Jump to section

ఐదవ పాఠము – దైవిక మరియు నిత్య జీవము

1 యోహాను 1:2—ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచు చున్నాము.

రోమా. 8:2—క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను.

నిత్యజీవము

నిత్యజీవము అనునది కాలమును బట్టి నిత్యమైనది మాత్రమే గాక నాణ్యతలో కూడా నిత్యమైయున్నది. తన మండలమునకు సంబంధించిన విషయములో కూడా ఈ జీవము నిత్యమైనదిగా ఉన్నది. కావున, నిత్యము అను పదము మూడు విషయములను తెలియజేయుచున్నది: సమయమును, స్థలమును, మరియు నాణ్యత. సమయమునకు సంబంధించిన విషయములో, ఈ జీవము ఎప్పటికీ ఉండును. స్థలము, మండలమునకు సంబంధించి, ఈ జీవము విశాలమైనది, అపరిమితమైనది. నాణ్యతకు సంబంధించి, ఎటువంటి లోపము లేదా కొరత లేకుండా నిత్యజీవము అనునది పరిపూర్ణమైనది మరియు సంపూర్ణమైనది. నిత్యజీవము యొక్క మండలము లేదా విస్తృతి అనునది విశ్వమంతటిని ఆవరించియున్నది. నిత్యజీవము అనునది జీవము అంతటినీ కప్పివేయగలిగినంత విశాలమైనది. జీవమునకు సంబంధించిన ఏదైనను ఈ నిత్యజీవముచే ఆవరించబడును. ఏదేమైనప్పటికి, మన మానవ జీవనము అనునది, చాలా భిన్నమైనది. మన జీవము అనునది తాత్కాలికమైనది మాత్రమే గాక, పరిమితమైనది కూడా. కానీ నిత్యజీవమనునది తాత్కాలికమైనది కాదు లేదా పరిమితమైనది కాదు; దానికి బదులుగా, సమయమునకు సంబంధించి ఇది ఎప్పుడు నిలచియుండేది మరియు స్థలమునకు సంబంధించి ఇది అపరిమితమైనది. ఇంకా చెప్పాలంటే, మన జీవము అనేక లోపాలను మరియు కొరతలను కలిగియున్నది. ఏదేమైనప్పటికి, దైవికజీవము, నిత్యజీవము అనునది ఎటువంటి లోపాలను గాని లేదా కొరతలను గాని కలిగిలేదు.

నాశనం చేయబడలేని

నిత్యజీవము అనునది నాశనము లేని జీవమైయున్నది (హెబ్రి. 7:16). ఈ జీవమును ఏదియు కూడా నాశనము చేయలేదు లేదా రద్దు చేయలేదు. నిత్యమైనదిగా, దైవికమైనదిగా, సృష్టించబడని జీవముగా మరియు పునరుత్థాన జీవముగా, మరణము మరియు పాతాళము యొక్క పరీక్ష నుండి వెళ్ళినదిగా ఇది అంతులేని జీవమైయున్నది. సిలువవేయుట ద్వారా సాతాను మరియు అతని అనుచరులు ఈ జీవమును నాశనము చేసెనని తలంచిరి… ఏదేమైనప్పటికి, సిలువ మరణము అనునది విస్తరించబడుటకు, వ్యాప్తి చెందుటకు ఈ జీవమునకు మంచి అవకాశమును కలుగజేసెను. ఈ జీవము అనంతమైనది గనుక, ఇది ఎన్నటికీ కూడ స్వాధీనపరచబడదు, అణచివేయబడదు, లేదా నాశనము చేయబడదు.

ఈ జీవములో పాలొందుటకు మరియు ఆస్వాదించుటకు ఎవరినైతే తండ్రి ఎన్నుకున్నాడో ఎవరినుండైతే మరియు ఎవరి ద్వారానైతే కుమారుడు నిత్యజీవము యొక్క వ్యక్తతగా వ్యక్తపరచబడెనో అట్టి నిత్యజీవమునకు తండ్రి మూలముగా ఉన్నాడు.

నిత్యజీవము యొక్క ఇట్టి వివిధ పార్శ్వములను పరిశీలించుటకు బదులుగా, వాటిని మనము మన ఆత్మీయ భోజనము యొక్క ‘‘రుచులుగా’’ ఆస్వాదించవలెను. నిత్యజీవము అనునది దేవుని జీవమైయున్నది, అది దేవుని కుమారుడై ఉండెను, మరియు అది నిత్యత్వము నందు తండ్రితో ఉండెను.

