము జీవమునిచ్చు-ఆత్మ ఆయెను’’ అని మొదటి కొరింథీయులు 15:45 చెప్పుచున్నది. కడపటి ఆదాము, అనగా, నరావతారమునొందిన ప్రభువైన యేసే, మరియు జీవము-నిచ్చు ఆత్మ, అనగా, పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మకు వేరుగా మరొక జీవము-నిచ్చు ఆత్మ ఎన్నడూ ఉండడు. కావున, ప్రభువైన యేసే పరిశుద్ధాత్ముడు అని ఈ వచనము కూడా మనకు స్పష్టంగా చెప్పుచున్నది.

ప్రభువు (కుమారుడు) ఆత్మగా ఉండుట

‘‘ప్రభువే ఆత్మ’’ అని రెండవ కొరింథీయులు 3:17 చెపుచున్నది. ఇక్కడ పేర్కొనబడిన ‘‘ప్రభువు,’’ అనగా ప్రభువైన యేసే, మరియు ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ….మన ప్రభువే పరిశుద్ధాత్మ. ఆయన తండ్రి, మరియు ఆయన ఆత్మ కూడా. ఆయనే సమస్తము! (Truth Lessons-Level One, vol. 1, pp. 16-21)

త్రియేక దేవుడు జీవము-నిచ్చు ఆత్మగా మారుటలోని మెట్లు

జీవము-నిచ్చు ఆత్మగా ప్రక్రియలు చెందుటకుగాను త్రియేక దేవుడు అనేకమైన కీలకమైన దశలను తీసుకొనెను. మొదటిగా, ఆయన నరావతారము నొందెను. దేవునిగా, ఆయన మానవ కన్యక గర్భములోనికి ప్రవేశించెను మరియు ఆ గర్భములో తొమ్మిది నెలలు ఉండెను. ఈ విధముగా ఆయన మానవత్వమును తన ఆశ్రయముగా, ఆయన నివాసస్థలముగా తీసుకొనెను. ఆయన నరావతారము అనునది ఖచ్చితముగా ఒక ప్రక్రియ. రెండవదిగా, ఆయన మానవ జీవనము అను ఒక గొప్ప ‘‘సొరంగము’’ గుండా పయనిస్తూ, ఈ భూమి మీద ముప్పైమూడున్నర సంవత్సరాలు జీవించెను, నడచెను. ఇదికూడా ఒక ప్రక్రియ. మూడవదిగా, ఆయన మరణములోనికి ప్రవేశించెను మరియు సమాధిని మరియు పాతాళమును కలుపుకొనియున్న మరణము గుండా ప్రయాణించెను. నాల్గవదిగా, మూడు దినముల తరువాత, ఆయన మరణము మరియు పాతాళముల నుండి బయటకు వచ్చెను, మరియు పునరుత్థానములోనికి ప్రవేశించెను. ఆయన మరణము మరియు పునరుత్థానములు కూడా ప్రక్రియలే. తన మరణ పునరుత్థానముల తరువాత, తన శిష్యులను దర్శించుటకు ఆయన వచ్చెను (యోహాను 20:19; లూకా 24:36).

ప్రభువు యొక్క పునరుత్థానము తరువాత ఆయన శిష్యులతో నలభై దినములు ఉండెను(అపొస్తలుల కార్యములు 1:3), ఆ సమయమందు తన సన్నిధిని ఆయన వారికి దృశ్యముగాను మరియు అదృశ్యముగాను ఉంచుకొనెను. ఆయన వారిని యెరూషలేమునకు నడిపించెను; ఒలీవల కొండపై నుండి మూడవ ఆకాశమునకు ఆరోహణమాయెను. తన ఆరోహణము ద్వారా ప్రభువైన యేసు తన ప్రక్రియను సమాప్తి చేసెను, ఆయన ఆరోహణము అనునది త్రియేక దేవుడు పరిణతి చెందుటలోని చివరి మెట్టై ఉన్నది. ముగ్గురును-తండ్రి, కుమారుడు, మరియు ఆత్మప్రభువు యొక్క ఆరోహణములో పూర్తిగా పరిణతి చెందెను.

