Jump to section

నాల్గవ పాఠము – మానవ ఆత్మ

జెక. 12:1—ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో (జీవాత్మ) మానవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా…

మానవ ఆత్మ యొక్క సృష్టి

‘‘నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము’’ అని సామెతలు 20:27 చెబుచున్నది. సాధారనముగా చూచినట్లయితే, ఆత్మకు గల హెబ్రీపదము రూయాక్, కానీ ఇక్కడున్న హెబ్రీపదము నెషామ. నెషామ అను పదము ఆదికాండము 2:7లో జీవవాయువు అను పదమునకు కూడా వాడబడెను. సామెతలు 20:27లో అది ‘‘ఆత్మ’’ గా తర్జుమా చేయబడెను. దీనిని బట్టి మానవుని సృష్టించినప్పుడు దేవునిచే మానవునిలోనికి ఊదబడిన జీవవాయువు మానవుని ఆత్మ అని మనము చూడవచ్చును. మనలో ఉండే మానవ ఆత్మ అనునది దేవుని జీవమునకు మరియు దేవుని ఆత్మకు చాలా దగ్గరగా ఉండునది. మానవాత్మ అనునది దేవుని జీవమును మరియు దేవుని ఆత్మను పొందుకొనుటకు మరియు కలిగియుండుటకు సృష్టించబడెనని ఇది తెలుపుచున్నది. తుదకు, ‘‘అటువలె ప్రభువును కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉండునని’’ 1 కొరింథీయులు 6:17 చెబుచున్నది. దేవుని జీవమునకు మరియు దేవుని ఆత్మకు చాలా దగ్గరగానున్న జీవపు ఆత్మచే అది సృష్టించబడినందున మన ఆత్మ ప్రభువుతో ఒక్క ఆత్మగా కాగలదు.

మానవ ఆత్మ యొక్క ప్రాముఖ్యత

యోహోవా ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో మానవాత్మను పెట్టెనని జెకర్యా 12:1 చెబుచున్నది. ఆయన ఉద్దేశ్యమును నెరవేర్చుటకు దేవుని సృష్టిలో ఈ మూడు అంశములు ఆకాశమండలము, భూమి, మరియు మానవ ఆత్మ-ప్రాముఖ్యమైనవి అనేదానిని ఎవ్వరూ కాదనలేరు. ఆకాశములు భూమి కొరకు సృష్టించబడెను, భూమి మానవుని కొరకు సృష్టించబడెను, మరియు మానవుడు దేవుని కొరకు సృష్టించబడెను.

జెకర్యా ‘‘మానవుని’’ కాదుగానీ ‘‘మానవ ఆత్మ’’ ను గూర్చి ప్రస్తావించెను. దీనికి గల కారణము దేవుని జీవమును మరియు దేవుని ఆత్మను ఆస్వాదించుటకు దేవుణ్ణి లోపలికి తీసుకునేది మరియు దేవుని ఆత్మతో ఒక్కటిగా ఉండగల అవయువము మానవ ఆత్మయే. ఇందువలననే అది ఆకాశమండలము మరియు భూమితో సమానముగా లెక్కించు స్థాయికి మానవ ఆత్మ కీలకమైనదిగా మరియు ప్రాముఖ్యమైనదిగా మారెను.

మానవ ఆత్మ యొక్క మూడు భాగములు

మనస్సాక్షి

మనస్సాక్షి అనునది ఆత్మలోని భాగమని నేరుగా చూపు వచనమును లేదా వచనములను తీసుకొనుట అంత సులువు కాదు. మనము రోమా 9:3ను 8:16తో పోల్చవలెను. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది అని రోమా 9:1 చెప్పుచుండగా, ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు అని 8:16 చెబుచున్నది. మన మనస్సాక్షి అనునది మన ఆత్మలోని భాగమని ఈ రెండు వచనాలు గట్టిగా నిరూపించుచున్నాయి. 1 కొరింథీయులకు 5:3లో పాపము చేసినవాడిని పౌలు తన ఆత్మలో తీర్పుతీర్చెను. తీర్పుతీర్చుట అనగా పాపమును ఖండించుట, అది        ముఖ్యముగా మనస్సాక్షి పనియై ఉన్నది. ‘‘నాలో సరైన ఆత్మ’’ అను     దానిని గూర్చి కీర్తనలు 51:10 మాట్లాడుతుంది (KJV). ఇది సరైన ఆత్మ. తప్పు నుండి ఒప్పు తెలుసుకొనుట అనునది మనస్సాక్షికి సంబంధించినదై యున్నది, కాబట్టి మనస్సాక్షి అనునది ఆత్మలో ఉన్నదని ఈ వచనము చూపుచున్నది. మనస్సాక్షి అనునది ఆత్మలోని భాగమని చూపుటకు మనము ఉపయోగించ గల వేరు వచనములు కీర్తన 34:18 మరియు ద్వితీయోపదేశకాండము 2:30.

