Jump to section

పద్నాల్గవ పాఠము – సంకీర్తనలను తెలుసుకొనుట

ఎఫె. 5:19—ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు..

కొలొ. 3:16—సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యముల తోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. 

సంకీర్తనల విషయ సూచికలకు సంబంధించిన ప్రాముఖ్యమైన అంశాలు

సంకీర్తనలను తెలుసుకొనుటకు మనము సంకీర్తనల విషయ సూచికలకు సంబంధించిన ప్రాముఖ్యమైన అంశాలను తెలసుకోవాలి. మొదటిగా, త్రియేక దేవుని దీవెన (స్తుతించుట) మరియు అనుభవించుట పైనున్న సంకీర్తనలను మనము కొన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఉపయోగించబడిన దీవెన అనే పదము త్రియేక దేవుడు మనకు ఇచ్చిన మంచి విషయములు కాదు కాని మనము ఆయనకు చేసే స్తుతి, అనగా దీవెన అయ్యుంది. త్రియేక దేవుని దీవించుట మీదనున్న మంచి సంకీర్తనకు సంబంధించిన ఒక ఉదాహరణయే సంకీర్తన, #7-‘‘ఓ తండ్రీ, నీకే మహిమ!’’-త్రియేక దేవుని గూర్చిన అనుభవము మీదనున్న మంచి సంకీర్తనకు ఒక ఉదాహరణయే సంకీర్తనలు, #608-ఏమీ మర్మం, తండ్రి కుమార ఆత్మ.’’ తండ్రిని స్తుతించుట మరియు ప్రభువును స్తుతించుట అనే వర్గములోనున్న సంకీర్తనలను కూడ మనము తెలుసుకోవాలి.

సంకీర్తనల విషయ సూచికకు సంబంధించిన మరో ప్రాముఖ్యమైన అంశము ఏమనగా, ఆత్మ యొక్క నింపుదల. కొందరు ఆత్మ సంపూర్ణత అన్న పదమును ఉపయోగించెను. ఆత్మ యొక్క నింపుదలకు రెండు పార్శ్వాలు ఉన్నాయని బైబిల్ బయలుపరచును జీవము కొరకైన ఆంతరిక నింపుదల మరియు శక్తి కొరకైన బాహ్యమైన నింపుదల. ప్లీరో అన్న గ్రీకు పదము ఆంతరిక నింపుదలను సూచించును, మరియు ప్లీతో అన్న గ్రీకు పదము బాహ్యమైన నింపుదలను సూచించును.

క్రీస్తుతో ఐక్యమగుటకు సంబంధించిన సంకీర్తనలను కూడ మనము తెలుసుకోవాలి. ఐక్యత కంటే గుర్తించబడుట అన్నదే ఉత్తమమైన పదమని నాకు అనిపిస్తుంది. క్రీస్తు కలిసి ఉండుటకు మనము కేవలం ఐక్యపరచబడడం మాత్రమే కాక మనము వాస్తవానికి క్రీస్తుతో ఒక్కటై ఉన్నాము. మన సంకీర్తనల పుస్తకమునకు సంబంధించి ఈ విభాగములోనున్న అనేక సంకీర్తనలు ఎ. బి. సింప్సన్ చేత వ్రాయబడెను, ఈయన క్రిష్టియన్ మరియు మిషనరీ అలియన్స్‌‌‌కు స్థాపకుడు. ఎ. బి. సింప్సన్ చేత వ్రాయబడిన ఈ లోతైన మరియు అద్భుతమైన సంకీర్తనలకు చెందినవి అనేకము క్రిష్టియన్ మరియు మిషనరీ అలియన్స్ సంఘములకు సంబంధించిన నేటి సంకీర్తనల పుస్తకములో కనుగొనబడవు, కాని మన సంకీర్తనల పుస్తకములో మనము వాటిని చేర్చితిమి.

సంకీర్తనల విషయ సూచికకు సంబంధించిన మరో ప్రాముఖ్యమైన అంశము క్రీస్తును గూర్చిన అనుభవము. సంకీర్తనలు, #499-‘‘అద్భుతమే ఈ జీవనం’’-మరియు #501- ‘‘మహిమాన్విత రక్షకా’’-అన్నవి ఈ వర్గములో అద్భుతమైన సంకీర్తనలు అయ్యున్నాయి. ఆంతరిక జీవము, సంఘము, రక్షణ యొక్క నిశ్చయత, సమర్పణ మరియు శోధనలలో ఆదరణ మీదనున్న సంకీర్తనలను కూడ మనము తెలుసుకోవాలి.