పరిణతి అనునది ఒక ప్రక్రియ-నెరవేర్చబడినది అనుదానిని తెలియజేయుట

పరిణతి అను పదము ఒక పని లేదా ఒక ప్రక్రియ పూర్తి అగుటను లేదా, ముగించుటను తెలియజేయును. ఇది ఆహారమును సిద్ధపరచుటతో ఉదహరించవచ్చును. వంట ప్రక్రియ ప్రారంభమవ్వక ముందు, సామాగ్రి అంతయు ముడిగా ఉండును. కొన్నిగంటలు వండిన తరువాత, సరుకులు ఒక విందుగా పరిణతి చెందును. నరావతారమునకు ముందు దేవుడు ‘‘పచ్చిగా,’’ అనగా మానవ స్వభావమును కలిగిలేకుండా దైవిక స్వభావమునే కలిగియుండెను. నరావతారము, మానవ జీవనము, సిలువ మరణము, పునరుత్థానము, మరియు ఆరోహణము అను ప్రక్రియల ద్వారా, దేవుడు ప్రక్రియలు చెంది, పరిణతి ఆయెను. ఇప్పుడు ఆయన ఇక ఏమాత్రము ‘‘పచ్చిగా’’ నున్న దేవుడు కాదు; ఆయన దైవత్వమును, మానవత్వమును, మానవ జీవనమును, సర్వము-ఇమిడియున్న మరణమును, శక్తివంతమైన పునరుత్థానమును, మరియు సర్వోత్కృష్టమైన ఆరోహణమును కలిగియున్న పరిణతిచెందిన మరియు సంపూర్ణమైన త్రియేక దేవునిగా ఉండెను. ఈ మూలకములు లేదా పదార్థములన్నియు, ప్రక్రియలు చెంది పరిణతియైన త్రియేక దేవునిలో కలవు.

సంభార ఆత్మ పరిణతి చెందిన త్రియేక దేవునిగా ఉండుట

నరావతారము, సిలువ మరణము, మరియు పునరుత్థానము అను మెట్ల ద్వారా, సంభారమైన, సర్వము-ఇమిడియున్న, అంతర్వసించు ఆత్మగా ఉండునట్లు త్రియేక దేవుడు పరిణతి చెందెను. ఆత్మ, ప్రక్రియలు చెందిన మరియు పరిణితి చెందిన త్రియేక దేవుడై ఉండెను. నిర్గమకాండము 30లో ఒక తైలము తయారుచేయబడెను, మరియు ఈ తైలము నూనె మరియు నాలుగు వేరువేరు సుగంధ ద్రవ్యములతో కలుపబడెను గనుక దానిని సంభార తైలము అనెను (వవ. 22-25). ఈ సంభారభరిత తైలము అనునది మానవత్వము, సర్వము ఇమిడియున్న క్రీస్తు మరణమును, క్రీస్తు యొక్క శక్తివంతమైన పునరుత్థానమును, మరియు సర్వోత్కృష్టమైన క్రీస్తు ఆరోహణమును కలుపుకొనియున్న త్రియేక దేవునితోనున్న సంభార ఆత్మకు సాదృశ్యముగా ఉండెను. ఈ సంభార ఆత్మయే పరిణతి చెందిన త్రియేక దేవుడు.  (CWWL, 1990, vol. 1, “The Triune God to Be Life to the Tripartite Man,” pp. 266-267, 269)

References: Truth Lessons-Level One, vol. 1, lsn. 2; CWWL, 1990, vol. 1, “The Triune God to Be Life to the Tripartite Man,” ch. 5

 

ఏమీ మర్మం, తండ్రి సుతుడు ఆత్మ

దేవుని గూర్చిన అనుభవము-త్రిత్వము చేత

608

 1    ఏమీ మర్మం తండ్రి సుతుడు ఆత్మ

సారాంశం ఒక్కటే వ్యక్తి మువ్వుర్‌

ఈ దేవుడే సుతునిలో ఆత్మగా

లోనికొచ్చి మన సర్వమాయెన్‌

 

 త్రిత్వ దేవుడే మా సర్వమాయెన్‌

ఏమాద్భుతం మహిమాన్వితం

తరగనిది ఈ దైవ వరం

ఎంతో ఘనం, ఎంతో శ్రేష్టం

 

2     తండ్రే మూలం గొప్ప నీటి ఊటగా

నరుని ఆస్వాదనం కొరకే

ఎంతో ధన్యం ఈ పాలిభాగం విస్తారం

నిత్యత్వమంతా మన కొరకే

 

3     కుమారుడే దేవుని వ్యక్తతగా

మనతో వసింపన్‌ శరీరుడై

విమోచన కార్యం ఎంతో ప్రభావం

పాపుల్‌ దేవునితో ఏకమవ్వన్‌

 

4     ఆత్మే కుమారుని స్వరూపాంతరం

జీవంబియ్యంగా మనలోకొచ్చెన్‌

గొప్ప సత్యం ఆత్మతో మన ఆత్మ

మిళనమై ఏకమైయున్నది

 

5    దేవుడాత్మై యున్నాడిప్పుడు నిజంగా

ప్రతిదినం మనమనుభవింపన్‌

దేవునితో ఏకాత్మయై యున్నాము

జీవంలో లేదు ఏ వ్యత్యాసము

Jump to section