Jump to section

పదవ పాఠము – నూతన యెరూషలేము

ప్రక. 21:2—మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

దైవిక ప్రత్యక్షత అంతటి యొక్క అంతిమ పరిణతి

నూతన యెరూషలేము అనునది పరిశుద్ధ లేఖనములోని దైవిక ప్రత్యక్షత అంతటి యొక్క అంతిమ పరిణతియై ఉన్నది. బైబిలులోని అరవై ఆరు పుస్తకముల ముగింపు ఏదైతే నూతన యెరూషలేముగా ఉన్నదో అది చివరి రెండు పుస్తకములలో ఉండెను. అరవై ఆరు పుస్తకాలలో చిట్టచివరికి ‘‘బయటకు వచ్చునది’’ నూతన యెరూషలేమై ఉన్నది. ఒక్క విషయముగా పరిణతి చెందు నూతన యెరూషలేమును గూర్చి వివరించుటకు బైబిలులోని అరవై ఆరు పుస్తకాలు అనేక విషయములను కలిగియున్నది. బైబిలులోని ప్రతి అనుకూల విషయము ఒక ఫలితమును కలిగియున్నది నూతన యెరూషలేము. (CWWL, 1984, vol. 3, “God’s New Testament Economy,” p. 354)

భౌతికమైన పట్టణము కాదు

ప్రకటన గ్రంథము సంజ్ఞల రూపములో వ్రాయబడెనని మనము చూచితిమి. చివరి సంజ్ఞగానున్న నూతన యెరూషలేము, ఒక భౌతికమైన, నిజమైన పట్టణము అని నీవు చెప్పినట్లయితే, ఈ పుస్తకములో దీపస్తంభములుగానున్న మొదటి సంజ్ఞ మాటేమిటి? మొదటి అధ్యాయములోని ఏడు నక్షత్రములు నిజమైన నక్షత్రములా? మరియు గొర్రెపిల్ల మాటేమిటి? దేవుని గొర్రెపిల్లగానున్న క్రీస్తు నాలుగు కాళ్ళు మరియు చిన్న తోక కలిగియున్న నిజమైన గొర్రెపిల్ల అని నీవు నమ్ముచున్నావా? యూదా గోత్రపు సింహము నిజముగా జంతుప్రదర్శనశాలలో ఉండే నిజమైన సింహమా? ప్రకటన గ్రంథములోనున్న  ఈ సంజ్ఞలను ఈ విధముగా వ్యాఖ్యానించుట అనునది అర్థవంతముగా లేదు. నూతన యెరూషలేము అనునది ఒక సంజ్ఞ. అది యధార్ధమైన, వాస్తవమైన, నిజమైన భౌతికపరమైన పట్టణము కాదు. మహాబబులోను కూడా అబద్దపు సంఘమునకు ఒక సంజ్ఞగా ఉంది. మహాబబులోను మరియు నూతన యెరూషలేము ప్రకటన గ్రంథపు చివరిలోని రెండు సంజ్ఞలైయున్నవి. ఒక పట్టణము అబద్దపు సంఘము యొక్క సంజ్ఞయైయున్నది, మరియు మరొక పట్టణము, పరిశుద్ధ పట్టణము, స్వచ్చమైన సంఘపు అంతిమ పరిణతిగా ఉన్నది. మహాబబులోను అనునది మహావేశ్యగా పిలువబడెను. నూతన యెరూషలేము అనునది గొర్రెపిల్ల భార్యగా పిలువబడెను. ప్రకటన గ్రంథము సంజ్ఞలతో వ్రాయబడిన పుస్తకము గనుక, నూతన యెరూషలేము అనునది ఒక మినహాయింపుగా ఉండరాదు; అది ఖచ్చితముగా ఒక సంజ్ఞ. (CWWL, 1984, vol. 2, “Elders’ Training, Book 2: The Vision of the Lord’s Recovery,” p. 134)

త్రియేక దేవుడు మానవునితో మిళనమగుట

దేవుని నిత్యమైన కట్టడగా, దేవునితో నిర్మించబడిన పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన యుగములలో ఉన్నటువంటి పునర్జన్మించబడిన విశ్వాసుల సమకూర్పుగానున్న నూతన యెరూషలేము అనునది విమోచించబడిన, పునర్జన్మించబడిన, రూపాంతరించబడిన, మరియు మహిమపరచబడిన త్రిభాగీయ మానవుడు ప్రక్రియలు చెంది, పరిణతుడైన త్రియేక దేవునితో మిళనమగుటగా కూడా ఉన్నది. మానవులతో, అనగా ఆయన ఎన్నుకొన్న ప్రజలతో ఒక్కటిగా ఉండుట కొరకు త్రియేక దేవుడు నరావతారము, సిలువ మరణము, మరియు పునరుత్థానములో ప్రక్రియలు చెంది పరిణతుడాయెను. వారు నిత్యత్వపు భవిష్యత్తులో తన భాగస్వామిగా, తన నివాసస్థలముగా, మరియు తనను వ్యక్తపరచుటకు వారిని నిత్యత్వపు భూతకాలమునందు ఎన్నుకొనిన త్రియేక దేవునితో ఒక్కటిగా ఉండుట కొరకు త్రిభాగీయ మానవుడు విమోచించబడెను, పునర్జన్మించబడెను, రూపాంతరించబడెను, మరియు మహిమపరచబడెను.

నిత్యత్వములో తన వ్యక్తత కొరకు  ప్రక్రియలు చెంది పరిణతుడైన త్రియేక దేవుని అంతిమ ప్రత్యక్షత

వీటన్నిటికి అదనముగా, నూతన యెరూషలేము అనునది పునర్జన్మించబడిన, రూపాంతరించబడిన, మరియు మహిమపరచబడిన మానవాళియందు నిత్యత్వములో తన వ్యక్తత కొరకు  ప్రక్రియలు చెంది పరిణతుడైన త్రియేక దేవుని అంతిమ ప్రత్యక్షతగా కూడా ఉన్నది.

References: CWWL, 1984, vol. 3, “God’s New Testament Economy,” ch. 26; CWWL, 1984, vol. 2, “Elders’ Training, Book 2: The Vision of the Lord’s Recovery,” chs. 5-13; The Conclusion of the New Testament, msgs. 254-264; CWWL, 1994-1997, vol. 3, “The Application of the Interpretation of the New Jerusalem to the Seeking Believers,” ch. 1

 

 

IN NEW HEAVEN AND NEW EARTH

Ultimate Manifestation— The New Jerusalem

978

1    In new heaven and new earth

New Jerusalem lies;

Out of God it has its birth,

With God’s radiance thrice.

 

Lo, God’s image it doth bear,

And God’s glory it doth share!

And the Lord Himself is there

In that city of God.

 

2   All the gates are pearls assigned

In the city of gold,

And the street is gold refined

With foundations twelvefold.

 

3    There life’s crystal river f lows

With abundant supplies,

And the tree of life there grows

And all need satisfies.

 

4    God is there, the great I AM,

In that city of light;

God’s the light within the Lamb,

And there never is night.

 

Jump to section