రెండవ పాఠము – సర్వము-ఇమిడియున్న క్రీస్తు
కొలొ. 2:6-కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి.
క్రీస్తే అన్నిటి యొక్క వాస్తవికత
లేఖనముల ప్రకారము మనము చూచు, తాకు, మరియు ఆస్వాదించు సమస్త భౌతికమైన విషయములు, మరియు సమస్త వస్తుపరమైన విషయములు అనేవి నిజమైనవి కావు. అవి నిజమైన వాటి యొక్క ఛాయ, ప్రతిబింబమై ఉన్నవి. దినదినము మనము అనేక వస్తుపరమైన అంశములను తాకెదము: మనము ఆహారమును తినుచున్నాము, నీటిని త్రాగుచున్నాము, దుస్తులను ధరించుచున్నాము; మనము మన గృహములలో నివసించుచున్నాము మరియు మన కార్లలో ప్రయాణిస్తున్నాము. ఈ విషయములన్నియు వాస్తవమైనవి కాదని మీరు గ్రహించాలని మరియు బాగా జ్ఞాపకముంచుకోవాలని నేను కోరుకొను చున్నాను. అవి కేవలము ఛాయలు మరియు ప్రతిబింబములై ఉన్నవి. మనము అనుదినము తీసుకునే ఆహారము నిజమైన ఆహారము కాదుగానీ నిజమైనదాని యొక్క ప్రతిబింబమై యున్నది. మనము త్రాగు నీరు నిజమైన నీరు కాదు. మన కళ్ళ ముందు ఉన్న వెలుగు నిజమైన వెలుగు కాదుగానీ మరొకదానిని చూపు ప్రతిబింబమై ఉన్నది.
మరి నిజమైన విషయములు ఏమిటి? సహోదర మరియు సహోదరీలారా, దేవుని కృప వలన నిజమైన విషయములు క్రీస్తు తప్ప మరేమీ కావని నిజముగా నేను మీతో చెబుతున్నాను. క్రీస్తే మనకు నిజమైన ఆహారము. క్రీస్తే మనకు నిజమైన నీరు. క్రీస్తే మనకు నిజమైన వెలుగు. క్రీస్తే మనకు సమస్తము యొక్క వాస్తవికత. ఇంకాచెప్పాలంటే, మన భౌతికమైన జీవము నిజమైన జీవము కాదు. అది క్రీస్తును చూపే ఒక ప్రతిబింబము మాత్రమే. క్రీస్తే మనకు నిజమైన జీవము. నీవు క్రీస్తును కలిగిలేకపోతే, నీవు జీవమును కలిగియుండవు. ‘‘నేను జీవించుచున్నాను; నేను నా దేహములో జీవమును కలిగియున్నాను’’ అని నీవు చెప్పవచ్చు. కానీ అది నిజమైన జీవము కాదని నీవు గ్రహించాలి. అది నిజమైన జీవముగానున్న క్రీస్తును చూపించే, కేవలము ఒక ఛాయ మాత్రమే అయియున్నది.
క్రీస్తును గూర్చిన మన అనుభవము యొక్క కొలత
[మంచి దేశముగానున్న కానాను] అనగా ఏమిటి? ఈ దేశము సర్వము-ఇమిడియున్న క్రీస్తు అని ఎన్నడూ మరచిపోవద్దు. అది కేవలము క్రీస్తు మాత్రమే కాదుగానీ సర్వము-ఇమిడియున్న క్రీస్తుగా ఉన్నది. నీవు క్రీస్తును కలిగియున్నవా అని నేను నిన్ను అడిగినట్లయితే, ‘‘ప్రభువుకు వందనాలు, నేను ఆయనను కలిగియున్నాను; నేను క్రీస్తును కలిగియున్నాను’’ అని నీవు జవాబు చెప్పవచ్చు. కానీ నీవు ఎటువంటి క్రీస్తును కలిగియున్నావని నేను అడిగెదను. నీ అనుభవములో నీవు సర్వము-ఇమిడియున్న క్రీస్తును గాక, కేవలము కొద్దిగా మాత్రమే క్రీస్తును, అనగా పేద క్రీస్తును కలిగియుంటివేమో అని నేను భయబడుచున్నాను.
