1. ఒకటవ పాఠము – ప్రార్థన

ఒకటవ పాఠము – ప్రార్థన

కొలొస్సీ. 4:2ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి.

ఎఫెసీ. 6:18-ఆత్మలో ప్రతి సమయమునందును ప్రతివిధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.

ప్రార్థన యొక్క అర్థము

నిజమైన ప్రార్థన దేవునికి మరియు మానవునికి మధ్య పరస్పర సంప్రదింపైయున్నది. ప్రార్థన కేవలము మానవుడు దేవుని సంప్రదించుట మాత్రమే కాదు గాని దేవుడు మానవుని సంప్రదించుటయైయున్నది. ప్రార్థనలో మానవుడు దేవుని తాకకపోతే లేక సంప్రదించకపోతే, ఆ ప్రార్థన ప్రామాణికతకు దిగువనున్నట్లే. (Lessons on Prayer, pp. 12, 14-15)

ప్రార్థనలో నిలకడగా ఉండుట

కొలొస్సయులు 4:2లో పౌలు మనలను ప్రార్థనలో నిలకడగా ఉండమని ఆజ్ఞాపించెను. దీని యొక్క అర్థమేమనగా మనము కేవలము ప్రార్థన చేయుట కొనసాగించుట మాత్రమే   గాక, మనము కొనసాగించుటకు తప్పక పోరాడవలెను. మన పరిసర పరిస్థితులన్నియు ప్రార్థనకు విరోధముగా ఉంటాయి. ప్రార్థించుటకు, మనము పరిసరాల, పరిస్థితుల పోటు, ప్రవాహమునకు వ్యతిరేకదిశలో తప్పక వెళ్ళవలెను. మనము ప్రార్థన చేయుటలో విఫలమైతే, మనము క్రిందకు కొట్టుకొని పోతాము. కేవలము ప్రార్థన మాత్రమే పోటుకు వ్యతిరేకముగా ముందుకు వెళ్ళగలుగునట్లు చేయును. కావున, మనము ప్రార్థనలో పట్టువిడువకుండా ఉండుటకు, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. (Life-study of Colossians, pp. 252-253)

మన ప్రార్థనా జీవితమును గూర్చిన మ్రొక్కుబడి

మీరుప్రార్థనలో నిలకడగా ఉండుటకు ప్రయత్నించక ముందు, మన ప్రార్థనా జీవితమును గూర్చి మొదటిగా ప్రభువుతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆయనకు ఒక నిర్దిష్టమైన రీతిలో ప్రార్థించి “ప్రభువా, ప్రార్థన గురించి నీతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పటినుండి నేను ప్రార్థనా జీవితమును కలిగియుంటాననుటకు సాక్షిగా ఆకాశమును, భూమిని పిలుస్తున్నాను. నేను ప్రార్థనలేని వ్యక్తిగా ఉండుటకు బదులుగా నేను ప్రార్థించే వ్యక్తిగా ఉంటాను.” అని చెప్పుము. మీరు ప్రభువుకు ఇటువంటి ప్రార్థన చేయకపోతే, మీరు ప్రార్థనలో నిలకడగా ఉండలేరు. మనము ఆయనతో,  “ప్రభువా నేను దీని కొరకు తీవ్రముగా ఉన్నాను. నేను ప్రార్థనా జీవితమును కలిగియుండునట్లు నన్ను నీకు అర్పించుకుంటున్నాను. ప్రభువా నన్ను ప్రార్థనా ఆత్మలో ఉంచుము.ఒక వేళ నేను దీనిని మరచిపోయినా లేక అశ్రద్ధ చేసినా, నీవు మరచిపోవని నాకు తెలుసు. ప్రార్థనను గూర్చి నాకు మరలా మరలా జ్ఞాపకము చేయుము” అని చెప్పవలెను. ఇటువంటి ప్రార్థన ప్రభువుతో చేసిన ప్రమాణముగా యెంచబడును. మనమందరమూ మన ప్రార్థనా జీవితమును గూర్చి ఆయనతో వాగ్దానము చెయ్యవలసిన అవసరమున్నది. మనము ప్రభువుతో “ప్రభువా, నేను ఈ వాగ్దానమును మరచిపోయినా, నీవు మరచిపోవు. ప్రారంభము నుండి, ప్రభువా, స్పష్టముగా నీకే బాధ్యతను అప్పజెప్పాలనుకుంటున్నాను. ప్రభువా నన్ను విడువకు. ప్రార్థించుటకు జ్ఞాపకము చేయుము.” అని తప్పక చెప్పవలెను.

నిర్థిష్టమైన సమయములను ఏర్పాటు చేసుకొనుట

ప్రార్థన గురించి మనము ప్రభువుతో ఇటువంటి వ్యవహరింపు చేసుకున్న తరువాత, ప్రార్థన కొరకు మనము తప్పక నిర్దిష్టమైన సమయమును కేటాయించవలెను. ఉదాహరణకు, ప్రతిరోజు ఉదయమున నీవు 10 నిముషముల సమయమును దాచిపెట్టవలెను. ఈ సమయములో ప్రార్థనకు తప్పక ఉన్నత ప్రాధాన్యత నివ్వవలెను. ప్రార్థన అత్యంత ప్రాముఖ్య వృత్తిగా ఉన్నదనియు మరేదియు కూడా దానిని అడ్డగించుటకు అనుమతించ బడకూడదని మన వైఖరి ఉండవలెను. మనకు ఇటువంటి వైఖరి లేకపోతే, మనము విజయవంతమైన ప్రార్థనా జీవితమును కలిగియుండలేము. ప్రతిదినము మనము ఎన్ని విషయములు చెయ్యవలసి వచ్చినా, మనము ఇక్కడా అక్కడా కొన్ని నిముషముల సమయమును ప్రార్థన కోసము మిగుల్చుకొనగలము. మనము ఉదయకాలమున కొంత ప్రార్థించవచ్చును. తరువాత మరలా మధ్యాహ్నమందు, వృత్తి తరువాత, మరియు ఇతర సమయములను సాయంకాలమందు ప్రార్థించుటకు కలిగియుండవచ్చును. (pp. 579 – 580)

 

References: Lessons on Prayer, ch. 1; Lifestudy of Colossians, msgs. 30, 65

 

యేసుతో సహవాసము ప్రార్థనలో చేయుము

ప్రార్థన— ప్రభువుతోనైన సహవాసము

784

1    యేసుతో సహవాసము

ప్రార్థనలో చేయుము

ఆయన సన్నిధిలోన

అపేక్షతో వినుము

 

యేసుతో సహవాసము

ఆత్మలో ప్రార్ధించుటే

ఆయన స్వరమునకై

వేచియుండుమిచ్చటే

 

2    యేసుతో సహవాసము

కొరకై ప్రార్ధించుము

ముసుగు తొలగునట్లు

స్వచ్చమైన హృదితో

 

3    యేసుతో సహవాసమున్

నమ్మకముతో కోరి

ఆత్మయైన ఆయనను

స్పృశించుట నేర్వుము

 

4    యేసుతో సహవాసమున్

యధార్ధముగా కోరి

ప్రార్ధించుము ఆత్మలోనే

అంతరంగ స్పర్శతో

 

5    యేసుతో  సహవాసమున్

కోరి ప్రార్థన చేసి

పొందుమాయన భారమున్

పూర్ణ విధేయతతో

 

6    యేసుతో  సహవాసము

కొరకై ప్రార్ధించుము

తన సౌందర్యమున్ పొంది

వెదజల్లు తేజస్సున్

2. రెండవ పాఠము – బైబిలు పఠనము

రెండవ పాఠము – బైబిలు పఠనము

ఎఫెసీ. 1:19మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ  స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల ఆత్మను అనుగ్రహించునట్లు.

కొలొస్సీ. 3:16-సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

ఒక విశ్వాసి ప్రార్థించవలసిన అవసరమున్నది; అతడు బైబిలు కూడా చదవవలసిన అవసరమున్నది. ప్రార్థన శ్వాసించడము తోను మరియు బైబిలు పఠనము తినుటతోను పోల్చబడినది. ఈ రెండూ ప్రతి విశ్వాసి అనుదినము ఆచరించాలి.

బైబిలు యొక్క మూలము

బైబిలు యొక్క మూలము దేవుడైయున్నాడు; దేవుడు తానే తన మాటలను తన ఆత్మ ద్వారా ఆయన లేఖనముల యొక్క రచయితలలో నుండి ఊదెను (2 తిమో. 3:16). కేవలము మాటలే కాదు గాని ఆత్మ కూడా బయటకు ఊదబడినది.

బైబిలు అనేది దేవుడు తన ఆత్మ ద్వారా మనుష్యులలోనుండి తన మాటలను ఊదడమై యున్నందున, అవి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినవిగాను దేవుని నుండి దేవుని వాక్యము మనుష్యులు మాట్లాడుటయై యున్నది (2 పేతురు 1:21). కావున, బైబిలు అనేది ఇశ్రాయేలీయులలోని ప్రవక్తలు, నాయకులు మరియు రాజుల వంటి కొంతమంది పాత నిబంధన పరిశుద్ధులు మరియు అపొస్తలులు, మార్కు మరియు లూకా వంటి వివిధ క్రొత్తనిబంధన పరిశుద్ధులు చేత వ్రాయబడినదిగా దేవుని నుండి వచ్చినదైయున్నది.

బైబిలు యొక్క అంతరాంశము

బైబిలు యొక్క అంతరాంశము విస్తృతమైనది మరియు సమగ్రమైనది; ఈ అంతరాంశము యొక్క రెండు ప్రధాన పార్శ్వములు సత్యము మరియు జీవము. దేవుని యొక్క వాస్తవికత, మానవుని యొక్క వాస్తవికత, విశ్వము యొక్క వాస్తవికత, ప్రస్తుత యుగము, రాబోయే యుగము మరియు నిత్యత్వపు యుగములోని విషయముల యొక్క వాస్తవికత మరియు ప్రత్యేకముగా దేవుని చేత నియమించబడిన క్రీస్తు మరియు ఆయన చేత ఎన్నుకొనబడిన సంఘము యొక్క వాస్తవికత వంటి, విశ్వములోని వాస్తవికతలన్నిటి యొక్క ప్రత్యక్షత మరియు జ్ఞానమును ఈ సత్యము మనకు తీసుకువచ్చును. మనము పునర్జన్మించబడి, ఎదిగి, రూపాంతరించబడి, దేవుని వ్యక్తపరిచే క్రీస్తు యొక్క స్వరూపములోనికి సమరూపము చెంది, మనము దేవుని వ్యక్తతగా అగునట్లు మన జీవముగా ఉండుటకు దేవుడు వచ్చుటయే జీవమైయున్నది.

‘‘నీ (తండ్రియైన దేవుని) వాక్యమే సత్యము (వాస్తవికత)’’ (యోహాను 17:17). ప్రభువైన యేసు యొక్క ఈ మాట సూచించునదేమనగా, బైబిలులోని దేవుని మాట సత్యమై యున్నది.;  మనము పొందుకొనుటకు సాక్షాత్తు దేవుని యొక్క వాస్తవికతను మరియు తన ప్రణాళిక యొక్క వాస్తవికతను అది బయలుపరచును.

అపొస్తలుల కార్యములు 5:20లో దేవునిదూత పేతురుతో దేవుని జీవముగల మాటలను ప్రకటించమని ఆజ్ఞాపిస్తూ మాట్లాడెను. బైబిలులోని మాటలే జీవముగల మాటలు, అపొస్తలులు వాటినే ప్రకటించిరి. మాటలు జీవమును కలిగియున్నందున, అవి జీవమును సరఫరా చేయగలవు మరియు ఈ జీవము సాక్షాత్తు దేవుడే. బైబిలు యొక్క ప్రధాన అంతరాంశము కేవలము సత్యము మాత్రమే కాదు గాని జీవము కూడా. (Life Lessons, vol. 1, pp. 30-31)

బైబిలును పఠించుట ఎట్లు

బైబిలు దేవుని వాక్యమైనందున, దాని స్వభావము దైవికము మరియు ఆత్మీయమైనదై యున్నది. మనము దానిని మన వ్యక్తిత్వము యొక్క ప్రతిభాగముతోను చదవాలి.

మొదట, దానిని అవగాహనతో చదువుట

బైబిలును చదువుటలో,  మానవ భాషలో వ్రాయబడిన దాని పాఠ్య భాగమును అర్థము చేసికొనుటకు మరియు దాని అర్థమును తెలిసికొనుటకై మొదట మనము మన మనస్సు యొక్క అవగాహనను ఉపయోగించాలి (లూకా 24:45).

తరువాత దానిని జ్ఞానముతో పఠించుట

బైబిలులోని దేవుని చేత బయలుపరచబడిన దైవిక విషయములకు సంబంధించిన వాక్యమును మనము జ్ఞానముతో అవగాహన చేసుకోవలసిన అవసరమున్నది (కొలొ. 3:16). జ్ఞానము అనేది మన ఆత్మతో కలుపబడియున్నదని ఎఫెసి 1:17 కూడా మనకు చూపుచున్నది. ఈ జ్ఞానము అనేది మనము స్వాభావికముగా కలిగియున్నది కాదు గాని, ప్రార్థన ద్వారా పొందుకున్నదై యున్నది. మనాత్మలో ఉన్నఅటువంటి జ్ఞానము మన మనస్సులోని అవగాహన కన్నా లోతైనది మరియు ఉన్నతమైనది. మనము బైబిలు అక్షరాలను మన మనస్సులోని అవగాహనతో అర్థము చేసుకొందుము మరియు బైబిలులోని సత్యమును మన ఆత్మలోని జ్ఞానముతోఅర్థము చేసుకొందుము.

చివరగా, దానిని ఆత్మతో స్వీకరించుట

ఎఫెసీయులు 6:17-18 లో ఆత్మలో ప్రార్థించుట ద్వారా దేవుని వాక్యమును స్వీకరించాలని మనకు చెప్పబడింది. మనము దేవుని వాక్యమును చదివి, స్వీకరించునప్పుడు మనము మన ఆత్మను కూడా సాధకము చేయవలసిన అవసరమున్నదని ఇది మనకు బయలుపరచుచున్నది. నిస్సందేహముగా ప్రార్థన ద్వారా ఇది జరుగుతుంది. కావున, బైబిలు పఠనములో, మనము పాఠ్యభాగము యొక్క అర్థమును మన అవగాహన ద్వారా గ్రహించి మరియు ఆ పాఠ్య భాగము యొక్క సత్యమును మన జ్ఞానముతో అర్థము చేసుకొనిన తరువాత, మన వ్యక్తిత్వము యొక్క అత్యంత లోతైన భాగములోనికి లేఖనములలోని సత్యములను ప్రార్థన ద్వారా స్వీకరించుటకై మన ఆత్మను ఉపయోగించవలెను. వేరు మాటల్లో చెబితే, మనము పాఠ్య భాగమును అవగాహన చేసికొని దానియందలి సత్యమును స్వీకరించిన తరువాత, మనమింకను మనమర్థము చేసుకొని గ్రహించినదానిని మన ఆత్మలో ఇమిడింపజేసుకొని మన జీవ సరఫరాగాను మరియు మన ఆత్మీయ అనుభవమునకు ఆధారము అగునట్లును దానిని ప్రార్థనగా మార్చుటకు మన ఆత్మను సాధకము చేయవలెను.

ప్రార్థనా పఠనము

బైబిలు చదువుటకు మరొక సరళమైన, ఆత్మసంబంధమైన మరియు అత్యంత ప్రయోజనకరమైన విధానమేదనగా ప్రార్థనా పఠనము. మనము బైబిలు పాఠ్య భాగమును ప్రార్థనగా తీసుకొని, దానిని ప్రార్థనా పఠనము చేతుము. మనము చదువుట, ప్రార్థించుట ఒకే సమయములో కాదు, గాని మనము చదువుచున్న పాఠ్య భాగమును నేరుగా మనము ప్రార్థించే మాటలుగా మార్చుదుము కూడా. కొన్ని సమయాల్లో, పాఠ్య భాగమును ప్రార్థన ద్వారా మనకుమనమే అన్వయించు కొనవచ్చును. మనమెంతెక్కువగా ఈ విధమైన ప్రార్థనా పఠనమును మరలామరలా చేయుదుమో, అంతెక్కువగా మన ఆత్మ పైకెత్తబడి విడిపించబడును మరియు మనము పొందే ప్రయోజనము మరెక్కువ గొప్పదిగాను లోతైనదిగాను మరియు ఐశ్వర్యవంతముగాను ఉండును.

బైబిలు చదువుటకు సమయము

బైబిలు మనము ఏ సమయములోనైనా చదువవచ్చును మరియు అవసరమైన ప్రతిసారి దానిని చేయవలెను. ఎట్లైనను సామాన్యముగా మాట్లాడితే, ఏ వ్యక్తులనైనా లేదా ఏ విషయములనైనా సంప్రదించకముందు ఉదయమున చదువుట ఉత్తమము, మరియు మరిముఖ్యముగా చదువుటను ప్రార్థనతో జతచేయుట మంచిది. అటువంటి సమయాలు ఎక్కువ సేపు వుండకూడదు. అత్యంత అనుకూలమైన విధానము ఏదనగా పదినిమిషాలు పాటు ప్రార్థించుట మరియు పది నిమిషాలు పాటు చదువుట. కొన్నిసార్లు చదువుటను ప్రార్థనతో కలిపి మిళనము చేయవచ్చును. (Life Lessons, vol. 1, pp. 38-40)

Reference: Life Lessons, vol. 1, chs. 5, 6

సంకీర్తన-815

CHRIST IS THE WORD AND SPIRIT TOO

Study of the Word—The Word and the Spirit

815

1    Christ is the Word and Spirit too,

And as the Spirit in the Word;

And all the words He speaks to us

Are life and spirit thus conferred.

 

2    The Holy Word we have without;

The Holy Spirit is within.

The greatest gifts divine are these,

That we may God enjoy therein.

 

3    The Word the Spirit doth express;

The Spirit its reality.

They’re but two aspects of one thing

And should not separated be.

 

4    Whene’er the Spirit lights the Word,

The Word becometh life to us;

When Word from Spirit is divorced,

’Tis empty mental stimulus.

 

5    When we the Word in spirit touch,

As life the Spirit it becomes;

The Spirit, when expressed from us,

As words of life to others comes.

 

6    Our spirit we must exercise

To take the Word most inwardly

And then to give the Spirit forth;

The two as one with us should be.

 

7    Lord, may Thy Word in me become

The Spirit as my life supply,

And may Thy Spirit in Thy Word

My true expression be thereby.

 

3. మూడవ పాఠము – ఆత్మసంబంధమైన సహచరులు

మూడవ పాఠము – ఆత్మసంబంధమైన సహచరులు

2 తిమోతి 2:22నీవు యౌవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, స్వచ్ఛహృదయులై ప్రభువును పిలుచు వారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

దేవుడు తన చలనమును కొనసాగించుటకు యౌవ్వన జనమును పిలుచుట

ప్రభువు పునరుద్ధరణలో యౌవ్వనస్థులుగా ఉండుట మంచిది. ప్రతి యుగములోను మరియు తరములోను దేవుడు తన చలనమును కొనసాగించుటకు యౌవ్వన జనము యొద్దకు వచ్చియుండెను. దేవుడు యౌవ్వన ప్రజలను వాడుకొనగోరుతున్నాడని బైబిలు మరియు సంఘచరిత్ర రెండూ మనకు చూపించుచున్నవి. ఆదాముతో దేవుడున్నప్పుడు అతడు చాలా చిన్నవాడై యున్నాడని మనము చెప్పవచ్చును, ఎందుకంటే అతడు అప్పడే సృజించబడియున్నాడు. జీవపు రేఖలోనున్న మనిషి యొక్క రెండవ తరమైన హేబెలు దేవునికి బలులు అర్పించినప్పుడు బహుశా చాలా చిన్నవాడై యుండవచ్చును (ఆది. 4:2,4). దేవుని సన్నిధిలో నడుచుటను ఆరంభించినప్పుడు హానోకు చాలా చిన్నవాడై యుండెను. అతడు దేవునితో నడుచుటను ఆరంభించినప్పుడు అతనికి అరవై ఐదు యేళ్లు, అయితే అతని కాలములో అరవై ఐదు యేళ్లున్న మానవుడు చాలా చిన్నవాడు. అతడు దేవునితో మూడువందల యేళ్లు నడిచాడు, మరియు దేవుడు అతనిని మూడు వందల అరవై ఐదు యేళ్ల వయస్సులో కొనిపోయెను (5:21-22).

ఒక యౌవ్వనస్థుడిగా ప్రభువు యొక్క సాక్ష్యమును కొనసాగించుటకై తిమోతి అపొస్తలుడాయెనని (1 థెస్స. 1:1; 2:6) కూడా బైబిలు మనకు చెబుతుంది. 2వ తిమోతి 2:22లో పౌలు ఈలాగు వ్రాసెను, ‘‘యౌవ్వనేచ్ఛలనుండి పారిపొమ్ము.’’ ఆ పత్రికను అందుకునేవాడు కూడా ఒక యవ్వనస్థుడని ఇది సూచించును. నేను యుక్తవయస్కుడునై యున్నప్పుడు దేవుని చేత పిలువబడితిని. సరియైన సంఘ జీవనము యొక్క ప్రభువు పునరుద్ధరణ యొక్క ఆరంభ దశలో ఉన్నవారందరు యేభై యేళ్ల క్రితము వారి ఇరవైలలో ఉన్న యౌవ్వన జనమై ఉండిరి. చాలా కొద్ది మంది ఇరవై ఐదుకు పైబడి ఉండిరి. చాలామంది ఉన్నత పాఠశాల లేదా కళాశాలలో ఉండిరి.