దైవిక జీవము మానవుని త్రిభాగములలోనికి వితరణించుట

దైవిక జీవము మానవుని త్రిభాగములలోనికి వితరణించబడెనని రోమా 8 ప్రత్యక్షపరచుచున్నది. 2వ వచనము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము గూర్చి మాట్లాడుచున్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమై యున్నది 6వ వచనము చెబుచున్నది. క్రీస్తు మనలోనున్న యెడల మన శరీరము పాపవిషయమై మృతమైనది గాని, మన ఆత్మ నీతివిషయమై జీవము కలిగి యున్నది అని 10వ వచనము చెబుచున్నది. తరువాత మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మనలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మన శరీరములకు కూడ మనలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవము నిచ్చును అని 11వ వచనము చెబుచున్నది. కావున, 2వ వచనము దైవిక జీవమును గూర్చి మాట్లాడుచున్నది, మన ఆత్మ జీవమైయున్నదని 10వ వచనము చెబుచున్నది, మన మనస్సు జీవము కాగలదు అని 6వ వచనము చెబుచున్నది, మన శరీరము కూడా జీవమును పొందుకొనును అని 11వ వచనము చెబుచున్నది. 8వ వచనము దేవుని గూర్చి మాట్లాడును, 9వ వచనము దేవుని ఆత్మను గూర్చి మరియు క్రీస్తు ఆత్మను గూర్చి మాట్లాడుచున్నది, మరియు 10వ వచనము క్రీస్తును గూర్చి మాట్లాడుచుండును. …త్రియేక దేవుడు మానవుని మూడు భాగములలోనికి వితరణించబడునని ఈ వచనములు తెలుపుచున్నవి.

జీవపు ఆత్మ

రోమా 8:2 జీవపు ఆత్మను గూర్చి మాట్లాడుచున్నది. జీవపు ఆత్మ అనునది ఒక సమానార్థమునిచ్చే పదబంధమై యున్నది, వాస్తవానికి ఆత్మయే జీవము అనే అర్థము నిచ్చును. బైబిలులో ఇటువంటి పదబంధములు అనేకము కలవు. దేవుని ఆత్మ అనగా ఆత్మయే దేవుడు  అని అర్థము; దేవుని జీవము అనగా జీవమే దేవుడు అని అర్థము; క్రీస్తు ఆత్మ అనగా ఆత్మయే క్రీస్తు అని అర్థము; మరియు దేవుని ప్రేమ అనగా ప్రేమయే దేవుడు అని అర్థము.

ఇది విద్యుచ్ఛక్తి యొక్క ప్రవాహము వంటిది. వాస్తవానికి, ప్రవాహమనగా విద్యుచ్ఛక్తియే. ఇది విద్యుచ్ఛక్తి ప్రవాహమునకు వేరుగానున్న మరొకటి కాదు; ఇది ప్రవాహములోనున్న విద్యుచ్ఛక్తియే. ఎప్పుడైతే విద్యుచ్ఛక్తి ప్రవహించునో, అది ప్రవాహములో ఉండునో, అదియే విద్యుచ్ఛక్తి యొక్క ప్రవాహమైయున్నది. విద్యుచ్ఛక్తి యొక్క ప్రవాహమును జీవపు ఆత్మతో పోల్చవచ్చును. జీవపు ఆత్మ అనగా ఆత్మయే జీవము అని అర్థము. ఆత్మ అనగా ప్రవాహములో నున్న జీవము, అనగా ప్రవాహములోనున్న త్రియేక దేవుడు.

మన ఆత్మలోనికి వితరణించబడుట

అటువంటి దైవికజీవము మొదటిగా మన ఆత్మలోనికి వితరణించబడెను. క్రీస్తు మనలో ఉండెను గనుక, మన ఆత్మ జీవమైయున్నదని రోమా 8:10 చెబుచున్నది. ఇది ఎందువలన అనగా క్రీస్తే స్వయానా ఇటువంటి జీవమైయున్నాడు, మరియు ఇట్టి జీవము నేడు మన ఆత్మలో ఉన్నది. కాబట్టి, మన ఆత్మయే జీవము. ఇది చాలా బలమైన విషయము. క్రీస్తు మనలో ఉన్నందున, మనలో జీవము ఉన్నది అని 10వ వచనము చెప్పుట లేదు. దానికి బదులుగా, మన ఆత్మయే జీవము అని అది చెప్పుచున్నది. నేడు మన పునర్జన్మించబడిన ఆత్మయే జీవముగా ఉన్నది.

