మూడవ పాఠము – పరిణతి చెందిన ఆత్మ
యోహాను 7:39—తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి- యుండలేదు.
నూతన నిబంధనలో ఆత్మ యొక్క పరిణతి
నూతన నిబంధన ప్రారంభములో, క్రీస్తు గర్భమున పడి మరియు జన్మించునప్పుడు, పరిశుద్ధాత్మ మొదటిసారిగా పేర్కొనబడెను. యేసు గర్భములోపడుట మరియు జన్మించుట అన్నియు కూడా పరిశుద్ధాత్మ ద్వారా కలిగెను. ఇక్కడ పరిశుద్ధాత్ముడు గట్టిగా నొక్కి చెప్పబడెను. క్రీస్తు ఈ ఆత్మ ద్వారా గర్భమునపడెను, మరియు ఆయన ఈ ఆత్మ ద్వారానే జన్మించెను.
ప్రభువు ఈ భూమిపై ముప్పై సంవత్సరాలు జీవించెను; తరువాత మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేసెను. ఆయన ఆత్మ ద్వారా జన్మించెను, మరియు ఆయన దేవుని ఆత్మ ద్వారా పనిచేసెను. యోహాను 7లో, ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్య చివరిలో, దప్పిక గొనినవారు తనయొద్దకు వచ్చి త్రాగవలసినదిగా ఆయన పిలిచెను, మరియు వారు తమ కడుపులో నుండి జీవజలమును ప్రవహింపచేయుదురని ఆయన చెప్పెను (వ. 37-38). ప్రభువు ఇక్కడ ఆత్మను గూర్చిదేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మను గూర్చి కాక ఏ ఆత్మనైతే విశ్వాసులు పొందుకొనబోవుచున్నారో ఆ ఆత్మను గూర్చి చెప్పెనని అపోస్తలుడైన యోహాను చెప్పెను; ‘‘దానికి’’, ‘‘ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు’’ అని యోహాను చెప్పెను. దేవుని ఆత్మ ఆదికాండము 1లో కలడు, మరియు పరిశుద్ధాత్ముడు మత్తయి 1లో కలడు. ఎందుకు, ఈ భూమిపై ప్రభువు యొక్క పరిచర్య ముగింపులో, విశ్వాసులు పొందుకొనబోవు ఆత్మ ‘‘ఇంకనూ లేకుండెను’’ అని యోహాను మనకు చెప్పెను?
జీవము-నిచ్చు ఆత్మ అనునది క్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా మరియు పునరుత్థానములో ఉత్పత్తిచేయబడిన ఆత్మయై ఉండెను.
క్రీస్తు ఆత్మ అను పుస్తకములో,…‘‘పెంతెకొస్తు దినమున కుమ్మరించబడిన ఆత్మ వాస్తవానికి నూతనమైనది’’ అని ఆండ్రూ ముర్రే రాసెను. ఆండ్రూముర్రే ప్రకారము, ఈ ఆత్మ, అనగా యోహాను 7:39లో చెప్పబడిన ఆత్మ, దేవుని ఆత్మ, యోహోవా ఆత్మ, దేవుని పరిశుద్ధమైన ఆత్మ, మరియు పరిశుద్ధాత్మ కన్నా అధికమైనది. ఇంకాచెప్పాలంటే, పరిశుద్ధాత్మలో, దేవుని ఆత్మ సంపూర్ణముగా పరిణతి చెందలేదు; అనగా, ఆయన సంపూర్ణముగా పూర్తిగావించబడలేదు. క్రీస్తు మహిమ పరచబడు నంత వరకు ఆత్మ పరిణతి చెందలేదు. లూకా 24:26 ప్రకారము, క్రీస్తు మహిమపరచబడుట అనునది ఆయన పునరుత్థానములో జరిగెను. క్రీస్తు పునరుత్థానములోనికి ప్రవేశించినప్పుడు, ఆయన మహిమ పరచబడెను. ఆయన దైవిక స్వభావము ఆయనలోని దైవిక జీవముతో కలుపుకొని విడుదల చేయబడెను. క్రీస్తు మహిమ పరచబడుట అనునది ఒక పువ్వు వికసించుట వంటిది. ఎప్పుడైతే పువ్వు వికసించునో, అది మహిమపరచబడును; దాని జీవము మరియు స్వభాములోని సమస్త విషయములు విడుదల చేయబడును మరియు వ్యక్తపరచబడును. తన పరిశుద్ధ స్వభావము మరియు పరిశుద్ధ జీవముతోనున్న దేవుడే యేసు క్రీస్తు యొక్క మూలకములై ఉండెను. తన మరణ పునరుత్థానములకు ముందు ఈ మూలకములనునవి క్రీస్తు యొక్క మానవత్వము అనే పెంకులో మూయబడి ఉండెను. ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఒకసారి, రూపాంతర కొండపై, క్రీస్తు యొక్క ముగ్గురు శిష్యులు వారి కన్నుల ఎదుట ఆయన రూపాంతరమును, లేదా రూపాంతరించబడుటను చూచిరి. ఆకస్మికంగా ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను, మరియు ఆ దుస్తులు వెలుగు కలిగినంత తెల్లవిగా మారినవి (మత్త. 17:2). అది ఆయన మహిమపరచబడుటై ఉన్నది, కానీ అది కొంత సమయము వరకు మాత్రమే నిలచియుండెను. ఆయన పునరుత్థానములోనికి ప్రవేశించినప్పుడు, తనలో నుండి దేవుని స్వభావమును మరియు దేవుని జీవమును కలిగిన దేవుణ్ణి విడుదల చేయుట ద్వారా ఆయన సంపూర్ణముగా మహిమపరచబడెను. ఆ సమయము వరకూ ఈ ఆత్మ ఇంకనూ లేకుండెను. ఆ సమయమందే ఈ ఆత్మ ఉత్పత్తిచేయబడెను. ‘‘కడపటి ఆదాము [క్రీస్తు] జీవము-నిచ్చు ఆత్మగా మారెను’’ అని మొదటి కొరింథీయులకు 15:45 చెబుచున్నది. ఈ జీవము-నిచ్చు ఆత్మ అనునది క్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా మరియు పునరుత్థానములో ఉత్పత్తిచేయబడిన ఆత్మయై ఉండెను.
సమస్త ప్రక్రియల గుండా ప్రయాణించుట ద్వారా త్రియేక దేవుడు జీవము-నిచ్చు ఆత్మగా పరిణతి చెందెను.
సమస్త ప్రక్రియలు నరావతారము, మానవ జీవనము, సర్వము ఇమిడియున్న మరణము, మరియు సమస్తమును విడుదల చేయు పునరుత్థానము ద్వారా పయనించుట ద్వారా త్రియేక దేవుడు, దైవిక త్రిత్వములో నున్న దేవుడు, ఒక్క ఆత్మగా, అనగా, జీవము-నిచ్చు ఆత్మగా, పరిణతి చెందెను. ఈ జీవము-నిచ్చు ఆత్మ పరిణతి చెందిన త్రియేక దేవుని యొక్క మొత్తమై ఉండెను. ఇది నూతన నిబంధనలో స్పష్టమైన ప్రత్యక్షత. మొదటిగా, దేవుడు మానవుడయ్యెను. ఆ మానవుడు శరీరములోనున్న దైవ-మానవుడైన యేసు క్రీస్తుగా ఉండెను. ఆయన దేవుడై ఉండెను, కానీ ఒక దినమున ఆయన మానవత్వమును ధరించెను. కావున, ఆయన తనపై శరీరమును ధరించుట ద్వారా దైవికమైనవానిగా, మానవునిగా మారెను. ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆయన ఈ మానవుణ్ణి, అనగా, తన మానవత్వమును, సిలువ నొద్దకు తెచ్చి మానవత్వమును నిర్మూలించుటకు అక్కడ చనిపోయెను. తరువాత తన మానవత్వమును దైవత్వమునొద్దకు తెచ్చుటకు ఆయన తిరిగి లేచెను. ఈ పునరుత్థానము ద్వారా ఆయన మానవత్వము అనునది దైవికమైనదిగా మారెను (రోమా. 1:4) మరియు ఆయన దేవుని జ్యేష్టకుమారునిగా ఉండుటకు జన్మించెను (అపొస్తలుల కార్యములు 13:33; రోమా 8:29). అటువంటివాడు, తన పునరుత్థానమునందు మరియు తన పునరుత్థానము ద్వారా, జీవము-నిచ్చు ఆత్మగా మారెను. ఈ ఆత్మ త్రియేక దేవుని పరిణతిగా ఉండెను. (CWWL, 1994-1997, vol. 1, “Living a Life according to the High Peak of God’s Revelation,” pp. 185-187)
