Jump to section

పదమూడవ పాఠము – బైబిల్ యొక్క రికవరీ వర్షెన్

2 తిమో. 3:16, 17—దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.

సంక్షిప్త వివరణ

దశాబ్దాలుగా, బైబిల్ తర్జుమాలు క్రమంగా మెరుగుపడుచున్నవి. సాధారణంగా, ప్రతి క్రొత్త తర్జుమా మునుపటి వాటి నుండే పొందుకొనును మరియు తరువాతి దానికి మార్గమును తెరచును. క్రొత్త తర్జుమా దాని ముందున్న వాటి నుండి సహాయమును పొందుకొనుచుండగా, అది మరింత ముందుకు వెళ్ళాలి. ప్రధానమైన అధికారిక ఆంగ్ల వెర్షన్ల చేత పెట్టబడిన పూర్వపు సముదాయమును అనుసరిస్తూ మరియు ఈ వెర్షన్లను రిఫరెన్సుగా తీసుకుంటూ, క్రొత్త నిబంధన రికవరీ వెర్షన్ ఇతరుల ప్రయోగాలకు చెందిన పరీక్ష నుండి నేర్చుకోబడ్డ పాఠములను కలుపుకొనుట మాత్రమే కాక, పక్షపాతాలను మరియు సరికాని తీర్పులను నివారించుటకు కూడా ప్రయత్నించును. తరచుగా ఇతర వెర్షన్ల చేత మార్గనిర్దేశకము చేయబడిన ఈ వెర్షన్, దైవిక మాటలోనున్న ప్రత్యక్షత కొరకు ఉత్తమమైన ఉచ్చారణను అందించుటకు ప్రయత్నించును, అనగా అది ఆంగ్ల భాషలో గొప్ప ఖచ్చితత్వముతో తెలియజేయబడవచ్చును.

రెండు వేల సంవత్సరాలుగా పొందుకోబడిన దైవిక ప్రత్యక్షతను గూర్చిన  సరైన అవగాహనపై ఆధారపడి

బైబిల్‌ను తర్జుమా చేయడమన్నది మూలభాషను తగినంతగా తెలుకోవడముపై మాత్రమే కాక పరిశుద్ధ వాక్యములోనున్న దైవిక ప్రత్యక్షతకు సంబంధించిన సరైన అవగాహన మీద కూడా ఆధారపడును. దశాబ్దాలుగా పరిశుద్ధుల చేత స్వాధీనము చేసుకోబడ్డ దైవిక ప్రత్యక్షతను అర్థం చేసుకోవడమన్నది ఎల్లప్పుడు వారు పొందుకున్న వెలుగును ఆధారము చేసుకునే ఉండెను, మరియు ఈ అవగాహన క్రమంగా పురోగమించెను. ఈ అవగాహనకు గల పరిణతి అన్నది ఈ తర్జుమాకు మరియు దాని ఫుట్‌నోట్లకు ఆధారముగా ఉండును. కావున, ఈ తర్జుమా మరియు జతచేయబడిన ఫుట్‌నోట్లు అన్నవి గత రెండు వేల సంవత్సరాలుగా ప్రతిచోట పరిశుద్ధులు సంపాదించుకొనిన దైవిక ప్రత్యక్షతను అర్థం చేసుకోడానికి సంబంధించిన ‘‘స్పటికీకరణము’’ అని పిలువబడగలదు. అది పొందుకొనిన సంపదను రికవరీ వెర్షన్ కొనసాగించునని మరియు రాబోవు యుగములకు మార్గమును ఏర్పరచునన్నది మా నిరీక్షణ.