నన్ను ఒక కథను, ఒక నిజమైన కథను చెప్పనివ్వండి. నేను రక్షించబడ్డ కొద్దిదినములకే, నేను లేఖనములను చదివితిని, మరియు పస్కా గొర్రె ఒకరకమైన క్రీస్తు అని నాకు బోధింపబడెను. నేను ఈ విషయమును నేర్చుకున్నప్పుడు, నేను ఎంతగా ప్రభువును స్తుతించానో ‘‘ప్రభువా, నేను నిన్ను స్తుతించుచున్నాను. నీవు గొర్రెపిల్లవు; నీవు నా గొర్రెపిల్లవు’’ అని నేను బిగ్గరగా చెప్పితిని. కానీ గొర్రెపిల్లను భూమితో పోల్చమని నేను మిమ్మును కోరుచున్నాను. చిన్న గొర్రెపిల్లకు మరియు గొప్ప భూమికి ఏ విధమైన పోలికను మీరు చేయగలరు? గొర్రెపిల్ల అనగా ఏమిటి? అది క్రీస్తు అని మీరు చెప్పవచ్చు. కానీ అది చిన్న క్రీస్తు అని నేను మీకు చెప్పెదను. ఆయన ప్రజల కొరకు దేవుని గురి అది కాదు. ‘‘మీరు గొర్రెపిల్లను కలిగియున్నంత కాలము, అది సరిపోతుంది,’’ అని దేవుడు ఎన్నడూ వారితో చెప్పలేదు. లేదు. ఆయన వారికి గొర్రెపిల్లను ఇచ్చుటకు గల కారణము వారిని మంచిదేశము లోనికి తెచ్చుట కొరకే అని దేవుడు వారితో చెప్పెను. పస్కా అనునది భూమి కొరకై యున్నది.
నీవు క్రీస్తును కలిగియున్నావా? అవును, నీవు క్రీస్తును కలిగియున్నావు. కానీ నీవు ఎటువంటి క్రీస్తును కలిగియున్నావు, గొర్రెపిల్లగానున్న క్రీస్తునా లేదా భూమిగా ఉన్న క్రీస్తునా? ఐగుప్తులో ఇశ్రాయేలీయులు అందరూ పస్కా దినమున గొర్రెపిల్లను కలిగియుంటిరి, కానీ చాలా కొద్దిమంది మాత్రమే, ఇది చెప్పినందుకు నన్ను క్షమించండి, దేశములోనికి ప్రవేశించిరి. చాలా కొద్దిమంది మాత్రమే ఈ దేశ భాగమును స్వాధీనపరచుకొనిరి.
నేను రక్షింపబడిన ఒకటి లేదా రెండు సంవత్సరాల తరువాత, ఇశ్రాయేలీయులు అరణ్యములో ఆస్వాదించిన మన్నా అనునది కూడా, ఒక రకమైన క్రీస్తు అని నాకు చెప్పబడెను. నేను ఎంతో సంతోషించితిని. నేను ‘‘ప్రభువా, నీవు నా ఆహారము; నీవు నాకు గొర్రెపిల్లవు మాత్రమే కాదుగానీ అనుదిన మన్నా కూడా అయ్యుంటివి.’’ కానీ మన్నా దేవుని ఉద్దేశ్యమునకు గురిగా ఉన్నదా అని నేను మిమ్మును అడుగగోరుచున్నాను? వారు అరణ్యములో మన్నా ఆస్వాదించుటకు దేవుడు తన పిల్లలను ఐగుప్తు నుండి విడిపించెనా? లేదు. ఆ దేశమే ఉద్దేశ్యము; ఆ దేశమే గురి. నీవు క్రీస్తును దేశముగా ఆస్వాదించావా? నాకు సందేహమే, అంతేకాదు మీకు కూడ సందేహమే అని అనుటకు నేను సాహసించుదును. గొర్రెపిల్లను మీ పస్కాగా ఆస్వాదించామని మరియు ప్రభువును మీ అనుదిన మన్నాగా ఆస్వాదించామని నీవు చెప్పవచ్చు, కానీ సర్వము-ఇమిడియున్న క్రీస్తును తమ భూమిగా ఆస్వాదించామని చాలా కొద్దిమంది మాత్రమే చెప్పగలరు.
