Jump to section

ఆరవ పాఠము – త్రియేక దేవుడు జీవముగా త్రిభాగీయ మానవుని సంపూర్ణముగా నింపుటకు

1 థెస్స. 5:23—సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.

కొలొ. 1:13—ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము లోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేసెను.

త్రియేక దేవుడు సృష్టించబడని, నిత్యమైన జీవముగా ఉండుట

మొదటి చిత్రము, అనగా చిత్రము 1,…నిత్యజీవమును సూచించుచున్నది….దైవిక జీవము  త్రియేక దేవుడే, మరియు ఈ జీవము దానంతట అదే ఉనికిలో ఉండేది, సృష్టించబడనిది, మరియు ఆది అంతము లేనటువంటి పరిమితిలేని జీవమైయున్నది.

మానవుడు దేవుని కొరకు సృష్టించబడిన పాత్ర

త్రియేక దేవుడు మానవుని సృష్టించెనని 2వ చిత్రము సూచించుచున్నది. దేవుడు తనను తాను మానవుని ద్వారా వ్యక్తపరచుకోవాలనే ఆశను కలిగియుండుట ద్వారా దేవుడు మానవుని సృష్టించెను….ఈ మానవుడు సృష్టించబడిన, ఆది అంతమును గల పరిమితమైన జీవమును కలిగియున్న మొదటి ఆదాము (1 కొరి. 15:45). ఈ జీవము, అది సృష్టించబడినప్పుడు, మంచిగాను, స్వచ్చమైనదిగాను, పాపరహితముగాను ఉండెను.

దేవుని కలిగియుండుటకు దేవునిచే సృష్టించబడిన మానవుడు ముడు భాగములను ఆత్మ, ప్రాణము, మరియు శరీరమును  (1 థెస్స. 5:23) కలిగియుండెనని 2వ చిత్రము చూపుచున్నది. ఆత్మ అనునది ఆత్మగానున్న దేవుని తాకుటకు మరియు కలిగియుండుటకు ఉండే ఆంతరిక విషయమై యున్నది, మరియు దేహము అనునది భౌతికమైన లోకమును తాకుటకు ఉండే ఆకారమైయున్నది. లోపల ఉండే ఆత్మకు మరియు బాహ్యపరమైన శరీరమునకు మానవుని యొక్క వ్యక్తిత్వముగానున్న ప్రాణము మాధ్యమంగా ఉన్నది. ఈ త్రిభాగీయ మానవుతో ఏ పాపము లేదు.

3వ చిత్రమునకు కొంత వివరణ అవసరమైయున్నది… ప్రతిభాగము నల్లగా మారెను; ఇదే ఆదాము యొక్క పతనము. దేవుని కలిగియుండుటకు మానవుడు పాత్రగా చేయబడెను, కానీ దేవుడు అతనిలోనికి రాకమునుపు, మరేదో లోనికి వచ్చెను. అదే సాతాను, అనగా దేవుని శత్రువు, వ్యక్తిత్వము ఆరోపించబడిన పాపమైయున్నది.

 

నరావతారుడైన, సిలువ మరణము నొందిన, మరియు పునరుత్థానుడైన దైవ-మానవుడు మన జీవముగా మారుట

పతనము ద్వారా చెడిపోయిన, మొదటి ఆదాము మొదటి మానవుడై యున్నాడు. రెండవ మానవుడు కడపటి ఆదాము, అనగా క్రీస్తు (1 కొరి. 15:45). క్రీస్తు ఎటువంటి మానవుడు? క్రీస్తు దైవ-మానవుడు, ఒక నిజమైన మానవుడు, అయినప్పటికీ నరావతారుడైన దేవుడు.

ఈ దైవమానవుడు, ఆయన సిలువపై మరణించు సమయములో, పాపమును మోయువానిగా మారెను….క్రీస్తు సిలువ మరణము తరువాత ఆయన పునరుత్థానము నొందెను, మరియు పునరుత్థానములో ఆయన ఎల్లపుడూ జీవించుచుండెను…. పునరుత్థానములో దైవిక స్వభావముతో ఆయన తన వ్యక్తిత్వమునంతా రూపాంతరపరచెను.

ఇట్టి నరావతారుడైన, సిలువమరణము నొందిన, మరియు పునరుత్థానుడైనవానిలో, జీవము ఉండెను,…మరియు ఈ జీవము మరేదోకాదుగాని స్వయానా క్రీస్తే (కొలొ. 3:4). ‘‘దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది’’ అని మొదటి యోహాను 5:11 చెబుచున్నది. ఈ కుమారుడు మనకు జీవమైయున్న నరావతారుడైన, సిలువమరణము నొందిన, మరియు పునరుత్థానుడైన, దైవ-మానవుడై ఉన్నాడు.

సిలువ ద్వారా బదిలీ

4వ చిత్రము అనునది సులువైనది కాదు. ఇక్కడ రెండు మండలములు, ఒకవైపున ఆదాము యొక్క మండలము, మరియు మరొకవైపున క్రీస్తు యొక్క మండలము కలవు. ఆదాము యొక్క మండలములో పాపము మరియు మరణము తప్ప మరేమియు లేవు, కానీ క్రీస్తు యొక్క మండలములో నిత్యజీవము కలదు. ఈ రెండు మండలముల మధ్య సిలువ కలదు. ఒకవేళ ఒకడు సిలువకు ఎడమవైపున ఉన్నట్లయితే, అతడు పాపపు మరియు మరణపు మండలములో ఉండును; అతడు సిలువ నుండి పయనించినట్లయితే , అతడు జీవపు మండలములో ఉండును.

