Jump to section

పదహారవ పాఠము – వేకువ ఉజ్జీవము కొరకైన పరిశుద్ధ వాక్యము

2 కొరి. 4:16—కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.

ఎఫె. 6:17-18—ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. 

1 కొరి. 14:4, 26ప్రవచించువాడు సంఘమును నిర్మించును. …సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు.  సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై (నిర్మాణమునకై) జరుగనియ్యుడి.

ఉజ్జీవింపబడుటకు మరియు ప్రవచించుటకు సాధకము చేయుట

ప్రతి ఉదయము ఉజ్జీవింపబడుట మరియు నూతనపరచబడుట

నేడు మన రక్షణ అన్నది పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనలను నూతనపరచుట  ద్వారాను అయ్యుందని తీతుకు 3లో పౌలు చెప్పును (5. వ). ఇక్కడ పేర్కొనబడిన రక్షణ అన్ని రకాల ఇబ్బందులు, శోధనలు, చిక్కులు, ప్రతి బలహీనత, చిరాకు మరియు దురాశనుండి అనుదినము విడిపించబడుతూ, అనుదిన రక్షణ అయ్యుంది. మనకు అనుదిన రక్షణ అవసరము. ప్రభువు చేత ప్రతి దినము మనము రక్షింపబడాలి. ఈ రక్షణ మొదటిగా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, ఆ తరువాత పరిశుద్ధాత్మ నూతన పరచుట ద్వారాను అయ్యుంది.

పరిశుద్ధాత్మ లోపల మనలను కడుగునప్పుడు అది నూతనత్వమును తీసుకువచ్చును. ప్రతి క్రైస్తవునికి వేకువ జాముననే ఇది మొదటి పాఠము అయ్యుంది. నాయంతట నేను ఈ మార్గమును సాధకము చేస్తున్నాను. ఉదయము నేను లేచినప్పుడు, దేవునితో మాట్లాడుటకు నా నోటిని నేను తెరువక మునుపు ఏ వ్యక్తితోనైనా మాట్లాడుటకు నా నోటిని నేను తెరువను. ‘‘ఓ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను! ప్రభువైన యేసూ, నేను నీ యొద్దకు వస్తున్నాను!’’ అని నేను చెప్పుదును. ప్రతి ఉదయము నేను చేయునదంతయు రెండు విషయములే: ప్రభువు నామమును పిలుచుట మరియు ఆయన వాక్యమును ప్రార్థన-పఠనము చేయుట. ఈ రెండు విషయములు క్రైస్తువునికి వేకువ సాధకములు. మీయంతట మీరు ఈ రెండు విషయములలో ప్రతి ఉదయము సాధకము చేస్తే, మీరు తప్పక ఉజ్జీవింపబడతారు. ప్రకాశతతో కూడిన ఉదయించు సూర్యునిగా, రోజు మొత్తం మరింత కాంతివంతముగా ప్రకాశించు అరుణోదయ వెలుగుగా మీరు అగుదురు.

క్రైస్తవులమైన మనము లోకములోనున్న ప్రజల నుండి భిన్నమైన వారమని మీకు చూపుటకే నేను ఇవన్నీ చెప్పి యున్నాను. లోకస్థులు మహా అయితే ఉదయమున ధ్యానించెదరు లేదా ఆలోచించెదరు. అయితే మనము చేయుచున్నది ధ్యానం కాదు. మనము ప్రభువు నామమును పిలుస్తున్నాము మరియు ఆయన వాక్యమును ప్రార్థన-పఠనము చేస్తున్నాము. ఇది మనల్ని ప్రభువుతో నింపును మరియు లోపల నుండి మనల్ని తాజాపరచును. అదే సమయములో, మనము ప్రభువును పిలుచునప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చును, ఎందుకంటే నేడు ప్రభువైన యేసే పరిశుద్ధాత్మ గనుక. ప్రతి ఉదయము మనము ప్రభువు నామమును పిలుచునప్పుడు, ప్రభువైన యేసు వచ్చెనని లోపల మనకు లోతైన గ్రహింపు ఉంది. మనము నిజంగా ఆయనను కనుగొన్నాము. అంతములో మన వ్యక్తిత్వము మొత్తము మార్చబడును. ఉజ్జీవింపబడుట అంటే అర్థం ఇదే.