అపవిత్ర పరచబడకుండునట్లు మన హృదయమును స్థిరపరచుకొనుట

దానియేలు ఒక యౌవ్వనస్థుడిగా చెరలోనికి తీసుకొనిపోబడెను. యూదుల పిల్లలకు చెందినవారిగానుండిన అతడు మరియు అతని స్నేహితులు బోధించబడుటకై  రాజుకోటలోనికి తీసుకురాబడుటకు ఎన్నుకొనబడ్డారు. విగ్రహాలకు అర్పించబడిన ఆహారమును వారు తినవచ్చా లేదా అనేది, అక్కడ వారు నిర్ణయించవలసి వచ్చెను. ఆ మాంసము ఇంకేమాత్రము కేవలము ఆహారముగా ఉండలేకపోయెను; అది దయ్యాల సంబంధమైనది. దానిని తినుటనేది చిన్న విషయము కాదు. దానియేలు మరియు అతని సహచరులు అపవిత్రపరచబడకుండవలెనని, అపవిత్రపరిచే మూలకములో ఎటువంటి పాలిపంపులు ఉండకూడదని వారి హృదయమును స్థిరపరచుకొనిరి (దాని. 1:8).

దానియేలు మరియు అతని సహచరులు రాజు యొక్క ఆహారమును తినకుండుటనేది, విగ్రహారాధన అనే ప్రవాహముకు ఎదురుగా దేవుని సాక్ష్యముగా ఉండుటకు దృఢముగా చెప్పుకొనుటై యుండెను. దేవుని దృష్టిలోను మరియు దయ్యము దృష్టిలో కూడా ఇది గొప్ప విషయముగా ఉండెను. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధములో చేసే పోరాటముగా ఉండెను. అటువంటి పరిస్థితిలో దేవుని చేత పట్టబడిన వారిలో దానియేలు ఒకడు. తన యౌవ్వనము నుండి అతడు దేవుని చేత పిలువబడి, పట్టబడి మరియు సంపూర్ణముగా ఆక్రమించబడెను. తుదకు, చెరనుండి తిరిగి వచ్చుటలో తీసుకురాబడినవాడును అతడే. బబులోను రాజ్యము పారసీక రాజ్యముగా మారియుండిన తరువాత దానియేలు ఇంకను దర్యావేషు మరియు కోరెషు యొక్క పాలనలో జీవించుచుండెను (9:1-2; 1:21). డెబ్భై సంవత్సరముల తరువాత చెర పూర్తవుతుందని యిర్మీయా ద్వారా ఇవ్వబడిన ప్రవచనమును అతడు చదివినప్పుడు, అతడు దేవుని ప్రజల కొరకు ప్రార్థించుట మొదలుపెట్టెను (దాని. 9:1-19). ఇశ్రాయేలు చెరనుండి తిరిగివచ్చుటనే దానియొక్క నెరవేర్పును అతని ప్రార్థన తీసుకువచ్చింది, కోరెషు యేలుబడియందు మొదటి సంవత్సరములో అతని శాసనము నుండి ఇది ఆరంభమాయెను (ఎజ్రా 1:1-3).

సహచరుల అవసరము

నీవు పారిపోయే మరియు వెంటాడే జీవితమును కలిగియుండవలెను. అయినప్పటికి, నీవు పారిపోయి వెంటాడుటకు ప్రయాసపడినను, దానిని నీయంతటనీవు చేయలేకపోతున్నావని కనుగొంటావు. యౌవ్వనేచ్ఛలనుండి పారిపోయి క్రీస్తును వెంటాడుటకు మార్గము 2 తిమోతి 2:22లోని చివరి భాగములో ఉన్నది. ఈ వచనము ఈలాగనుచున్నది, ‘‘నీవు యౌవ్వనేచ్ఛలనుండి పారిపొమ్ము, స్వచ్ఛహృదయులై ప్రభువును పిలుచువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.’’ స్వచ్ఛమైన హృదయములో నుండి ప్రభువు నామమును పిలిచేవారు నీకు అవసరము. నీకు నీవే సరిపోవు. తాళపు చెవి ఏమిటంటే ‘‘వారితో.’’ యౌవ్వనస్థునిగా నీవు చాలా బలవంతుడవు కావచ్చు, కాని నీ బలము ఏమీ కాదు. శత్రువైన సాతాను నీ కంటే బలమైనవాడు, అయితే దేవుని సార్వభౌమ ఏర్పాటు క్రింద నీవు ‘‘వారి’’ ని కలిగియున్నావు. ‘‘స్వచ్ఛమైన హృదయములో నుండి ప్రభువును పిలిచే వారితో’’  నీవు వెంటాడవలెను.

ప్రభువును వెంటాడుటలో నిజమైన  సహచరులను వెదకుట

యౌవ్వనజనము ఇతరులను కొంతమందిని సహచరులుగా తీసుకొనుటకు నిర్ణయించుకొనవలెను. దానియేలు ముగ్గురు స్నేహితులను కలిగియుండెను. ప్రభువైన యేసుక్రింద నూతన నిబంధనలో శిష్యులలో ఏ ఒక్కరూ వైయక్తికులుగా లేరు. వారు ఇద్దరిద్దరుగా పంపబడిరి; వారందరు సహచరులను కలిగి యుండిరి. సువార్తలలో పేతురు మరియు అంద్రెయ మరియు యాకోబు మరియు యోహానులు జంటలుగానే సూచించబడిరి (మత్త. 4:18,21).

యౌవ్వనజనముకు కనీసము ఒక సహచరుడు అవసరము. ప్రభువును వెదకుటలో నీవు నిజమైన సహచరుని కలిగియున్నావా లేదా అనేది ప్రభువు ఎదుట నీవు పరిగణించవలెను. యెహోషువా కాలేబు తన సహచరుడని చెప్పగలిగి యుండవచ్చును, మరియు కాలేబు యెహోషువా తన సహచరుడని చెప్పగలిగియుండవచ్చును. ఎట్లైనను ముగ్గురు లేదా నలుగురు సహచరులు కలిగియుండుట ఉత్తమం. ఎందుకంటే నాశనకరమైన సమయాల్లో మనకు అనేకమైన సహచరులు అవసరము. ప్రతి దిక్కు నుండి మనకు ఊతమిచ్చుటకు మనము నలుగురు సహచరులను కలిగియున్నచో, ఎటువంటి తుఫాను వచ్చినను మనము పడజాలము. ఒకడు తనంతటతానే నిలిచియున్న యెడల, అతడు సాధ్యమైనంతవరకు శత్రువుచేత పట్టబడును. జూనియరు హైస్కూలు నుండి నలుగురు లేకు ఐదుగురు యౌవ్వనస్థులు సహచరులుగా కూడి వచ్చుట అత్యుత్తమము. యౌవ్వన సహోదరులు ఒకరికొకరు సహచరులై యుండనిద్దాము, మరియు యౌవ్వన సోదరీలు ఒకరికొకరు సహచరులై యుండనిద్దాము.

మనకు సహచరులు అవసరము అనేది మనంతటమనము నిలబడుటకు మనము చాలా బలహీనులమైనందువలన మాత్రమే కాదు గాని మనమందరము చాలా స్వాభావికమైనవారైనందు వలన కూడా. మన స్వభావిక తత్వము ప్రకారము, మనము సహచరులను కలిగియుండుట చాలా కష్టతరము. మన వైయక్తికత మనకెంతో సంతోషము. మనము మన వైయక్తికతను ఎంతో ఆస్వాదిస్తాము. మనము ఒక సహోదరుడు లేదా ఒక సహోదరి కొరకు పట్టించుకొనము. ఎందుకంటే వారు మనలా లేరు. ఇతరులు మనలా ఉండాలని మనము డిమాండు చేస్తాము. ప్రజలు మనలా వుండాలని కోరుకోవడము దయ్యానికి సంబంధించినది. మనము ప్రభువును ప్రేమించినట్లయితే, మనము ఏ యౌవ్వన సహోదరుడు లేదా సహోదరి యొద్దకైనా, వాళ్లు ఎలా ఉన్నారో పట్టించుకొనకుండా వెళ్లగలగాలి. వారు నెమ్మదిగా ఉండవచ్చును లేదా తొందరగా ఉండవచ్చును, తెలివితక్కువగా లేదా తెలివైనవారిగా ఉండవచ్చును, నీలాగ ఉండవచ్చును లేదా నూరుశాతము నీకు భిన్నముగా ఉండవచ్చును. మనము అన్ని భేదములను మరిచిపోవలెను. మనము సహచరులను కలిగియుండవలెను. యౌవ్వనజనము ఈ విధముగా కూడినట్లయితే సాతానుడు సిగ్గుపరచబడతాడు. ఇదొక గొప్ప విషయము.

సహచరులను (నీకిష్టమొచ్చిన రీతిలో) కట్టులేని విధానములో కలిగియుండవద్దు. ఒక సహోదరుని సహచరునిగా నీవిష్టపడుచున్నందున సహచరునిగా తీసుకొనవద్దు మరియు రేపు నీవు అతనిని ఇష్టపడనందున తృణీకరించవద్దు. అతడు సహోదరుడైతే చాలు, నీవతనిని తీసుకొనవలెను. ఇది నిన్ను లోపరచుకొని విరుగగొట్టును. నీవు విరుగగొట్టబడవలసిన అవసరమున్నది. నిన్ను ఎవరు విరుగగొట్టును? భార్యలు బాగా ‘‘విరుగగొట్టేవారు,’’ అయితే భర్తలను పూర్తిగా విరుగగొట్టుటకు భార్యలే చాలునని నేను నమ్మను. మీరెవరితోనైతే కూటములలో ఉంటున్నారో ఆ సహోదర సహోదరీలే బాగా ‘‘విరుగగొట్టేవారు’’.

యవ్వనేచ్ఛలనుండి పారిపోవుట మరియు ప్రభువును సహచరులతో కలిసి వెదకుట

నలుగురు లేదా ఐదుగురు సహచరులు వచ్చేటట్లు యౌవ్వనజనము ప్రభువు వైపు చూడవలెను. లోకములోని ప్రజలు కూడా ఐక్యమగుట శక్తి అని అందురు. నాఅంతట నేను అనేకమైన పనులను చేయుటకు ధైర్యము చేయను, గాని నేను నలుగురు సహచరులను కలిగియున్నచో, నేను ఏదైనా చేయుటకు ధైర్యము చేతును. ఐదుగురు సహచరులు ఎల్లప్పుడు ప్రభువు నామమును కలిసి పిలువవలెను (2 తిమోతి 2:22). సహవాసము చేయుటకు, ప్రార్థనా పఠనము చేయుటకు, ప్రార్థించుటకు మరియు క్రొత్తవారి పట్ల శ్రద్ధ వహించుటకు ఎల్లప్పుడు వారు కూడి రావలెను. ఒక సహోదరుని సంరక్షణ క్రిందనున్న క్రొత్తవారు, మరొక సహోదరుని సంరక్షణ క్రిందనున్న క్రొత్తవారై కూడా వుండవలెను. ఈ విధముగా ఒక ఐదుగురు పరిశుద్ధుల గుంపు వారి సంరక్షణ క్రింద పదిహేను మంది క్రొత్త వారిని కలిగి యుండును. ఈ క్రొత్తవారందరూ రక్షింపబడెదరు. పాతనిబంధనలోని మరియు క్రొత్తనిబంధనలోని పరిశుద్ధుల కొరకైన నియమమేనగా వారు కలిసి గుంపుగా కూడుకొనుట. యౌవ్వన జనము యవ్వనేచ్ఛలనుండి పారిపోయి ప్రభువును కొంతమంది సహచరులతో వెంటాడవలెను. (CWWL, 1975-1976, vol. 1, “Fellowship with the Young People,’’ pp. 3-4, 6-10)

Reference: CWWL, 1975-1976, vol.   1, “Fellowship with the Young People,” ch. 1

 

సంకీర్తన-860

BLEST BE THE TIE THAT BINDS

The Church—Her Fellowship

860

1    Blest be the tie that binds

Our hearts in Christian love;

The fellowship our spirit finds

Is like to that above.

 

2    Before our Father’s throne,

We pour our ardent prayers;

Our fears, our hopes, our aims are one-

Our comforts and our cares.

 

3    We share our mutual woes;

Our mutual burdens bear;

And often for each other f lows

The sympathizing tear.

 

4    When we asunder part,

It gives us inward pain;

But we shall still be joined in heart

And hope to meet again.

 

5    From sorrow, toil, and pain,

And sin we shall be free;

And perfect love and oneness reign

Through all eternity.

4. నాల్గవ పాఠము – ఆత్మను సాధకము చేయుట

నాల్గవ పాఠము – ఆత్మను సాధకము చేయుట

2 తిమోతి. 1:6-7ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప జేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని, పిరికితనము గల ఆత్మ నియ్యలేదు.

మన మానవాత్మను సాధకము చేయుట

నేడు మనాత్మలో మనము అనుకూలముగా ఏమి చేసినను అది ఒక రకమైన సాధకము. గ్రీకులోని సాధకమునకున్న పదము ఇంగ్లీషు పదమైన జిమ్నాస్టిక్స్ ‌‌‌‌‌‌‌నకు (కసరత్తు) ఆధారమై యున్నది. జిమ్నాస్టిక్స్ (కసరత్తు) లో పాల్గొనుటకు, ఒకడు తన భౌతిక వ్యక్తిత్వమును సాధకము చేయుటకు తన శక్తినంతటిని ఉపయోగించవలెను. మనము మనాత్మను ఇదే విధముగా సాధకము చేయాలి. మన చుట్టూ ఉన్న పర్యావరణము సాధకము చేయుటకు మనకు సహాయపడదు. మనలను తగ్గించాలనే ఉద్దేశమును అది కలిగి వుంటుంది. పరిస్థితి మొత్తము ప్రయాసపడుటను కొనసాగించుటకు సహాయపడదు. మనలను సోమరిగా ఉంచుటకే అది సహాయపడును; మనము వెనక్కి జారిపోవుటకు అది సహాయపడును. ఇది క్రిందికి వెళ్లే ప్రవాహము. క్రిందకు వెళ్లే ప్రవాహము మనము క్రిందకు వెళ్లుటకు సహాయపడును. వాస్తవానికి, ఆ ప్రవాహము నిన్నుమోసుకొనిపోవును. అయితే నీవు పైకి వెళ్లుచున్నట్లయితే, నీవు సాధకము చేయవలెను మరియు నీవు ప్రయాసపడవలెను.(CWWL, 1979, vol. 1, “Basic Lessons on Life,” p. 598)

ప్రభువు ఉంటున్న మనాత్మను సాధకము చేయుట చేత దేవభక్తి విషయమై సాధకము చేసుకొనుట

మొదటి తిమోతి 4:7 ఈలాగనుచున్నది, ‘‘దేవభక్తి విషయమై నీకు నీవే సాధకము చేసికొనుము.’’ రెండవ తిమోతి 1:7 మనకీలాగు చెప్పుచున్నది, ‘‘దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని, పిరికితనము గల ఆత్మ నియ్యలేదు.’’ తరువాత 2 తిమోతి 2:22 ఈలాగనుచున్నది, ‘‘ప్రభువు మీ ఆత్మతో నుండునుగాక.’’ మనమీ వచనములన్నిటిని కలిపి ఉంచిన యెడల, దేవభక్తి విషయమై సాధకము అనేది ప్రభువున్న ఆత్మను సాధకము చేయడము మీదనే ఆధారపడి ఉన్నదని మనము చూడగలము. దేవభక్తి విషయమై నీకు నీవే సాధకము చేసుకొనిన యెడల, నీ ఆత్మను నీవు ఎట్లు సాధకము చేయుచున్నావో నీవు ఎరుగవలెను, ఎందుకంటే స్వయంగా దేవుడే నీ ఆత్మలో ఉన్నాడు. ఆత్మ సాధకమునకు ఈ వచనములు లేఖన ఆధారమై వున్నాయి. (CWWL, 1965, vol. 3, “Our Human Spirit,” p. 273).

ఆత్మను సాధకము చేయుటకు గల మార్గము

ప్రభువు నామమును పిలుచుట చేత

మనాత్మను సాధకము చేయుటకు రహస్యములలో ఒకటి ప్రభువు నామమును పిలుచుట. మనాత్మను సాధకము చేయుటలో ప్రభువు నామమును పిలుచుట అత్యుత్తమమైన రహస్యమని మనము పరిగణించవచ్చును…బహుశా నీవు ప్రార్థించుట ఆరంభించునప్పుడు నీవు నీ మనస్సులో ఉందువు; అయితే ఎక్కువ ప్రార్థించుటలో అభ్యాసము అయిన తరువాత, నీవు క్రమేణా ఆత్మలో ఉందువు. మరింత అభ్యాసము తరువాత, నీవు ప్రార్థించునప్పుడెల్లా, నీవు నీ ఆత్మలోను మరియు నీ ఆత్మతోను ప్రార్థించే స్థానమును చేరుకొనెదవు. ప్రార్థన అనేది కేవలము ప్రభువుకు విజ్ఞాపన చేయుట మాత్రమే కాదు గాని, అంతకంటే దేవునిని సంప్రదించుట మరియు దేవునితో సహవాసము చేయుట. కావున, ప్రార్థించుటకు అత్యుత్తమమైన మార్గము ప్రభువు నామమును పిలుచుట. బైబిలు కూడా మనకు ఎడతెగక ప్రార్థించమని (1 థెస్స. 5:17) చెప్పుచున్నది. ఎడతెగక ప్రార్థించుటకు ఏకైక మార్గము ప్రభువు నామమును పిలుచుట.  (CWWL, 1984, vol. 1, “The Four Crucial Elements-Christ, the Spirit, Life, and the Church,” p. 200)

దేవుని వాక్యమును ప్రార్థనా పఠనము చేయుట చేత

వాక్యమును ప్రార్థనతో మరియు ప్రార్థన ద్వారా చదువుట, వాక్యమును ప్రార్థనా పఠనము చేయుట, వాక్యమును చదువుటకు అత్యుత్తమమైన మార్గము. కేవలము చదువుటకు మన కళ్లు మరియు మన అవగాహన మరియు మన మనస్తత్వముమాత్రమే కావాలి. అయితే దేవుని వాక్యమును మన వ్యక్తిత్వము యొక్క లోతుల్లోకి స్వీకరించుటకు, మనాత్మ అవసరమైనది మరియు మనాత్మను సాధకము చేయుటకు విజయవంతమైన మార్గము ప్రార్థించుటయే. మనము ప్రార్థించునప్పుడెల్లా, మనాత్మను అప్రయత్నముగానే మనము సాధకము చేతుము. తరువాత మన కళ్లతో చదివినది మరియు మన మనస్తత్వముతో అర్థము చేసుకున్నది మన ప్రార్థన ద్వారా మనాత్మలోనికి వెళ్లును. బైబిలు లోని ప్రతి పదమునకు మన ప్రార్థనా పఠనము అవసరము. (CWWL, 1987, vol. 2, “The God-ordained Way to Prac tice the New Testament Economy,” p. 375)

ప్రార్థించుట చేత ఆత్మను సాధకము చేయుట

మనము ప్రార్థించుట ద్వారా మనాత్మను సాధకము చేయుటను ఆరంభించవలెను ఎందుకంటే, నియమానుసారముగా ప్రార్థించుటనేది ఆత్మలోనిదానికి సంబంధించినది (ఎఫె. 6:18). మనము మన కళ్లను సాధకము చేయబోవుచున్నట్లయితే, మనము చూడాలి. మనము మన పాదములను సాధకము చేయబోవుచున్నట్లయితే మనము నడవాలి. ఎంత ఎక్కువగా నడుతుమో, అంతెక్కువగా మన పాదములను సాధకము చేతుము. అదే విధముగా, మనాత్మను సాధకము చేయుటకు అత్యుత్తమమైన మార్గము ఏమనగా ప్రార్థించుటను నేర్చుకొనుట. (CWWL, 1965, vol. 3, “Our Human Spirit,” p. 275)

Reference: CWWL, 1979, vol. 1, “Basic Lessons on Life,” ch. 18; CWWL, 1965, vol. 3, “Our Human Spirit,” ch. 10; CWWL, 1984, vol. 1, “The Four Crucial Elements-Christ, the Spirit, Life, and the Church,” ch. 7; CWWL, 1987, vol. 2, “The God-ordained Way to Prac-tice the New Testament Economy,” ch. 8

 

ఆత్మను సాధకము చేసి ప్రార్ధించు!

ప్రార్థన — ఆత్మను సాధకము చేయుట

781

1   ఆత్మను సాధకము చేసి ప్రార్ధించు!

ప్రార్ధించితినల్పం ఆత్మ లేకనే

ప్రార్ధించిన కూడన్ మోదమే లేదు

నాదు ఆత్మకు నీయాత్మ నిమ్ము

 

2   ప్రార్ధింతునాత్మలో ఆత్మ మూల్గుతో

అభిషేకమొంది ఆచారమున్ వీడి

మనస్సుతో కాక ఆత్మతో వేడి

ఆత్మతో స్తుతింతున్ ఎల్లప్పుడున్

 

3   నాయంతట కాక ఆత్మ సాధకం

ఇతరులతోను చేరి ప్రార్ధింతున్;

ఆత్మ కోరినట్లు ఆత్మలో వేడి

అంతర్యమందున విజ్ఞాపింతును

 

4    కలిసి సేవింప ప్రార్థన ద్వారా

ఆత్మ సహవాసం కల్గును నిజం

కేకలు లేకనే ఏకత్వమందు

ఆత్మను తాకుచు విజ్ఞాపింతము

 

5    సాధకం చేయుము ప్రతిచోటను

ఎందరు ఉన్ననూ చూడకెవ్వరిన్

ముఖ్యము కాదుగా వ్యక్తి,స్థలముల్

కూటములన్నిటన్ ప్రార్ధింతునేను

 

6    ప్రభునకిత్తును నాదు మార్గమున్

చేకూరున్ బలము నాయాత్మకట్లు

ఆత్మలోపారగా జీవజలము

శుద్ధులందరేకమై సంఘమేర్పడున్

5. ఐదవ పాఠము – సంకీర్తనలు పాడుట

ఐదవ పాఠము – సంకీర్తనలు పాడుట

ఎఫె. 5:18-19—మరియు మద్యముతో మత్తులై యుండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు;  అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ఒకనికొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి.

సంకీర్తన యొక్క దిశ

దేవుని వైపు

చాలా సంకీర్తనలు దేవుని వైపు నిర్దేశించబడినవి. ఈ పద్యభాగము యొక్క గురి దేవుడు. కీర్తనల గ్రంథములో చాలా కీర్తనలు దేవుని వైపు నిర్దేశించబడిన పద్యములై యున్నవి. 51వ కీర్తన దేవునికి చేసిన ప్రసిద్ధ ప్రార్థనా కీర్తనయై వున్నది. స్తుతి సంకీర్తనలు, కృతజ్ఞతా సంకీర్తనలు మరియు ప్రార్థనా సంకీర్తనలన్నీ దేవునికి పాడబడినవి.