ఆత్మీయ యుద్ధము, సువార్త, కూటములు, మహిమ నిరీక్షణ మరియు అంతిమ ప్రత్యక్షతకు సంబంధించిన క్రీలకమైన అంశాలపైనున్న సంకీర్తనలను కూడ మనము తెలుసుకోవాలి.  (CWWL, 1988, vol. 1,“Speaking Christ for the Building Up of- the Body of Christ,” pp. 210-211)

[సంకీర్తనలలోనున్న ముప్పై వర్గాలు]

సంకీర్తనల విషయసూచికలో మొత్తం ముప్పై వర్గాలు ఉన్నాయి, అవేవనగా, త్రిత్వ దేవుని దీవెన (స్తుతించుట), తండ్రిని ఆరాధించుట, ప్రభువును స్తుతించుట, ఆత్మ సంపూర్ణత, రక్షణ యొక్క నిశ్చయత మరియు ఆనందము, ఆశలు, సమర్పణ, క్రీస్తుతోని ఐక్యత, క్రీస్తును గూర్చిన అనుభవము, దేవుని గూర్చిన అనుభవము, సిలువయందు అతిశయించుట, సిలువ మార్గము, పునరుత్థాన జీవము, ప్రోత్సాహము, శోధనలలో ఆదరణ, ఆంతరిక జీవపు వేర్వేరు అంశములు, దైవిక స్వస్థత, ప్రార్థన, వాక్యాధ్యయనము, సంఘము, కూటములు, ఆత్మీయ యుద్ధము, సేవ, సువార్త ప్రకటన, బాప్తిస్మము, ప్రభువు దినము, రాజ్యము, మహిమ నిరీక్షణ, అంతిమ ప్రత్యక్షత మరియు సువార్త. (Hymns, pp. iii-vii)

సంకీర్తనల యొక్క సంవేదన

సంకీర్తనల యొక్క సంవేదనను మీరు తెలుసుకున్నట్లయితే, వాటి ప్రమాణమును మీరు తెలుసుకోగలరు. సంకీర్తన గూర్చిన తలంపు నుండి సంవేదన వచ్చును. కూటముకు మనము ఒక సంకీర్తనను ఎంచుకున్నప్పుడు, సంకీర్తనను యొక్క తలంపు ప్రకారముగానున్న మన సంవేదన ప్రకారము మనము చేయాలి. సంకీర్తన యొక్క సంవేదన దాని రుచిని కూడ సూచించును. కొన్ని ఆహారములు రచికరమైనవా కాదా అన్నది వాటి రుచి చేత నిర్దారించబడును. వాటిని రచించుటను నేర్చుకొనుట చేత సంకీర్తనలను బాహ్యమైన రీతిలో కాక అనుభవేద్యమైన రీతిలో కూడ మనము తెలుసుకోగోరుచున్నాము.

సంకీర్తనల రాగము

సంకీర్తనల రాగము కూడ సంకీర్తనలను మనము తెలుసుకొనుటకు సంబంధించి ప్రాముఖ్యమైన పార్శ్వమై ఉంది. అనేక మంచి సంకీర్తనలు నీచమైన స్వర మాధుర్యము చేత పాడుచేయబడగలవు. మన సంకీర్తనల పుస్తకమును తయారు చేస్తునప్పుడు, సంకీర్తనలకు సరైన మరియు ఉన్నతమైన స్వరమాధుర్యతను కలిగియుండుట అనే ప్రాముఖ్యమైన అంశమును మనము తీసుకున్నాము. సంకీర్తనకు సంబంధించిన తలంపుకు మరియు భావనకు సరిపడాల్సిన స్వరమాధుర్యము వాటికి తగునో లేదో చూచుటకు మనము ఎన్నుకున్న స్వరమాధుర్యములను మనము విన్నాము. మన సంకీర్తనల పుస్తకము కొరకు మన చేత వ్రాయబడిన క్రొత్త సంకీర్తనలన్నియు పాత స్వరమాధుర్యముతో కూర్చబడెను. మనము క్రొత్త స్వరమాధుర్యములను కూర్చలేదు. ‘‘అద్భుతమే ఈ జీవనం!’’ అన్నది చార్లస్ వెస్లీ యొక్క ప్రసిద్ధిగాంచిన సంకీర్తనకున్న ‘‘And can it be that I should gain” రాగము బట్టి వ్రాయబడెను. సంకీర్తనలు, #499 కున్న ఈ స్వరమాధుర్యము ప్రజల కోరికను మరియు భావనను రేకెత్తించును. గత శతాబ్దాములో  మరియు ఈ శతాబ్దము ప్రారంభములో కూర్చబడిన స్వరమాధుర్యములు అనేకములను నేను సంపదగా ఎంచుతాను. రెండవ ప్రపంచ యుద్ధము తరువాత, బయటకు వెలువడిన స్వరమాధుర్యములు దాదాపుగా మునుపున్న పవిత్రమైన స్వరమాధుర్యములకు సరిపడలేదు. ఉదాహరణకు, ‘‘నాకై చీల్చబడ్డాయో’’  (సంకీర్తనలు, # 1058) మరియు ‘‘యేసు నా ప్రాణ ప్రియుడు’’  (సంకీర్తనలు, #1057)  అన్న వాటికి రాగములు చాల సారవంతమైనవి. సంకీర్తనలను మనము కూర్చడంలో ఈ రకమైన శైలిని అనుసరించుటకు మనము ప్రయత్నించాలి.