ఈ ఉజ్జీవము అనుదినము మనము స్నానము చేయడం వలె ఉంది; ఒకడు దానిని జీవితమంతటికి ఒక్కసారే చేయడు. అనుదినము మనము స్నానము చేయాలి. ప్రకృతి ధర్మము ప్రకారము, ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సూర్యుడు ఉదయించును. సూర్యునితో మనము కదులుతున్నప్పుడు, ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మనము కూడ లేవాలి. అంతేకాకుండా, సూర్యుడు దాని సామర్థ్యము కొలదీ ప్రకాశిస్తునట్టు మనము కూడ కాంతివంతముగా ఉండాలి. ఆత్మీయంగా మనము ఈలాగు ఉంటే, ప్రతిదినము మనము తప్పక నూతన పరచబడిన జీవితమును తప్పక జీవించుదుము. పౌలు మాటల్లో, మన ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడును    (2 కొరి. 4:16). ఆంతర్య పురుషుడు లోపల పునర్జన్మింపబడిన మన ఆత్మను సూచించును. ఆంతర్య భాగములన్నిటితో కూడిన ఈ ఆత్మ, పునరుత్థాన జీవము యొక్క సరఫరా ద్వారా వచ్చు అనుదిన జీవక్రియాత్మక ప్రక్రియ చేత నూతనపరచబడును. (CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” pp. 521-523)

వెలిగింపును పొందుకొనుట మరియు సంఘ కూటము కొరకు ప్రవచనమును సిద్ధపరచుకొనుట

వేకువ ఉజ్జీవము కొరకై వాక్యభాగమును ఉపయోగించుటకు ఇటీవల సంవత్సరాలల్లో మనకు మార్గము దొరికినది. ప్రార్థన-పఠనము మరియు వేకువ ఉజ్జీవము కొరకైన పరిశుద్ధ వాక్యము లోనున్న భాగములను చదువుట అనే అభ్యాసము అనేకమంది పరిశుద్ధులకు గొప్ప సహాయముగా ఉంది. వారు వేకువ ఉజ్జీవము కొరకైన పరిశుద్ధ వాక్యమును ఉపయోగించుట ప్రారంభించెను గనుక, వారి ఆత్మలు కదిలింపబడెను, వారి తలంపులు ప్రేరేపింపబడెను మరియు ఇప్పుడు తినుటకు, జీర్ణించుకొనుటకు, వివరించుటకు మరియు ప్రార్థన-పఠనము చేయుటకు కొంత సామాగ్రితో, మాట్లాడుటకు వారికి అంశము ఉంది.

బైబిల్‌ను చదవడంలో అత్యంత సహాయకరమైన విధానము భావానువాదము చెప్పుటే. కీర్తన 119:105 ఈలాగు చెప్పును, ‘‘నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.’’ మరియు అదే కీర్తనకు చెందిన 130 వచనము ఈలాగు చెప్పును, ‘‘నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును.’’ వాక్యములోనికి ప్రవేశించుటకు మరియు దాని ప్రకాశతకు సంబంధించి వెలుగును పొందుకొనుటకున్న ఉత్తమమైన మార్గము వాక్యమునకు భావానువాదము చెప్పుటే. ఇది బైబిల్‌ను అర్థం చేసుకొనుటకు, వెలుగును పొందుకొనుటకు మరియు ప్రవచించుటకు మనకు సహాయపడును.

పాత నిబంధనలో వాక్యమును ధ్యానించుట అనేది అనేకసార్లు పేర్కొనబడెను, అయితే క్రొత్త నిబంధనలో పాత నిబంధనల విధానములో లేఖనములను ధ్యానించుటకు సంబంధించిన రిఫరెన్సు ఏదియు లేదు. నేడు బాహ్యంగా మన చేతులలో బైబిల్ ఉండడం మాత్రమే కాక మనలోపల అంతర్వసించు ఆత్మ కూడ ఉన్నాడు. వాక్యమును ప్రార్థన-పఠనము చేసినప్పుడు, మన ఆత్మను మనము సాధకము చేస్తాము మరియు మన ప్రార్థన-పఠనము చేత అంతర్వసించు ఆత్మ కలిదింపబడును. ‘‘ఆదియందు. ఓ ప్రభువా, ఆందియందు వాక్యము ఉండెను. ఆమేన్. వాక్యము. హల్లెలూయూ, వాక్యము!’’ అని మనము చెప్పినప్పుడు, ఇది మన ఆత్మను కదిలించును. అప్పుడు అంతర్వసించు ఆత్మ మనలోపల గంతువేయును, మరియు ప్రేరేపణలు వచ్చును.

