పదిహేనవ పాఠము – బైబిలు యొక్క జీవ-అధ్యయనములు
యోహాను 5:39-40—లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.
జీవ-అధ్యయనములు యొక్క విశేషత
కేంద్రీయ విషయమునకు సంబంధించిన అన్నీ పార్శ్వములను ఎత్తిచూపుట
బైబిలు అనునది సాహిత్యములో ఒక ప్రత్యేకమైన పనియైయున్నది. అది ఏదో ఒక నిర్దిష్టమైన అంశముపై గురిపెట్ట నప్పటికి, అనేక విషయములను కలిగిన, అనేక విషయములను ఆవరించియున్న ఒక కేంద్రీయ విషయమును అది కలిగియున్నది. బైబిలు యొక్క కేంద్రీయ వెలుగును చూచుట మరియు దాని వెలుగును సంపూర్ణముగా గ్రహించుట అనునది గడచిన యుగాల నుండి బైబిలు చదవరుల మధ్యనున్న గొప్ప సమస్యగా ఉన్నది. కాబట్టి బైబిలును గూర్చిన వారి అవగాహన అనునది చాలా సూక్ష్మమైనది మరియు పైపైన గలది. వారు ఇక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్ అర్థము చేసుకొని యుండ వచ్చును, కానీ సంపూర్ణముగా అర్థము చేసుకొనలేరు. మనము బైబిలును సంపూర్ణముగా అవగాహన చేసుకోవాలంటే, బైబిలు కేవలము ఒకే కేంద్రమును కలిగియున్నదని మరియు ఈ కేంద్రము అనేక విషయములను కలుపుకొనియున్నదని; అది విస్తృతమైనదని మనము తప్పక చూడాలి.
ఈ నియమము క్రింద జీవ-అధ్యయనములు అనేవి కేంద్రమును కలిగియుండెను. అవికూడా అనేక విషయములకు సంబంధించిన నిర్వచనములను మరియు వివరణలను కలిగి యున్నవి, కాబట్టి అవికూడా అన్నిటిని కలుపుకొనియున్నవి. కావున, మనము జీవ-అధ్యయనములను చదువునప్పుడు, మనము ఎల్లప్పుడు వాటినుండి జీపపు పోషణను పొందుకొనెదము, మరియు మనము కొంత సత్యమునకు సంబంధించిన జ్ఞానమును కూడా పొందుకొనెదము.
కేంద్రీయ అంశమును మరియు దాని పార్శ్వములన్నిటిని చూచుట
ఉదాహరణకు నిర్గమకాండము యొక్క జీవ-అధ్యయనమును తీసుకోండి….ఏ విధముగా క్రీస్తు మనకు సమస్తముగా మారును అనునది నిర్గమకాండము యొక్క కేంద్రీయ ఉద్దేశ్యమైయున్నది. మొదటిగా, ఆయన మన పస్కా గొర్రెగా మారెను. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము అనునది మన పాపముల కొరకు చిందించబడిన క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తమును చూపుచున్నది (మత్త. 26:28; యోహాను 19:34; 1 పేతు. 1:18-19). అక్కడ మాంసము కూడా కలదు, అది మన సరఫరాగా ఉన్న క్రీస్తు యొక్క ఉత్పత్తి చేయు జీవమును తెలియజేయుచున్నది (యోహాను 6:53, 55). తరువాత మనకు జీవపు పోషణగా ఉన్న మరియు మన సమస్త పాపపు మరియు దుష్టక్రియలను తీసివేయు యేసుక్రీస్తును సాదృశ్యపరచు పులియని రొట్టె అక్కడ కలదు (1 కొరి. 5:7-8). తుదకు, పాపపు విషయములకు సంబంధించి చేదును మనము అనుభవించుటకుగాను మనము చింతించ వలసిన మరియు పశ్చాత్తాపము పొందవలసిన అవసరత కలదు అని సాదృశ్యపరచే, చేదు ద్రాక్షలు అక్కడ కలవు.
ఈ సాదృశ్యములను మన ఆచరణీయమైన అనుభవములతో సరిచూచుకొనుట మరియు మన దైనందన జీవితమునకు వాటిని అన్వయించుకొనుట
ఈ అంశములన్నీ జోడించుట కలసి సమగ్రముగా ఒక చోటికి తెచ్చుటే గాని కేవలము ఒక పార్శ్వమునకు పరిమితి చేయబడుటకు కాదు. ఇంకనూ, వాటిని మన క్రైస్తవ అనుభవములతో సరిచూచుకోవచ్చును….వాటిని మన సొంత అనుభవములతో సరిపోల్చుకొనకుండా మనము కేవలము సాదృశ్యములను చదివి మరియు సిద్ధాంతములను నేర్చుకొననట్లయితే, నిర్గమకాండమును అర్థము చేసుకొనుట అంత సులువు కాదు. ఏదేమైనప్పటికి, మనము మన అనుభవములను ఈ సాదృశ్యములతో పోల్చుకున్నట్లయితే, అవి మన సాధారణ క్రైస్తవ జీవనము యొక్క వివరణగా ఉన్నందున వాటిని అర్థము చేసుకొనుట చాలా సులువు.
