Jump to section

పదకొండవ పాఠము – పాత నిబంధన పుస్తకముల సామాన్య విషయములు

కీర్త. 12:6—యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండియంత పవిత్రములు.

119:140—నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది.

 

ఆదికాండము: దేవుడు సృష్టించెను, సాతానుడు నాశనము చేసెను, మానవుడు పడిపోయెను, మరియు రక్షించునని యోహోవా వాగ్దానము చేసెను.

నిర్గమకాండము: వారు దేవుని ఆరాధించుటకు మరియు సేవించుటకు ఆయనలో వారు దేవునితో కలసి నిర్మించబడుటకు, వారు మరియు దేవుడు కలుసుకొనుటకు, మాట్లాడుకొనుటకు, మరియు పరస్పరము నివసించుటకు క్రీస్తే దేవుని ప్రజల యొక్క విమోచన, రక్షణ, మరియు సరఫరా మరియు మాధ్యమముగా ఉండుట.

లేవీయకాండము: సహవాసములో, సేవలో మరియు జీవనములో దేవునిచే విమోచింపబడినవారికి క్రీస్తే సమస్తముగా ఉండుట.

సంఖ్యాకాండము: క్రీస్తే దేవుని ప్రజల యొక్క జీవనము యొక్క అర్థము, సాక్ష్యము, మరియు కేంద్రమైయుండుట, మరియు వారి ప్రయాణము మరియు యుద్ధములో నాయకుడు, మార్గము మరియు గురిగా నుండుట.

ద్వితీయోపదేశకాండము: వారు పరలోకపు భూభాగములోనికి ప్రవేశించుటకు మరియు ఆయన ఐశ్వర్యములలో పాల్గొనుటకు క్రీస్తే దేవుని ప్రజల శిక్షకుడు మరియు నాయకుడుగా ఉండుట.

యెహోషువ: దేవుని ప్రణాళికను కొనసాగించుటకు ఇశ్రాయేలీయులు మంచి దేశమును ఆక్రమించుకొనుట మరియు స్వాధీనపరచుకొనుట.

న్యాయాధిపతులు: ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టుట, వారి శత్రువులచే ఓటమిని ఎదుర్కొనుట, మరియు దుష్టమైనవారిగా మారుట.

రూతు గ్రంథము:  ఆయనతో ఐక్యమగుటతో క్రీస్తు యొక్క విమోచన ద్వారా పాపులు, ఇశ్రాయేలీయులతో అనగా దేవునిచే ఎన్నుకొనబడినవారితో, దేవుని స్వాస్థ్యములోనికి తీసుకు రాబడుట యొక్క సంపూర్ణమైన చిత్రము.

1 & 2 సమూయేలు గ్రంథము: దేవుడు ఇచ్చిన మంచి దేశమును ఆస్వాదించుటకు గల మార్గమును కొరకైన వివరణలు.

1 & 2 రాజుల గ్రంథము: దైవిక రాజరికమును ధ్వంసము చేయుట మరియు నాశనము చేయుట వలన దేవుని ప్రణాళికలో దేవుని చట్టపరమైన వ్యవహరింపు, మరియు దేవుని నీతిపరమైన వ్యవహరింపు వలనైన విషాదము.

1 & 2 దినవృతాంతములు: యూదా రాజులతో దేవుని వ్యవహరింపులకు సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైన వివరముల ప్రస్తావనతో, ఆదాము నుండి సమూయేలు గుండా ఇశ్రాయేలీయులు చెరలో నుండి తిరుగివచ్చుట వరకు ఉన్న మానవుని చరిత్రలో దేవుని చలనమునకు సంబంధించిన పూర్తి దినవృత్తాంతము.

ఎజ్రా: ఆయన ప్రణాళిక ప్రకారము భూమ్మీద ఆయన సాక్ష్యము నిమిత్తము ఆయన ఎన్నుకొనిన వారి మధ్య దేవుని పునరుద్ధరణకు ప్రారంభముగా తమ చెరలోనుండి ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చుట మరియు దేవుని ఇంటిని తిరిగి నిర్మించుట.