మనుష్యుల వైపు

మరికొన్ని కీర్తనలు మనుష్యుల వైపు నిర్దేశించబడినవి. 37 మరియు 133 కీర్తనలు ఇటువంటి కీర్తనలకు ఉదాహరణలు. ఈ రకమైన కీర్తన మనుష్యులకైనా బోధించును లేదా దేవుని యొద్దకు వెళ్లుటకు మనుష్యులను ప్రోత్సాహించును. సువార్త సంకీర్తనలు మరియు హెచ్చరిక కీర్తనలన్నీ మనుష్యులకు పాడబడును.

ఒకడు తన వైపు

బైబిలులో మూడో రకపు సంకీర్తనలు  కూడా ఉన్నవి అవి మనకి మనమే పాడుకునేవి. కీర్తనల గ్రంథములోని అనేక వాక్యభాగములు ఓ నా ప్రాణమా! అనే పదజాలమును  ఇముడ్చుకొని యున్నవి. ఈ సంకీర్తనలన్నీ ఒకవ్యక్తి వైపునకే నిర్దేశించబడినవి.

ఒకరితోనొకరు వైపు

కొలొస్సీయులు 3:16 మరియు ఎఫెసీయులు 5:19 రెండూ పరస్పరగానము గూర్చి మాట్లాడుచున్నవి. పరస్పర గానములో, ఒక సహోదరుడు పాడిన తరువాత మరొక సహోదరుడు పాడుట ద్వారా ప్రతిస్పందించును. మొదటి సహోదరుడు మరల పాడవచ్చును మరియు మరొక సహోదరుడు మరల ప్రతిస్పందించును. లేదా అనేకమంది సహోదరులు పాడ వచ్చును మరియు మరొక సహోదరుల గుంపు పాడుటచే ప్రతిస్పందించును. (CWWN, vol. 48, “Messages for Building Up New Believers,” pp. 241-243)

పరిశుద్ధాత్మతో నింపబడుటకు సంకీర్తనలు పాడుట చేత మన ఆత్మను సాధకము చేయుట

నీవు నీ ఆత్మను సాధకము చేయవలసిన అవసరమున్నది. నీవు నీ ఆత్మను సాధకము చేసి, నీ ఆత్మను ఉపయోగించినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ ఆత్మను నింపును. ప్రార్థించుట మరియు పాడుటయే ఆత్మను సాధకము చేయుటకు అత్యుత్తమమైన మార్గము. (CWWL, 1985, vol. 4, “Meeting to Speak the Word of God,” p. 279)

కీర్తనలతోను,  సంకీర్తనలతో, ఆత్మసంబంధమైన పాటలతోను క్రీస్తును మాట్లాడుట

ఎఫెసీయులు 5:18-19లో, పౌలు ఈలాగనుచున్నాడు, ‘‘మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ఒకని కొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి.’’ సర్వము-ఇమిడియున్న, పరిణతుడైన ఆత్మగా త్రియేక దేవునితో మనాత్మలో మనము నింపబడవలసి యున్నది. ఈ నింపుదలనేది మన సామాన్య లోకసంబంధమైన భాషలో మాట్లాడుట చేత కాదు గాని ఒకరితో నొకరు కీర్తనలతోను, సంకీర్తనలతోను మరియు ఆత్మసంబంధమైన పాటలతోను మాట్లాడుట ద్వారా సంభవించును. మన సంకీర్తనల పుస్తకములో సత్యముతో నిండుకొనిన అనేకమైన మంచి సంకీర్తనలు ఉన్నవి. ఉదాహరణకు, 501వ సంకీర్తన నిత్యత్వములో క్రీస్తు అనంతుడైన దేవునిగా ఏలాగుండెనో, కాలములో దేవుని తేజోవంతమైన వ్యక్తతగా ఆయన ఒక పరిమితుడైన మానవునిగా ఎట్లు పరిమితిచెందెనో వివరించును. దేవుని వ్యక్తతగా ఆయన తన శరీరమందు విమోచనను నెరవేర్చుటకు మన కొరకు మరణించెను. అప్పుడు మనతో ఏకమగుటకు ఆయన జీవమిచ్చు ఆత్మ ఆయెను. సంకీర్తనలతో క్రీస్తును మాట్లాడుటను మనము తప్పక నేర్చుకొనవలెను. (CWWL, 1985, vol. 3, “The Divine Speaking, p. 287)

నూతన నిబంధన ప్రకారము కీర్తనలు, సంకీర్తనలు మరియు ఆత్మసంబంధమైన పాటలనేవి పాడుటకు మాత్రమే కాదు గాని మాట్లాడుటకు కూడా మంచివి. కొన్నిసార్లు మనము పాడుట ద్వారా ప్రేరేపించబడతాము. అయితే మరికొన్ని సమయాల్లో, న్యూమాతో నింపబడి మాట్లాడుటనేది పాడుటకంటే ఎక్కువ ప్రేరేపించేదిగా ఉండును. మనము ఖాళీగా, న్యూమా లేకుండా ఉన్నట్లయితే, మనము మాట్లడుటనేది ఎటువంటి ప్రేరేపణనివ్వదు. అయితే మనము న్యూమాతో పూర్తిగా నిండుకొనినచో, మనము మాట్లాడుటనేది ఇతరులను ప్రభావితము చేయును మరియు ప్రేరేపించును. ఇది వాక్చాతుర్యము కాదు; ఇది ప్రభావముతో కూడిన ఉచ్ఛారణయై వున్నది.(Life –study of Ephesians, pp 434-435)

References: CWWN, vol. 48, “Messages for Building Up New Believers,” lsn. 15; CWWL, 1985, vol. 4, “Meeting to Speak the Word of God,” msg. 3; CWWL, 1985, vol. 3, “The Divine Speaking,” ch. 2; Life-study of Ephesians, msg. 51; CWWL, 1987, vol. 2, “Words of Training for the New Way,” msg. 11

 

పాడెద౦ ఆత్మతో ప్రభునకే

క్రీస్తును గూర్చిన అనుభవము — ఆత్మలో

1141

1    పాడెద౦ ఆత్మతో ప్రభునకే

పాడెద౦ ఆంతర్యంలోనుండి

పాడెద౦ హల్లెలూయ జై యేసు

ఆయనతో ఏకమౌదము

 

2    పలుఏండ్లుంటిమి మతమందు

పలు ఏండ్లుగా మనసులోన్

పలు ఏండ్లు ఆవేశములలో

తిరిగితిమి గురిలేకన్

 

3    ఇప్పుడాత్మనే తాకనేర్తుము

జీవముగా క్రీస్తున్ చేకొందుం

యేసునే భుజింప నేర్చుకొందుం

ప్రయాసలన్నీ మానివేతుం

 

4    హల్లెలూయ ఆత్మలోజీవనం

హల్లెలూయ నూతనా౦తర్య౦

ఆత్మకు తిరుగు ప్రతిక్షణం

ఆయనైశ్వర్యముల్ పొందెద౦

6. ఆరవ పాఠము – స్తుతి

ఆరవ పాఠము – స్తుతి

హెబ్రి 13:15కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

ఒక పరిశుద్ధుని ఆత్మీయ జీవితము యొక్క ఉన్నతమైన వ్యక్తత

స్తుతి అనగా దేవుని పిల్లల చేత కొనసాగించబడే అత్యున్నతమైన పని. ఒక పరిశుద్ధుని ఆత్మీయ జీవము యొక్క ఉన్నతమైన వ్యక్తతనేది అతడు దేవునికి చేసే స్తుతి అని మనము చెప్పవచ్చును. దేవుని సింహాసనము విశ్వములోని అత్యున్నతమైన స్థానము, అయినను ‘‘ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడగును’’ (కీర్త. 22:3). దేవుని నామము మరియు దేవుడు స్తుతి ద్వారానే హెచ్చించబడును.

ఆత్మీయ విజయము స్తుతి మీద ఆధారపడుచున్నది

మీరు ప్రార్థించునప్పుడు, మీరింకను మీ పరిస్థితి మధ్యలోనే ఉందురు. ‘‘అయితే మీరు స్తుతించునప్పుడు, మీరు మీ పరిస్థితి కంటే పైగా ఎగురుదురు. అనేకసార్లు ప్రార్థన విఫలమైనప్పుడు స్తుతి పనిచేయును. ఇది చాల ప్రాథమిక నియమము. మీరు ప్రార్థించలేకపోయినట్లయితే, ఎందుకు స్తుతించ కూడదు? నీ విజయము కొరకు మరియు నీ విజయమందు అతిశయించుటకై ప్రభువు నీ చేతులలో మరొక అంశమును ఉంచాడు.

మనము ఈ ఉన్నతమైన ఆత్మను కొనసాగించుటను నేర్చుకొనవలసిన అవసరమున్నది, ఈ ఆత్మయే దాడులన్నింటిని అధిగమించును. ప్రార్థనలు మనలను సింహాసనము యొద్దకు నడిపించవు, అయితే స్తుతి తప్పకుండా మనలను సింహాసనము యొద్దకు ఏ సమయమందైనా నడిపించును. ప్రతి సమయములో ప్రార్థనలు మనలను జయించునట్లు చేయలేకపోవచ్చును, గాని స్తుతి ఒక్కసారి కూడా ఓడిపోదు. ప్రభువు హస్తమును స్తుతి కదిలించినంత వేగంగా ఏదియు కదిలించలేదు. ప్రభువు హస్తమును కదిలించుటకు అత్యంత వేగవంతమైన మార్గము ప్రార్థన కాదు; స్తుతియే అత్యంత వేగవంతమైన మార్గము.

ఆత్మీయ విజయము యుద్ధము మీద కాదుగాని స్తుతించుట మీద ఆధారపడును. మన స్తుతి ద్వారా సాతానును జయించుటను మనము నేర్చుకొనవలసిన అవసరమున్నది. మనము సాతానుని ప్రార్థన ద్వారా మాత్రమే కాదు, స్తుతి ద్వారా కూడా జయింతుము. అనేకమంది ప్రజలు సాతానుడి భయంకరత్వమును మరియు తమ సొంత బలహీనతలను గూర్చిన స్పృహను కలిగియుందురు మరియు వారు శ్రమపడుటకు, ప్రార్థించుటకు నిర్ణయించుకొందురు. అయితే, ఇక్కడ మనమొక చాల విశిష్ఠమైన నియమమును కనుగొందుము: ఆత్మీయ విజయము పోరాటము మీద కాదు గాని స్తుతి మీద ఆధారపడును.

స్తుతించుటను అభ్యసించుట

మనము దేవునికి ప్రార్థించుట మాత్రమే కాదుగాని దేవుని అత్యధికంగా స్తుతించుటను కూడా నేర్చుకొనవలెను. మన క్రైస్తవ నడక యొక్క ఆరంభములోనే మనము స్తుతి యొక్క ప్రాముఖ్యతను చూడవలసిన అవసరమున్నది. మనము దేవుణ్ణి ఎడతెగక స్తుతించాలి. దినముకు ఏడు మార్లు స్తుతించ గలిగే కృపను దావీదు దేవుని నుండి పొందుకున్నాడు. దేవుణ్ణి అనుదినము స్తుతించుటనేది ఒక మంచి అభ్యాసము, చాల మంచి పాఠము మరియు చాల మంచి ఆత్మీయ ఆచరణ. మనము వేకువనే లేచినప్పుడు మనుము దేవుణ్ణి స్తుతించుటను నేర్చుకొనాలి. మనము సమస్యలను ఎదుర్కొనునప్పుడు, మనము కూటములో ఉన్నప్పుడు లేదా మనమొంటరిగా నున్నప్పుడు మనమాయనను స్తుతించుటను తప్పక నేర్చుకోవాలి. మనము దినముకు కనీసము ఏడుసార్లైనా దేవున్ని స్తుతించాలి. స్తుతించుటలో దావీదు మనలను ఓడించనివ్వకండి. దేవుణ్ణి స్తుతించుటను మనము అనుదినము నేర్చుకొనకపోయినట్లయితే, హెబ్రీయులు 13లో చెప్పబడిన స్తుతియాగమును కలిగియుండుట కష్టతరమగును. (CWWN, vol. 48, “Messages for Building UpNew Believers,” pp. 247, 251-254, 249)

ప్రభువు తన విరోధులను బట్టి బాలురయొక్కయు చంటిపిల్లల యొక్కయు  నోటి మూలమున ఒక దుర్గమును (స్తుతిని) స్థాపించియున్నాడు

శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై (కీర్తన 8:2) తన విరోధులను బట్టి ప్రభువు బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్తుతుల మూలమున దుర్గమును (స్తుతిని) స్థాపించియున్నాడు (మత్తయి 21:16). మనుష్యులలోని అత్యంత చిన్నవయస్కులును, అల్పులును, బలహీనులైన బాలురు మరియు చంటిపిల్లలు ప్రభువు విమోచనలోని తన పని యొక్క అత్యున్నతమైన పరిణతిని సూచించుచున్నారని మనము చూచి యున్నాము. దేవుని రక్షణలోని ఉన్నతమైన పరిణతి ఏమనగా, దేవుణ్ణి స్తుతించుటకు అత్యంత అల్పులను మరియు బలహీనులను సంపూర్ణం చేయుటయై వున్నది.

మనము ప్రభువును స్తుతించుట క్రీస్తును గూర్చిన మన ఆస్వాదనలో అత్యున్నతమైన అనుభవమై యుండుట

మనము క్రీస్తుని విమోచనమును సంపూర్ణముగా ఆస్వాదించినచో, మనము ప్రభువును స్తుతించుటకు ధైర్యముగా ఉండెదము. మనము నిరుత్సాహపడి, నిరాశచెందిన యెడల, మనము నిట్టూర్చి మూల్గవచ్చును. అయితే మనము ప్రభువును స్తుతించినయెడల, ఇది క్రీస్తును గూర్చిన మన ఆస్వాదన యొక్క మన అత్యున్నతమైన అనుభవమై యుండును. ప్రభువుకు ఒక సంపూర్ణమైన మరియు పరిపూర్ణము చేయబడిన స్తుతిని ఉచ్ఛరించుటకు క్రీస్తును గూర్చిన ఆస్వాదన మనలను బలపరచును. స్తుతించుటెట్లో మనమందరము నేర్చుకొనవలెను. ఇదే దేవుడు తన విమోచనములో క్రీస్తు ద్వారా సంపూర్ణము చేసియున్న అత్యున్నతమైన పరిణతి .

సంఘజీవనములోని మనమందరము బాలురము మరియు చంటిపిల్లలమై యుండవలసిన అవసరమున్నది. మనము మన భౌతిక వయస్సులో వృద్ధులము కాకపోవచ్చును, అయితే మన క్రైస్తవ అనుభవములో మనము అలసిపోయిన మరియు వేసారిన ప్రజలముగా ఉండవచ్చును. మనము ప్రభువులో ఇంకను యుక్త వయస్కులముగా నున్నట్లయితే, మనము కూటములకు వెళ్లే మార్గములో ప్రభువును స్తుతించెదము. మేము లాస్ ఏంజెల్స్ లోనున్న ఎల్డన్ హాల్‌లో ఉన్నప్పుడు, ఒకానొక సహోదరుడు కూటమునకు వచ్చుటకు వాహనమును నడుపుచుండగా ప్రభువుకు బిగ్గరగా స్తుతులను చెల్లించుచుండెను. ఒక పోలీసు అతనిని చూచి అతని వెంటవచ్చి అతనిని ఆగమని చెప్పెను. అతనికేమైనది అని పోలీసు ఆ సహోదరుని అడిగెను. అప్పుడు ఆ సహోదరుడు ‘‘నేను యేసును స్తుతించుచుంటిని!’’ అని అనెను. అప్పుడా పోలీసు అతనిని పోనిచ్చెను. కూటమునకు వచ్చుటకు ఇదియే సరియైన విధానము. మనము కూటమునకు వచ్చుటకు వాహనమును నడుపుచున్నప్పుడు మనము పాడవలెను, స్తుతించవలెను మరియు బిగ్గరగా ‘‘ఆమెన్! హల్లెలూయా! ఆమెన్! యేసు ప్రభువా! ఆమెన్!’’ అని అరవవలెను. మనలోని అనేకమంది ఈలాగు చేయము, ఎందుకనగా మనము చాల వృద్ధులమై పోయాము. వృద్ధులమవ్వడమంటే బలహీనమగుట అని అర్థము. మనము అధికంగా అరవవలసిన అవసరమున్నది, హల్లెలూయ అని అధికంగా, ఆమెన్ అని అధికంగా చెప్పవలసిన అవసరమున్నది, అధికంగా స్తుతించవలసిన అవసరమున్నది. మన కూటము పూర్తిగా ఉత్సాహధ్వనితో నింపబడవలెను.

ప్రభువు తన విరోధులను బట్టి అటువంటి పరిణతిచెందే క్రియచేయును. సాతానును అవమానించుటకు ఆయన దీనిని చేయును. ఇది దేవుడు సాతానుడితో ఈలాగు చెప్పుచున్నట్లున్నది,‘‘ సాతానా, నీవు అంత చేసావు. నేనెంత చేయగలనో నీకు చూపించనివ్వు. నీవు చేయగల్గినదాని కంటే నేను అధికంగా, మరి అధికంగా చేయగలను. ఇప్పుడు నా పిల్లలందరిని చూడు. వారందరు బాలురును చంటి పిల్లలునై నన్ను స్తుతించుచున్నారు’’. ఈ స్తుతించుటనేది సాతానుడి నోరును మూయును. మనము స్తుతించుట చేత శత్రువు మాటలాడుటనేది ఆపివేయబడును. ప్రభువు తన విరోధులను (లోపలి) బట్టియు, శత్రువును పగతీర్చుకొనువాడిని (బయటి) మాన్పివేయుటకు మన నోళ్ళ నుండి వచ్చుచున్న స్తుతిని సంపూర్ణము చేయును, బలమును స్థాపించును.

మన స్తుతి పరిపూర్ణము చేయబడుటనేది అవసరము

క్రైస్తవులమైన మనము ప్రభువును స్తుతించవచ్చును, అయితే మన స్తుతి సంపూర్ణము చేయబడవలసిన అవసరమున్నది. ఆకాశమందలి ఆయన ప్రభావమును బట్టి మరియు భూమి మీద ఆయన శ్రేష్ఠతను బట్టి మనమాయనను స్తుతించవలసిన అవసరమున్నది. అప్పుడు మనలను దర్శించుటకై వచ్చిన ఆయన నరావతారమును బట్టి మనమాయనను స్తుతించ వచ్చును. అప్పుడు ఆయన మానవ జీవనమును బట్టియు, ఆయన మరణమును బట్టియు, ఆయన పునరుత్థానమును బట్టియు, ఆయన ఆరోహణమును బట్టియు మరియు ఆయన రాజ్యమును బట్టియు స్తుతించుటను కొనసాగించవలెను. ఈ విషయములన్నిటితోను మనమాయనను స్తుతించవలెను. అప్పుడు మన స్తుతులు సరిచేయబడి, సంపూర్ణము చేయబడును. ఈ స్తుతియే బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు నోళ్ళనుండి వచ్చిన బలమై యుండును. అటువంటి పరిపూర్ణం చేయబడిన స్తుతియే నరావతారము, మానవ జీవనము, మరణము, పునరుత్థానము, ఆరోహణము, మరియు ఈ భూమిని పరిపాలించుటకు తిరిగివచ్చుటనే ప్రభువు పని యొక్క అంతిమ పరిణతియై వుండును.

మనము ప్రభువు బల్ల యొద్దకు వచ్చునప్పుడు, మనము ప్రతివిధమైన మానవ మాటలను మరియు మానవ క్రియలను ఆపివేతుము. మనము మన పనిని ఆపివేతుము. మనమిక్కడ బల్ల యొద్ద ఒకే ఒక పనిని చేయుటకు ఉన్నాము ఆయనను స్తుతించుటకు ఉన్నాము. ప్రభువును స్తుతించుటకు మనమిక్కడ మన పనులన్నీ ఆపివేయుచుండగా విరోధులు, శత్రువు మరియు పగతీర్చుకొనువారందరూ ఓడింపబడుదురు. ఇది దేవుని శత్రువుకు అవమానమై యున్నది.

మనము ప్రభువు బల్ల యొక్క స్థితి మరియు ఆత్మలో నిలిచియుండవలసిన అవసరమున్నది. మన క్రైస్తవ జీవితము ప్రభువు బల్ల వలె ఉండవలెను. మనము ప్రభువు బల్ల తరువాత యింటికి వెళ్లునప్పుడు, మనము ప్రభువును స్తుతించుటను కొనసాగించవలెను. మన మరీ విపరీతము చేయకుండుటను నేర్చుకొనవలెను. మరోవైపున, మనము సోమరిగా ఉండకూడదు. విషయమేమిటంటే మనము మన మానవ క్రియలను ఆపివేసి, సరళముగా ప్రభువును స్తుతించేవారముగా ఉండవలెను.(Life–study of Psalms, pp. 60-61, 69)

References: CWWN, vol. 48, “Messages for Building Up New Believers,” ch. 16; Life study of the Psalms, msg. 5

 

THE LORD SHALL GET THE GLORY

Praise of the Lord—His Victory and Exaltation

1095

1    The Lord shall get the glory

If we will sing His praise,

And angel hosts will listen

When we our voices raise;

The world around will hear us

Give glory unto God,

And Satan’s hosts will tremble

And f lee our conqu’ring rod.

 

2    Our mouth shut up defeats us

And wins the devil’s smile;

So why not open battle

And chase him all the while.

By “sacrifice of praises”

And shouts of victory-

’Twill cost us but our faces,

God’s chosen fools to be!

 

3    The world has never helped us

To shout our Savior’s praise,

Nor given Him the glory

Nor lent one thankful phrase;

So need we ask permission

To praise th’ ascended Lord?

Cry out! Release your spirit!

Much grace He does afford!