జీవ-అధ్యయనపు సందేశముల ప్రయోజనాలు
బైబిలులోని సత్యములలోనికి ప్రవేశించుటకు
మనము బైబిలును కాక జీవ-అధ్యయనపు సందేశములను మాత్రమే చదివెదమని కొందరు మనలను విమర్శించెదరు. ఎవరైతే ఈ విధముగా మాట్లాడతారో వారు పూర్తిగా తప్పుడు సందేశమును పొందుకున్నారు. ప్రజలను బైబిలు యొక్క సత్యములలోనికి తీసుకువచ్చుటయే జీవ-అధ్యయనపు సందేశములు యొక్క గురి. గతములో ప్రజలు బైబిలును చదివినప్పుడు, వారు లోపలికి ప్రవేశించు మార్గమును కనుగొనలేదు, కావున వారు అర్థము చేసుకొనుటకు ఏ మార్గమును లేదు. ఇది ప్రజలు లోపలికి ప్రవేశించుటకు ఒక ప్రవేశద్వారమును, తలుపును, మరియు కిటికీని కలిగిలేని గృహమువలే ఉన్నది. ప్రజలు ఇంటిలోనికి ప్రవేశించి సమస్తమును ఆస్వాదించుటకుగాను జీవ-అధ్యయనపు సందేశములు అనునవి ఒక మార్గమును ఏర్పరచును, ఒక తలుపును నిర్మించును, మరియు ఒక కిటికినీ తెరచును.
జీవమును తాకునట్లు ప్రజలను నడుపుట
జీవ-అధ్యయనపు సందేశముల యొక్క మరొక విధి ఏదనగా, ప్రజలను జీవము నొద్దకు తెచ్చుటైయున్నది. జీవ-అధ్యయనపు సందేశములనునవి బైబిలుకు వేరుగా ఉన్నటువంటి తాత్విక లేదా శాస్త్రీయ రచనలు కాదు. జీవ-అధ్యయనపు సందేశములనునవి కేవలము బైబిలును విశదీకరించి సత్యమును చెప్పుట మాత్రమే కాదు; దానికిబదులుగా, దాని ఐశ్వర్యములను ఆస్వాదించుటకు మరియు అనుభవించుటకు అవి ప్రజలను సత్యములోనికి కూడా తెచ్చును….బైబిలు లోపల గల జీవమును ఆస్వాదించుటకు జీవ-అధ్యయనపు సందేశములనునవి మనలను బైబిలు యొక్క లోతులలోనికి తీసుకువెళ్ళును (యోహాను 5: 39-40).
ఐశ్వర్యవంతమైన కూటముల కొరకైన కారకము
జీవ-అధ్యయనపు సందేశములు వాటి అంశముగా కలిగియున్న కూటములే అధిమైన ఐశ్వర్యవంతమైన కూటములు. మనము ప్రతి ప్రభు దినము రెండు జీవ-అధ్యయనాలను మన సహవాసపు విషయముగా తీసుకునట్లయితే, కూటములు ఎంతో ఐశ్వర్యవంత ముగా ఉండును.
అత్యున్నతమైన మరియు లోతైన సత్యములను మాట్లాడునట్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొనుట
దేవుని ప్రణాళిక, దేవుని వితరణ, సారాంశికమైన ఆత్మ, మరియు ప్రణాళికీయమైన ఆత్మ అను పదములు ఖచ్చితముగా చాలా లోతైన పదములైయున్నవి, కానీ నూతన విశ్వాసులకు, మరిముఖ్యముగా యవ్వనస్థులకు, అవి ఎక్కువ కాలము లోతైనవిగా ఉండవు. ఈ క్రొత్తవారు ఈ పదములతో క్రమముగా అలవాటు పడెదరు, మరియు వారు వాటిని స్పష్టంగా అర్థముచేసుకోగలరు. మనము మన భావములను మార్చుకొనుటకు సిద్దముగా ఉండాలి మరియు అత్యున్నతమైన మరియు లోతైన సత్యములను నేర్చుకొనుటకు యవ్వనస్థులను ప్రోత్సహించాలి. మనము ఈ విధముగా చేసినట్లయితే, భవిష్యత్తులో పరిశుద్ధులు ఒకరితోనొకరు మాట్లాడినప్పుడు మరియు వారు సువార్తను ప్రకటించునప్పుడు, వారి మాటలు ఉన్నతమైన నాణ్యతను కలిగియుండునని నేను నమ్ముచున్నాను. (CWWL, 1984, vol. 5, “Truth, Life, the Church, and the Gospel-the Four Great Pillars in the Lord’s Recovery,” pp. 359-361, 363-364)
References: Reference: CWWL, 1984, vol. 5, “Truth, Life, the Church, and the Gospel-the Four Great Pillars in the Lord’s Recovery,” ch. 1
సజీవమైన దైవవాక్యమా, నీవే దేవుని నిజ రూపివి
వాక్యాధ్యయనము—వాక్యపు విధి నిర్వహణ
801
1 సజీవమైన దైవవాక్యమా
నీవే దేవుని నిజ రూపివి
నీలో దేవుని కలుసుకొందుం
దైవ సంపూర్ణతను చూతుము
2 నీవుగాక నరుడెన్నడును
చూచియుండలేదు దేవునిని
మానవ జాతికి దేవునిని
నీవే ప్రచురపరచితివి
3 నీవే దేవునికి మూర్తిమంతం
లేఖనములు నీ చిత్రణమే
దైవ స్వరూపమును నీలోనే
మేము గ్రహింపగల్గుచున్నాము
4 జీవమిచ్చు ఆత్మయైన నీవు
ఇప్పుడు వాక్యమందు
ఆత్మగా దైవ సంపూర్ణతను నాలోన
నిక్షేపము చేయుచున్నావు
5 దేవునితో సహవాసమును
నీలోనే కలిగియుందును
లేఖనము పఠించుట ద్వారా
నిన్నే భుజింతును ఇలలోన
6 ఆత్మను సాధకం చేయుటను
వాక్యాధ్యయనమును నేర్పుము
సజీవమైనట్టి వాక్యమును
మన్నాగా చేకొందుము నిరత౦