నెహెమ్యా: ఆయన సాక్ష్యము నిమిత్తము ఆయన ప్రణాళిక నెరవేర్చబడు నిమిత్తము దేవుని ఎన్నిక ప్రజల మధ్య నిరంతర పునరుద్ధరణగా యెరూషలేము పట్టణపు ప్రాకారమును తిరిగి నిర్మించుట.

ఎస్తేరు: ఇశ్రాయేలీయులను తన ఎన్నిక జనాంగముగా ఎంచుకున్న దేవుడు వారి పట్ల రహస్యంగా శ్రద్ధ వహించుటకు మరియు అన్యజనాంగముల మధ్య వారు చెరలో ఉంటుండగా రహస్యంగా పనిచేస్తూ వారిని బాహాటముగా రక్షించుటకు వారికి దాగియున్న దేవునిగా అగుట.

యోబు: తన పరిశుద్ధమైనవానితో దేవుడు వ్యవహరించుటకున్న ఉద్దేశము.

కీర్తనలు: తమ స్తుతులతో, ప్రార్థనలతో మరియు ఉత్సాహముతో పాడుట ద్వారా దేవుని అన్వేషిస్తూ మరియు సంప్రదిస్తూ దైవభక్తి (వ్యక్తత) గల మనుష్యుల అభిమానాల, అనుభూతుల, ప్రేరణల మరియు అనుభవాల వ్యక్తీకరణలు.

సామెతలు: మానవ జీవితంలో ఏలాగు ప్రవర్తించాలో మరియు వారి శీలమును ఏలాగు  పెంపొందించుకోవాలో ప్రజలకు బోధించు జ్ఞానపు మాటలు.

ప్రసంగి: భ్రష్టుపట్టిన లోకములో మానవ జీవితము వ్యర్థమే, గాలిని పట్టుకొనుటయే అని చూపు సొలొమోను బోధలు.

పరమ గీతములు: ఒక్కొక్క విశ్వాసి క్రీస్తుతో ప్రేమపూర్వకమైన సహవాసముకు సంబంధించిన పురోభివృద్ధి అనుభవమును బయలుపరుస్తూ, అద్భుతమైన వివాహములోనున్న ప్రేమ చరిత్ర.

యెషయా: నరావతారుడైన, సిలువమరణము నొందిన, పునరుత్థానుడైన, ఆరోహణుడైన మరియు రాబోవు క్రీస్తు ద్వారానైన యెహోవా రక్షణ.

యిర్మీయా: ఇశ్రాయేలీయులతో మరియు జనులతో దేవుని వ్యవహరింపులలో, తమ కేంద్రముగా మరియు కైవారముగా దేవుని ఎన్నిక జనాంగముకు యెహోవా నీతిగా క్రీస్తు చేయబడుట.

విలాపవాక్యములు: పరిశుద్ధ పట్టణము పట్ల మరియు దేవుని పరిశుద్ధ ప్రజల పట్లనున్న యిర్మీయా దుఃఖము మరియు ప్రేమ యొక్క వ్యక్తత.

యెహెజ్కేలు: మహిమలో దేవుడు మానవునికి అగుపడుట, ఆయన ప్రజలపై మరియు జనులపై ఆయన తీర్పు, మరియు తన కొరకు తనకు చెందిన పరస్పర నివాసముగా మరియు పూర్తి వ్యక్తతగానున్న నివాస స్థలముగా నిర్మించబడుటకు ఆయన ఎన్నుకొనిన ప్రజలను ఆయన పునరుద్ధరించుట.

దానియేలు: దేవుని చేత పంచి ఇవ్వబడిన ఇశ్రాయేలీయుల గమ్యము డెబ్భై వారాలకు సంబంధించిన అంతరాంశాలు.

హోషేయా: వ్యభిచరించిన మరియు భ్రష్టమైన ఇశ్రాయేలీయులను తిరిగి స్వీకరించుట మరియు ఆమెను పునఃస్థాపించడంలో ఆమెకు యెహోవా రక్షణగా ఉండుట.