 

 

మన మానవ ఆత్మలో పునర్జన్మించబడుట

మనము ఇప్పుడు మన మానవ ఆత్మలో పునర్జన్మించబడితిమి (5వ చిత్రము). మనము ప్రభువైన యేసును మన రక్షకుడిగా అంగీకరించిన సమయములోనే, ఆయన ఆత్మగా మన ఆత్మలోనికి వచ్చెను మరియు మనకు జీవమును ఇచ్చును. ‘‘దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేని వాడే’’ అని మొదటి యోహాను 5:11 చెబుచున్నది. ప్రభువుకు వందనాలు, కుమారుడే జీవము కాబట్టి, మనము కుమారుని కలిగియునట్లయితే, జీవమును కలిగియుందుము! అయినప్పటికి, మన పునర్జన్మ సమయమున మనము జీవమును కొద్ది పరిమాణములోనే పొందుకొంటిమి. మనము దైవిక జీవమును మన వ్యక్తిత్వములోని ఒక పరిమితి భాగములోనికే పొందుకొంటిమి.

చీకటిలోనుండి మహిమలోనికి రూపాంతరించబడుట

మనము పునర్జన్మించబడిన తరువాత, మనము చీకటి నుండి మహిమలోనికి రూపాంతరించబడవలెను (6వ చిత్రము). దీనికి గాను, దైవికజీవము మన వ్యక్తిత్వమంతయు వ్యాప్తి చెందు లాగున స్వేచ్చా మార్గమును ఇవ్వవలెను. అధికముగా దైవిక జీవము వ్యాప్తిచెందే కొలదీ, అంతే అధికముగా మనము మహిమ నుండి అధిక మహిమలోనికి రూపాంతరించబడెదము (2 కొరి. 3:18).

రోమా 8:11లో పేర్కొనబడినట్లుగా, కొన్నిసార్లు మనము మన భౌతికమైన బలహీనతను దైవికజీవమును గ్రహించుట ద్వారా అధిగమించెదము. అప్పుడు ప్రభువు తిరిగివచ్చినప్పుడు, మహిమా శరీరముగా ఉండునట్లు మన దేహమంతయు పాత సృష్టి నుండి నూతన సృష్టిలోనికి స్వరూపాంతరము, రూపాంతరీకరణము చెందును. ఆ సమయములో మనము ఆయన వలె ఉందుము (7వ చిత్రము). మనము అచ్ఛము నరావతారము, సిలువ మరణము, మరియు పునరుత్థానము నొందిన క్రీస్తువలె ఉండెదము (1 యోహాను 3: 1-2). మన వ్యక్తిత్వములోని ప్రతి భాగము ఆత్మ, ప్రాణము, మరియు దేహము దైవికజీవముతో నింపబడును, పూర్ణముగా నింపబడును, లోపల అంతటా వ్యాపించబడును, మరియు మిళనము చెందును. ఇదే దేవుని కుమారులు వ్యక్తత, ప్రత్యక్షతగా ఉన్నది (రోమా 8:19). మనము సంపూర్ణముగా, పరిపూర్ణముగా ఆత్మ, ప్రాణము మరియు శరీరములో ప్రభువైన క్రీస్తువలె ఉండెదము. ఇది ఎంతో  అద్భుతము!

 

 

 

మనము ఎక్కడ ఉన్నామో, మనము ఏమైయున్నామో, మరియు మనకు ఏమి అవసరమైయున్నదో తెలుసుకొనులాగున ఆత్మ మనలను ఆకట్టుకొనును గాక. (CWWL, 1963, vol. 3, “Basic Principles of the Experience of Life,” pp. 151, 154-159)

References: CWWL, 1963, vol. 3, “Basic Principles of the Experience of Life,” ch. 17; CWWL, 1994-1997, vol. 1, “The High Peak of the Vision and the Reality of the Body of Christ,” msgs. 1, 2

 

అద్భుతమే! ఈ మర్మము!

అంతిమ ప్రత్యక్షత— దేవుని నిత్య సంకల్పము

151

1   అద్భుతమే! ఈ మర్మము

దేవుడును నరుడును

సమ్మేళనమగుటయే

గొప్ప దైవప్రణాళిక !

దేవుని దయాభీష్టము

తీరుటకై ఆ దేవుడే

నరావతారుడయ్యెను

నరుని దేవుని జేయన్

 

2   జీవస్వభావములలో

నే దేవుడనగునట్లు

ప్రధమ దైవ-నరుడు

సశరీరుడై ఏతెంచెన్

ఆయన లక్షణములు

నా సద్గుణములాయెను;

ఆయన మహిమా రూపం

నా ద్వారా ప్రకాశించును

 

3   జీవించుట నేకానికన్

దేవుడే నాలో జీవించున్

దేవునిలో శుద్ధులతో

కలిపి, కట్టబడియు

సార్వత్రిక గృహమైయు

సజీవ దేహమైయును

దేవునిని సమిష్టిగా

వ్యక్తపరతుమిలలో

 

4    యెరూషలేమ్,అంతిమము,

దర్శనముల సంపూర్తి;

త్రియేకుడైన దేవుడు

త్రిభాగీయ మానవుడు

నిత్యము ప్రేమ జోడియై

సహంతర్గతులైయుండి

పరస్పర నివాసమై

మహిమతో ప్రకాశించున్

Jump to section