 

 

 

 

సహవాసము

మన మానవ ఆత్మకు గల మరొక భాగము, లేదా పని సహవాసమై యున్నది. ‘‘దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మలో ఆరాధించవలెను’’ అని యోహాను 4:24 చెబుచున్నది. ఈ ఆరాధన అనునది ఒక రకమైన సహవాసము, ఒక రకమైన సంప్రదింపై ఉన్నది. తాను దేవుణ్ణి తన ఆత్మలో సేవిస్తునట్లు రోమా 1:9లో పౌలు పేర్కొనెను. ఎల్లప్పుడు ఆత్మయందు ప్రార్థించుడి అని ఎఫెసీయులకు 6:18 చెబుచున్నది. ప్రార్థించుట అనగా దేవునితో సహవాసము చేయుట అని కూడా అర్థము. తన ఆత్మ దేవుని యందు ఆనందించెను, సంతోషించెను అని లూకా 1:47లో మరియ చెప్పెను. అది ఖచ్చితముగా ఒక రకమైన సహవాసమే. మన ఆత్మ దేవుని ఆత్మతో ఒక్కటైయున్నదని రోమా 8:16 మరియు 1 కొరింథీయులు 6:17 చూపుచున్నవి. అది ఖచ్చితముగా ఒక రకమైన సహవాసమే. మన ఆత్మలో సహవాసము అనునది ఉన్నదని చూచుటకు పైన పేర్కొనబడిన వచనములన్నిటిని ఉపయోగించవచ్చును.

అంతర్‌ జ్ఞానము

అంతర్‌ జ్ఞానము కూడ మానవ ఆత్మలోని ఒక భాగము. మానవుని విషయములు అతని మానవ ఆత్మకు తెలుసునని 2 కొరింథీయులకు 2:11 చెబుచున్నది. ప్రాణము తెలుసుకోలేని విషయములను ఆత్మ తెలుసుకొనగలదు. ఒక ప్రాణసంబంధమైన వ్యక్తి దేవుని విషయములను స్వీకరించలేడు గాని ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అంగీకరించునని 14 మరియు 15 వచనములు చెబుచున్నవి. కారణము లేదా పరిస్థితులతో సంబంధము లేకుండా మన ఆత్మలోని నేరైన స్పృహనే అంతర్‌ జ్ఞానమై ఉన్నది. అంతర్‌ జ్ఞానము అనునది దేవుని నుండి వచ్చే నేరైన స్పృహగా మరియు నేరైన జ్ఞానముగా ఉన్నది. మార్కు 2:8, 8:12 మరియు యోహాను 11:33 అంతర్‌ జ్ఞానము అనునది మన మానవ ఆత్మలోని భాగమని చూపే మరికొన్ని వచనములై ఉన్నవి. దేవుణ్ణి మరియు ఆత్మసంబంధమైన విషయములను తెలుసుకొనుటకు మన మానవ ఆత్మలో ఒక నేరైన స్పృహతో కూడిన వివేచన కలదని ఈ వచనములు చూపుచున్నవి. ఈ నేరైన స్పృహయే అంతర్‌ జ్ఞానము.

కావున, తప్పు నుండి ఒప్పును వివేచించుట మనస్సాక్షి యొక్క పని అని, సహవాసము అనునది దేవుని సంప్రదించునట్లు పనిచేయునని, మరియు దేవుణ్ణి మరియు దేవుని చిత్తమును, దేవుని ఉద్దేశమును తెలుసుకొనుట అంతర్‌ జ్ఞానము యొక్క పని అని మనము చూడవచ్చును.

[మానవ ఆత్మలోని భాగములను గూర్చి సమగ్రముగా అర్థము చేసుకొనుటకుగాను దేవుని ప్రణాళికలోని 6వ అధ్యాయమును చూడుము.]

మానవ ఆత్మ యొక్క పని

దేవుని సంప్రదించుటకు

మానవ ఆత్మ యొక్క పని దేవుని సంప్రదించుట అని యోహాను 4:24 చూపుచున్నది.