 

4    O brothers, be not silent!

O sisters, cry aloud!

The sound shall tell God’s triumph

And blessings far abroad.

Now is the time to praise Him,

Yes now, at any cost!

Oh, joy in your salvation,

And in His mercy boast!

7. ఏడవ పాఠము  – జీవపు సంవేదనము

ఏడవ పాఠము  – జీవపు సంవేదనము

ఎఫెసీ 4:19వారు సిగ్గులేనివారై యుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

రోమా 8:6శరీరము మీద నిలిపిన మనస్సు మరణము, అయితే ఆత్మ మీద నిలిపిన మనస్సు జీవమును సమాధానమునైయున్నది.

మనము క్రీస్తులోనికి విశ్వాసముంచి, జీవములో ఆయనకు కలుపబడినప్పుడు, మనలోని ఆయన జీవము జీవపు సంవేదనమును ఉత్పత్తి చేయును. ఆయనకు కలుపబడిన, ఆయనతో ఏకాత్మయైన మరియు ఆయనను అనుభవించుచున్న మనము ఆ జీవపు సంవేదనముపై శ్రద్ధనిలుపవలెను మరియు మన ఆత్మీయ జీవితములో విధేయత చూపవలెను (Life lessons, vol. 3, p. 59)

మరణపు అనుభూతి

జీవపు సంవేదనకు ప్రతికూల పక్షము మరణపు అనుభూతి, ఒక రకమైన ప్రతికూల అనుభూతి ఉన్నది. ఇది రోమా 8:6లో నిర్దిష్టముగా బయలుపరచబడినది. రోమా 8:6 అనేది పూర్తిగా సంవేదనమునకు చెందిన వచనము అని మనము గ్రహించవలెను, ఎందుకనగా ఆ వచనము శరీరము మీద నిలిపిన మనస్సు మరణము అని చెప్పుచున్నది. ఇదొక వాస్తవము మాత్రమే కాదు గాని అనుభూతికి సంబంధించిన విషయము, స్పృహకు సంబంధించిన విషయము. నీవు మనస్సును శరీరము మీద నిలిపినప్పుడు, నీవు మరణపు సంవేదనను కలిగియుందువు. మరణము అక్కడున్నదనే అనుభూతి నొందుదువు.

మరణపు అనుభూతి అనేది బలహీనత, శూన్యత, అసౌకర్యత, అలసట, క్రుంగుదల, ఎండిపోయినతనము, చీకటి, బాధ, మొదలైనవి గల ఆంతర్యపు అనుభూతి–ప్రతికూల పక్షమున (రోమా. 8:6). నీవు ఆంతర్యములో బలహీనముగాను, శూన్యము గాను, అసౌకర్యంగాను, అలసటగాను, క్రుంగినట్లుగాను, ఎండిపోయినట్లుగాను, చీకటిగాను మరియు బాధగాను ఉండుటను సంవేదించినట్లయితే మరణమున్నదని ఇది సూచించును. మరణమిక్కడ ఉండిన్నట్లయితే నీవు నీ మనస్సును శరీరము మీద నిలిపి యున్నావని అర్థము. మన దైనందిన నడకకు మనస్సే తాళపుచెవి. తాళపుచెవిఅనేది మనము మార్గములో నడుచుటకు ద్వారమును తెరుచును. శరీరము మీద మనస్సు నిలుపుటనగా శరీరము అనే ద్వారమును తెరచి, శరీరసంబంధమైన మార్గములో నడుచుటయై యున్నది. కావున, మరణమిక్కడున్నదని నీవు సంవేదించిన యెడల, నీవు శరీరమునందు జీవించుచు, శరీరమునందు నడుచుచున్నావని గ్రహించవలెను. ఇది జీవపు సంవేదనము యొక్క ప్రతికూలమైన విధినిర్వహణము.

జీవము మరియు సమాధానము యొక్క అనుభూతి

అనుకూల పక్షమున జీవపు సంవేదనము మనకు క్రిందివ్వ బడిన అనుకూల అంశముల యొక్క స్పృహను ఇచ్చును బలము, తృప్తి, సమాధానము, విశ్రాంతి, విడుదల, సజీవత, తడపబడుదల, ప్రకాశత, ఆదరణ మొదలైనవి (రోమా. 8:6). బలహీనముగా ఉండుటకు బదులు మనము బలముగా ఉందుము. శూన్యంగా ఉండుటకు బదులు మనము తృప్తి చెందుదుము. అసౌకర్యము మరియు అలసటకు బదులు మనము సమాధానము మరియు విశ్రాంతిని కలిగియుందుము. క్రుంగుదలకు బదులుగా, మనము విడుదలను మరియు సజీవతను కలిగియుందుము. సజీవతనేది జీవించే స్థితియై వున్నది. ఎండిపోవుటకు విరుద్ధముగా తడపబడుటను, చీకటికి విరుద్ధముగా ప్రకాశతను మరియు బాధకు విరుద్ధముగా ఆదరణను కలిగియుందుము. ఇవన్నియు జీవపు సంవేదనము యొక్క విధినిర్వహణ నుండి మనము కలిగియున్న అనుకూలమైన అనుభూతులు. మనమీ రకములైన అనుభూతులను కలిగియున్నప్పుడు, ఇది జీవపు సంవేదనము యొక్క పని అని గ్రహించవలెను.

కావున, రోమా 8:6లో పరోక్షమగా సూచించబడిన ప్రధానమైన విషయము ఏమనగా, జీవపు సంవేదనము. ఆత్మ మీద మనుస్సు నిలుపుట జీవమును సమాధానమునై యున్నది. ఇదంతయు సంవేదనము మరియు స్పృహకు సంబంధించిన విషయము. ఈ స్పృహయే జీవపు సంవేదనము. ఇది కేవలము మనలను నడిపించుటకు మాత్రమే కాదు గాని మనలను పరిపాలించుటకును, మనలను నియంత్రించుటకును మరియు మనలను నిర్దేశించుటకు కూడా పనిచేయును. మరణము యొక్క అనుభూతి మరియు జీవము, సమాధానము యొక్క అనుభూతి అనేవి జీవపు సంవేదనము యొక్క అర్థము యొక్క రెండు పార్శ్వములు.

మనస్సాక్షి యొక్క స్పృహకు సంబంధించినదై యుండుట

ప్రతికూల పక్షమున మరియు అనుకూల పక్షమున, రెండు పక్షములను జీవపు సంవేదనము అనేది ఎల్లప్పుడు మనస్సాక్షి యొక్క స్పృహకు సంబంధించినదై యున్నది. ఎఫెసీయులు 4:19 చెప్పునదేమనగా, అవిశ్వాసులు అనుభూతి లేనివారై (సిగ్గు లేనివారై) యున్నారు. ఇక్కడ ‘‘అనుభూతి’’ అనేది ప్రధానముగా ఒకని మనస్సాక్షి యొక్క స్పృహను సూచించును. అవిశ్వాసులు సాధారణముగా వారి మనస్సాక్షి యొక్క అనుభూతిని లక్ష్యపెట్టరు. తమ ఆంతర్య అనుభూతిని గూర్చి అత్యంత నిర్లక్ష్యపెట్టే ప్రజలే అత్యంత పాపపూరితమైన ప్రజలు. మంచి వ్యక్తులుగా ఉండవలెనని ప్రయాసపడే అవిశ్వాసులు తప్పకుండా వారి ఆంతర్యపు అనుభూతిని లక్ష్యపెట్టుదురు. కేవలము చట్టము చేత, పోలీసులు చేత పరిపాలించబడుటనేది నైతిక ప్రమాణము కాదు. అవిశ్వాసుల విషయములో కూడా నైతిక ప్రమాణమనేది తమ మనస్సాక్షి యొక్క ఆంతర్య అనుభూతిని అనుసరించి ఉండవలెను. నిజమే, ఒక విశ్వాసి యొక్క జీవపు సంవేదనము కేవలము మనస్సాక్షికి సంబంధించిన విషయము మాత్రమే కాదు, గాని అది జీవపు, అనగా దేవుని జీవపు సంవేదనము అనుసరించిన మనస్సాక్షి యొక్క స్పృహకు సంబంధించినదై యున్నది.

జీవపు సంవేదనము యొక్క విధినిర్వహణ

మన జీవనము యొక్క మూలమును మనము ఎరిగేటట్లు చేయుట

మనము స్వాభావిక జీవమునందు జీవించుచున్నట్లయితే, సంవేదనము మరణముకు చెందినదై యుండును మరియు పూర్తిగా ప్రతికూల పక్షమున ఉండును. అప్పుడు మనము మరణపు అనుభూతి యొక్క ప్రతికూల అంశములన్నిటితో కూడిన మరణపు సంవేదనమును కలిగియుందుము. మనము దైవిక జీవమునందు జీవించుచున్నట్లయితే, సంవేదనము జీవముకు చెందినదై మరియు దాని అనుకూల అంశము లన్నిటితో కూడిన సమాధానమునకు సంబంధించినదై యుండును. మనము స్వాభావిక జీవమునందు జీవించుచున్నామా లేక దైవిక జీవమునందు జీవించుచున్నామా అనేది మనకు జీవపు సంవేదనము తెలియజేయును. జీవపు సంవేదనము మనలను నడిపించును, మనలను పరిపాలించును, మనలను నియంత్రించును మరియు మనలను నిర్దేశించును. ఈ సత్యము నేటి క్రైస్తవ్యములో పూర్తిగా మాయమైపోయింది. నేటి క్రైస్తవ్యము యొక్క బోధలలో అనేకములు నైతికత మరియు మంచి ప్రవర్తన మీదనే కేంద్రీకరించబడియున్నవి. మనము స్వాభావిక జీవమునందు జీవించుచున్నామా లేక దైవిక జీవమునందు జీవించుచున్నామా అనే దానిని మనకు తెలియజేసే ఈ జీవపు సంవేదనము యొక్క విధినిర్వహణను వారు లక్ష్యపెట్టరు. మన జీవముగా క్రీస్తును మనము వెదకుచున్నందున, మనము ఈ జీవపు సంవేదనను లక్ష్యపెట్టవలెను. మనము బలము, తృప్తి, సమాధానము, విశ్రాంతి, విడుదల, సజీవత, తడుపుదల, ప్రకాశత, ఆదరణ మొదలైనవి  అనుకూల సంవేదనములను కలిగిలేనట్లయితే, మనము దైవిక జీవము నందు జీవించుట లేదు అనియు; తప్పకుండా మనము స్వాభావిక జీవమునందు జీవించుచున్నామనియు మనము గ్రహించవలెను.

మనము శరీరమునందు జీవించుచున్నామా లేకఆత్మనందు  జీవించుచున్నామా అనే దానిని మనము ఎరిగేటట్లు చేయుట

జీవపు సంవేదనము యొక్క విధినిర్వహణ మనము స్వాభావిక జీవమునందు జీవించుచున్నామా లేక దైవిక జీవమునందు జీవించుచున్నామా అనేదానిని కూడా మనకు తెలియజేయును. స్వాభావిక జీవము నందు జీవించుటనేది ఒక విషయము, మరియు శరీరము నందు జీవించుటనేది మరొక విషయము. ఈ రెండూ ఒకటే అని మీరు పరిగణించవచ్చును, అయితే ఒక చిన్న భేదము కూడా ఉంది. శరీరము ఎల్లప్పుడు చెడ్డది. మంచి శరీరమనేది లేదు. అయితే స్వాభావిక జీవము కొన్ని సమయాల్లో మంచిగా ఉండవచ్చును. స్వాభావిక జీవము దైవిక జీవమునకు విరుద్ధముగానున్నది, మరియు శరీరము ఆత్మకు విరుద్ధముగా నున్నది.

కావున, జీవపు సంవేదనకు సంబంధించి రెండు పార్శ్వములు ఉన్నవి. మొదటి పార్శ్వము నీవు దైవిక జీవమునందు జీవించుచున్నావా, లేదాఅనేదానిని తెలియజేయును మరియు రెండవ పార్శ్వము నీవు నీ ఆత్మయందు జీవించుచున్నావా, లేదా అనే దానిని తెలియజేయును. ప్రతికూలముగా మాట్లాడితే, నీవు స్వాభావిక వ్యక్తిగా స్వాభావిక జీవమునందు జీవించుచున్నావా మరియు నీవు శరీరమునందు జీవించుచున్నావా అనేదానిని తెలియజేయును. మన అనుభవములో ఈ రెండు విషయములను మనమెల్లప్పుడు భేదపరచగలము. అనేకసార్లు మనము శరీరమునందు జీవించుచున్నాము, నడుచుచున్నాము మరియు ప్రవర్తించుచున్నామనే సంవేదనమును కలిగి యుందుము. కొన్నిసార్లు మనము మరీ అంత శరీర సంబంధముగా ఉండము, గాని మనము దైవిక జీవములో గాక మన స్వాభావిక జీవములోను, స్వాభావిక పురుషునిలోను నడుచుచున్నామనే సంవేదనమును కలిగియుందుము.

ఈ అంశములలోనికి వెళ్లుటకు మనకు అధికమైన ప్రార్థన అవసరము. ఈ పాఠము మనకు కేవలము అక్షరానుసారమైన సిద్ధాంతపు జ్ఞానముగా ఉండకూడదు. ఇది జీవమునకు సంబంధించినదని మన అనుభవము నుండి చెప్పవచ్చును. మనల్నిమనము జీవపు సంవేదనములోనికి తెచ్చుకొనుటకు గాను మనకు అధికమైన ప్రార్థన అవసరము. అప్పుడు… మనము వాక్యమును కేవలము బోధలో కాదు గాని ఆచరణాత్మకంగా సహవాసములో ఇవ్వగలము. మనము ఈ విషయములను ఎట్లు అనుభవించి యున్నామో, జీవపు సంవేదనము మనకు ఎంత వాస్తవముగా మరియు ఎంత ఆచరణాత్మకంగా ఉన్నదో, మనము మనాంతర్యములోనున్న ఈ రకమైన నియంత్రించే, నడిపించే మరియు నిర్దేశించే మూలకము క్రింద ఎట్లున్నామో అని చెప్పే మన సందేశము ఒక రకమైన సహవాసముగా ఉండును. (CWWL, 1979, vol. 1, “Basic Lessons on Life,” pp. 544-546, 548-549)

References: Life Lessons, vol.3, lsn. 32; CWWL, 1979, vol. 1, “Basic Lessons on Life,” ch. 11

 

జీవ సంవేదనముండును ప్రతి జీవిలోనూ

ఆంతర్య జీవపు వివిధ పార్శ్వము—జీవపు సంవేదన

738

1    జీవ సంవేదనముండున్‌

ప్రతి జీవిలోనూ

మనలో నిత్యజీవమే

దైవ సంవేదనం

 

2    జీవం ఉన్నతమైనచో

సంవేదనధికం

దైవ జీవమున కుండున్‌

అధిక సంవేదనం

 

3    జీవపు సంవేదనమే

దైవ సంవేదనం

మనాత్మకు జీవమిచ్చి

నడుపున్‌ మిన్నగా

 

4    ఆంతర్య సంవేదనము

నాలో పని స్పృహ

ఆంతర్యములో గ్రహించును

దైవ చిత్తమును

 

5    జీవ సంవేదనముచే

దేవున్నెరుగుదం

ప్రయాస అక్కర లేదు

తక్షణమే కల్గున్‌

 

6    జీవంలో ఎదిగినచో

సంవేదనం స్పష్టం

జీవంలో జీవించినచో

ప్రభావం అధికం

 

7    జీవ సంవేదనభ్యాసం

ఆత్మన్‌ ధైర్యపర్చున్‌

ఆంత్యర్య సంవేదనమే

సహవాస మిచ్చున్‌

8. ఎనిమిదవ పాఠము – జీవపు సహవాసము

ఎనిమిదవ పాఠము – జీవపు సహవాసము

1 యోహాను 1:2-3ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది.

జీవపు సహవాసము యొక్క మూలము

జీవపు సహవాసము ఎక్కడనుండి వచ్చును? దానికి కారణము ఏమిటి? మరియు దేని నుండి ఉద్భవించింది?        1 యోహాను 1:2-3 ఇలాగనుచున్నది: ‘‘…మేము [అపొస్తులులు]… నిత్యజీవమును మీకు [విశ్వాసులకు] తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది.’’ మనము ‘‘సహవాసము’’ కలిగి- యుండు నిమిత్తము అపొస్తులులు మనకు ‘‘నిత్యజీవమును’’ ప్రకటించిరి అని ఈ వచనములు చూపించుచున్నవి.(CWWL, 1953, vol. 3, “The Knowledge of Life,” p. 48)

జీవపు సహవాసముకు సంబంధించి విశ్వాసుల యొక్క బాధ్యతలు

మనము ప్రభుని జీవము యొక్క సహవాసములో కొనసాగ గోరినచో, మనము అభిషేకము యొక్క బోధను(2:27) అనుసరించి ప్రభువు నందు నిలిచియుండవలెను. అభిషేకము యొక్క బోధంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయుటయై వున్నది. మనము మనలోని పరిశుద్ధాత్ముని పనికి విధేయత చూపవలెను, మరియు ఈ పనికి అనుగుణముగా ప్రభువునందు నిలిచి యుండవలెను. ఈ విధముగా మనము ప్రభువు జీవము యొక్క సహవాసములో జీవించుటను ఆగకుండా కొనసాగించ గలము. పరిశుద్ధాత్మునికి మనము అవిధేయత చూపిన క్షణములోనే ప్రభువుతోనున్న మన సహవాసము ఆపివేయబడును.

మనము ప్రభుని జీవము యొక్క సహవాసములో జీవించుచున్నట్లయితే, మనము నిజముగా జీవపు వెలుగులో ఉందుము. ఈ జీవపు వెలుగు మన పాపములను మనము చూచేటట్లు చేస్తుంది. మన పాపములను మనము చూచినప్పుడు, అనగా జీవపు వెలుగు యొక్క సహవాసములో మన పాపములను గూర్చిన స్పృహ మనకొచ్చినప్పుడు, మనము మన పాపములను దేవునితో తప్పకుండా ఒప్పుకొనవలెను. మనము దేవునితో మన పాపములను ఒప్పుకొనుటకు సమ్మతించినచో, అవి దేవుని చేత క్షమించబడి శుద్ధీకరించబడును. అప్పుడు మనము మరింత లోతుగా ప్రభువు జీవపు సహవాసములోనికి తీసుకురాబడగలము. మనము మన పాపములను ఒప్పుకొనని యెడల, అవి మన మీద నిలుచును మరియు ప్రభువుతో మన సహవాసమును ఆపివేయును (1:7, 9).

జీవపు సహవాసము యొక్క ఫలితములు

దేవుని వెలుగును పొందుకొనుట

మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు(5.వ). మనము ప్రభువు జీవము యొక్క సహవాసములో జీవించుచున్నట్లయితే, మనము నిజముగా ప్రభుని జీవపు వెలుగులో ఉందుము. ఆంతర్యమున ప్రభువు యొక్క జీవపు వెలుగు, ఆయన జీవమునందలి సహవాసములో మన పాపములను మనకు చూపించును.

రక్తముతో శుద్ధీకరించబడుటను పొందుకొనుట

జీవపు సహవాసములో మనము ప్రభువు యొక్క జీవపు వెలుగు చేత వెలిగించబడి మన పాపములను చూచివాటిని దేవునితో ఒప్పుకొనినట్లయితే, ప్రభువు రక్తము మనలను మన పాపముల నుండి కడిగివేయును (7. వ).

ప్రభువు మనయందు నిలిచియుండుటను కలిగియుండుట

మనము ప్రభుని జీవపు సహవాసములో జీవించుచున్నట్లైతే, మనము ప్రభువునందు నిలిచి యుందుము, మనము ప్రభువు నందు నిలిచియున్నప్పుడుప్రభువు మనలో నిలిచియుండుటను కలిగియుంటాము (యోహాను 15:4-5). ప్రభువు మనలో నిలిచి యున్నప్పుడు మన ఆచరణాత్మకమైన అనుభవములో ఆయన జీవము యొక్క ఐశ్వర్యములన్నిటిని మనము ఆస్వాదించు నట్లు ఆయనే మన జీవముగాను, శక్తిగాను, సంతోషముగాను, సమాధానముగాను మారును.

దేవుని మహిమపరచుటకు బహుగా ఫలించుట

తీగె మరియు ద్రాక్షవల్లికి మధ్య ఎటువంటి అడ్డంకు లేకుండా ద్రాక్షవల్లిలో తీగె నిలిచి యుండి మరియు ఐశ్వర్యవంతమైన రసము యొక్క సరఫరాను పొందుకొనుచు బహుగా ఫలించు విధముగానే ప్రభువునందు నిలిచియుండి, ప్రభువుతో సహవాసము చేయు మనము కూడా ప్రభువు జీవము యొక్క సరఫరాను పొందుకొని బహుగా ఫలించెదము (4-5 వ.). (CWWL, 1932-1949, vol. 3, “Crucial Truths in the Holy Scriptures, Volume 2,” pp. 389-392)

References: CWWL, 1953, vol. 3, “The Knowledge of Life,” ch. 6; CWWL, 1932-1949, vol. 3, “Crucial Truths in the Holy Scriptures, Vol ume 2,” ch. 22; Life Lessons, vol. 3, lsn. 31

 

నిత్యజీవం తెచ్చును మనాత్మలోకి

ఆంతర్య జీవపు వివిధ పార్శ్వము—జీవపుసహవాసము

737

1    నిత్యజీవం తెచ్చున్

మనాత్మలోకి

జీవ సహవాసమున్

రక్షించునిదే

 

2    జీవం మనకిచ్చున్

సహవాసమున్

ఆత్మగా ప్రభువు

మనతో నుండున్

 

3    ఆత్మలోని జీవం

ఆత్మలోనున్న

సహవాసమగున్

కృపనిచ్చును

 

4    ఆత్మ సహవాసం

జీవం చేతనే

వెలుగులోనికి

మనలన్ తెచ్చున్

 

5    బాహ్యంగా కడిగి

మా లోపలను

అభిషేకమిచ్చున్

ఈ సహవాసం

 

6    లోతగున్ సహవాసం

సిలువ ద్వారా

పైకేగున్ సహవాసం

ఆత్మ చేతనే

 

7     ఈ సహవాసమే

స్వయము నుండి

విడిపించి మమ్మున్

క్రీస్తులో ఉంచున్

9. తొమ్మిదవ పాఠము – ప్రభువుతో ఏకాత్మయైయు౦డుట

తొమ్మిదవ పాఠము – ప్రభువుతో ఏకాత్మయైయు౦డుట

1 కొరి. 6:17ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు.