దేవుని ప్రణాళిక యొక్క అన్వయింపు పరిణతి చెందిన ఆత్మతో ఉండుట
పరిణతి చెందిన ఆత్మను గూర్చిన లోతైన గ్రహింపును మనము చూడాలి. నేను సహవాసము చేయాలనుకుంటున్న ముఖ్యమైన అంశము ఇదే… ఆదికాండము 1 దేవుని ఆత్మను గూర్చి పేర్కొనుచుండెను, కానీ అది పరిణతిచెందిన ఆత్మ కాదు; యోహోవా ఆత్మ మరియు పరిశుద్ధాత్మ రెండు కూడా పరిణతి చెందిన ఆత్మ కాకుండెను. క్రీస్తు పునరుత్థానము తరువాతనే తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ యొక్క పరిణతి చెందిన ఆత్మ ప్రత్యక్షపరచబడెను. ఈ ఆత్మ ఆదికాండములో చెప్పబడిన దేవుని ఆత్మ, పాత నిబంధనలోని యోహోవా ఆత్మ, మరియు మత్తయి 1లోని పరిశుద్ధాత్మ కన్నా వ్యత్యాసమైనది. ఈ ఆత్మ పరిణతి చెందిన ఆత్మ. దేవుని ప్రణాళిక నెరవేర్చబడెను, ఇప్పుడు ఇది అన్వయించబడవలెను. అన్వయింపు అనునది పరిణతి చెందిన ఆత్మతో ఉండెను కేవలము మొత్తము ఆత్మతో కాదుగానీ అంతిమ పరిణతి చెందిన ఆత్మతో ఉండెను.
జీవము-నిచ్చు ఆత్మ పరిణతి చెందిన ఆత్మగా ఉండుట
క్రైస్తవ్యములో చాలా కొద్దిమంది మాత్రమే నేడు ఈ విషయమును చూచిరి; దానికిబదులుగా, కొంతమంది 1 కొరి. 15:45 చెబుచున్న ‘‘కడపటి ఆదాము జీవము-నిచ్చు ఆత్మ ఆయెను’’ అను దానిని పూర్తిగా నమ్మకున్నారు. ఏదేమైనప్పటికి, ఇది మనము నమ్మవలసిన బైబిలులోని వచనమై ఉన్నది. ఈ సంవత్సరాలన్నీ ఈ పాయింట్లను, ఒకదాని వెంబడి మరొకటి, ప్రభువు మనకు స్పష్టంగా చూపుచున్నందుకు ప్రభువుకు వందనాలు. నేడు జీవము-నిచ్చు ఆత్మ పరిణతి చెందిన ఆత్మగా ఉండెను. కావున, యేసు పునరుత్థానము నందు ఇంకనూ మహిమపరచబడలేదు, గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడలేదు అని యోహాను 7:39 చెబుచున్నది. స్పష్టముగానే, పరిశుద్ధాత్మ ఉండెను, మరియు ఆదికాండము 1లో దేవుని ఆత్మ కూడా ఉండెను, అటువంటప్పుడు ఆత్మ అనుగ్రహించ బడకుండా ఎలా ఉండును? ఇది ఎందువలననగా, ఆ సమయమందు క్రీస్తు ఇంకనూ పునరుత్థానము చెందలేదు గనుక అక్కడ నూతన సృష్టి లేకుండా కేవలము పాత సృష్టి మాత్రమే కలదు. అప్పుడు, క్రీస్తు పునరుత్థానములోని నూతన సృష్టి యొక్క ప్రారంభములో, ఆత్మ ఉనికిలోనికి వచ్చెను. ఏదైతే మొదట దేవుని ఆత్మగా ఉన్నదో అది క్రీస్తు యొక్క పునరుత్థానములో విశేషమైన ఆత్మగా మారెను. ఇది 2 కొరింథీయులకు 3:17ను పేర్కొనుచున్నది: ‘‘ప్రభువే ఆత్మ.’’ 2 కొరింథీయులకు 3 లో చూపబడిన విశిష్టమైన ఆత్మ, విశ్వాసులలో