ఏ క్రొత్త నిబంధన తర్జుమాతోనైనా, అసలైన గ్రీకు పాఠమును నిర్ధారించుట అన్నది అందుబాటులోనున్న వ్రాత ప్రతులపై ఆధారపడెను, ఇవే క్రొత్త నిబంధన రికవరీ వెర్షన్‌ యొక్క పాఠ్యముకు ఆధారముగా ఎర్పడును. రికవరీ వెర్షన్, చాలా భాగము, నోవూం టెస్టమెంటమ్ గ్రేసిలో (Novum Testamentum Graece (26th edition) కనుగొనబడిన నెస్టెల్-ఎలాండ్ గ్రీకు పాఠ్యమును (Nestle-Aland Greek text) అనుసరించును. అయితే, ఏదైనా వచనముకు సంబంధించిన అసలైన వాడికను నిర్ధారించడంలో, రికవరీ వెర్షన్ తర్జుమా దారులు అధ్యాయనముకు చెందిన పెద్ద సందర్భాలను మరియు పుస్తకమును మరియు క్రొత్త నిబంధనను పోలియున్న విభాగములను జాగ్రత్తగా పరిశీలించిరి. ఇటీవల ఆవిష్కరించబడిన రాతప్రతులు లేదా పురాతన కాల రాతప్రతులు అంతగా ఖచ్చితమైనవి లేదా ఆధారపడదగినవి కానవసరము లేదు; కనుక, ఈ వెర్షన్ యొక్క పాఠ్యమును నిర్ధారించుట అన్నది పైన పేర్కొనబడిన నియమముపై అధికంగా ఆధారపడెను. నెస్టెల్-ఎలాండ్ పాఠ్యము నుండైన ప్రస్థానములు కొన్నిసార్లు ఫుట్‌నోట్లల్లో తెలియజేయబడినవి. వచనములలో ఏటవాలైన అక్షరాలు గల పదాలు గ్రీకు పాఠ్యములో కనుగొనబడని, అమర్చబడిన మాటలను తెలియజేయును.

మూల పాఠ్యమునకు సంబంధించిన అర్థంలోనికి విస్తృతంగా పరిశీలించడమును మరియు ఈ అర్థమును విషయమునకు అనుగుణముగా, అర్థం చేసుకోవడానికి సులభంగా మరియు చదువగలిగేలా ఆంగ్లములో తెలియజేయుటకు ప్రయత్నించడమును రికవరీ వెర్షన్‌లో ఉన్నది. మూల గ్రీకుకు సంబంధించిన నిర్దిష్ట అర్థమును తెలియజేయుటకు కష్టంగానున్న ఆయా స్థలాల్లో, వివరణాత్మకమైన ఫుట్‌నోట్లను అది అందించును.

సత్యముకు చెందిన ప్రత్యక్షతను, ఆత్మీయ వెలుగును మరియు జీవ సరఫరాను నొక్కిచెప్పు ఫుట్‌నోట్సు

ప్రతి పుస్తకము యొక్క ప్రారంభములో అందించబడిన అంశము మరియు ప్రతి పుస్తకము యొక్క సంక్షిప్త వివరణ వాటి ఆధారముగా చారిత్రాత్మకమైన వాస్తవాలను తీసుకొనును మరియు ప్రతి పుస్తకములోనున్న ఆత్మసంబంధమైన అర్థమును తెలియజేయును. చరిత్ర, భూగోళశాస్త్రము మరియు వ్యక్తుల కంటే ఎక్కువగా సత్యముకు చెందిన ప్రత్యక్షతను, ఆత్మసంబంధమైన వెలుగును మరియు జీవ సరఫరాను ఫుట్‌నోట్స్ నొక్కిచెప్పును. క్రాస్-రిఫరెన్సులు ఇతర వచనముల యొద్దకు తీసుకువెళ్ళడం మాత్రమే కాక దైవిక వాక్యములోనున్న ఆత్మసంబంధమైన ప్రత్యక్షతకు సంబంధించిన ఇతర విషయముల యొద్దకు కూడా తీసుకువెళ్ళును.(“A Brief Explanation,” Recovery Version- of the Bible)

References: “A Brief Explanation,” Recovery Version of the Bible

 

GOD’S OWN WORD MUST NOT BE TAKEN

Study of the Word— Knowledge and Life

816

1    God’s own Word must not be taken

Just as knowledge but as life;

Not alone God’s thought conveying,

But Himself to us as life;

Not alone God’s mind revealing,

But His Christ as life within.

Not alone the teaching giving,

But experience of Him.

 

2    It is only knowledge to us

If we in the letter read,

But when reading in the spirit,

It is truly life indeed.

All the knowledge in the letter

Only brings us into death,

But the Word in spirit taken

Gives to us the quick’ning breath.

 

3    If we miss the Lord in Scripture,

It is just as knowledge vain;

But when Christ we touch within it,

Then His life we may obtain.

When we read, the Lord not touching,

’Tis but mental stimulus;

But when Christ we touch by reading,

It becometh life in us.

 

4    All the knowledge of the Scriptures

Into life must be transformed.

All the mental understanding

In the spirit must be formed.

All the Script’ral understanding

Must become the life received.

All the knowledge of the letters

In the spirit be conceived.

 

5    Just to touch the Word for knowledge

Is to take the very way

By which Eve was lured by Satan

And by knowledge led astray;

But as life to take the Scriptures

Is the tree of life to eat.

Thus the Word we must be taking

In the spirit as our meat.

Jump to section