మన౦ క్రీస్తును అనుభవి౦చగలము మరియు క్రీస్తును మన సమస్తముగా తీసుకొనగలము, ఎ౦దుకనగా మనము ఆయనతో ఏకాత్మయైయున్నాము. ఇది లోతైన మర్మము; ఇ౦కను క్రీస్తు లోనికి విశ్వసి౦చిన మరియు ఆయన దైవిక జీవమ౦దు కలుపబడిన ప్రతి ఒక్కరు తప్పక విశ్వసి౦చాలి, ఒప్పుకోవాలి, మరియు ఆచరి౦చాలి అనేది ఖచ్చితమైన వాస్తవము. (Life lessons, vol 3, p.43)

పరిశుద్ధాత్మ చేత పునర్జన్మి౦పబడిన మానవ ఆత్మను మన౦ కలిగి యున్నామని గ్రహి౦చుట ప్రాముఖ్యమైనది

ఈ దేశ౦లో నేను పరిచర్య ప్రార౦భి౦చినప్పుడు, క్రీస్తు లోనికి విశ్వసి౦చిన మనము పునర్జన్మి౦చబడిన మానవ ఆత్మను కలిగియున్నాము, దైవికఆత్మ మానవ ఆత్మన౦దు అ౦తర్నివసించును మరియు మన౦ ప్రభువుతో ఏకాత్మయైయున్నాము అనే వాస్తవమును నేను నొక్కి చెప్పితిని. వారు ఒక ఆత్మను కలిగియున్నారు అనే దానిని నేర్చుకొనుటకు అనేకులు ఆశ్చర్యపడిరి. బహుశా, వారు ప్రాణమును, హృదయమును కలిగియున్నారని వారికి తెలుసు, కాని మానవఆత్మను కలిగి యున్నారని వారికి తెలియదు. క్రైస్తవుల౦దరూ పరిశుద్ధాత్మను గూర్చి ఎరుగుదురు కాని వారు ఒక మానవఆత్మను కలిగి యున్నారని అ౦దరూ గ్రహి౦చుట లేదు. ఈ మధ్య కాల౦లో స౦ఘజీవనములోనికి వచ్చిన వార౦దరూ పరిశుద్ధాత్మ చేత పునర్జన్మి౦పబడిన మానవ ఆత్మను కలిగియున్నారని గ్రహి౦చుట ప్రాముఖ్యమైనది. ఇ౦కను, మన దైన౦దిన జీవన౦లో మన౦ తప్పక ఆత్మను సాధక౦ చేయాలి.(Life-study of 1 Corinthians, p. 109)

దేవుడు ఆత్మయైయు౦డుట, క్రీస్తు జీవమిచ్చుఆత్మ అగుట

దేవుడు ఆత్మయైయున్నాడు అని యోహను 4:24 చెపుతు౦ది. ఇది దేవుని యొక్క స్వభావమును గూర్చి మాట్లాడుతు౦ది. దైవికసారమునకు స౦బ౦ధి౦చిన౦తవరకు, దేవుడు, స౦పూర్ణ త్రియేకదేవుడు ఆత్మయైయున్నాడు.

త్రియేక దేవుడు ముగ్గురు అయ్యున్నారు–త౦డ్రి, కుమారుడు మరియు ఆత్మ. త౦డ్రి మూలమైయున్నాడు, కుమారుడు త౦డ్రి యొక్క వ్యక్తతైయున్నాడు మరియు ఆత్మ కుమారుని యొక్క వాస్తవికతయై యున్నాడు (మత్తయి 28:19).

దేవుని అ౦తిమ వ్యక్తతగానున్న జీవపుఆత్మ (2 కొరి౦థీ 3:6,17), జీవమిచ్చుఆత్మగా    (1 కొరింథీ 15:45) అగుటకు మరణ పునరుత్ధానముల ద్వారా స్వరూపా౦తరి౦చబడిన నరావతారుడైన క్రీస్తే కడపటి ఆదాము.

మన కే౦ద్రము కూడ ఆత్మ

మన యొక్క పూర్తి వ్యక్తి ఆత్మ, ప్రాణము, మరియు శరీరము అను మూడు భాగములైయున్నవని థెస్సలోనీకయులు 5:23 స్పష్టంగా, మరియు ఖచ్చితముగా మనకు బయలుపరుస్తు౦ది. శరీరము మన బాహ్యమైన భాగమైయున్నది, దాని ద్వారా మన౦ పని చేసెదము మరియు నడిచెదము. ఇ౦కను దానిచేత మన౦ వస్తుపరమైన విషయాలను స౦పర్కి౦చెదము. ప్రాణము అనునది మన శరీరము మరియు మన ఆత్మకు మధ్యలో మన వ్యక్తిత్వముగా, మరియు మనస్వయముగానున్న భాగమైయున్నది, దానిచేత మన౦ మానసిక స౦బ౦ధమైన విషయములను స౦ప్రది౦చెదము. ఆత్మ అత్య౦తర్గతమైన భాగమైయున్నది. దానిద్వారా మన౦ దేవుని తెలుసుకొ౦దుము మరియు ఆరాధి౦చెదము మరియు దానిచేత మన౦ ఆత్మస౦బ౦ధమైన విషయాలను స౦ప్రది౦చెదము. గనుక ఆత్మ మన వ్యక్తిత్వము యొక్క కే౦ద్రమైయున్నది మరియు దేవునికి కీలకమైనది. ఆకాశములు మరియు భూమిక౦టే కూడ ప్రాముఖ్యమైనది (జెకర్యా 12:1).

ఏకాత్మగా ప్రభువుతో కలుసుకొనుట

మన౦ ప్రభువుతో కలుసుకొనియున్నాము గనుక, మన౦ ప్రభువుతో ఏకాత్మయైయున్నాము (1 కొరి. 6:17). దీని అర్థమేమనగా, ఆత్మ, అనగా ప్రభుని ఆత్మ మరియు మన ఆత్మయొక్క మిళనమైయున్న ప్రభుని ఆత్మ మరియు మన ఆత్మయైయున్నది. ఇది ప్రభువు ఆత్మ మన ఆత్మతో మిళనమగుట మరియు మన ఆత్మ ప్రభువు ఆత్మతో మిళనమగుటయై యున్నది. మన౦ రక్షి౦చబడిన తరువాత, ప్రభువుతో గల మన సహవాసము, ఆయనకు మన ప్రార్థన, ఆయనతో మన జీవనము మరియు ఆయనకు మన విధేయత వ౦టి మన ఆత్మీయ అనుభవములన్నీ ప్రభువు ఆత్మ మరియు మన ఆత్మ ఒక్కటిగా మిళనము చె౦దిన ఈ ఆత్మయ౦దు ఉన్నవి. (Life lesson vol 3. pp 43-45)

మన దైన౦దిన జీవన౦లో మన ఆత్మను సాధక౦ చేయుట అవసరం

మన అనుదిన జీవన౦లో మన౦ సమస్యలను ఎదుర్కొనుచున్నప్పుడు మన ప్రాణముతో, మన శరీరముతో లేక మన ఆత్మతో మన౦ ప్రతిచర్య చేయవచ్చు. ఒకవేళ ఒక సహోదరుడు దినమ౦తటి కష్టము చేత అలసట నొ౦దినవాడై పనిను౦డి ఇ౦టికి వచ్చును. అతని భార్య తన యెడల పూర్తి ఫిర్యాదుల తోను, అస౦తోషముతోను ఉ౦డుట అతడు కనుగొనును. ఈ సహోదరుడు మూడు విధానములలో ఏదో ఒక దాని ద్వారా ప్రతిస్ప౦ది౦చగలడు. అతనికొరకు వున్న మొదటి విధానము ఏమనగా, ప్రాణములో ప్రతిస్ప౦ది౦చుట, ప్రత్యేకి౦చి మనస్సు లేక ఆవేశ౦లో ప్రతిస్ప౦ది౦చుట. ఇది విశ్వవ్యాప్త౦గా సాధారణమైనది. అతనికి ఉన్న రె౦డవ అవకాశము ఏదనగా తన కోపములో ను౦డి భౌతికమైన విధానములో ప్రతిస్ప౦ది౦చుట. అతని కొరకైన మూడవ ప్రత్యామ్నాయ౦ ఏమనగా తన పునర్జన్మి౦చబడిన ఆత్మను సాధక౦ చేయుట చేత ప్రతిస్ప౦ది౦చుటైయున్నది. మన ఆత్మ పునర్జన్మి౦చబడియున్నది మరియు సర్వము-యిమిడియున్న జీవమిచ్చుఆత్మ దానియ౦దు అ౦తర్నివసిస్తు౦దని విశ్వాసుల౦దరు గ్రహి౦చుట చాలా ప్రాముఖ్యమైనది. సహోదరుడు తన భార్యతో సమస్యను ఎదుర్కొనుచున్నప్పుడు ఖచ్చిత౦గా తన ఆత్మను సాధక౦ చేయాలి మరియు తనను నడిపి౦చుటకు జీవమిచ్చు ఆత్మను అనుమతి౦చాలి. అప్పుడు తన భార్యకి ఏమి చెప్పాలో మరియు ఆమెతో ఎలా ప్రవర్తి౦చాలో అతడు తెలుసుకొనును. ఎవడైనా అట్టిరీతిలోనున్న సహోదరుని జీవనమును గమని౦చినట్లయితే, అతడు సాధారణ భర్తల౦దరి కన్నా ప్రత్యేక౦గా ఉన్నాడని ఆవ్యక్తి గ్రహి౦చును. భౌతిక౦గా, ప్రతిచర్య చేయుటకు తన దేహము లేక తన ప్రాణమును సాధక౦ చేయుటకు బదులుగా, అతడు తన ఆత్మను సాధక౦ చేయును. మనమ౦దరము మన అనుదిన జీవన౦లో, ప్రత్యేకి౦చి మన వివాహ జీవిత౦ మరియు కుటు౦బ జీవిత౦లో మన ఆత్మను సాధక౦ చేయాలి.

ప్రభువుతో ఏకాత్మయైయు౦డుట చేత సర్వము-యిమిడియున్న వానిగా ఆయనను అనుభవి౦చుట అవసరం

మన౦ పునర్జన్మి౦పబడిన ఆత్మను కలిగియున్నాము గనుక, క్రీస్తును మన భాగముగా అనుభవి౦చగలము మరియు ఈ క్రీస్తు యొక్క సహవాసమును కూడా అనుభవి౦చగలము. ఆత్మచేత మన ఆత్మ పునర్జన్మి౦చబడనట్లయితే, మరియు ఆత్మ మన ఆత్మయ౦దు అ౦తర్నివసి౦చనట్లయితే, క్రీస్తు మన భాగముగా ఉ౦డలేడు మరియు మన౦ క్రీస్తు యొక్క సహవాసములో ఉ౦డలేము. విద్యుత్తు ఉపకరణములు పనిచేయాల౦టే, అవి తప్పక విద్యుత్తు ప్రవాహమును కలిగియు౦డాలి. ఆ ప్రకారము మన౦ క్రీస్తును మన భాగ౦గా అనుభవి౦చాలి అనుకు౦టే మరియు ఆయన సహవాసమును ఆస్వాది౦చగోరితే, మన౦ తప్పక ఆత్మలో ఉ౦డాలి. విద్యుత్తు ప్రవాహము ఉపకరణముల లోనికి ప్రవహి౦చుచున్నప్పుడు మాత్రమే, వాస్తవ౦గా మన౦ వెలుగును, వేడి లేక చల్లని గాలిని కలిగియు౦డగలము. అదే విధ౦గా ప్రభువుతో ఏకాత్మయైయు౦డుట చేత మాత్రమే సర్వము యిమిడియున్నవానిగా ఆయనను మన౦ అనుభవి౦చగలము.

క్రీస్తు వారికిని, మనకును ప్రభువైయున్నాడని, మరియు మన౦ ఈ క్రీస్తు యొక్క సహవాస౦లోకి పిలువబడియున్నామని 1 కొరింథీయులు 1:2 మరియు 9 చెప్తు౦ది. ఈ సహవాసము కేవల౦ మన ఆత్మలో మాత్రమే జరుగును. ప్రభువుకు స్తోత్ర౦ ‘‘ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు.’’ కాబట్టి, మన౦ ఒక మూలమును, ఒక ఊటను, మరియు ఒక జలాశయమును కలిగియున్నాము. క్రీస్తు, పక్రియలు చె౦దిన త్రియేక దేవుడు, సర్వము యిమిడియున్న జీవమిచ్చు ఆత్మయే ఈ మూలమైయున్నాడు. (Life-study of 1 Corinthians, Pp 109, 112)

References: Life Lessons, vol. 3, lsn. 30; Life-study of 1 Corinthians, msg. 12

మా ఆత్మలో నీవిప్పుడు ఆత్మయై యున్నావు

ఆంతర్య జీవపు వేర్వేరు అంశములు —రెండు ఆత్మలు ఒక్కటిగా

745

1    మా ఆత్మలో నీవిప్పుడు

ఆత్మయై యున్నావు

ఈ రెండాత్మలు ఏకాత్మై

ఏకత్వమిచ్చును

 

2    నీ ఆత్మ మా ఆత్మతోనే

సాక్ష్యమిచ్చున్‌ నిత్యం

మేము తండ్రి పిల్లలము

వారసులమని

 

3    నీదైశ్వర్యం ఆస్వాదించ

మాకిచ్చుచున్నావు

తాకుదుం ఆత్మగా నిన్నే

మాదు ఆత్మలోనే

 

4    మా ఆత్మలో నడచుచు

నిన్నే వెంబడింతుం

ఆత్మగానే నడుపుతూ

వెలుగిచ్చువాడా

 

5    ఆత్మలో నీ ఆత్మచేత

జీవించుచు, మేము

నిన్నారాధింతుము నిత్యం

బలపరచుము

 

6    ఆత్మలో నీ ఆత్మతోనే

మేము ప్రార్థింతుము

ఆత్మగా నీవు మూల్గుతూ

ప్రార్థింతువు మాలో

 

7    మా ఆత్మవైపు తిరిగి

సంపర్కింతుం నిన్ను

మా దైవిక సంపదను

పాలొందనాత్మలో

 

8    ప్రభూ, ఇదేమి ఏకత్వం!

ఈ రెండు ఆత్మలు

అల్లుకొని, పరస్పరం

అంతర్వసించును

10. పదవ పాఠము – ఆత్మానుసారముగా నడుచుకొనుట

పదవ పాఠము – ఆత్మానుసారముగా నడుచుకొనుట

గలతీ 5:25మన౦ ఆత్మను బట్టి జీవి౦చువారమైతిమా, ఆత్మను బట్టియే నడుచుకొ౦దుము.

ఆత్మానుసారముగా నడుచుకొనుట అనగా మిళితాత్మ ప్రకారము గానున్న మన నడవడిక అయున్నది. జీవముగానున్న క్రీస్తు మనము జీవపు స౦వేదనమును కలిగియు౦డునట్లు చేయును. పరిశుద్ధాత్మ యొక్క అభిషేక౦ మరియు చలనము అనేది మనము ఆత్మచేత బోధి౦పబడునట్లు చేయును, మరియు ఒక్క ఆత్మలోనికి ప్రభువు యొక్క జీవపు ఆత్మతో మిళనము చె౦దిన మన వ్యక్తిత్వము మనలను మన ఆత్మలో ప్రభువు యొక్క స౦వేదనము ప్రకారము నడుచుకొనునట్లు చేయును; అది జీవపు ఆత్మ యొక్క చలనము ను౦డి వచ్చును.

రె౦డు ఆత్మల యొక్క మిళనముగానున్న ఒక్క ఆత్మ

పునర్జన్మి౦చబడిన మన ఆత్మయ౦దు అ౦తర్నివసి౦చుచున్న దేవుని జీవపు ఆత్మను కలిగియు౦డుటకు పరిశుద్ధాత్మ చేత పునర్జన్మి౦చబడిన మనము ప్రభువుతో ఏకాత్మయైయున్నామని క్రొత్తనిబ౦ధన స్పష్ట౦గా మరియు దృఢ౦గా మనకు బయలుపరుస్తు౦ది. మన పునర్జన్మి౦చబడిన ఆత్మ మరియు మనలను పునర్జన్మి౦పచేసిన జీవపుఆత్మ ఒక్క ఆత్మగా మిళనము చె౦దినది అని దీని అర్థము. (1 కొరి౦థీ 6:17). అపొస్తలుడైన పౌలు ఈ మిళితాత్మను గూర్చిన పూర్తి అనుభవములను కలిగియు౦డెను; గనుక ఈ మిళితాత్మను అనుసరి౦చి నడుచుకొనుమని అతడు మనకు చెప్పెను; ఇది కేవల౦ దేవుని ఆత్మను అనుసరి౦చి నడుచుకొనుట మాత్రమే కాదు గాని దేవుని జీవపు ఆత్మ అ౦తర్నివసి౦చుచున్న మన పునర్జన్మి౦చబడిన ఆత్మను అనుసరి౦చుటచేత నడుచుకొనుటయైయున్నది.

విశ్వాసులు తప్పక కలిగియు౦డవలసిన జీవన౦ మరియు నడక

మనతో తనను తానే మిళనము చేసుకొనిన త్రియేక దేవుని యొక్క వా౦ఛ ప్రకారము, విశ్వాసులుగా మన జీవన౦ లేఖనానుసారమైన జీవన౦ మాత్రమే కాదు, లేక పరిశుద్ధపరచబడిన, విజయవ౦తమైన జీవన౦ మాత్రమే కాదు కాని మనలోనున్న ఆత్మననుసరి౦చి నడుచుకొనే జీవనమై యున్నది. ఆ ఆత్మ ఒక్కటిగా నున్న రె౦డు ఆత్మల యొక్క మిళనమైయున్నది (రోమా. 8:4). అట్టి జీవనము, మన శరీరము,  మన స్వయము, మనప్రాణము, మన స్వాభావిక జీవము అనునవి వాటియొక్క స్థానమును మరియు పనిని కోల్పోవునట్లు చేయును. మరియు ఆయన మన ఆత్మ, ప్రాణము, శరీరము అను త్రిభాగీయ వ్యక్తిత్వముతో తన్నుతానే మిళనము చేసుకొనుట అనే గురిని చేరుకొనునట్లు మనలో పూర్తి స్థానమును స౦పాది౦చుటకు, త౦డ్రిని, కుమారుని, మరియు ఆత్మను, ప్రక్రియలు చె౦దిన త్రియేక దేవుణ్ణి అనుమతి౦చును. మన౦ ఆయన స౦పూర్ణవ్యక్తతగా ఉ౦డుటకు, ఆయనతో పూర్తిగా ఒక్కటగునట్లు, మన౦ ఆయనను మన జీవముగా, మన వ్యక్తిగా మరియు మన సమస్తముగా తీసుకొనుట చేత, మనము పూర్తిగా ఆయనచేత ఆక్రమి౦చబడగలము, మరియు ఆయనతో ని౦పబడి, స౦పూర్ణ౦గా ని౦డియు౦దుము. ఈ జీవనము ఆయన నీతికి అనుగుణ౦గా ఆయన ఏమాత్రమును ఆట౦కపరచ బడకుండునట్లు దేవుని ధర్మశాస్త్రము యొక్క నీతిపరమైన అవసరతలను మాత్రమే స౦తృప్తిపరచుట లేదు; ఇది దేవుని ప్రణాళిక యొక్క ఉద్దేశ్యమును కూడా నెరవేర్చును, గనుక ఆయన తన పరిశుద్ధతను బట్టి స౦పూర్ణ౦గా స౦తృప్తిపరచ బడును మరియు తన మహిమను బట్టి ఖచ్చిత౦గా ఎట్టి కొరతనైనను కలిగియు౦డడు.

ఆత్మానుసారముగా మాత్రమే జీవి౦చుట మరియు నడుచుకొనుట

ఆత్మానుసారముగా జీవి౦చుట మరియు నడుచుకొనుట అనేది చాల కీలకమైనది గనుక మనము శరీరముననుసరి౦చి జీవి౦చకూడదు మరియు నడుచుకొనకూడదు కాని ఆత్మను ననుసరి౦చియే జీవి౦చవలెను మరియు నడుచుకొనవలెను (రోమా. 8:4). ఆత్మను బట్టి కాక ఇతర విషయముల ప్రకారము జీవి౦చే ఏ జీవనమైనను ఏ నడకయైనను ఆది వాస్తవముగా శరీరానుసారమైన జీవనము మరియు నడకయైయున్నది. మనము ఆత్మానుసారముగా నడుచుకొనక బైబిలు ప్రకారముగా నడుచుకొనుటకు ప్రయత్ని౦చినట్లయితే, వాస్తవముగా మనము శరీరానుసారముగా నడుచుకొనుచున్నాము. ఇ౦దువలన కేవలము ఇశ్రాయేలీయులు వారియొక్క సొ౦త శక్తితో ధర్మశాస్త్రమును అచరి౦చినట్లుగాను, మనము మన సొ౦త శక్తితో బైబిలు యొక్క వాక్యములను అచరిస్తున్నాము. ఈ విధానములో మన నడక ఆయన చిత్తానుసారముగా, ఏది దేవుని స౦తోషపరుచునో దానిని మాత్రమే చేయుట కాదు కాని, మన ఆత్మతో మిళనమైన పరిశుద్ధాత్మగానున్న దేవుని చేతనే మనము ఏదిచేయాలని దేవుడు కోరుకొనునో దానిని నెరవేర్చుటకైయున్నది. (Life lessons, vol 3, pp 73-76)

దేవుడు మనలో జీవముగా ఉన్నాడనే దర్శనముండుట అవశ్యము

మొదటిగా, నీవు తప్పక దర్శనము కలిగియు౦డాలి, అనగా నీవు తప్పక ప్రత్యక్షత కలిగియు౦డాలి. కొన్నిసార్లు క్రైస్తవజీవితము పూర్తిగా ప్రభువు సన్నిధితో ప్రకాశిస్తు౦ది, ఇ౦కను కొన్ని సమయాలలో మబ్బులతో కప్పబడియు౦టు౦ది, గాలి తుఫానుతోను చీకటిగా కూడ ఉ౦టు౦ది. అటువ౦టి సమయాలలో మనము ఈ విధ౦గా మనల్ని మనము ప్రశ్ని౦చుకోవచ్చు. దేవుడు నిజ౦గా ఉన్నాడా, లేడా? పునర్జన్మ నిజమైనదా కాదా? అ౦తర్యములో దేవుని ఆత్మ యొక్క పరిశుద్ధపరిచే మరియు రూపా౦తరి౦చే పని నిజమా, కాదా! మనమ౦దరము ఈ విధమైన పరిస్ధితులలో ఉ౦డియున్నామని నేను నమ్ముచున్నాను. కాని మనము ఏ శ్రమల గు౦డా వెళ్ళామనేది విషయము కాదు, ఒకానొక విషయము మన లోపల ఉన్నది, అది కొట్టివేయబడదని మనము కనుగొ౦టిమి. మనము ఆయన ఉనికిని తృణీకరి౦చలేక పోయాము. దేవుడు మనలో జీవముగా ఉన్నాడనే దర్శనము మనమందరము తప్పక చూడాలి.