మన మనస్సులోనికి వితరణించబడుట

ఆత్మానుసారమైన మనస్సు జీవమైయున్నదని రోమీయులు 8:6 చెబుచున్నది. మన ఆత్మ జీవముగా ఉండుట మాత్రమే కాదు; మన మనస్సు కూడా జీవమై యుండును. కానీ ఈ మనస్సును ఆత్మపై పెట్టవలెను. ఆత్మ యొక్క మనస్సు అగునట్లుగా ఈ మనస్సు ఆత్మలో మునుగవలెను, పూర్ణముగా నింపబడవలెను, మరియు పోయబడవలెను. తుదకు, ఆత్మ అనునది మన మనస్సు యొక్క ఆత్మగా మారును. ఇది ఎఫెసీయులకు 4:23లో పేర్కొనబడెను. మన మనస్సును ఆత్మపై పెట్టినందున, మన ఆత్మ మన మనస్సును పూర్ణముగా నింపును మరియు మన మనస్సును ఆత్మ యొక్క మనస్సుగా చేయును. తుదకు, మన ఆత్మ మన మనస్సు యొక్క ఆత్మగా మారును. …ఈ ఆత్మ మిళితాత్మగా ఉండును. ఇది మన ఆత్మ జీవము-నిచ్చు ఆత్మగానున్న క్రీస్తుతో మిళనమైనదిగా ఉండుట.

మన మనస్సు మన ఆత్మతో ఒక్కటై యున్నందున, మన ఆత్మతో కలుపబడి, జతచేయబడి, పూర్తిగా ఆక్రమించబడి, మరియు నింపబడినందున, మన మనస్సు కూడా జీవమై యుండును. అటువంటి మనస్సు ఇతరులకు జీవమును పరిచర్య చేయునట్లు పనిచేయును. మన స్వాభావికమైన మనస్సుతో మనము ఇతరులకు జీవమును సరఫరా చేయలేము. ఇట్టి మనస్సు జీవము కాదు. కానీ ఎప్పుడైతే మన మనస్సు మన ఆత్మతో కలుస్తుందో మరియు మన ఆత్మతో పూర్ణముగా నింపబడుతుందో అప్పుడది జీవమైయుండును, అనగా మన మనస్సు ఆ సమయములో జీవమైయుండును.

మన శరీరములోనికి వితరణించబడుట

మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ చావునకు లోనైన, అనగా చనిపోవుచున్న  మన  శరీరములకు మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవము ఇచ్చునని రోమా 8:11 చెబుచున్నది.  ఈ వచనములో చెప్పబడిన చావునకు  అనే పదము మరణము అనే ఆలోచనను మాత్రమే గాక బలహీనతను కూడా చూపుచున్నది. మర్త్య శరీరము అనగా ఒక బలహీనమైన శరీరము, చావునకు లోనైన శరీరము కూడ. పతనమైన మన శరీరమును మరణముకు చెందిన శరీరము అని కూడ రోమా 7 చెబుచున్నది. అటువంటి బలహీనమైన, చనిపోవుచున్న, మర్త్య శరీరమునకు, అనగా మరణపు శరీరమునకు కూడ జీవము ఇవ్వబడును.

ఇప్పటివరకు, రోమా 8:2లో పేర్కొనబడిన దైవికజీవము అనునది మన ఆత్మలోనికి ప్రవేశపెట్టబడెను, లేదా వితరణించబడెను అని 10వ వచనములో మరియు మన మనస్సులోనికి వ్యాపించును అని 6వ వచనములో మనము చూచితిమి. దాని తరువాత 11వ వచనములో అది మన మర్త్య శరీరములోనికి వితరణించబడును. కావున, దైవికజీవము అనునది మన వ్యక్తిత్వములోని మూడు భాగములలోనికి వితరణించబడును. (CWWL, 1979, vol. 1, “Basic Lessons on Life,” pp. 559-561, 563-564)

References: Life-study of 1 John, msg. 4; CWWL, 1979, vol. 1, “Basic Lessons on Life,” ch. 13

 

నాదు ఆత్మలో నుండి జీవ బుగ్గయై

క్రీస్తుని గూర్చిన అనుభవము—జీవముగా

 1191

1    నాదు ఆత్మలో నుండి జీవ బుగ్గయై

త్రిత్వదైవం ప్రవహించున్;

తండ్రియే మూలము,

సుతుడే మాధ్యమం

 

ఆత్మయే జీవమిచ్చును

మధురమే ఈ ప్రవాహము

ప్రాణ-జీవమున్ కోల్పోదును;

జీవకీరీటం నే పొందను

ప్రభూ, నా లోతును పెంచుము

 

2    పచ్చికపైరుపై పరుండజేయును

శాంతి జలమునొద్దకు

నడిపించున్ నన్ను,స్వీయ-శ్రమ వ్యర్ధం

ప్రవాహంలో ధన్యనైతి

 

3   యేసు నన్ను పిల్చెన్, అతిపరిశుద్ద

స్థలమునకు తనతో

హల్లెలూయ, వింటిన్,‘‘ద్రాక్షవల్లిలోన

తీగెవై నిల్వుము”నంచు

Jump to section