మనము పొందుకున్న అనుప్రేరణలను వ్రాసుకోవడానికి ఒక చిన్న పుస్తకమును పెట్టుకొనుట ఎల్లప్పుడు మంచిది. ఎక్కువగా వ్రాయుటకు సమయము లేనప్పుడు జ్ఞాపకము చేయునదిగా ఉపయోగించుటకు ఒకే ఒక్క ప్రాముఖ్యమైన మాటను వ్రాస్తూ, ప్రేరణను పొందుకున్న తరువాత వెంటనే మనము దానిని వ్రాయాలి. దాని తరువాత, ప్రవచించుటకు మనము అభ్యాసము చేయుటకు, మనము పొందుకున్న ప్రేరణ నుండి మూడు నిమిషాలకు మించకుండా ప్రవచనను కూర్చుకొనుట మంచిది. మన ప్రవచనము మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉంటే, మనము దానిని తగ్గించవచ్చు. అది చాల తక్కువ ఉంటే, మనము దేనైనా చేర్చగలము. అభ్యసించుటకు మరియు నేర్చుకొనుటకు మనము ఇతర పరిశుద్ధులతో కలిసి కూడ చేయవచ్చును.

ప్రవచించుటకు మనము వ్రాసుకునే సందేశములను ప్రార్థించుట చేత మనము అభ్యాసము చేయవలెను కూడా. ప్రవచించుటకు మనము సందేశమును వ్రాసుకున్న తరువాత, మనము వ్రాసిన దానిని మనము ప్రార్థన-పఠనము చేయాలి. దీనిని చేయడం వల్ల, అది మనలోనికి సంఘటితపరచబడును. అప్పుడు మనము కూటముకు వెళ్ళి ప్రవచించాలి. అట్టి ప్రవచనము చాల మంచిగా ఉండుననే నిశ్చయత నాకు ఉంది.

ఆఖరిగా, లోపల ఆత్మ నింపుదల కొరకు మరియు మనల్ని ప్రభావితము చేసేదిగా ఉండుటకు పైనుండి శక్తిగా మనపై ఆత్మ కుమ్మరింపబడుటను మనమందరము వెదకాలి (అపొ. 6:10; 7:55; 4:31). దీని కొరకు మనము ప్రార్థించాలి. మనము కూటములలో ఉంటుండగా కూడ, ఒక వైపున మనము ఇతరులు చెప్పేది వింటున్నాము మరియు మరో వైపున మనంతట మనము ఆత్మతో నింపబడుటకు మరియు మన శక్తిగా మరియు అధికారముగా ఉండుటకు మనపై ఆత్మ కుమ్మరింపబడుటకు మనము ప్రార్థించాలి.  (CWWL, 1991-1992, vol. 2, “The Practice of the Church Life according to the God-ordained Way,” pp. 603-606)

References: CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” ch.4; CWWL, 1991-1992, vol. 2, “The Practice of the Church Life according to the God- ordained Way,ch.9; A Time with the Lord; Pray- reading the Word

 

ప్రభువా, నీ సన్నిధి నే కోరితిన్

ఆశలు—ప్రభుని సన్నిధిలో జీవించుట కొరకు                              

389

1   ప్రభువా, నీ సన్నిధి నే కోరితిన్

రోజంతా నీవే నాలోకమవ్వాలి

నిన్ను తప్ప ఇంకేమి ప్రేమించినా

తృప్తిని విశ్రాంతిన్ నాకియ్యకుమా

రోజంతటిలో శ్రమ బాధలలో

ఓదార్పు నిచ్చేవారు లేనప్పుడు

నిట్టూర్పులతో నిండియున్నప్పుడు

ప్రభువా నా కన్నీరు తుడువుమా

 

2   మంచి జీవితముకై నేతలంచగా

అందున నీవే యుండాలి ప్రభువా

నా ఇష్టాన్ని అనుమతించకుమా

నీవులేని ఆనందం నాకియ్యకు

నిశ్శబ్ధ రాత్రిలో నే పరుండగా

నా చెంతన నీవుండాలని కోరితిన్

ప్రతి ఉదయం మేల్కొనక ముందే

మెల్లని స్వరంతో నన్ను పిల్వుమా

 

3   ప్రభూ నీ వాక్యం ధ్యానించే వేళల్లో

ప్రకాశమిమ్ము ప్రతి వరుసపై

అప్పుడు గ్రహింతున్ నా రక్షకుని

నాకై ఇచ్చిన రాజ్య భాగ్యాన్ని

నిస్సహాయతలోనే మోకరిల్లి

ప్రార్థించగ కృపననుగ్రహించుమా

నా పాపములన్ బట్టి నీ ముఖము

దాచకు, నీ సన్నిధి తీయకు

 

4   పరలోక దీవెనల్ తలంచగ

ఎత్తబడే ఆకాంక్ష నివ్వు

నీ రాకడే నాకున్న నిరీక్షణ

నీ సన్నిధే నాకానందం ప్రభూ

నీ సన్నిధిన్ నివసింప నేర్పుమా

రోజంతా నీవే నా లోకమవ్వాలి

నిన్ను తప్ప ఇంకేమి ప్రేమించినా

తృప్తిని విశ్రాంతిన్ నాకియ్యకుమా!

 

 

 

 

 

Jump to section