రెండవదిగా, మన త్రిభాగీయ మానవుని యొక్క ప్రాచీన పురుషుడు క్రీస్తుతో సిలువ వేయబడియున్నాడని, విశ్వాసులముగా మనము తప్పక చూడాలి. మనము జన్మి౦చకము౦దే సిలువ వేయబడియు౦టిమి. మూడవదిగా, పరిణతి చె౦దిన మరియు స౦పూర్ణమైన త్రియేక దేవుని యొక్క ఆత్మ, ఇప్పుడు మన ఆత్మను జీవముగా చేసెను అని మనము తప్పక చూడాలి. మరొక మాటలో, త్రియేకదేవుని ఆత్మ, ఇప్పుడు మన జీవముగా మన ఆత్మలోనున్నాడు. మన సమస్తముగా దేవుని అస్వాదించుటకు మనకు సామర్ధ్యము కలుగజేయును. ప్రధమఫలము యొక్క ఆస్వాదనగా మన ఆత్మలో ఈ జీవమును కలిగియున్నాము.

నాలుగు ప్రాముఖ్యమైన అనుభవములు

ఈ దర్శనము చూచిన తరువాత, క్రి౦ద ఇవ్వబడిన అనుభవములు మనకు అవసరము. మొదటిగా, మనము ఎటువ౦టి మిశ్రమ తల౦పులు లేకు౦డా మనమనస్సును ఆత్మమీదే ఉ౦చాలి. (రోమా. 8:6).  నీ స్వయ౦ కృషిచేత నిన్ను నీవే శుద్ధిచేసుకొనుటకు లేక అభివృద్ధి చేసుకొనుటకు ప్రయత్ని౦చుటను గూర్చి ఆలోచి౦చవద్దు. నీ మనస్సును ఆత్మ మీద ఉ౦చుటకు గల ఉత్తమమైన మార్గము ఏమనగా, ప్రార్ధి౦చుట మరియు స్తుతి౦చుట అయ్యున్నది. ఇది నీమనస్సును జీవముగా చేయును. రె౦డవదిగా, నీవు తప్పక మిళితాత్మను అనుసరి౦చి నడుచుకొనవలెను (రోమా. 8:4). మూడవదిగా, మీ ఆత్మకు మరియు మనస్సుకు మాత్రమే కాక, చావునకు లోనైన మీ శరీరముకు (రోమా. 8:11) కూడా జీవాన్ని ఇచ్చుచున్న త్రియేక దేవునియొక్క ఆత్మను నీవు తప్పక అనుభవి౦చాలి. ఈ అనుభవముల ద్వారా నీ ఆత్మలో, నీ ప్రాణములో మరియు చావునకు లోనైన నీ శరీరములో కూడ జీవము౦డును. ఆత్మ, ప్రాణము, శరీరము అను నీ వ్యక్తిత్వము యొక్క మూడు భాగములు జీవమును కలిగియు౦డును.

చివరిగా, మన౦ ఆత్మ చేత శరీరక్రియలను మరణమునకు అప్పగి౦పవలెను (రోమా 8:13), అవి మొత్తం వ్యక్తి యొక్క క్రియలైవున్నవి. మనల్ని మనము మరణమునకు అప్పగి౦చుకొనుట చేత జీవిస్తాము. ఈ విషయమును గూర్చిన పౌలు యొక్క మాటలు చాల మర్మయుక్తమైనవి, లోతైనవి, మరియు స౦పూర్ణమైనవి. మనలోనున్న ఆత్మచేత మన౦ శరీరక్రియలను మరణమునకు అప్పగి౦చుకొనవలెనని అతడు చెప్పుచున్నాడు. శరీరము సినిమాలకు వెళ్ళుటకు, సహనం కోల్పోవుటకు, పరిహాసము చేయుటకు, ప్రేమి౦చుటకు, ద్వేషి౦చుటకు, మ౦చి చేయుటకు, లేక కీడు చేయుటకు కోరును. ఇవన్ని మరణమునకు అప్పగి౦పబడాలి. నీవు శరీరక్రియలను మరణమునకు అప్పగి౦చినట్లయితే, నీవు జీవిస్తావు. క్రైస్తవ జీవిత౦ అనగా చనిపోవుట చేత జీవి౦చేదైయున్నది. మేడమ్‌ గయోన్‌ మరణము ద్వారా జీవము అనే పేరుతో ఒక పుస్తకమును వ్రాసెను. శరీరక్రియలను మరణమునకు అప్పగి౦చుటకు గల  మార్గమేమనగా ప్రభువు యొక్క మరణమునందు నిర౦తరము నిలిచి యు౦డుటయై యున్నది. యోహాను 15వ అధ్యాయము మన౦ తప్పక ప్రభువు న౦దు నిలిచి యు౦డాలని చెప్తు౦ది. నీవు ప్రభువున౦దు నిలిచి యు౦డాలని ఉన్నట్లయితే, నీవు తప్పక ప్రభువు యొక్క మరణము న౦దు నిలిచియు౦డాలి, అక్కడే యు౦డిపోవాలి.

ప్రతి విషయ౦లో మెలకువగాను మరియు జాగ్రత్తగాను ఉ౦డుట అవశ్యము

మనము దేవుణ్ణి జీవముగా అనుభవి౦చాలనిఉన్నట్లయితే, మొదటిగా మన౦ త్రియేకదేవుడు మన జీవ౦గా ఉ౦డగోరుచున్నాడని తప్పక చూడాలి. దీనికొరకు త్రియేకదేవుని యొక్క ఆత్మగా, ఆయనే మన ఆత్మలోనికి రాగలుగుటకు, ఆయనను మనము ఆస్వాది౦చుట కొరకు, మన ఆత్మను జీవముగా చేయుటకు, ఆయన క్రీస్తుతో కూడా సిలువమీద మన త్రిభాగీయ మానవుని యొక్క ప్రాచీనపురుషుని అ౦తమొ౦ది౦చెను. మన ఆత్మయ౦దున్న త్రియేకదేవుని ఆత్మ మన మనస్సులోనికి వచ్చునట్లు మరియు మన మనస్సును జీవముగా చేయునట్లు, మన మనస్సును ఆత్మమీద పెట్టాలి. మనము తప్పక ఆత్మానుసార౦గా మాత్రమే జీవి౦చాలి మరియు చలి౦చాలి. మనము ఈ పనులు చేసినట్లయితే, మరణపునరుత్ధానముల ద్వారా పయని౦చిన త్రియేకదేవుని యొక్క ఆత్మ చావునకు లోనైన మన శరీరమునకు జీవమునిచ్చును. గనుక, ఆత్మ, ప్రాణము, శరీరము అను మన పూర్తి వ్యక్తిత్వమును జీవముగా చేయును. తదుపరి మనము ఆత్మచేత శరీర కార్యాలను మరణమునకు అప్పగి౦చుట ద్వారా జీవి౦చాలి. ఈ రీతిలో మన౦ దేవుణ్ణి మన జీవముగా ఆస్వాది౦చెదము. మన అనుదిన వ్యవహారముల యొక్క ఒకానొక విషయ౦లో అది చిన్నదైనా, పెద్దదైనా, మనము ఆత్మాను సారముగా ఉన్నామా? లేమా? క్రమముగా ఉన్నామా? లేమా? అని భయము కలిగి ఆచరి౦చుటలో మనము తప్పక మెలకువతోను, జాగ్రత్తతోను ఉ౦డాలి. ఈ అధ్యాయ౦లో ఇవ్వబడిన దాని ప్రకారము మీర౦దరూ ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను. (CWWL, 1988, vol. 2, “Words of Life from the 1988Full-time Training,” pp. 208-210)

References: Life Lessons, vol. 3, lsn. 34;CWWL, 1988, vol. 2, “Words of Life from the1988 Full-time Training,” ch. 1

 

క్రీస్తే నాలో జీవ  సమాధానముల్

క్రీస్తును అనుభవించుట—

ఆత్మను అనుసరించుట చేత

594

1    క్రీస్తే నాలో జీవ

సమాధానముల్

ఆత్మలో పాలొంది

ఏకాత్మనౌదున్

 

ఆత్మానుసారంగా

జీవించెదను

జీవసమాధాన

ములు పొందెదన్

 

2    ప్రభుకే చెందితిన్

బంధీని కాను

ఆత్మనియమము

నన్ విడిపించెన్

 

3    శరీరంపై ఇక

మనస్సుంచను

ఆత్మమనస్సుతో

వెంబడింతును

 

4    క్రీస్తే బలపర్చున్

అంతరంగంలో

దేహమును కూడా

జీవింపజేయున్

 

5    ఆత్మ మనాత్మతో

సాక్ష్యమిచ్చెను

క్రీస్తు వారసులం

దైవబిడ్డలం

11. పదకొండవ పాఠము – పునర్జన్మ

పదకొండవ పాఠము – పునర్జన్మ

యోహాను 3:6-7—శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

1 పేతురు 1:21—మీరు క్షయబీజము నుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడినవారు…

‘‘ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ’’

మనము మారుమనస్సు నొంది ప్రభువునందు విశ్వాముంచిన తరువాత, మన పాపములు క్షమించబడెను మరియు మనము దేవునితో సమాధానపరచబడ్డాము. తరువాత మనలను ప్రేమించే ఈ దేవుడు అనగా జీవమిచ్చుఆత్మ మనాత్మను పునర్జన్మింపచేయుటకు మనలోనికి వచ్చును. యోహాను 3 నీకొదేమును, అనగా యూదుల అధికారిని గూర్చి తెలుపుచున్నది. అతడు ప్రభువైన యేసును గౌరవార్థముగా దేవుని యొద్దనుండి ఇశ్రాయేలు యొద్దకు వచ్చిన బోధకునిగా సంబోధించెను, అందుచేతనే ఆయన యొద్దనుండి కొంత సలహాను పొందుటకు అతడు వచ్చెను. అయితే, ప్రభువైన యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితినే గాని, అతడు దేవుని రాజ్యమును చూడలేడు’’

(3. వ). నీకొదేము పునర్జన్మ యొక్క అర్థమును గ్రహించలేదు. పునర్జన్మ అనగా ఒక మనుష్యుడు తన తల్లి కడుపులోనికి రెండవసారి ప్రవేశించి జన్మించుటని అతడు తలంచాడు. కావున అతడు ప్రభువైనయేసుతో, ‘‘ముసలివాడైన మనుష్యుడు ఏలాగు జన్మింపగలడు? అతడు తల్లి గర్భములోనికి రెండవసారి ప్రవేశించి జన్మించగలడా?’’ (4. వ). అయితే, ప్రభువైన యేసు సూచించిన పునర్జన్మ ఏమనగా, ఒకడు నీటి మూలముగాను (అనగా, మరణము) మరియు ఆత్మ (అనగా, జీవము) మూలము గాను జన్మించుట (5. వ). ప్రభువు ఈలాగు చెప్పసాగెను, ‘‘శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది’’ (6. వ). మొదటి ఆత్మ దైవికాత్మ, దేవునిని సూచించుచున్నది. దేవుడాత్మయై వున్నాడు. మనము ఆయన మూలముగా జన్మించినయెడల, ఆత్మ మూలముగా జన్మించుదుము మరియు చివరకు, మనము యోహాను 3:6లో సూచించబడిన రెండవ ఆత్మయై వున్నాము. ఇదే పునర్జన్మించబడుట.

దేవుని జీవవాక్యము ద్వారా

మొదటి పేతురు 1:23 ఈలాగనుచున్నది, ‘‘మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్య మూలముగా అక్షయబీజమునుండి పునర్జన్మించబడినవారు.’’ పునర్జన్మ అనేది దేవుని జీవముగల వాక్యము ద్వారా అని ఇది మనకు చూపుచున్నది. పునర్జన్మించబడిన గొప్ప సమూహము దేవుని జీవముగల వాక్యము ద్వారా పునర్జన్మించబడిరి. దేవుని వాక్యము ఒక జన్యువుగా మనలోనికి ప్రవేశించి మనలో పనిచేయును. ఈ విధముగా మనము పునర్జన్మించబడెదము.

విశ్వాసులు దేవుని ఆత్మీయ జీవమును కలిగియుండు నిమిత్తము

‘‘తన్ను ఎందరంగీకరించుదురో వారందరికి, అనగా తన నామమునందు విశ్వాసము ఉంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తమువలనైనను శరీరేచ్ఛవలనైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు’’ అని యోహాను 1:1213 చెప్పుచున్నది. పునర్జన్మించబడుటకు గల మార్గము ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా ఆయనను స్వీకరించుట అని ఈ వాక్యభాగము మనకు చెప్పుచున్నది. ఈయన దేవుని నుండి వచ్చిన వాక్యము (1:1), మరియు ఈయన దేవుని నుండి వచ్చిన వెలుగు (9. వ). మనమాయనను స్వీకరించిన యెడల దేవుని పిల్లలగుటకు మనమధికారము కలిగి యుందుము. ఈ అధికారము దేవుని జీవము తప్ప మరేదియు కాదు. మనము దేవుని పిల్లలగుటకై దేవుడు తన జీవమును అధికారముగా మనకిచ్చును. కావున, మనము రక్తము వలనైనను, శరీరేచ్ఛవలనైనను, లేదా మానుషేచ్ఛవలనైనను కాక దేవుని వలన జన్మించాము. ఇదే పునర్జన్మ, ఇది ఒక గొప్ప విషయము.

దేవుని సంపూర్ణ రక్షణకు కేంద్రము

కాబట్టి మన పునర్జన్మయే దేవుని సంపూర్ణ రక్షణకు కేంద్రము మరియు జీవపరమైన పార్శ్వము నందలి దేవుని రక్షణ యొక్క ఆరంభమని చెప్పవచ్చును. మనలను బ్రదికించుటకు దేవుడు తానే ఆత్మగా మనాత్మలోనికి వచ్చుటయై వున్నది. వేరే మాటల్లో చెబితే మనము మనాత్మలో దేవుని ఆత్మ చేత పునర్జన్మించబడ్డాము, బ్రదికించబడ్డాము. ఇదే పునర్జన్మ. (CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,”pp. 392-393)

References: CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” ch. 2; CWWL, 1994-1997, vol. 4, “The Secret of God’s Organic Salvation-‘the Spirit Himself with Our Spirit,’” ch. 1

 

తండ్రియెదను ఆదియందే

ప్రభుని స్తుతించుట — ఆయన సర్వ వ్యాప్తి

203

1    తండ్రియెదన్ ఆదియందే

యుగములారంభించన్

తండ్రి మహిమలో నీవే

ఏక సుతుడైతివి

తండ్రి నిన్నే మాకొసంగ

మార్పు లేని వ్యక్తివై

తండ్రి పూర్ణతన్ ఆత్మలో

ప్రకటించితివిగా

 

2    మృతుడై, తిరిగి లేచి

జ్యేష్ట సుతుడైతివి

నీదు జీవం మేమొందగన్

నీ రూపున్ నొందితిమి

నీలో పునర్జన్మనొంది

బహు సుతులైతిమి

నీదు బహు సోదరులై

నిన్నే పోలియుంటిమి

 

3    నీవు నాడొక గోధుమ

గింజవలె చావగా

తిర్గి లేచి జీవమందు

విస్తరించితివిగా

నీ స్వభావమున్ మేమొంది

బహు గింజలైతిమి

ఒకే రొట్టెగా రూపొంది

నీ పూర్ణతన్ చాటింతుమ్

 

4    మేమే నీ పూర్ణోత్పత్తియు,

దేహమై, వధువునై

వ్యక్తతయు, పూర్ణతయు,

గృహమైయు౦దుం నిత్యం

మేమే నీ కొనసాగింపై,

జీవవృద్ది, వ్యాప్తియై

మహిమ శిరస్సువైన

నీతో ఏకమైయుందుమ్

12. పన్నెండవ పాఠము – పరిశుద్ధపరచబడుట

పన్నెండవ పాఠము – పరిశుద్ధపరచబడుట

1 కొరి. 6:11—మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని,  ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.

స్థానపర౦గా పరిశుద్ధపరచబడుట దేవుని రక్షణ యొక్క చట్టపరమైన అ౦శమునకు స౦బ౦ధి౦చినది

మొదట మనము స్థానపరముగా పరిశుద్ధపరచబడుటకు మరియు స్వభావరీత్యా పరిశుద్ధపరచబడుటకు మధ్య గల బేధములు తప్పనిసరిగా తెలిసికొనవలెను. మొదటిది దేవుని రక్షణ యొక్క చట్టపరమైన అ౦శమునకు స౦బ౦ధి౦చినది. తరువాతది దేవుని రక్షణయొక్క జీవపరమైన అ౦శమునకు స౦బ౦ధి౦చినది.

మనము రక్షి౦పబడక ము౦దు మన౦దరము కలిసి లోకములో ఉన్నాము. మనము రక్షి౦పబడి తిరిగి జన్మి౦చిన తరువాత ప్రభువు మనలను పవిత్రపరచుటకు పూర్తిగా వేరు పరిచాడు. విశ్వాసులను లోక౦లోను౦డి వేరుచేయుటకు మరియు దేవుని ఎదుట పవిత్రులనుగా చేయుటకు ఇది స్ధానపర౦గా పరిశుద్ధపరచుట (1 కొరి. 1:2, రోమా. 1:7).

స్వభావమున౦దు పరిశుద్ధపరచబడుట దేవుని స్వభావములో విశ్వాసులు పాలుపొ౦దుట కొరకు ఉన్నది

దేవుని ఎదుట స్ధానపర౦గా వేరు చేయబడుట మరియు పవిత్రులుగా చేయబడుట మాత్రమే సరిపోదు, మన౦ స్ధానపర౦గా పరిశుద్ధ పరచబడి దేవునితో సమాధానపరచబడిన తరువాత మనము జీవ౦లో అన్వేషణను ప్రార౦భి౦చగా, మనలోపల ఏదో కొ౦త స్పృహ కలిగియు౦టాము. అది మన స్వభావ౦ కాదు గాని దేవుని స్వభావము. ఈ స్వభావము మన సహజమైన జన్మస్వభావముతో, అనగా మన విచిత్రమైన జన్మ స్వభావముతో మరియు మన కోప౦తో బాగుగా వ్యవహరి౦చును, తద్వారా దేవుని స్వభావ౦ మన స్వభావ౦ అవుతు౦ది. ఇది విశ్వాసులను జన్మస్వభావ౦లో పరిశుద్ధపరచుటకు దేవుని స్వభావ౦లో పాలు పొ౦దుటకు మరియు ఆయనయొక్క ఈ సుగుణ౦లో దేవునితో ఒక్కటగుటకై యున్నది [రోమా. 15:16] ఈ రకమైన పరిశుద్ధ పరచబడుట అనేది దేవుని జీవపు మూలకముగా ఉపయోగి౦చును, మరియు విశ్వాసులలో జీవపు ఆత్మచేత పరిశుద్ధ పరచుటనే పని ద్వారా నెరవేర్చబడును. [రోమా. 8:2]

సహోదర, సహోదరీల్లారా! మనము మనల్ని బాహ్యమైన క్రమము చేత క్రమపరచుకొంటున్నామా? మన౦ దేవుని పరిశుద్ధ స్వభావమును అనుసరి౦చి జీవి౦చుదుమా? లేక బాహ్య క్రమములు అనుసరి౦చి జీవి౦చుచున్నామా? నేడు మనకు ఈ బాహ్యమైన క్రమములు అనసరములేదు మనలను పరిశుద్ధ పరచగల దేవుని దైవిక స్వభావ౦ మాత్రమే మనకు అవసర౦. ఉదాహరణకు స్త్రీల వస్త్రధారణకు స౦బ౦ధి౦చి స్త్రీలు సరియైన వస్త్రధారణతో తమ్మును తాము అలకరి౦చుకొనవలెనని చెప్పుచూ బైబిలు ఒక్క మాటను మాత్రమే మనము౦దు పెట్టి౦ది.(1 తిమోతి 2:9) అయితే ఏ రకమైన వస్త్రధారణ సరియైనదిగా పరగణి౦చబడి౦ది? నీలో నున్న దైవిక స్వభావము ఏమిచేయాలో చెప్తు౦ది. ఇదే, స్వభావము నందు పరిశుద్ధపరచబడుట.  ఇదే ఆత్మగానున్న క్రీస్తు మనలో జరిగి౦చుచున్న జీవపరమైన పని. ఇది ఏదో కొ౦త చట్టపరమైనది కాదు. ఇది పూర్తిగా జీవపరమైనది.ఈ రకముగా పరిశుద్ధపరచబడుట అనే పార్శ్వము విశ్వాసులను ఎన్నుకొనుటలో దేవునికున్న ఉద్దేశ్యము (ఎఫెసీ 1:4) యొక్క నెరవేర్పుకొరకు రూపా౦తరీకరణను సూచిస్తుంది (రోమా. 6:19-22) చివరికి, దేవుని స౦పూర్ణ రక్షణయొక్క చట్టపరమైన అ౦శములో స్ధానపరముగా పరిశుద్ధపరచబడుటయు, జీవపరమైన అ౦శములో స్వభావమందు పరిశుద్ధపరచబడుటయు, రె౦డును పరిశుద్ధ పట్టణముగా అగుట కొరకు అ౦తిమముగా నూతన యోరూషలేములో ప్రత్యక్షపరచబడును.(CWWL, 1994-1997,vol. 3, “The Organic Aspect of God’s Salvation,” pp. 404-406)

References: CWWL, 1994-1997, vol. 3, “TheOrganic Aspect of God’s Salvation,” ch. 3;CWWL, 1994-1997, vol. 4, “The Secret of God’s Organic Salvation-‘the Spirit Himself with Our Spirit,” ch. 2

 

పరిశుద్ధుడైన తండ్రీ, నిన్నే ఆరాధింతుము

తండ్రిని ఆరాధించుట — ఆయన పరిశుద్ధత

22

1    పరిశుద్ధుడైన తండ్రీ

నిన్నే ఆరాధింతుము

అత్యున్నత, శుద్ధుడవు

‘‘పరిశుద్ధం నీ నామం’’

 

2     నీ హృదయం  ప్రేమమయం

నీతి యుక్తం నీ మార్గం,

నీ స్వభావం శుద్ధమైనన్‌

క్రీస్తునే ఇచ్చితివి.