మన కూటములలో సంకీర్తనలను మాట్లాడడం నేర్చుకొనుట

ముగింపులో, మనము కూటములను ఆత్మసంబంధమైన రీతిలో కలిగియుండబోతున్నట్లయితే, మనము సంకీర్తనలను తెలుసుకోవాలి. మనము సంకీర్తనల విషయ సూచికకు సంబంధించిన ప్రాముఖ్యమైన అంశాలను, సంకీర్తనల ప్రమాణమును, సంకీర్తనల సంవేదన, సంకీర్తనల మాటలు మరియు సంకీర్తనల రాగమును తెలుసుకోవాలి. సంకీర్తనలు పాడుకొనుటకు మాత్రమే కాదు కాని మరి ఎక్కువగా కూటములలో మాట్లాడుకొనుట కొరకు కూడ అని మనము గుర్తుంచుకోవాలి. సరైన సంకీర్తనలను ఒకరికొకరము మాట్లాడుకోవడం మరియు వాటిని ప్రభువుకు పాడుట అన్నది కూటములను ఐశ్వర్యవంతముగా చేయును, ఉజ్జీవింపజేయును, పైకెత్తును, తాజాపరచును మరియు బలపరచును.

మన కూటములలో సంకీర్తనలను మాట్లాడడం మనము నేర్చుకోవాలి. కేంద్రముగానున్న క్రీస్తుతో కూడిన ఈ అభ్యాసము తాజాపరస్తుంది, పోషిస్తుంది, క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది మరియు నిర్మిస్తుంది. ప్రభువు పునరుద్ధరణలోనున్న పరిశుద్ధులందరు కూటములలో సంకీర్తనలను మాట్లాడడం నేర్చుకున్నట్లయితే, కూటములు సజీవంగా, తాజాగా మరియు ఐశ్వర్యవంతముగా ఉండును. వారి ఆస్వాదనను ఇతరులతో పంచుకొనుటకు పరిశుద్ధులందరికి ఇది మార్గమును ఇచ్చును. సంకీర్తనలను మాట్లాడుటకు మనము భారమును తీసుకోవాలి మరియు మన స్థానిక ప్రదేశములో దానిని చేయుటకు పాటుపడాలి. (CWWL, 1988, vol. 1, “Speaking Christ for the Building Up of the Body of Christ,” pp. 214-215, 219)

References: CWWL, 1988, vol. 1, “Speaking Christ for the Building Up of the Body of Christ,” ch.7; Hymns

 

WITHIN MY HEART A PRAISE O’ERFLOWING

Assurance and Joy of Salvation—Satisfied with Christ

8255

1

Within my heart a praise o’erflowing

’Tis the gracious Lord, my song;

There never was a song so excellent;

Heaven’s joys to me belong.

 

In my heart there springs a melody,

The sweetest melody, a song so heavenly,

In my heart there springs a melody,

There springs a melody of love.

 

2

O wondrous love, the Lord has saved me,

Granting me new life and joy;

Amazing grace! He’s living now in me;

Grace and love I now enjoy.

 

3

O light of life, my Lord now leads me.

Step by step this song I raise;

O perfect peace, Christ now abides in me,

Welling up in psalms of praise.

 

4

O what release! I shall be raptured,

Where the vict’ry song we’ll sing;

O what an honor, reigning with the Lord;

Angels’ celebrations ring.

 

5

The Holy City, what a blessing!

Living water flowing free,

The tree of life with fruits abundant, sweet,

Satisfy eternally.

Jump to section