క్రీస్తు భూమిగా ఉండుట, క్రీస్తు మట్టిగా ఉండుట, మరియు మన వ్యక్తిత్వము క్రీస్తునందు వేరుపారియుండుట
మనము క్రీస్తునందు వేరుపారితిమని కొలొస్సయులకు 2లో వాక్యము మనకు చెబుచున్నది (వ. 7). అయితే నేనిప్పుడు మిమ్ములను ఈ విధముగా పరిగణించమని అడిగెదను: మీరు క్రీస్తునందు వేరుపారినట్లయితే, అప్పుడు క్రీస్తు మీకు ఏమైయున్నాడు? అవును, క్రీస్తు నేలగా ఉన్నాడు; క్రీస్తు మట్టిగా ఉన్నాడు. ఒక మొక్క లేదా చెట్టు అనునది మట్టిలో, అనగా భూమిలో వేరుపారును. అదేవిధముగా, మనము క్రీస్తునందు వేరుపారితిమి. మీరు ఎన్నడూ కూడా మీకు క్రీస్తే నిజమైన నేల, నిజమైన భూమి అని గ్రహించలేదేమోనని నేను భయపడుచున్నాను. నీవు ఈ భూమిలో, అనగా స్వయంగా క్రీస్తులో పాతబడిన చిన్న మొక్కగా ఉన్నావు. ఐదు లేదా ఆరు సంవత్సరాల క్రిందట నాకు అటువంటి ఆలోచన ఎన్నడూ లేదని నేను ఒప్పుకొనవలెను. నేను లేఖనములను చదివితిని మరియు కొలొస్సయులకు రాసిన పత్రికలో చాలా సమయమును గడిపితిని. నేను దానిని మరలా మరలా చదివితిని కానీ ఇటువంటి వెలుగును నేను ఎన్నడూ పొందుకొన లేదు. క్రీస్తు నేలగా, సాక్షాత్తూ భూమిగా ఉన్నాడని నాకు ఎన్నడూ తెలియదు. గడచిన కొద్ది సంవత్సరాల క్రితము వరకూ కూడా నా కళ్ళు తెరువబడలేదు.
మనము నడువగలిగే భూమిగా క్రీస్తు ఉండుట
ఎక్కువమంది దేవుని పిల్లలు ఇంకనూ ఐగుప్తులోనే ఉండిపోయారని నేను లోతుగా గ్రహించియున్నాను. వారు పస్కాను మాత్రమే అనుభవించారు; వారు ప్రభువును కేవలము గొర్రెపిల్లగా మాత్రమే తీసుకున్నారు. వారు గొర్రెపిల్ల ద్వారా రక్షించబడిరి, కానీ వారు లోకము నుండి విడిపించబడలేదు. అవును, కొంతమంది ఐగుప్తు నుండి బయటకు వచ్చిరి, కొంతమంది లోకము నుండి విడిపించబడిరి, కానీ వారు ఇంకనూ అరణ్యములోనే తిరుగులాడుచున్నారు. వారు క్రీస్తును కొంచెం ఎక్కువుగా ఆస్వాదించిరి; వారు ఆయనను తమ అనుదిన మన్నాగా అనుభవించిరి. వారు తాము క్రీస్తును తమ ఆహారముగా ఆస్వాదించామని మరియు వారు ఎంతో సంతృప్తి చెందారని గర్వపడవచ్చును. కానీ, సహోదర సహోదరీలారా, అది సరిపోతుందా? క్రీస్తును తమ అనుదిన మన్నాగా ఆస్వాదించినవారిని చూచి, మనము ఎంతో సంతోషించవచ్చు. ‘‘ప్రభువుకు వందనాలు, దినము వెంబడి దినము నిజముగా ప్రభువును తమ మన్నగా ఆస్వాదించిన కొంతమంది సహోదర సహోదరీలు ఇక్కడ ఉన్నారు’’ అని మనము చెప్పవచ్చు. ఇది దేవుని ఉద్దేశ్యమునకు చాలా దూరములో ఉన్నదని మనము తప్పక గ్రహించవలెను. మనము క్రీస్తును కొద్దిగా ఆస్వాదించుట దేవుని చిత్తము కాదుగాని ఆయన మనకు సర్వము-ఇమిడియున్నవానిగా ఉండాలి. ఈ వచనమును చూడండి: 6-7 వచనములు ఇలా చెప్పుచున్నవి, ‘‘కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును స్వీకరించిన విధముగా… ఆయనలో నడచుకొనుడి’’ (వ. 6). మనము నడచుటకు ఆయనే మండలము, ఒక గోళమై ఉండెను. ఆయన కేవలము కొంత ఆహారమో లేదా నీరు మాత్రమే కాదుగానీ ఒక మండలము, మనము నడవదగిన ఒక భూమిగా ఉన్నాడు. మనము ఆయనలో తప్పక నడవాలి. ఆయన మన భూమి; ఆయన మన నేల; ఆయన మన రాజ్యము. ఆయనలో నడువుము. (The All-inclusive Christ, pp. 7-8, 13-14)