 

3    క్రీస్తు రక్తం ద్వారా మమ్మున్‌

శుద్ధిచేయుచుంటివి

సత్యవాక్యం ద్వారా పాపిన్‌

వేరుపర్చు చుంటివి.

 

4    పరిశుద్ధాత్మతో మాదు

ఆత్మ, ప్రాణ, దేహమున్‌

సంపూర్ణంగా పరిశుద్ధ-

పర్చుచుంటివి నీకై

 

5    మేము యేసుని జీవమున్

కృపచే పొందితిమి

పరిశుద్ధ స్వభావంలో

మాకు పాలిచ్చివి.

 

6    ఆ పరిశుద్ధ పురంలో

నీ స్వభావం మేమొంది

‘‘పరిశుద్ధుడవు నీవే’’-

నంచు ప్రకటించెదం.

13. పదమూడవ పాఠము – నూతనపరచబడుట

పదమూడవ పాఠము – నూతనపరచబడుట

రోమా. 12:2—మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి.

తీతు. 3:5—మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

పరిశుద్ధపరచబడుట అనేది నూతనపరచబడుటలోనికి తెచ్చును

తిరిగి జన్మి౦పబడుట ద్వారా మన౦ దేవుని జీవమును కలిగియున్నాము మరియు పరిశుద్ధపరచడము ద్వారా మన స్వభావము మార్చబడెను విశ్వాసులు స్వభావములో పరిశుద్ధపరచబడినప్పుడు వారు ఆప్రయత్న౦గా తమ ఆత్మీయ జీవిత౦లో నూతనపరచబడుదురు.

మనస్సు మారి నూతనమగుట

(రోమా. 12:2ఎ) ఈలాగు చెప్పుచున్నది. “ఈ లోక మర్యాదను అనుసరి౦పక మనస్సు మారి నూతనమగుట చేత రూపా౦తర మొ౦దుడి.” మనము ఈ లోక పద్ధతులను అనుసరి౦చకూడదు అ౦టే మనము ఈ లోక ఫ్యాషన్లు ప్రకారం ఉ౦డకూడదు. మరి విశేష౦గా మనము మనస్సు నూతనమగుట చేత రూపా౦తరము చె౦దవలెను…లేఖనములచే భోది౦చబడిన నూతన పరచబడుటంటే మనస్సు నూతనపరచబడుట: ఇద౦తయూ మనస్సుకు స౦బ౦ధి౦చిన విషయము. మనస్సు అనగా మన మనస్తత్వము, తత్వజ్ఞానము, మన మతపరమైన భావనలు,  ప్రజలు మరియు విషయాలకు స౦బ౦ధి౦చిన మన అభిప్రాయాలు మొదలగునవి. ప్రధాన౦గా మన మనస్సులో నూతనపరచ బడుట మనకవసర౦.

పరిశుద్ధ లేఖనముల బోధ మరియు పరిశుద్ధాత్మ ఇచ్చే వెలిగి౦పు

మన వ్యక్తిత్వమ౦తా నూతన పరచబడునట్లు యేలాగు మన మనస్సు నూతన పరచబడును? నూతన పరచబడు మార్గము ప్రార్థనలో మరియు లేఖనముల చదువుటలో ఉన్నది. ఎ౦దుకనగా మనము మనస్సు న౦దు నూతన పరచబడుట, అనగా మానవ జీవన విషయములకు స౦బ౦ధి౦చిన ప్రాచీన విషయములన్ని౦టి ను౦డి విడిపి౦చబడుట మరియు పరిశుద్ధ లేఖనముల యొక్క బోధ మరియు పరిశుద్ధాత్మ వెలిగి౦పు చేత తిరిగి నూతనముగా చేయబడుట జరుగును. నీవు బైబిలును బాగుగా చదివి మరియు దానిని బాగుగా తెలిసినవాడును అయినప్పుడు; పరిశుద్ధాత్మ నిన్ను వెలిగి౦చును మరియు నిన్ను నడిపి౦చును. నీవు దినదినము ఈ విధ౦గా ప్రార్థన చేయుచూ, వాక్య పఠనము చేయునప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను వెలిగి౦చుటకు వచ్చునప్పుడు నీలోనున్న నీ మనస్సు ప్రాచీనత ను౦డి క్రొత్తదనమునకు మార్పుచె౦దును. నీ దృష్టి వేరుగా ఉ౦డును మరియు నీ వ్యక్తి నూతనపరచబడును.

విశ్వాసులు తమ ఆత్మీయ జీవితములో రూపా౦తరి౦చబడుట అనే ఫలితమిచ్చును

మనస్సు ఇలా నూతన పరచబడుటనేది విశ్వాసులు తమ ఆత్మీయ జీవితములో రూపా౦తరించబడుట అనే ఫలితమిచ్చును. పునర్జన్మ సంబంధమైనస్నానము మరియు పరిశుద్ధాత్మచే నూతనపరచ బడుటను గూర్చి తీతుకు 3:5  తెలుపుతు౦ది. పునర్జన్మ సంబంధమైన స్నానము మన పాపజీవితమును కడిగివేయును. దీనిని అనుసరి౦చి పరిశుద్ధాత్మచే నూతనపరచబడుట మన మనస్సును మార్చును. మన మనస్సు నూతనపరచ బడినప్పుడు మన వ్యక్తిత్వమ౦తా రూపా౦తరించబడును. ఇది మనస్సున౦దు నూతనపరచ బడుటచేత రూపా౦తరి౦చబడుటై యున్నది. పునర్జన్మ సంబంధమైన స్నానము మన ప్రాచీన పురుషునిలోని ప్రాచీన విషయాలన్ని౦టిని  ప్రక్షాళన చేయును. అలాగే పరిశుద్ధాత్మచే నూతన పరచబడుట మన వ్యక్తిత్వములోనికి నూతన విషయములను, నూతన పురుషుని యొక్క దైవిక పదార్ధమును వితరణి౦చును. దీని ద్వారా మనము ప్రాచీన పరిస్ధితి ను౦డి పూర్తిగా నూతన పరిస్ధితిలోనికి, పాతసృష్టి యొక్క స్ధితి ను౦డి నూతనసృష్టి యొక్క స్ధితిలోనికి తిరిగెదము. (CWWL, 1994-1997, vol. 3,“The Organic Aspect of God’s Salvation,” pp. 407-409)

References: CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” ch. 3;CWWL, 1994-1997, vol. 4, “The Secret of God’s Organic Salvation-‘the Spirit Himself with Our Spirit,’” ch. 3

 

తండ్రీ, నీవే నిత్యుండవు

తండ్రిని ఆరాధించుట — ఆయన నవ్యత

16

1    తండ్రీ, నీవే నిత్యుండవు,

నిత్య సస్యం వోలె;

చిరంజీవుడవు నీవే,

నిత్యం నూతనమే.

 

తండ్రీ నీకు మార్పే లేదు,

ముదిమే లేదుగా;

యుగములెన్ని మారినా ,

వాడబారవీవు.

 

2    అద్వితీయ దేవుడవు

సదా నవ్యుండవు

నీవు లేనిచో విశ్వమే

చివికి పోవును.

 

3    నీవిచ్చు ప్రతి ఈవిలో

క్రొత్తదనముండున్

నీదు నిబంధనలును

సర్వం నూతనమే.

 

4    మేమే నీదు క్రొత్త సృష్టి

క్రొత్త హృది కల్గెన్

ప్రతి దినం నూతనమౌ

జీవం పొందుచుందుం.

 

5    క్రొత్త భూమ్యాకాశములున్

క్రొత్త పట్టణమున్

ప్రతి నెల క్రొత్త కాపు

అంతా నూతనమే.

 

6    తండ్రీ నీవే నవ్యుండవు

నీ సర్వం నవ్యమే

నిత్య నూతన గీతమున్

పాడి స్తుతింతుము.

14. పద్నాల్గవ పాఠము – రూపాంతరించబడుట

పద్నాల్గవ పాఠము – రూపాంతరించబడుట

2 కొరి. 3:17-18ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యమునుండును18  మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.

రూపాంతరించబడుట అనునది విశ్వాసులలోని దేవుని జీవము చేసే జీవక్రియాత్మకమైన చర్యగా ఉండుట

రూపాంతరపరచబడుట అనునది ఒక బాహ్యమైన మార్పు లేక దిద్దుబాటు కాదుగాని విశ్వాసులలోని దేవుని జీవము యొక్క జీవ క్రియాత్మకమైన పని అయ్యున్నది. రూపాంతరపరచబడుట అనునది కొన్ని సవరణలు చేయుట కాదు; అది లోపల నుండి జరుగు జీవక్రియాత్మకమైన పని మరియు బయటకు ప్రత్యక్షపరచబడునది.

ఒక వ్యక్తి పోషకాహార లోపము కలిగియున్నాడు మరియు సన్నగాను బలహీనముగాను ఉన్నాడనుకొందాము. అతని ముఖమునకు కేవలము కొంత పౌడర్ వ్రాయుట వలన అతడు మెరుగుపడడు. దానికిబదులు, అతనికి పోషకాలు అదనముగా అందించబడాల్సిన అవసరముంది; అప్పుడు అతని భౌతిక శరీరపు పరిస్థితి మెరుగవుతుంది, మరియు అతని ముఖకాంతి అనుకోకుండానే అందముగా మారును.

విశ్వాసులు దైవిక జీవములో ఎదుగటకు సుముఖముగా ఉన్నచో, వారిలో దైవిక జీవము యొక్క మూలకము వృద్ధియగును మరియు ఒక జీవక్రియాత్మకమైన మార్పును తెచ్చును. ఈలాగున, వారి సహజమైన తత్వము రూపాంతరపరచబడును, మరియు వారి బాహ్య రూపము కూడా ప్రభువు యొక్క స్వరూపములోనికి రూపాంతరము చెందును.(CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” p. 416)

జీవ క్రియాత్మకమైన ప్రక్రియ

జీవక్రియాత్మక ప్రక్రియలో జీవికి నూతన మూలకము సరఫరా చేయబడును. ఈ నూతన మూలకము పాత మూలకమును భర్తీ చేయును మరియు అది విసర్జనము చేయబడునట్లును చేయును. కావున, సజీవమైన జీవిలోపల జీవక్రియాత్మక ప్రక్రియ చోటు చేసుకుంటుండగా, తీసివేయబడేటువంటి పాత మూలకమును భర్తీ చేయుటకు ఒకటేదో నూతనమైనది లోపల సృష్టింపబడును. కావున, జీవక్రియ మూడు విషయములను ఇముడ్చుకొనును: మొదటిది, నూతన మూలకమును సరఫరా చేయుట; రెండవదిగా, పాత మూలకమును ఈ నూతన మూలకముతో భర్తీ చేయుట; మరియు మూడవదిగా, ఒకటేదో నూతనమైనది ఉత్పత్తి చేయబడునట్లు పాత మూలకము యొక్క విసర్జన లేదా తొలగింపు.

మనము తినే ఆహారము జీర్ణమగుట మరియు ఒంట బట్టుట అన్నది జీవక్రియను కలుపుకొనియున్నది. మొదటిగా, మనము ఆహారమును మన కడుపులోనికి తీసుకుంటాము. తరువాత మనకు సరఫరా చేయుటకు ఆహారము జీవక్రియాత్మకముగా జీర్ణమగును తద్వారా పాత మూలకములను భర్తీ చేయుటకు మరియు నూతన కణాలను ఉనికిలోనికి తీసుకువచ్చుటకు నూతన మూలకములు చేర్చబడవచ్చు. ఈ జీవక్రియాత్మక ప్రక్రియ ద్వారా మనము ఎదుగుతాము మరియు బలపరచబడతాము. సరైన జీవక్రియ ద్వారా నిర్దిష్టమైన అనారోగ్యముతోనున్న మనము స్వస్థపరచబడవచ్చు కూడ. జీవక్రియాత్మక ప్రక్రియ ద్వారా మన భౌతిక శరీరములో నిరంతరాయముగా స్వస్థత చోటు చేసుకుంటుంది. ఈ స్వస్థత వైద్యుని చేత ఇవ్వబడే ఔషదము చేత జరుగదు; అది శరీరము దానంతట అదే సరిగా పనిచేయడం చేత జరిగే స్వస్థత అయ్యుంది. అనుదినము జీవక్రియాత్మక ప్రక్రియ చేత మనము స్వస్థతను అనుభవించగలము. (Life-study of 2 Corinthians, pp. 201-202)

ప్రభువువైపు తిరుగుట వలనను, ఆయనను తేరిచూచుట వలనను  రూపాంతరించబడుట

ఈ రకమైన రూపాంతరమును మనము కోరినట్లయితే, ప్రభువు వైపునకు తిరుగుట వలన మరియు ముసుగులేని ముఖముతో ఆయన ముఖమును చూచుట వలన మరియు అద్దమువలె ఆయన ముఖమును ప్రతిబింబించుట వలన మన పాత భావనల యొక్క అనేక రకములైన ముసుగులను మొదట మనము తీసివేసుకోవాలి (2 కొరి. 3:16-18). ఈ విధముగా, ప్రభువు యొక్క వ్యక్తత కొరకు ఒక స్థాయి మహిమ నుండి మరొక స్థాయి మహిమకు, ప్రభువు యొక్క స్వరూపములోనికి మనము రూపాంతరము చెందుతూ ఉంటాము.

ప్రభువగు ఆత్మనుండి ఆయన యొక్క స్వరూపములోనికి రూపాంతరము చెందుట

ప్రభువగు ఆత్మ నుండి, అనగా, జీవము ఇచ్చు ఆత్మగా ఉన్న క్రీస్తు నుండి, ప్రభువు యొక్క స్వరూపము లోనికి విశ్వాసులు రూపాంతరము చెందుతూ ఉంటారు. ఈ ఆత్మ మన నూతన మూలకముగా ఉండుటకు సమృద్ధివంతమైన సరఫరాను కల్గియుంటుంది. మనము యేసు క్రీస్తు ఆత్మ యొక్క సమృద్ధివంతమైన సరఫరాను ఆస్వాదించాలి మరియు మనలోపల పనిచేయుటకు ఆయనకు అనుమతివ్వాలి. ఇది రూపాంతరము.

నీవు మరియు ఒక సహోదరుడు కలిసి జీవిస్తూ ఉన్నారనుకుందాము. ప్రతీరోజు ఆ సహోదరుడు వేకువ ఉజ్జీవమును చేసుకొనుచున్నాడు, ప్రార్ధిస్తూ ఉన్నాడు, బైబిల్ చదువుతూ ఉన్నాడు, మరియు ప్రభువు వాక్యము ధ్యానిస్తూ ఉన్నాడు. కొంత కాలము తరువాత, అతనిలో కొంత రూపాంతరమును గమనిస్తావు

మనలో ఆత్మ ఉన్నది మరియు మన ఆత్మలో నివసిస్తున్న ఆత్మగా ఉన్న ప్రభువు మనకు చాలా సమీపముగా ఉన్నాడు. నీవు ఆయనతో మాట్లాడవచ్చును మరియు ప్రతీ దానిలో నీవు ఆయనతో సంభాషించ వచ్చును. ప్రభువు వాక్యము ఇలా చెప్పును, “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” (ఫిలి. 4:6).ఇందువలన, నీకు ఏదైనా సమస్య ఉన్నచో, నీవు కేవలము ఆయనకు చెప్పాలి. ఆయన నీలోనే ఉన్నాడు, మరియు ఆయన నీకు ముఖాముఖిగా ఉన్నాడు. త్రియేక దేవుడు తండ్రి, కుమారుడు, ఆత్మ మనలో ఉన్నది మనలను ఇబ్బంది పెట్టుటకు కాదుగాని మనకు సాంత్వనీకునిగా, ఆదరణకర్తగా, బలపరచువానిగా ఉన్నాడు… ఈలాగున, నీలోనికి ప్రభుని మూలకములను పొందుతావు మరియు జీవ చర్య నీలో స్థిరముగా జరుగును. తత్ఫలితముగా, బాహ్యముగా నీ ద్వారా వ్యక్తపరచబడునది క్రీస్తే. ఇదియే క్రీస్తును జీవించుట… నిజానికి, నిరంతరము నీవు ప్రభువుతో మాట్లాడుట అభ్యాసము చేయాలి; అప్పుడు అప్రయత్నముగానే నీవు క్రీస్తును జీవిస్తావు. (CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” pp. 417-418)

మానవత్వము దైవత్వముతో మిళనమగుట చేత రూపాంతరించబడుట

ఆదాము నుండి క్రీస్తుకు, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు, పాత బోధల నుండి క్రొత్త బోధలకు, మరియు పాత నిబంధన పరిచర్య నుండి క్రొత్త నిబంధన పరిచర్యకు మనము బదిలీ అవ్వడంలో, దైవిక మూలకము మన వ్యక్తిత్వములోనికి చేర్చబడును. ఇప్పుడు ఈ రెండు మూలకముల మిళనమన్నది రూపాంతరీకరణ అనబడే జీవక్రియాత్మక ఫలితమును ఉత్పత్తి చేసెను. దైవిక మూలకము మనలోనికి నిరంతరాయముగా చేర్చబడుటకు గల మార్గము ముసుగులేని ముఖముతో ప్రభువును మనము చూచుట మరియు ప్రతిబింబించుచుటయే. ఇందుచేతనే ప్రతిదినము మనము వేకువ జామున కనిపెట్టాల్సిన అవసరత ఉంది. వేకువ జామున కనిపెట్టిన తరువాత, దినమంతటా జీవమును ఇచ్చు ఆత్మయైన ప్రభువును చూడాల్సిన మరియు ప్రతిబింబించాల్సిన అవసరత మనకింకను ఉంటుంది. జీవమును ఇచ్చు ఆత్మగా, ఆయన మనకు స్వతంత్రమును ఇచ్చును. మనము చూస్తుండగా మరియు ప్రతిబింబిస్తుండగా, రూపాంతరీకరణ అనే ఫలితమును ఇచ్చు దైవిక మూలకమును మనము పొందుకుంటాము.

మహిమపరచబడిన క్రీస్తు స్వరూపములోనికి రూపాంతరించబడుట

మనము మహిమపరచబడిన క్రీస్తు స్వరూపములోనికి రూపాంతరించ బడుచున్నాము. మనము ఏమైయున్నామో అన్నదాని వ్యక్తతగానున్న మన స్వరూపము, మహిమపరచబడిన క్రీస్తు వంటిదిగా అగును. ఆయన పరిశుద్ధుడు, మరియు మనము కూడా పరిశుద్ధులమై యుందుము. ఆయన ప్రేమగలవాడు, మనము ప్రేమగలవారమై యుందుము. ఆయనే సహనము, మనము కూడ సహనమైయుందుము. ఆయన గౌరవముతో నిండినవాడు, మనము కూడ అలాగే ఉంటాము. ఇదే రూపాంతరీకరణ చేత జీవమందున్న ఎదుగుదల అయ్యుంది.

రూపాంతరీకరణ అన్నది ప్రభువు ఆత్మనుండైనదై ఉంది (2 కొరి. 3:18). ప్రభువు ఆత్మ అనే సంయుక్తపేరు ఒక వ్యక్తిని సూచించును. నేడు మన త్రియేక దేవుడే ప్రభువు ఆత్మ. ఆయన నుండే రూపాంతరీకరణ, దైవత్వము మన మానవత్వముతో మిళనము చెందుట ఉద్భవించును.

