Jump to section

పన్నెండవ పాఠము – నూతన నిబంధన పుస్తకముల సామాన్య విషయములు

2 పేతు. 1:20-21—ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించు కొనవలెను; ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

 

మత్తయి సువార్త: యేసు క్రీస్తు రాజు-రక్షకుడు అని నిరూపించు రాజ్యపు సువార్త.

మార్కు సువార్త: యేసు క్రీస్తు దాస-రక్షకుడు అని నిరూపించు దేవుని సువార్త.

లూకా సువార్త: యేసు క్రీస్తు మానవ-రక్షకుడు అని నిరూపించు పాప క్షమాపణ సువార్త.

యోహాను సువార్త: తనను తానే వ్యాప్తి చేసుకొనుటకు జీవముగా వచ్చిన యేసు క్రీస్తు రక్షకుడైన దేవుడు అని నిరూపించు జీవపు సువార్త

అపొస్తలుల కార్యములు: తన ఆరోహణములో, ఆత్మచేత, శిష్యుల ద్వారా సంఘముల ఉత్పత్తికొరకై అనగా దేవుని రాజ్యము ఉత్పత్తికొరకై పునరుత్థానుడైన క్రీస్తు యొక్క వ్యాప్తి.

రోమీయులకు వ్రాసిన పత్రిక: స్థానిక సంఘములుగా వ్యక్తపరచబడు క్రీస్తు దేహమును నిర్మించుటకుగాను పాపులను దేవుని కుమారులుగా చేయు దేవుని సువార్త.

1  కొరింథీయులకు వ్రాసిన పత్రిక: సంఘములోని అన్నీ సమస్యలకు క్రీస్తు మరియు ఆయన సిలువే పరిష్కారం.

2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక: నూతననిబంధన పరిచర్య మరియు దాని  పరిచారకులు.

గలతీయులకు వ్రాసిన పత్రిక: క్రీస్తు ధర్మశాస్త్రమును స్థానభర్తీ చేయుట మరియు మతముకు మరియు ఆచారమునకు విరుద్ధముగా ఉండుట.

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక: సంఘము క్రీస్తు మర్మముగా ఉండుట, క్రీస్తు దేహము క్రీస్తు యొక్క సంపూర్ణతగా ఉండుట, దేవుని సంపూర్ణతగా మారుట.

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక: క్రీస్తును అనుభవించుట క్రీస్తునే మన జీవనముగా, మాదిరిగా, గురిగా, శక్తిగా, మరియు రహస్యముగా తీసుకొనుట.

కొలొస్సయులకు వ్రాసిన పత్రిక: సర్వము-ఇమిడియున్న వానిగా, దేవుని మర్మము మరియు మూర్తీమంతముగా సమస్త విషయములలో ప్రథమ స్థానమును కలిగియున్న, సంఘము యొక్క శిరస్సు మరియు సంఘటితాంశముగానున్న, విశ్వాసులకు కేటాయించబడిన భాగము, జీవము, ఘటకాంశము మరియు నిరీక్షణగా, మరియు సమస్త అనుకూల విషయముల యొక్క దేహముగా (నిజస్వరూపముగా) నున్న క్రీస్తు.

1 థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక: సంఘజీవనము కొరకైన పరిశుద్ధ జీవనము జీవముగల దేవుని సేవించుట, మనలను మనము పరిశుద్ధమైన రీతిలో ఉంచుకొనుట, మరియు ప్రభువు రాకడ కొరకు వేచియుండుట.

2 థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక: సంఘజీవనము కొరకైన పరిశుద్ధ జీవనముకు ప్రోత్సాహము మరియు దిద్దుబాటు.

1 తిమోతి పత్రిక: సంఘమును గూర్చిన దేవుని ప్రణాళిక.

2 తిమోతి పత్రిక: సంఘ క్షీణతకు వ్యతిరేకముగా టీకా వేయుట.

తీతుకు వ్రాసిన పత్రిక: సంఘములో క్రమమును పాటించుట.

ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక: నూతన పురుషునిలో విశ్వాసులందరికీ సమాన స్థాయిని చూపు ఒక నమూనా.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక: యూదా మతమునకు మరియు దానికి సంబంధించిన సమస్త విషయముల కంటే క్రీస్తు ఉన్నతుడుగా ఉండుట, మరియు ఆయన పరిణతి గావించిన నూతన నిబంధన పాతనిబంధన కంటే మెరుగైనదిగా ఉండుట.

