Jump to section

ఏడవ పాఠము – సంఘము

ఎఫె. 3:9-11—పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుట కును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

పిలువబడిన గుంపు

‘‘సంఘము’’ అను పదముకు గ్రీకు తర్జుమా అనునది… రెండు పదములను కలిగియున్న ఎక్క్లీసియా: ఎక్, ‘‘బయటకు,’’ మరియు కాలియో, ‘‘పిలువబడిన.’’ ఈ రెండు పదములను ఒకచోట పెట్టిన యెడల అది ‘‘బయటకు పిలువబడిన సమాజము’’ లేదా ‘‘పిలువబడిన వారి సమాజము’’ అని అర్థమునిచ్చును. కావున, వాక్యము యొక్క నిజమైన భావన ప్రకారము, సంఘము అనగా లోకమునుండి బయటకు దేవునిచే పిలువబడిన వారి సమూహము అని అర్థము.

పూర్వకాలములో పట్టణము యొక్క పురపాలక అధ్యక్షుడు కొన్నిసార్లు ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యము కొరకు ప్రజలను ఒక గుంపుగా, అనగా ఒక సమాజముగా పిలిచేవాడు. అటువంటి కూడికను చెప్పుటకు ఉపయోగించు గ్రీకు పదము ఎక్క్లీసియాగా ఉన్నది (cf. అపొస్తలుల కార్యములు 19:41).  బైబిల్ వాడుక ప్రకారము, ఎక్క్లీసియా అను పదము, సంఘము ఒక బయటికి పిలువబడిన గుంపు అని చెప్పుటకు ఉపయోగించబడినది అను విషయమును మేము ఇక్కడ నొక్కి చెప్పాలనుకుంటున్నాము. సంఘము అనునది లోకము నుండి ఆయన ఉద్దేశ్యము నిమిత్తము దేవుని కొరకు పిలువబడిన గుంపు. ఎక్క్లీసియా అనుదానిని ‘‘సంఘము’’ కన్నా  ‘‘సమాజము (అసెంబ్లీ)’’ అని తర్జుమా చేయుట ఎంతో ఉత్తమము. బ్రదరన్ సహోదరులు దీనిని గట్టిగా నొక్కి చెప్పెను, మరియు బ్రదరన్‌వారి మధ్య గల కూడికలను బ్రదరన్ అసెంబ్లీలుగా పిలిచెడివారు. నేను వారి సమాజము అను పదము యొక్క వాడుకతో ఏకీభవించెదను. (The Conclusion of the New Testament, pp. 2215-2216)

దేవుని గృహము

సంఘము దేవుని గృహము అని చూపే మూడు వచనములు 1 తిమోతి 3:15, హెబ్రీయులు 3:6, మరియు 1 పేతురు 4:17. 1 తిమోతి 3:15లో పౌలు ‘‘అయినను నేను ఆలస్యము చేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను’’ అని  చెప్పెను. దేవుని నివాస స్థలముగా, సంఘము అనునది దేవుని ఇల్లు మరియు ఆయన గృహ పరివారం, ఆయన కుటుంబముగా ఉన్నది. పాత నిబంధనలో మందిరము మరియు దేవుని ప్రజలు రెండూ వేరువేరు విషయములు, కానీ నూతన నిబంధన నెరవేర్పులో నివాస స్థలము మరియు కుటుంబము రెండూ ఒకటే. దేవుని నూతన నిబంధన ప్రణాళిక ప్రకారము, దేవుని ఇల్లు అనగా ఆయన కుటుంబము. …సంఘము దేవుని గృహము అని చెప్పు మరొక వాక్యము హెబ్రీయులు 3:6గా ఉన్నది. ఈ వచనము ‘‘క్రీస్తును…ఎవరి గృహములోనైతే మనము ఉన్నామో ఆయన గృహము యొక్క కుమారునిగా’’ పేర్కొనుచున్నది. (The Conclusion of the New Testament, p. 2227)

దేవుని రాజ్యము

‘‘కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు’’ అని ఎఫెసీయులు 2:19 చెబుచున్నది. ఏక పట్టణస్థులు      అను పదము దేవుని రాజ్యమును చూపుచున్నది. దేవుడు తన అధికారమును సాధకము చేయు మండలమైన దేవుని రాజ్యములో విశ్వాసులందరూ, అనగా యూదులు మరియు అన్యులు పౌరులై ఉన్నారు. ఒకడు విశ్వాసిగా ఉన్నంతవరకు, అతడు దేవుని రాజ్యములోని పౌరుడే. పౌరసత్వమనునది హక్కులను మరియు బాధ్యతలను కలిగియుండును, ఈ రెండు విషయములు ఎల్లప్పుడు కలసి వెళ్ళును. మనము రాజ్యము యొక్క హక్కులను ఆస్వాదించెదము, మరియు మనము రాజ్యము యొక్క బాధ్యతలను మోయుదుము. (The Conclusion of the New Testament, p. 2235)