యోవేలు: మానవ ప్రభుత్వము నాలుగు దశలలో ఇశ్రాయేలీయులను నాశనము చేయుట మరియు నాశనము చేయువారిని క్రీస్తు నాశనము చేయుట మరియు పునఃస్థాపనలో ఇశ్రాయేలీయుల మధ్య ఆయన ఏలుబడి చేయుట.

ఆమోసు: పునఃస్థాపన అనే విషయమునకు సంబంధించి, ఇశ్రాయేలీయులపై మరియు చుట్టూ ఉన్న జనులపై యెహోవా తీర్పు.

ఓబద్యా: ఏశావుతో యెహోవా వ్యవహరింపులు మరియు యెహోవా రాజ్యము కొరకు యాకోబు విజయము.

యోనా: నీనెవె అనబడు అన్యజనుల పట్టణమునకు కూడ యెహోవా రక్షణ చేరుట.

మీకా: ఇశ్రాయేలీయులపై యెహోవా గద్దింపు మరియు ఇశ్రాయేలీయులకు సంబంధించి ఆయన పునఃస్థాపనము.

నహూము: దుష్ట అష్షూరుకు రాజధానిగానున్న నీనెవెపై యెహోవా తీర్పు.

హబక్కూకు: మొదటిగా కల్దీయుల చేత ఇశ్రాయేలీయులపై మరియు ఆ తరువాత జనుల చేత కల్దీయులపై దేవుని నీతి వంతమైన తీర్పు.

జెఫన్యా: ఇశ్రాయేలీయులపై మరియు జనులపై యెహోవా తీర్పు మరియు అన్యులకు మరియు ఇశ్రాయేలీయులకు ఆయన రక్షణ.

హగ్గయి: ఆయన ఇంటిని నిర్మించుటకు చెరగొనిపోబడి తిరిగి వచ్చిన  వారితో యెహోవా వ్యవహరించుట.

జెకర్యా: తమ చెరలో తన దీనత్వమునందు బాధను అనుభవించే తమ సహచరునిగా మారిన క్రీస్తు విమోచన ద్వారా దండించబడిన ఆయన ఎన్నిక ప్రజలకు యెహోవా హృదయ పూర్వకమైన ఓదార్పు మరియు వాగ్దానము.

మలాకీ: లేవీ కుమారులతో (ఇశ్రాయేలీయులలోనున్న యాజకులు) మరియు యాకోబు కుమారులతో (ఇశ్రాయేలీయులు) యెహోవా వ్యవహరించుట.

References: Recovery Version of the Bible

 

LORD, THE ANCIENT TYPES AND SYMBOLS

Praise of the Lord—His All-Inclusiveness

196

Lord, the ancient types and symbols

As our all Thyself portrayed;

As was shadowed in those figures,

Real to us Thou now art made.

Contemplating such a picture,

As we on its wonders gaze,

How we marvel at Thy riches

And our song of worship raise.

 

Lord, Thou art our true Passover;

God passed over us through Thee.

By Thyself and Thy redemption,

We with God have harmony.

Thou, the Lamb of God, redeemedst us

With Thyself and with Thy blood;

We apply Thy blood, our ransom,

Eating Thee, our real food.

 

Lord, Thou art the Bread from heaven,

The unleavened Bread of life;

Eating Thee, with Thee we mingle,

Ceasing from our sin and strife.

Lamb and Bread are both Thy figures,

Showing Thou art life to us;

Feasting on Thee at Thy table,

We enjoy Thy riches thus.

 

Lord, Thou art the Heav’nly Manna,

As our daily food supply;

Strengthening and energizing,

All our need to satisfy.

Living Rock Thou also art, Lord,

Cleft for us with life to f low;

Drinking of this living water,

Thirst is quenched, Thy life we know.

 

Lord, Thou art the Land of Canaan-

Elevated, rich, and good,

Flowing with both milk and honey

In a glorious plenitude.

By Thy surplus, God we worship,

In Thy fellowship we move;

Thus in love we’re joined together,

And God’s building we will prove.

Jump to section