రూపాంతరించబడు పనిని కొనసాగించును. ప్రభువు ఆత్మగా మనలో ఉన్నందున మనము రూపాంతరించబడుచున్నాము. ఇందువలననే 2 కొరింథీయులు 3: 18 మనమందరమును ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడు చున్నాము అని చెబుచున్నది. (CWWL, 1994-1997, vol. 1, “A General Outline of God’s Economy and the Proper Living of a God-man: A Fellowship with the Elders from Taiwan, Hong Kong, and Malaysia,” pp. 503-505)
ఆత్మ మరియు వధువు ‘‘రమ్ము!’’ అని చెప్పుట
అంతిమముగా, పరిణతియైన ఆత్మగా, ఆయన వాయూకృతుడైన క్రీస్తు యొక్క వాస్తవికతగాను, అనుభవముగాను మరియు ప్రక్రియలు చెంది పరిణతియైన త్రియేక దేవుని పరిణతిగాను, క్రీస్తు రాకడను ప్రకటించుటకు గొర్రెపిల్ల (క్రీస్తు) యొక్క వధువుతో ఏకమైయుండునట్లు ఆత్మగా ఆయెను. ప్రకటన గ్రంథము 22:17 ‘‘ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము’’ అని చెబుచున్నది. ఈ వాక్యములోని ఆత్మ అను బిరుదు త్రియేకదేవుడు వెళ్ళిన ప్రక్రియ మరియు పరిణతి చెందుటను తెలియజేయుచున్నది. వధువుగానున్న మనతో ఒక్కటిగా ఉండుటకు ఇప్పుడు ఆత్మగా ఆయన త్రియేక దేవుణ్ణి మనలోనికి తెచ్చును. ఈ ప్రక్రియలు చెందిన ఆత్మ తనకు తానుగా వధువుతో చేరెను. కావున, ప్రకటన గ్రంథము యొక్క చివరిలో ఆత్మ మరియు వధువు ‘‘రమ్ము!’’ అని కలసి చెబుచున్నారు (CWWL, 1993, vol. 3, “Blending Conference Messages concerning the Lord’s Recovery and Our Present Need,” pp. 124, 136)
References: CWWL, 1994-1997, vol. 1, “Living a Life according to the High Peak of God’s Revelation,” ch. 3; CWWL, 1994-1997, vol. 1, “A General Outline of God’s Economy and the Proper Living of a God-man: A Fellowship with the Elders from Taiwan, Hong Kong, and Malaysia,” ch. 2; CWWL, 1993, vol. 2, “Blending Conference Messages concerning the Lord’s Recovery and Our Present Need,” ch. 6
మనలోకిప్డు త్రియేకదేవుడు అద్భుతాత్మగా ఏతెంచెను
అంతర్వసించు ఆత్మగానున్న —ఆత్మ సంపూర్ణత
1113
1 మనలోకిప్డు త్రియేకదేవుడు
అద్భుతాత్మగా ఏతెంచెను
జీవమిచ్చు ఆత్మైన ప్రభునందు
మనమేకమైయున్నాముగా
ఆయనే అద్భుతాత్మాయెనుగా
మనలో అద్భుతాత్మాయెనుగా
తండ్రి సుతునిలో సుతుడాత్మగా
అద్భుతాత్మ ఆయెనుగా
2 “అబ్బా, తండ్రీ ’’ అని మొరలిడుదుం
ఈ అద్భుత ఆత్మనుండియే
మొరలిడువాడు సుతుని ఆత్మే
జీవమిచ్చు శుద్ధాత్మగాను
3 ప్రభువిప్పుడు మనయందున్నాడు
అద్భుతమైన ఆత్మగానే
స్వరూపాంతరమొందియున్నవాడై
జీవమిచ్చు ఆత్మాయెనుగా
4 నిజపాత్మయై ఇచ్చుటున్నాడుగా
అద్భుతమైన ఈ ఆత్మనే
“యేసు ప్రభువా” తరింతుమాత్మలో
జీవమిచ్చు ప్రభునాత్మతో