సర్వము-ఇమిడియున్న సాదృశ్యముగానున్న క్రీస్తు
ఈ నేల అనునది సంపూర్ణమైన సాదృశ్యము, సర్వము-ఇమిడియున్న సాదృశ్యమైన క్రీస్తు. పాత నిబంధనలో అనేకమైన సాదృశ్యములు కలవని మనకు తెలుసు. పస్కా గొర్రె క్రీస్తుకు ఒక సాదృశ్యమని మనకు తెలుసు, మరియు మన్నా అనునది క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నదని మనకు తెలుసు. దాని ఉపకరణములు, పాత్రలు, మరియు అనేక బలులను కలుపుకొనియున్న ప్రత్యక్ష గుడారము అనునది కూడా క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. కానీ ఈ భూభాగము లేకుండా, సర్వము-ఇమిడియున్న క్రీస్తుకు చెందిన సాదృశ్యము లేదని నేను మీకు చూపదలచుచున్నాను. పస్కా గొర్రెపిల్ల అనునది సర్వము-ఇమిడియున్న సాదృశ్యము కాదు, మరియు మన్నాగాని లేదా ఇంకనూ అన్నీ విషయములను కలుపుకొనియున్న ప్రత్యక్ష గుడారము కూడా కాదు. అనేకమైన వివిధ రకాల అర్పణలు ప్రభువుచే ఆదేశించబడెను, కానీ అవి క్రీస్తుకు చెందిన వివిధ పార్శ్వములను మాత్రమే వర్ణించుచున్నవి. ఈ నేల అనునది సంపూర్ణమైన సాదృశ్యము, సర్వము-ఇమిడియున్న సాదృశ్యమైన క్రీస్తు. మన విమోచకునిగా మనమందరమును క్రీస్తును అంగీకరించితిమి. అది చాలా అద్భుతమైనది. కానీ క్రీస్తు విమోచకునిగా సర్వము-ఇమిడియున్నవాడు కాదని మనము గ్రహించవలెను. క్రీస్తే సర్వమై ఉన్నాడని మరియు అందరిలో ఉన్నవాడని, మరియు ఆ క్రీస్తు సర్వము ఇమిడియున్నవాడని మనకు లేఖనములలో చెప్పబడెను. సమస్తము ఆయనయందు ఉండెను, మరియు ఆయన సమస్తములో ఉండెను . కనాను దేశము తప్ప ఆయనను ఆ రీతిగా చూపు సాదృశ్యము పాత నిబంధనలో ఒక్కటి కూడా లేదు. (The All- inclusive Christ, pp. 19-20)
References: The All-inclusive Christ, chs. 1, 2; Life-study of Deuteronomy, msg. 5
నా ప్రభుని ఐశ్వర్యము
క్రీస్తును గూర్చిన అనుభవము — ఆయన ఐశ్వర్యము
542
1 నా ప్రభుని ఐశ్వర్యము
శోధింపజాలనివి
దేవత్వపు స౦పూర్ణతన్
అనుభవింపజేయున్
ఎంతో గొప్ప ఐశ్వర్యము
క్రీస్తు నాకై ఉంచెను
శోధింపశక్యముకాదు
నాదు సొంతం, నిజముగా
2 రక్షకుని ఐశ్వర్యము
జీవమున్ వెలుగునై
జ్ఞానమున్, శక్తిని, స్వస్థతన్
ఇచ్చును మోదముతో
3 విమోచన, రక్షణయు
పునరుత్ధాన శక్తి
పరిశుద్ద పర్చినన్ను
ఉత్కృష్టింపజేయును
4 రక్షకుని ఐశ్వర్యము
దేవుని సర్వస్వము!
ఆయన వ్యక్తిత్వమంతా
నాయత్మ సొంతమాయెన్
5 రక్షకుని ఐశ్వర్యము
పొడవున్, వెడల్పును
లోతునైనన్, ఎత్తునైనన్
కొల్వలేరెవ్వరైనన్
6 మితిలేని ఐశ్వర్యము
క్రీస్తు అనుభవమే
పంచిత్తును అందరికిన్
వాటిని సమృద్దిగా