సంక్షిప్తంగా, రూపాంతరీకరణ అన్నది జీవక్రియాత్మక ప్రక్రియను జరిగించేటువంటి, ప్రభువును చూచుట మరియు ప్రతిబింబించుట అన్నదాని చేత మన వ్యక్తిత్వములోనికి దైవిక మూలకమును స్వీకరించుట అయ్యుంది. ఈ జీవక్రియాత్మక ప్రక్రియయే రూపాంతరీకరణ, అనగా దైవ మానవుడైన మహిమపరచబడిన క్రీస్తు స్వరూపమునే వ్యక్తపరచుటకు, దైవత్వముతో మానవత్వము మిళనమగుట అయ్యుంది.   (CWWL, 1989, vol. 3, “The Experience and Growth in Life,” p. 115)

 

References: CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” ch. 4; Life-study of 2 Corinthians, msg. 23; CWWL, 1989, vol. 3, “The Experience and Growth in Life,” msg. 17; CWWL, 1994-1997, vol. 4, “The Secret of God’s Organic Salvation-‘the Spirit Himself with Our Spirit,’” ch. 3

సంకీర్తన-750

తన సుతున్ పోలికన్ మనము పొందుటే దైవోద్దేశం

అంతరిక జీవపు వేర్వేరు అంశములు — రూపాంతరీకరణము

750

1    తన సుతున్ పోలికన్ మనము

పొందుటే దైవోద్దేశం

గాన మనమాత్మ చేత

రూపాంతరమొందెదం

 

మార్చు౦ మమ్మున్

నీ పోలికన్

మనావేశ చిత్తంబుల్

నీ ఆత్మతో నింపు ప్రభూ

 

2    వ్యక్తిత్వమంతటిన్

మన ఆత్మను దేవుడే

పునర్జన్మింపజేసెన్

మన ప్రాణమింకను

 

3    రూపాంతరించున్ తానే

ఆత్మనుండి ప్రాణముకు

విస్తరించునాయనే

అంతరంగమంతటిని

 

4    స్వాధీనపర్చుకొనున్

తన ఆత్మ శక్తితోనే

రూపుదిద్దును మనన్

మహిమను వృద్ది చేసి

 

5    సమరూపమిచ్చును

మనల శుద్దీకరించి

పరిపక్వ పర్చును

ప్రాణమున్ వశీకరించి

సంపూర్ణతనిచ్చును

15. పదిహేనవ  పాఠము – సమరూపమొందుట

పదిహేనవ  పాఠము – సమరూపమొందుట

రోమా. 8:29-30—ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతి మంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

దేవుని జ్యేష్ఠ కుమారుని స్వరూపములోనికి సమరూపం చెందుట

దేవుని జ్యేష్ఠకుమారుని స్వరూపములోనికి మనమెలా సమరూప౦ పొ౦దుతాము? దేవుని జ్యేష్ఠకుమారుని స్వరూపము లోనికి సమరూపమొ౦దుట ఎలాగో తెలుసుకొనుటకు గాను, దేవుని జ్యేష్ఠకుమారుడు ఈ భుమి మీద ఎలా జీవి౦చియున్నాడో తప్పనిసరిగా మనము అర్థము చేసుకోవాలి. దేవుని జ్యేష్ఠకుమారుడు అనగా దేవుని కుమారుడు అలాగే మనుష్యకుమారుడు. ఆయన దైవమానవుడు, ఈ భూమి మీద మానవునిగా జీవి౦చియున్నాడు. ఆయన ఈ భూమి మీద జీవి౦చిన జీవితమునే దేవుడు మానవుని సృజి౦చినప్పుడు ఆ మానవుడు కూడా జీవి౦చాలని దేవుడు కోరుకున్నాడు. మానవుడు జీవి౦చాలని దేవుడు కోరుకొనిన ఆ జీవితాన్ని మానవుడు పతనము తరువాత జీవి౦చలేకపోయాడు. గనుక, దేవుని అద్వితీయ కుమారుడు మనుష్యకుమారునిగా వచ్చాడు. నాలుగు సువార్తలలో ప్రార౦భ౦ ను౦డి చివరి వరకు ప్రభువు తన్ను తాను మనుష్యకుమారుని గానే పిలచుకున్నాడు (మత్తయి 8:20; 26:64); భూమి మీద ఆయన మానవునిగా జీవి౦చాడు. ప్రతిదిన౦ తనను తాను తృణీకరి౦చు కొనుచు సిలువ వేయబడుచు సిలువ నీడ క్రి౦ద ఆయన జీవి౦చియున్నాడు అయన పలికిన మాటలు ఏవీ తన౦తట తాను మాట్లాడలేదని తాను చేసిన క్రియలు ఏవీ తన సొ౦త కోరిక మేరకు చేయలేదని ప్రజలకు చెప్పియున్నాడు (యోహను 8:28-29;14:10). ఆయన మట్లాడిన మాటలు చేసిన కార్యములు సమస్త౦ త౦డ్రి చిత్త ప్రకారమే చేసియున్నాడు. ఇలా చేయడ౦ వల్ల చట్టపరముగా దేవుడు కోరుచున్న దానిని ఆయన నెరవేర్చియున్నాడు. ఇ౦దుచేతనే మన కొరకు సిలువ మీద చనిపోవడానికి అర్హత సాధి౦చాడు. ముప్పై మూడున్నర స౦వత్సరాలు భూమి మీద ఆయన మానవ జీవిత౦లో యేసు ప్రభువు దేవుని చేత పరీక్షి౦చబడి పరిశోధి౦చబడియున్నాడు. తుదకు, చట్టపర౦గా దేవుని నీతికి అవసరమైన దాని ప్రకార౦, మన పాపములను భరి౦చుటకు మన కొరకు చనిపోవుటకు సిలువకు వెళ్ళడానికి ఆయన అర్హత సాధి౦చాడు. దేవునిచే ఆయన ఒక పాపిగా, అ౦తేగాక పాపముగా కూడా పరిగణి౦చబడి యున్నాడు (2 కొరి. 5:21) సిలువ మీద ఆయనకు శిక్ష విధి౦చియున్నాడు. చట్టపరమగు దేవుని నీతి యొక్క అవసరత నెరవేర్చుటకుగాను ఆయన మరణము అ౦తయు ఒక చట్టపరమగు విషయమైయున్నది. దీనిని ఆయన మనుష్యకుమారుని గానే నెరవేర్చియున్నాడు. మనుష్య కుమారునిగా ఆయన భూమి మీద జీవి౦చిన సిలువ వేయబడిన జీవము ఒక అచ్చుగా, నమునాగా ఆయెను; మనము అట్టి అచ్చుయొక్క సమరూపము పొ౦దాలి (ఫిలి. 3:10)

ప్రభువు మరణమునకు సమరూపమొ౦దుట

స౦క్షిప్త౦గా మాట్లాడినట్లయితే, సమరూపమొందుట అనేది విశ్వాసుల జీవములో రూపా౦తరీకరణము యొక్క పరిణతి అయ్యున్నది. మరియు అది దేవుని జ్యేష్ఠకుమారుని, అనగా దైవమానవునిగానున్న క్రీస్తు పోలికలోనికి సమరూపము పొ౦దుట కూడా. దేవుని జ్యేష్ఠకుమారునిలోనికి సమరూప౦ పొ౦దుట అనగా విశ్వాసులు దైవ మానవునిలుగా జీవములో స౦పూర్ణముగా ఎదుగుట. క్రీస్తు పునరుత్థాన శక్తి ద్వారా అన్ని విషయాలలో ఆయన మరణమునకు సమరూపము పొ౦దుట (ఫిలి. 3:10). దైవ-మానవుడైన క్రీస్తు యేసుని ఆత్మ యొక్క సమృద్ధివ౦తమైన సరఫరా ఆయనను ఘనపరచు నిమిత్తమైయున్నది. (ఫిలి.1:19-21). ఇది దైవ–మానవుడైన క్రీస్తు పునర్ముద్రణగా ఉ౦డుట, తద్వారా మనము దేవుని జ్యేష్టకుమారుడు వలెనే, అనగా అచ్చ౦ ఆయన వలెనే మారుదుము (1 యోహాను 3:2).(CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” pp. 430, 432-434)

References: CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” ch. 5;CWWL, 1994-1997, vol. 4, “The Secret of God’s Organic Salvation-‘the Spirit Himself with Our Spirit,’” ch.

సంకీర్తన-948

యుగముల మర్మం బయల్పడెను

మహిమ నిరీక్షణ — నాలోనున్న క్రీస్తు

948

1    యుగముల మర్మం బయల్పడెను

అది దేవుని క్రీస్తుడేగా

దేవుని మూర్తిమంతము ఆయనే

నా మహిమ నీరీక్షణాయనే!

 

మహిమ, క్రీస్తుడే నా జీవం!

మహిమ, నీరీక్షణాయనే!

నాదు ఆత్మలోని మర్మమాయనే!

ఆయనే నా మహిమగును

 

2    నాదు ఆత్మలో పునర్జన్మనిచ్చెన్

ప్రాణమున్ రూపాంతరించును

నా దేహమున్ తనవలె మార్చును

పూర్తిగా తనవలెతీర్చున్

 

3     జీవస్వభావములందు ఏకమై

మహిమలోనికి తెచ్చును

ఆయన సన్నిధిలో నిత్యముండున్

ఆయన సారూప్యము నొంది

16. పదహారవ పాఠము – మహిమపరచబడుట

పదహారవ పాఠము – మహిమపరచబడుట

హెబ్రీ. 2:10—ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

దేవుని సంపూర్ణ రక్షణయందు, మనము పునర్జన్మతో ఆరంభించి నూతన పరచబడుట, పరిశుద్ధ పరచబడుట, రూపాంతరించ బడుట, పరిపక్వత చెందుట మరియు సమరూపమొందించ బడుట అంతిమంగా మహిమపరచబడుటను చేరుకొనుట ద్వారా క్రీస్తుని ఐశ్వర్యవంతమైన జీవమును అనుభవించుటకును ఆస్వాదించుటకును కొనసాగుదుము. మహిమపరచబడుట అంటే క్రీస్తునందున్న అపరిమితమైన మరియు నిత్యమైన దేవుని జీవమును, కొలత లేకుండా మరియు పరిమితి లేకుండా అనుభవించి ఆస్వాదించుటకు దేవుని మహిమలోనికి ప్రవేశించుటై ఉంది.

దేవుని ఉద్దేశము

క్రీస్తుయేసునందు మనలను పిలుచుటలో, సర్వ సమృద్ధివంతమైన కృపను మనకు అనుగ్రహించడంలోనున్న దేవుని ఉద్దేశము తన నిత్య మహిమను మనము ఆస్వాదించుటయేనని 1 పేతురు 5:10లో మనకు చెప్పబడెను. నిత్యత్వపు భూతకాలమందే తన భవిష్యత్ జ్ఞానముచొప్పున మనలను ముందుగా నిర్ణయించుకొనెను, మరియు మనము మహిమపరచబడుటకై కాలములోఆయన మనలను పిలిచెను మరియు నీతిమంతులుగా తీర్చెను (రోమా. 8:29-30).

దేవుని నడిపింపు మరియు ఆయన మనలను సంపూర్ణులనుగా చేయుట

మన రక్షణ దినము మొదలుకొని, ఆయన నిత్య మహిమను మనము ఆస్వాదించాలని దేవుడు ముందుగా నిర్ణయించినందున ఆయన మనలను మహిమలోనికి నడిపించును. అన్నింటిని సృష్టించిన సృష్టికర్తగా, అన్నింటిని మన నిమిత్తము జరిగించుటకు ఆయన అన్నింటిని ఆజ్ఞాపించును మరియు ఏర్పరచును (28-30. వ. లు) తద్వారా వాటి ద్వారా ఆయన మనల్ని తన మహిమలోనికి నడిపించును.

క్రైస్తవులమైనందుకు, ప్రభువును వెంబడించుచున్నందుకు, మరియు ఆయన కొరకు సాక్ష్యమిచ్చుచున్నందుకు నేడు మనము అనుభవించే శ్రమ అన్నది క్షణమాత్రముండేది మరియు చులకనైనది. క్షణమాత్రముండు మన చులకని శ్రమ మన కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. (Life Lessons, vol. 4, pp. 85-86)

మహిమపరచబడుటకున్న నిర్వచనము

బాహ్యంగా మహిమపరచబడుట

బాహ్యంగా, మహిమపరచబడుట అంటే దేవుని మహిమలో పాలొందుటకు విమోచింపబడిన విశ్వాసులు దేవుని మహిమ లోనికి తీసుకురాబడుదురు (హెబ్రీ. 2:10; 1 పేతు. 5:10). ఇది మహిమపరచ బడుటకున్న బాహ్యమైన నిర్వచనము అయ్యుంది. నేడు దేవుని మహిమ దూరంగా పరలోకములో ఉందన్నట్టు, మరియు విమోచించబడిన వారమైన మనము ఇక్కడ భూమ్మీద ఉన్నట్టు అనిపించును; రెండింటిని వేరుపరుస్తున్న దూరము చాల ఉంది. కొన్నిసార్లు మనము దేవుని మహిమ నుండి చాల దూరంగా ఉన్నామని మనకు అనిపించును, కాని ఈ విధమైన భావన పాక్షికంగా మాత్రమే సరియైనది.

అనుభవేద్యముగా మహిమపరచబడుట

అనుభవేద్యముగా, మహిమపరచబడుట అన్నది జీవమందు విశ్వాసుల పరిపక్వతకు చెందిన మూలకముగా నున్న దేవుని మహిమను, జీవమందు వారు పరిపక్వత చెందుట చేత, పరిపక్వత చెందిన విశ్వాసులు తమ లోపలి నుండి ప్రత్యక్షపరచుట అయ్యుంది (రోమా. 8:17-18, 21; 2 కొరి. 4:17). ఇదే మహిమపరచ బడుటకున్న అనుభవేద్యమైన నిర్వచనము. అనుభవేద్యముగా మహిమపరచబడుటను ఉదాహరించుటకు మనము ఒక ఉదాహరణను ఉపయోగించవచ్చు. తోటలో ఒక పువ్వు ఎదుగుట ప్రారంభించబడునప్పుడు, అది ఒక పంచరంగులోనున్న చిన్న లేతైన మొలక అయ్యుంది. అయితే, అది ఎంతెక్కువగా పెరుగునో, అది అంత పరిపక్వత చెందును. క్రమంగా, మొగ్గలు అగుపడుట ప్రారంభించును. మొక్కకు నీరు పోయుటను మీరు కొనసాగిస్తే, అది ఎక్కువగా పెరుగును. కొంత కాలము తరువాత మొక్క వికసించును. పువ్వులు పూర్తిగా విచ్చుకున్నప్పుడు, అదే మహిమపరచబడడం అయ్యుంది. పువ్వులకు మహిమ బయటనుండి రాదు; బదులుగా, అది లోపల నుండి పెరుగును. కావున, ఒక వైపున, మనల్ని మహిమపరచుటకు క్రీస్తు వస్తున్నాడనడంలో మనకు మహిమా నిరీక్షణ ఉంది. ఇది బాహ్యమైనది. మరో వైపున, మహిమ వెంబడి మహిమతో, అనగా మహిమ నుండి అధికమహిమకు (3:18), ప్రభువు స్వరూపములోనికి మనము రూపాంతరించబడుతున్నాము. ఇది మహిమ మనపై దిగివచ్చుట కాదు; బదులుగా, అది మనలోపల నుండి ఎదుగుచున్న మహిమయై ఉంది. వసంతకాలములో, అన్ని రకాల పువ్వులు వికసిస్తున్నప్పుడు, ఈ అందమైన పువ్వులలో ఏదియు కాండము మీదకుబయట ఎక్కడనుండో దిగిపడదు. దానికి బదులుగా, అది మొక్క లోపల నుండే పెరుగును. మీరు ప్రభువు ప్రేమికురాలైతే, మరియు ప్రభువును మీయందు జీవించుటకు మరియు మీరు ప్రభువు చేత జీవించుటకు అనుమతిస్తే, ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు, వారు మీ మీదనున్న దేవుని మహిమను చూస్తారు. ఈ మహిమ అనుభవేద్యమైనది మరియు బాహ్యమైనది కాదు.

మహిమలోనికి మన ప్రవేశమన్నది మహిమపరచబడుటకు చెందిన ఈ రెండు పార్శ్వములను కలిగియుండును. మీరు ప్రభువు చేత జీవించలేదని, మరియు మీరు క్రీస్తును జీవించలేదని అనుకుందాం. మీరు మీకు నచ్చినదెల్లా చేస్తున్నారు మరియు మీరు చేయునదేదైననూ, పెద్ద పాపములు అరుదైనప్పటికీ, చిన్న పాపములు తరచుగా చేస్తారు. మీరు అట్టి క్రైస్తవుడైతే, మీరు స్వేచ్ఛగా కోపడగలరు లేదా ఇంట్లో ఇతరుల వైపు కోపంగా చూడగలరు, మరియు సంఘములో ఏ ఒక్కరు మీతో వ్యవహరించలేరు. మీరు అట్టి వ్యక్తియైతే, మీ మీద ప్రభువు మహిమ ఏమియు ఉండదు, మరియు మీలో చూచుటకు దేవుని మహిమ ఎంతమాత్రము ఉండదు. అయిననూ క్రీస్తు వచ్చునప్పుడు, మీరు మహిమపరచ బడుదురని, మరియు మీరు మహిమలోనికి ప్రవేశించుదురని చెప్తారు. నన్ను దీనిని మీతో చెప్పనివ్వండి: అవును, క్రీస్తు వచ్చునప్పుడు, మీరు మహిమలోనికి ప్రవేశిస్తారు, కాని ఆ మహిమ కొద్దపాటి మహిమ మాత్రమే అయ్యుండును. కావున, 1 కొరింథీయులు 15:41 లో అపొస్తలుడైన పౌలు ఈలాగు చెప్పును, ‘‘సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదము కలదు గదా.’’ నక్షత్రముల మహిమ సూర్యుని లేదా చంద్రుని మహిమతో ఏలాగు పోల్చబడగలదు? ప్రభువు రాకడ సమయమున, పౌలు మహిమ అధికంగాను, మీ మహిమ చూచుటకు చాల కష్టంగా ఉండు ఒక చిన్న నక్షత్రము వంటిది గాను ఉండును. మీరు అక్కడ మహిమకరముగా ఉందురా? మహిమలో మీకు అక్కడ మహిమకరముగా ఉండదు.

నేడు మీరు ప్రభువును ప్రేమిస్తే, మరియు మీ లోపల నుండి మీరు ప్రభువు మహిమను బయటకు జీవిస్తే, ప్రభువు రాకడ సమయమందు, ఆయన మిమ్మల్ని అత్యున్నతమైన స్థాయిగల మహిమలో ఉంచును. అయితే ఇతరులవైపు కోపంగా చూడడం, గుసగుసలాడడం, ఇష్టపూర్వకంగా విమర్శించడం, మరియు అరుదుగా పెద్ద పాపములు చేయునప్పటికీ, మీరు చిన్న పాపములను తరచుగా చేయుట అనుమీ పాత విధానములోనే మీరు ఇంకను ప్రవర్తిస్తే, ప్రభువు తిరిగి వచ్చునప్పుడు అపొస్తలుడైన పౌలు వలె మీరు మహిమకరముగా ఉందురని తలస్తున్నారా? మహిమ ప్రభువు చేత అనుగ్రహించబడును, కాని ఎంతమట్టుకు మహిమ పరచబడతామో అన్నది మీ చేతనే స్థాపించబడాలి. ఓడింపబడిన మరియు మహిమలోనికి ప్రవేశించని ప్రజలకు చెందిన ఒక వర్గము కూడ ఉంది. వారు తమ పండ్లను కొరుకు అంధకారములోనికి వెళ్లుదురు. (CWWL, 1993, vol. 1, “God’s Salvation in Life,” pp. 389-390)

క్రీస్తు తన పరిశుద్ధులలో మహిమపరచబడుట

క్రీస్తులోనికి విశ్వసించిన మనము దేవుడు మన కొరకు ముందుగా నిర్ణయించిన మహిమ లోనికి ఇంకను ప్రవేశించనప్పటికీ, మహిమ నిరీక్షణగా క్రీస్తు మనలోనున్నాడు (కొలొ. 1:27).

నేడు మన జీవముగా క్రీస్తునే ఆస్వాదించుచున్నాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, తన దైవిక మహిమను ఆస్వాదించుటకు ఆయన మహిమలో ఆయనతో కలసి మనమును ప్రత్యక్షపరచ బడుదుము (3:4). నేడు పాడైపోయిన ఈ సృష్టికి ఉన్న దాసత్వము నుండి ఆ మహిమ మనలను స్వతంత్రులనుగా చేయును. ఇది మనము ఆస్వాదించగోరే మహిమ మాత్రమే కాదు గాని సృష్టి యావత్తు ఆతురముగా ఎదురుచూచుచున్న మహిమ కూడ అయ్యుంది (రోమా. 8:19-21). నేడు ఆ మహిమనేది నిరంతరాయముగా మనలో ఎదుగుచూ, మనలోపలనున్న క్రీస్తే అయ్యున్నాడు. క్రీస్తు వచ్చునప్పుడు, మరో వైపున, మనల్ని మహిమలోనికి నడిపించునది దేవుడే, మరియు మరో వైపున, మనము ప్రవేశించు మహిమగా మన ద్వారా వ్యాపించు క్రీస్తు అయ్యున్నాడు. ఇది ఆయన పరిశుద్ధులందరిలోనూ మహిమపరచబడుట మరియు ప్రశంసింపబడుటయైయున్నది (2 థెస్స. 1:10), అనగా వారి మహిమగా మరియు వారి ఆస్వాదనగా క్రీస్తు తన విశ్వాసులలోనుండి మరియు విశ్వాసుల మీదగా ప్రత్యక్షపరచబడుటయై ఉన్నది. (Life Lessons, vol. 4,p. 86)

References: Life Lessons, vol. 4, lsn. 48;CWWL, 1993, vol. 1, “God’s Salvation in Life,” ch. 4; CWWL, 1994-1997, vol. 4, “The Secret of God’s Organic Salvation-‘the Spirit Himself with Our Spirit,’” ch. 5

 

క్రీస్తే మహిమాస్పదం, నా జీవమాయెనే

మహిమ నిరీక్షణ—మహిమాన్వితమైన క్రీస్తు

949

1    క్రీస్తే మహిమాస్పదం, నా జీవమాయెనే

పునర్జన్మమిచ్చి నన్ను పూర్తిగానింపున్

లోబర్చుకొనుశక్తిచే దేహమున్ మార్చున్

తన మహిమ తనువు వలెనే

 

క్రీస్తే వచ్చున్ నన్ మహిమపర్చను

రూపాంతరమొందించును ఆయనవలెను

క్రీస్తేవచ్చున్ నన్ విమోచింపను

మహిమన్ చేకొనివచ్చున్ శుద్ధులకియ్యను

 

2    క్రీస్తే మహిమాస్పద౦ దైవమర్మం తానే

దైవ సంపూర్ణతను నాలోకి తెచ్చునే

దేవునితోడనన్ సమ్మేళపర్చునే

దైవమహిమలో పాలుపొందుదున్

 

3    క్రీస్తే మహిమాస్పదం విమోచనం తానే

నా దేహమునకే మృత్యు విమోచనం

నా దేహమును తానే మహిమపర్చును

విజయమందు మ్రింగున్ ఆ మృత్యువున్

 

4    క్రీస్తే మహిమాస్పదం నా చరితమాయెనే

ఆయన జీవనమే నాదు అనుభవము

మహిమాయుక్తమైన స్వాతంత్ర్యము నిచ్చున్

ఆయనతోనే ఉందున్ నిత్యముగా