దేవుని పొందుకొనుట

దేవుడు మనకు నూతన హృదయమును మరియు నూతనమైన ఆత్మను ఇచ్చునని యెహెజ్కేలు 36:26  చెబుచున్నది. నూతన హృదయము అనునది ప్రభువును ప్రేమించుటకు మరియు దేవుని వెదకుట కొరకు కాగా, నూతన ఆత్మ అనునది దేవుని పొందుకొనుట కొరకై ఉన్నది.

దేవుని కలిగియుండుటకు

‘‘ప్రభువు మీ ఆత్మకు తోడైయుండును గాక’’ అని రెండవ తిమోతి 4:22 చెబుచున్నది. మన ఆత్మ దేవుడు మనలో నివసించు ప్రదేశమై ఉన్నది, కాబట్టి మన ఆత్మ దేవుని పాత్రగా ఉన్నది.

ప్రభువుతో ఏకాత్మగా ఉండుట కొరకు

మానవ ఆత్మ అనునది ఒక ఉద్దేశ్యము కొరకు సృష్టించబడెను. మానవుడు దేవునితో ఏకాత్మగా ఉండుట కొరకు దేవుడు మానవుణ్ణి ఇట్టి అవయువముతో సృష్టించెను.  ‘‘అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు’’ అని  మొదటి కొరింథీయులు 6:17 చెబుచున్నది. బైబిలు అంతటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన వచనమై యున్నది. దైవిక ఆత్మ మన మానవ ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నదని  రోమా 8:16 చెబుచున్నది. ఇప్పుడు ఈ రెండు ఆత్మలు ఒక్కటే.

ఆత్మచే మరియు ఆత్మ ప్రకారము నడచుట

ఆత్మచే నడువమని గలతీయులకు రాసిన పత్రిక 5:16 మరియు 25 వచనములు మనలను హెచ్చరించుచున్నవి, మరియు మనము ఆత్మానుసారము నడువవలెనని రోమా 8:4 చెబుచున్నది. ప్రభువు దినమందు తాను ఆత్మలో ఉన్నానని ప్రకటన గ్రంథము 1:10లో అపొస్తలుడైన యోహాను చెప్పెను. మనము ఆత్మలో జీవనమును కలిగియుండాలని ఇది చూపుచున్నది. యోహాను ఆత్మలో ఉన్న మనుష్యుడు. మనము ఆత్మలో జీవించాలని దీని అర్థము.

[మనమందరము] మానవ ఆత్మను గూర్చిన బలమైన అవగాహనను కలిగియుండాలి. ప్రభువు పునరుద్ధరణలోని అనేక బోధనలకు మానవ ఆత్మను గూర్చిన సత్యము అనునది ఒక ప్రాథమిక మూలకమైయున్నది. మానవ ఆత్మను గూర్చిన చాలినంత జ్ఞానములోనికి పరిశుద్ధులు తీసుకురాబడకపోతే, ఆత్మసంబంధమైన సమస్త విషయములను అర్థము చేసుకొనుటలో వారు కొంత బలహీనముగా ఉందురు. (CWWL, 1979, vol. 1, “Basic Lessons on Life,”  pp. 583-587)

References: CWWL, 1979, vol. 1, “Basic Lessons on Life,” ch. 16; CWWL, 1964, vol. 3, “The Economy of God,” ch. 6; CWWL, 1965, vol. 3, “Our Human Spirit,” chs. 1, 2

 

GOD’S GLORIOUS SUBSTANCE SPIRIT IS

Experience of God—By Exercising the Spirit

611

 

1   God’s glorious substance Spirit is,

His essence, holy and divine;

To contact God and Him enjoy,

His Spirit I must touch with mine.

 

2   The spirit is the innermost,

The part of man most deep and real;

If he would contact God in life,

’Tis with the spirit he must deal.

 

3   The worship which the Father seeks

Is in the spirit’s strength alone;

His Spirit into man’s would come,

That His and man’s may thus be one.

 

4   When Spirit unto spirit calls,

The two commingle and are one.

Man’s spirit is the Spirit’s home;

The Spirit doth man’s life become.

 

5   Man’s spirit must God’s Spirit touch

If in God’s fullness he would live;

’Tis only with the spirit thus

That he to God may worship give.

 

6   In ministry and fellowship

Man to the spirit we must bring;

All ministry should turn to prayer,

Spirit to spirit answering.

 

7   In spirit we must pray and serve,

In spirit touch the life divine,

In spirit grow, in spirit build,

That Christ through us may fully shine.

 

8   Lord, to the spirit I would turn

And learn to truly contact Thee;

Thy Spirit thus will f low with mine

And overflow eternally

 

Jump to section