క్రీస్తు దేహము

సంఘము క్రీస్తు దేహమైయున్నదని ఎఫెసీయులకు 1:22 మరియు 23 తెలియజేయుచున్నవి. ‘‘మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.’’ సంఘము ఒక  సంస్థ  కాదుగానీ శిరస్సును వ్యక్తపరచుటకు పునర్జన్మించబడిన మరియు దేవుని జీవమును కలిగియున్న విశ్వాసులందరిని కలుపుకొనియున్న జీవపరమైన దేహమై యున్నది. దేహము అనునది శిరస్సు యొక్క సంపూర్ణతై యున్నది, మరియు సంపూర్ణత అనునది శిరస్సు యొక్క వ్యక్తతైయున్నది. (The Conclusion of the New Testament, p. 2245)

క్రీస్తు యొక్క సరిజోడి

ఎఫెసీయులు 5:22-23లోని తన బోధలో, పౌలు సంఘమును క్రీస్తు యొక్క సరిజోడుగా చెప్పెను. వాస్తవానికి సంఘము క్రీస్తులోని భాగమైయున్నదని ఇది తెలియజేయుచున్నది, హవ్వ ఆదాములో నుండి వచ్చినదై మరియు ఆదాము కొరకై ఉన్నట్లుగానే సంఘము కూడా క్రీస్తు నుండి వచ్చినదై క్రీస్తు కొరకై ఉన్నది (ఆది. 2: 21-23).

సంఘము క్రీస్తు వధువుగా ఉండుటనగా ప్రేమలో సంతృప్తిని మరియు విశ్రాంతిని కలిగియుండుటే.  ప్రేమలో దొరికే, సంతృప్తి మరియు ప్రేమ ప్రతి భర్తకు అవసరమైయున్నది.  (The Conclusion of the New Testament, pp. 2275-2276)

నూతన పురుషుడు

‘‘విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, తన శరీరమందు కొట్టివేయుట చేత సంధి చేయుచు ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతనపురుషునిగా సృష్టించి’’ అని ఎఫెసీయులు 2:15 చెప్పుచున్నది. ‘‘సత్యము యొక్క నీతియు మరియు పరిశుద్ధతయు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన పురుషుని ధరించుకొనవలెను’’ అని ఎఫెసీయులు 4:24 చెబుచున్నది. అంతేకాకుండా, కొలొస్సీయులు 3:10 ఈలాగనుచున్నది, ‘‘సంపూర్ణ జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నూతన పురుషుని ధరించుకొని యున్నారు.’’

[సంఘము బయటికి పిలువబడినవారి యొక్క గుంపుగా ఉండుట] అనునది సంఘము యొక్క ప్రారంభపు దశగా నున్నది. ఈ పార్శ్వము నుండి మనము దేవుని గృహము మరియు దేవుని రాజ్యము అనే పార్శ్వముల యొద్దకు కొనసాగవలసిన అవసరమున్నది. ఇవి ప్రారంభపు పార్శ్వము కంటే ఉన్నతమైనవి; అయితే సంఘము యొక్క పార్శ్వమైన క్రీస్తు దేహమంత ఉన్నతమైనది కాదు. అయితే నూతన పురుషుడు అనేది క్రీస్తు దేహము కంటే మరింత ఉన్నతమైనది. కావున, సంఘమనేది కేవలము విశ్వాసుల సమాజము, పరలోకపు పౌరుల రాజ్యము, దేవుని పిల్లల గృహము లేదా క్రీస్తు దేహము మాత్రమే కాదు. మరింత ఉన్నతమైన పార్శ్వములో దేవుని నిత్యఉద్దేశమును నెరవేర్చుటకు సంఘమనేది ఒక నూతన పురుషుడు. సంఘము క్రీస్తు దేహమైయుండుటలో జీవము ఒక్కాణించబడుచుండగా, సంఘము నూతన పురుషుడైయుండుటలో వ్యక్తి ఒక్కాణించబడుతుంది. క్రీస్తు దేహముగా, సంఘముకు దాని జీవముగా క్రీస్తు అవసరము. ఒక నూతన పురుషునిగా, సంఘముకు దాని వ్యక్తిగా క్రీస్తు అవసరము. జీవము లేకుండా దేహమనేది దేహము కాదు గాని ఒక మృతదేహమై యున్నది. అయినను, దేహము చలించునప్పుడు, అది జీవము చేత కాదు గాని వ్యక్తి చేత నిర్ణయించబడును. కావున, నూతన పురుషునిలో మనము క్రీస్తును మన వ్యక్తిగా తీసుకొనవలెను. ఒక సమిష్ఠి వ్యక్తిగా నూతన పురుషుడు, యేసు భూమి మీద జీవించిన విధముగానే జీవించవలెను అనగా సత్యముతో కూడిన జీవితమును అంటే దేవుని వ్యక్తపరుస్తూ, మానవుడు దేవుణ్ణి వాస్తవికతగా గ్రహించేలా చేసే జీవితము జీవించవలెను. (The Conclusion of the New Testament, pp. 2301-2302)