యాకోబు పత్రిక: ఆచరణాత్మకమైన క్రైస్తవ పరిపూర్ణత.

1 పేతురు పత్రిక: దేవుని పరిపాలన క్రింద ఉన్న క్రైస్తవ జీవితము.

2 పేతురు పత్రిక: దైవిక సరఫరా మరియు దైవిక ప్రభుత్వము.

1 యోహాను పత్రిక: దైవిక జీవపు సహవాసము..

2 యోహాను పత్రిక: దుర్భోదలో పాలొందుటను నిషేదించుట.

3 యోహాను పత్రిక: సత్యములో జతపనివారికి ప్రోత్సాహము.

యూదా పత్రిక: విశ్వాసము కొరకు పోరాడుట.

ప్రకటన గ్రంథము: దేవుని నిత్య ప్రణాళిక ప్రకారము క్రీస్తే దేవుని పరిపాలనకు కేంద్రముగా ఉండుట.

References: Recovery Version of the Bible

 

అసమానుండే దొరికెన్

క్రీస్తును గూర్చిన అనుభవముసమస్తముగా

510

1    అసమానుండే దొరికెన్

హృది ఉల్లసించెన్

కీర్తింతున్ నాలోని క్రీస్తున్

ఓ ఎంతో ఘనుడు!

 

2    క్రీస్తే దైవ గొర్రెపిల్ల

రక్షణ దెచ్చెను

నీతి సూర్యుండును

తానే స్వస్థతనిచ్చును

 

3    క్రీస్తే ఆ జీవవృక్షమై

మాధుర్య ఫలమున్

నాకిచ్చి తృప్తి పర్చును

అనుదినమును

 

4    క్రీస్తే చీలిన బండయై

జీవ జలమిచ్చున్

నా హృదిలోనే బుగ్గయై

దప్పిక తీర్చును

 

5    జీవం, వెలుగు, మార్గమున్

ఆదరణ క్రీస్తే

ఆరోగ్యమున్, ఆనందమున్

శాంతియును తానే

 

6    జ్ఞానం, శక్తి, అతిశయం,

నీతియును క్రీస్తే

సత్యం, పరిశుద్దతయున్

జయం, విమోచనం

 

7    రక్షకుడున్, కాపరియు,

ప్రభువును క్రీస్తే

ఆలోచనకర్త, తండ్రి,

దైవం, స్నేహితుడున్

 

8    నావికుడు, నాయకుడు,

బోధకుడు క్రీస్తే,

యజమానుడున్, వరుడున్,

శిరస్సును తానే

 

9   ప్రవక్తయు, యాజకుడున్,

రారాజును క్రీస్తే

దేవునికిని నాకును

మధ్యవర్తియాయెన్

 

10   నా విశ్వాసపు కర్తయై

కొనసాగించును నాదు

సంచకరువునై

సత్యసాక్ష్యమిచ్చున్

 

11   నాదు నిత్య గృహమును,

మంచి దేశం క్రీస్తే

నా కోటయు, దుర్గమును,

దాగుచోటు తానే

 

12   ఉదయమున్, పగలును,

సబ్బాతును క్రీస్తే

అమావాస్య, పండుగయు,

నిత్యత్వము తానే

 

13   ఆశయును, ఆశ్రయమున్,

తృప్తియును క్రీస్తే

మోదమిచ్చి అక్కరలన్

అన్నిటినీ తీర్చున్

 

14   సర్వము-ఇమిడియున్న

క్రీస్తే ఆదియును

అంతమును, సర్వములో

సర్వమునైయుండున్

 

15   ఇట్టి సంపదను కల్గి

నా హృది ఉప్పొంగెన్

కీర్తింతును నిత్యమును

అద్వితీయ క్రీస్తున్

 

16   క్రీస్తే నాదు విశ్రాంతియు

నిరీక్షణయును

మహిమయు, ధనమును

సంపదయు తానే

 

17   క్రీస్తే ఉత్తరవాదియు

నా సహోదరుడున్

నాదు ప్రాణప్రియుడును

సన్నిహితుడును

Jump to section