బంగారు దీపస్తంభములు

బైబిలులో గల ముఖ్యమైన చిహ్నములలో దీపస్తంభములు ఒకటి. ‘‘నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడతిరిగితిని; నేను తిరుగగా, ఏడు సువర్ణ దీపస్తంభములను చూచితిని’’ అని ప్రకటన గ్రంథము 1:12 చెబుచున్నది. ‘‘ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములని’’ ప్రకటన గ్రంథము 1:20 చెబుచున్నది. కావున, సంఘము అనునది బంగారు దీపస్తంభముచే సూచించబడెను.

బంగారు దీపస్తంభమును గూర్చిన ప్రత్యక్షత అనునది నిర్గమకాండము, జెకర్యా గ్రంథము, మరియు ప్రకటన గ్రంథములో కనుగొనవచ్చును. నిర్గమకాండములో దీపస్తంభము అనునది క్రీస్తు త్రియేక దేవుని మూర్తిమంతముగా ఉన్నాడని సూచించుచున్నది. జెకర్యాలో దీపస్తంభము అనునది ఇశ్రాయేలీయులు దేవుని సాక్ష్యముగా ఉండుటను సూచించుచున్నది. ప్రకటన గ్రంథములో సంఘము యేసుయొక్క సాక్ష్యము నిమిత్తము దేవుని యొక్క సజీవమైన మూర్తిమంతముగా ఉండుటను సూచిస్తున్నది. కావున, దీపస్తంభము అనునది క్రీస్తుకు, ఇశ్రాయేలీయులు జనాంగమునకు, మరియు సంఘమునకు చిహ్నముగా నున్నది. ఇంకా చెప్పాలంటే,…దీపస్తంభము అనునది త్రియేక దేవుని యొక్క మూర్తిమంతముగా ఉన్నది. క్రీస్తుతో, ఇశ్రాయేలీయులతో, మరియు సంఘముతో బంగారు దీపస్తంభము అనునది త్రియేక దేవుని యొక్క మూర్తిమంతముగా చిత్రరూపములో చెప్పబడినది. (The Conclusion of the New Testament, pp. 2327-2328)

References: The Conclusion of the New Testament, msgs. 207-220; Life-study of Ephesians, msg. 74

 

సంఘమే క్రీస్తు దేహం

సంఘము—దాని సామాన్య నిర్వచనము

824

1     సంఘమే క్రీస్తు దేహం

తండ్రివాస స్థలం

పిలువబడ్డవారి

కూడికయే గదా

దేవుడున్ నరులును

సమ్మేళనమైన

పరసంబంధమైన

సత్త్వమే సంఘము

 

2     నూతన సృష్టి యొక్క

క్రొత్త పురుషుడు

పునరుత్ధానుడైన

ప్రభుని ద్వారాను

పుట్టి, ఆత్మలోనికి

బాప్తిస్మమొందెను

ఆయన వాక్కు చేత

శుద్ది చేయబడెన్

 

3     క్రీస్తే దాని పునాది

వేరెవ్వరు కాదు

తన సర్వమంతయు

క్రీస్తు దైవత్వమే;

తన సభ్యులందరు

బంగారు వెండియు

ప్రశస్తమైన రాళ్ళై

కట్టబడియుండెన్

 

4     దేవుడు ఒక్కడేను

ప్రభువు ఒక్కడే

ఆత్మయును ఒక్కడే

విశ్వాసమొక్కటే

నిరీక్షణ ఒక్కటే

బాప్తిస్మమొక్కటే

దేహమును ఒక్కటే

కుమారునిలోన

 

5     ప్రతి జనమునుండి

ప్రతి జాతి నుండి

సభ్యులుందురందున

ఏ భేదము లేక;

నూతన పురుషుడు

క్రీస్తే సర్వమైయు

సంఘములో ఉండును

ఐక్యపర్చుచును

 

6     సార్వత్రికమైనట్టి

ఒక్కటే దేహమై

ప్రతి స్థలమందున

వ్యక్తమగుచుండున్;

పరిపాలించువారు

స్థానికపెద్దలు

సార్వత్రికమైనట్టి

సహవాసం కల్గి

 

7     క్రొత్త యెరూషలేము

మాదిరిని కల్గి

దాని అంశములన్నీ

చూపింపవలెను

క్రీస్తుని మహిమను

వెలుగుగా కల్గి

దీపస్తంభములయ్యు

ప్రకాశింపవలెన్

Jump to section